For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ శరీర బరువును కోల్పోవడంలో నెయ్యి నిజంగానే సహాయపడుతుంది, అది ఎలానో మీరు తెలుసుకోండి

  |

  మీరు మీ శరీర బరువును కోల్పోవడానికి మరియు ఫిట్ గా ఉండటానికి గల మార్గాలను మొదలు పెట్టినవారయితే, అప్పుడు మీరు తప్పనిసరిగా, కొన్ని రకాల ఆహార పదార్థాలను విడిచిపెట్టవలసి ఉంటుంది, అవునా ?

  మీ శరీర బరువును తగ్గించాలన్నా / పెంచాలన్నా విషయానికి వస్తే ఆహారం అనేది చాలా కీలకమైన పాత్రను పోషిస్తుందని, అది మీ శరీర బరువుకు సరైన మార్గనిర్దేశం చేస్తుందని - ప్రముఖ న్యూట్రీషియన్లు మరియు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.

  నిజానికి ఇదే వాస్తవం. ఎందుకంటే, మనం తీసుకునే ఆహారం విచ్ఛిన్నం కాబడి కొవ్వు కలిగిన కణాలుగా ఉంటూ, మన శరీరంలోనే భద్రచేయబడతాయి. కాబట్టే మన శరీరంలో కొవ్వు కణాల సంఖ్య మరింత ఎక్కువగా గానీ ఉంటే అది అధిక బరువు సమస్యలకు (లేదా) ఊబకాయానికి దారితీస్తుంది.

  ఒక వ్యక్తి యొక్క BMI (బాడీ మాస్ ఇండెక్స్) స్థాయిలు సాధారణ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, అతను / ఆమె అధిక బరువును (లేదా) ఊబకాయంతో ఉన్నారని చెప్పవచ్చు.

  అధిక బరువు (లేదా) ఊబకాయం వలన ఆ వ్యక్తికి తన మీద తనకి ఉండే విశ్వాసమును గణనీయంగా కోల్పోతాడు మరియు చివరకు ఆ వ్యక్తి యొక్క ఆత్మ-గౌరవానికి సంబంధించిన సమస్యలు అతనిని నిరుత్సాహపరుస్తుంది.

  అంతే కాకుండా, అధిక శరీర బరువు కారణంగా కీళ్ల నొప్పి, అలసట, జీర్ణ సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది.

  కాబట్టి, అధిక బరువును / ఊబకాయమును కలిగి ఉండటం అనేది నిజానికి చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యగా భావించబడుతుంది మరియు మీరు తప్పక ఆరోగ్యకరమైన శరీర బరువును పొందేందుకు అవసరమైన ప్రతిచర్యలను అనుసరించాలి.

  కాబట్టి, సహజంగానే ప్రజలు బరువును కోల్పోయే ప్రయత్నాలను చేస్తున్నప్పుడు, వారి ఆహారం నుండి "కొవ్వును" కలిగి ఉన్నవిగా భావించిన వాటిని, తీసుకొనే భోజనం నుండి మినహాయిస్తారు.

  బరువును కోల్పోయేందుకు ప్రయత్నించే సమయంలో - జంక్ ఫుడ్స్ ను, వేయించిన (వేపుళ్ళు) ఆహారాలను, తెల్లని రొట్టె, తెల్లని బియ్యం, బంగాళాదుంప మొదలైన కొన్ని రకాల కూరగాయలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.

  ఇప్పుడు, చాలామంది ప్రజలు బరువు కోల్పోయే ప్రయత్నంలో నెయ్యిని కూడా దూరంగా ఉంచుతున్నారు, ఎందుకంటే అది అధిక కొవ్వుతోనూ మరియు కేలరీలతోనూ పూర్తిగా నిండి ఉంటుందని వారు భావిస్తారు.

  అయినప్పటికి, ఇటీవలి అధ్యయనంలో మీ రోజువారీ భోజనంలో కొద్దిపాటి నెయ్యను జోడించడం వల్ల మీ బరువు క్షీణించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

  నెయ్యిలో కొవ్వును కలిగి ఉందన్న విషయాన్ని ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూడండి.

  ghee health benefits

  నెయ్యిలో ఉండే ఆమ్లాలు శరీర బరువును ఎలా తగ్గించగలవు :

  నెయ్యి అనేది పాల ఉత్పత్తికి సంబంధించినది., ప్రత్యేకించి భారతదేశంలో అనేక రుచికరమైన మరియు తీపి పదార్ధాలను తయారుచేయటానికి దీనిని ఉపయోగిస్తారు.

  భారతీయ పండుగ వంటకాలలో మరియు తీపి పదార్ధాలలో ఎక్కువ భాగం నెయ్యిని కలిగి ఉండటం వల్ల, వాటి యొక్క రుచిని మరియు గొప్పతనాన్ని మరియు వాసనను పెంచేలా చేస్తాయి.

  చాలా గృహాల్లో, నెయ్యిని రోజువారీ భోజనంలో, అనగా అన్నము (లేదా) పరోటాల పైన, జతచేయబడి ఒక సాంప్రదాయమైన గుర్తుగా సూచించవచ్చు.

  ఏదేమైనప్పటికీ, నూతన పోకడలు అందుబాటులోకి రావడం వల్ల ఈ సాంప్రదాయమును నేటి ఆధునిక సమాజంలో ఏ మాత్రం అనుసరించడం లేదు. ఎవరైతే ముఖ్యంగా ఫిట్గా ఆరోగ్యంగా ఉంటూ, బరువు తగ్గాలని కోరుకుంటారో - అలాంటివారు మాత్రమే నెయ్యిలో కొవ్వుఆమ్లాలను కలిగి ఉంటుందని నమ్ముతారు.

  ghee health benefits

  ప్రస్తుతం, ఇటీవల చేసిన పరిశోధనా అధ్యయనంలో నెయ్యిను తక్కువ పరిమాణంలో, దాని స్వంత రూపంలోనే (స్వచ్ఛమైన నెయ్యిగానే - స్వీట్స్ రూపంలో మాత్రం కాదు) తినేటప్పుడు, బరువు తగ్గించే ప్రక్రియను మరింత వేగంగా చేయటానికి సహాయపడుతుంది.

  నెయ్యితో చెయ్యబడిన తీపి పదార్థాలను మరియు ఇతర అధిక కేలరీలు గల ఆహారాలను తీసుకుంటే, శరీర బరువు పెరగవచ్చు. అయితే, మీ రోజువారీ భోజనానికి స్వచ్ఛమైన నెయ్యిని కేవలం ఒక టీ స్పూన్ మోతంలో తీసుకోవడం వల్ల మీ జీవక్రియను పెంచవచ్చు.

  నెయ్యిలో, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మరియు అమైనో ఆమ్లాల వంటివి మీ జీవక్రియ రేటును మెరుగుపర్చడానికి సహాయపడతాయి, తద్వారా కొవ్వు కణాలు వేగవంతంగా శక్తిగా మారటంలో సహాయపడతాయి.

  కాబట్టి, మీ భోజనంలో స్వచ్ఛమైన నెయ్యిని ఒక టీ స్పూను మోతాదులో జోడించడం వల్ల వేగంగా బరువు తగ్గటంలో సహాయపడుతుంది మరియు అది కూడా మీ మానసిక శక్తిని మరియు రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేసేటటువంటి ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండవచ్చు!

  English summary

  Ghee For A Quicker Weight Loss

  Losing weight requires people to stay away from certain foods which are fattening. Many people think that ghee is fattening and avoid consuming it. A new research study has stated that ghee can actually aid weight loss. Find out how, here.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more