అల్లం-పానీయంతో మీ శరీరంలో ఉన్న అధిక కొవ్వును కరిగించవచ్చు..

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

అన్నిచోట్ల ఉన్న ప్రజలు, తమ శరీరంలో ఉన్న అధిక కొవ్వుతో నిత్యము పోరాడుతుంటారు. ముఖ్యంగా వారి పక్కటెముకల మధ్యభాగంలో, పొత్తికడుపు చుట్టూ గల భాగంలో మరియు తొడ భాగంలో ఉన్న కొవ్వును కరిగించటం కోసం.

మీ ఇంటి వంట గదిలోనే అల్లం-పానీయాన్ని చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ పానీయం మీ శరీరంలో మొత్తంగా ఉన్న విష పదార్థాలను తొలగించడానికి దోహదపడుతుంది మరియు కొవ్వును కరిగించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి ఆ ద్రావణం యొక్క తయారీకి అవసరమయ్యే పదార్ధాలతో పాటు మరియు ఆ పానీయం యొక్క ఇతర లక్షణాలను గురించి ఈ క్రింద ఇవ్వబడిన విషయాలను గూర్చి ఒకసారి తెలుసుకోండి.

జింజర్ +లెమన్ వాటర్ తో బాడీలో జరిగే అద్భుత మార్పులు ...!

how to lose fat with ginger

ఈ పానీయానికి కావలసిన పదార్థాలు :

సన్నగా తరిగిన అల్లం ముక్కలు

5 లీటర్ల నీరు

మరియు నిమ్మకాయ

how to lose fat with ginger

తయారీ విధానం :

నీటిని బాగా వేడి చేయండి, దానిలో అల్లం ముక్కలను చేర్చండి మరియు 15 నిమిషాలు చిన్న మంట మీద ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. అలా చేసిన మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లార్చాలి. అలా ఉన్న ద్రావణాన్ని వేరొక గ్లాస్లోనికి తీసుకొన్న తర్వాత, త్రాగడానికి ఈ "అల్లం పానీయం" సిద్ధంగా ఉంటుంది.

how to lose fat with ginger

ఈ పానీయం యొక్క ఇతర లక్షణాలు :

ఈ పానీయం కూడా అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది ప్రధానంగా కొలెస్ట్రాల్ ను నిర్వహించడంలో సహాయం పడుతుంది. ఈ పానీయాన్ని నిత్యము త్రాగటం వలన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయం చేస్తుంది. ఇది కూడా రక్తాన్ని పలుచగా చేసి, రక్త ప్రసరణపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఇది శరీరంలో స్వేచ్ఛగా విహరించే హానికరమైన రాశులతో పోరాడుతుంది. అవి శరీరంలో ఉన్న కణాలకు హాని కలుగచేసేదిగా ఉన్నందున వాటిని శరీరం నుండి తీసివేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా, హానికరమైన కణాల యొక్క అదనపు బలగాలను పూర్తిగా స్తంభింప చెయ్యటం వల్లన, ఈ పానీయం - క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను వేగంగా నియంత్రించగలదు.

పసుపు + అల్లం జ్యూస్ ను పరగడుపుతో తాగడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు!

how to lose fat with ginger

అల్లం పానీయాన్ని త్రాగటం వలన వాపులను తగ్గించడం, కీళ్ల అసమతౌల్యతను మరియు ఇతర అంటు వ్యాధుల కారకాల యొక్క సామర్థ్యాన్ని విరమింప చేస్తుంది. తాజా పరిశోధనల ప్రకారం అల్లం అనేది శరీరంలోని వచ్చే వాపును అన్ని కోణాలలో తగ్గిస్తుంది అని బట్టబయలయ్యింది.

ప్రతిరోజు ఈ అల్లం నీటిని తాగటం వల్ల జీర్ణవ్యవస్థను పటిష్టం చేయడంలోనూ మరియు అజీర్ణం, వికారం మరియు గుండె మంటను నివారించటంలో సహాయపడుతుంది.

ఈ పానీయం మూత్రపిండాలకు వాటిల్లే నష్టాన్ని తగ్గిస్తుంది మరియు డయాబెటిస్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ మూల పదార్థంలో ఉండే జింక్, ఇన్సులిన్ యొక్క పాత్రలను పోషించడంలో గొప్ప మూలకంగా పని చేస్తుంది.

English summary

Ginger water remedy to burn excess fat from your body

Try ginger water remedy to burn the excess fat from your body.
Story first published: Thursday, November 16, 2017, 14:00 [IST]
Subscribe Newsletter