For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేగంగా బరువు తగ్గించే మిరాకిల్ డ్రింక్ -లెమన్ + జింజర్ జ్యూస్

వేగంగా బరువు తగ్గించే మిరాకిల్ డ్రింక్ -లెమన్-జింజర్ జ్యూస్

By Staff
|

బరువు ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఒకసారి బరువు పెరగిన తర్వాత మనం ఏం తింటున్నాం అనే విషయంపై దృష్టి పెట్టాలి. చేసే పని ఏమిటి? తినేదాని నుంచి వచ్చే క్యాలర్లీలో రోజూ ఎంత ఖర్చవుతుంది?.. ఇలా పలు అంశాలను గమనించకుంటే బరుగు తగ్గడం సాధ్యం కాదు.

మీరు నేచురల్ బరువు తగ్గించుకోవాలని కోరుకుంటే, హెల్తీ లైఫ్ స్టైల్, లోఫ్యాట్ డైట్, రెగ్యులర్ గా వ్యాయామంతో పాటు, మరెన్నో వెయిట్ లాస్ టీలు, ఫ్యాట్ బర్నింగ్ స్మూతీస్, ఫ్రూట్స్, హెర్బ్స్ ను ఉపయోగించి ఉంటారు. అయితే ఇవాల మీకు అల్లం-నిమ్మరసం కాంబినేషన్ లో బరువును ఎలా తగ్గించుకోవచ్చు అన్న విషయం తెలుసుకుందాం..

Home Remedy Reduce Belly Fat Using Lemon Ginger

నడుము, తొడలు, పిరుదుల చుట్టూ.. ఫ్యాట్ పేరుకున్నప్పుడు చాలా అసహ్యంగా కనిపిస్తుంది. లావుగా మారిన విషయం ఈ భాగాల్లో పేరుకున్న ఫ్యాట్ ని చూస్తేనే అర్థమవుతుంది. ప్యాంట్స్ పట్టనప్పుడు మీ నడుము, తొడలు లావయ్యాయన్న విషయం అర్థం అవుతుంది.

ఇలా భారీగా పెరిగిన ఫ్యాట్ కరిగించుకోవడానికి ఎఫెక్టివ్ అండ్ క్విక్ రెమిడీస్ కోసం వేట మొదలుపెట్టేస్తారు. అయితే.. ఇలాంటప్పుడు అల్లం, నిమ్మరసం కాంబినేషన్ చక్కటి పరిష్కరం. ఇవి మాత్రమే వేగంగా.. ఫ్యాట్ ని కరిగిస్తుంది. అల్లం, నిమ్మకాయ ప్రతి వంటింట్లో ఉపయోగించే నిత్యవసర వస్తువులు. ఇందులో ఉన్న ఔషధ గుణాలు.. అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తాయి.

Home Remedy Reduce Belly Fat Using Lemon Ginger

అయితే అనారోగ్య సమస్యలే కాదు.. అధిక ఫ్యాట్ ని కరిగించడంలో కూడా.. అల్లం, నిమ్మరసం మిరాకిలస్ గా పనిచేస్తుంది. అయితే అలాగని కేవలం వీటి మీద డిపెండ్ అయ్యి, ఫ్యాట్ ఫుడ్స్, షుగర్ ఫుడ్స్, స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.మరి నిమ్మరసం, అల్లం బరువు తగ్గించడంలో ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం.

నిమ్మరసం

నిమ్మరసం

నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్, అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. నిమ్మరసంలో డ్యూరియాటిక్ లక్షణాలు అధికంగా ఉండి డిటాక్సిఫై చేస్తుంది. ఫ్యాట్ కరిగిస్తుంది. ఈ లెమన్, జింజర్ డైట్ ను ఫాలో అయ్యేప్పుడు, కేవలం పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. మీబరువు తగ్గించుకునే లక్ష్యాన్ని చేరుకోవాలంటే తప్పనిసరిగా కఠిన నియమాలు పాటించాల్సిందే.

ఇక అల్లం విషయానికొస్తే:

ఇక అల్లం విషయానికొస్తే:

ఇది అద్భుతమైన మూలిక. ఎన్నో రకాల వ్యాధులను నివారిస్తుంది. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఫ్యాట్ బర్న్ చేస్తుంది.ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. మరి ఈ రెండింటి కాంబినేషన్ లో బరువు తగ్గించుకోవడం ఎలాగో 5 మార్గాల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం కలిపి తాగడం

ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం కలిపి తాగడం

ప్రతి రోజూ ఉదయం పరగడపును వార్మ్ లెమన్ వాటర్ తాగడంలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఈ వార్మ్ వాటర్ శరీరంను డిటాక్సిఫై చేస్తుంది, ఫ్యాట్ బర్న్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి శరీర ఉష్ణోగ్రతను క్రమంగా పెంచి కొవ్వు కరగడానికి సహాయడపతుంది. ఈ టానిక్ ఇన్ఫ్లమేషన్, స్టొమక్ పెయిన్, మలబద్దకం వంటివి తగ్గిస్తాయి.

నిమ్మరసం, కేయాన్ పెప్పర్ మరియు మాప్లే సిరప్

నిమ్మరసం, కేయాన్ పెప్పర్ మరియు మాప్లే సిరప్

ఈ బర్నింగ్ ట్రిక్ ను మరిప్పటివరకూ విని ఉండరు? అవును ఇది క్లెన్సింగ్ డైట్ . లైట్ గా స్పైసీ డ్రింక్ . ఫ్యాట్ బర్న్ చేయడానికి మెటబాలిజంను స్పీడ్ చేస్తుంది. 10 రోజుల్లోనే మంచి ఫలితం కనబడుతుంది. ఈ కాంభినేషన్ డ్రింక్ ను రోజుకు మూడు గ్లాసులు తాగాలి. బ్రేక్ ఫాస్ట్ సమయంలో, లచ్ కు ముందు, డిన్నర్ కు ముందు తాగాలి. అందుకోసం ఒక గ్లాసులో ఒక నిమ్మకాయ రసం పిండిలి, తర్వాత చిటికెడు కేయాన్ పెప్పర్ పౌడర్, మాల్ల్పే సిరప్ ను మిక్స్ చేయాలి. గ్లాసు లో నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి తర్వాత తాగాలి. రోజుకు మూడు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం, పుదీనా, గ్రేఫ్ ఫ్రూట్ టీ

నిమ్మరసం, పుదీనా, గ్రేఫ్ ఫ్రూట్ టీ

ఈ టీ తయారుచేయడం చాలా సులభం, ఈ టీని రోజుకు రెండు సార్లు తాగాలి. అందుకు కావల్సిం, సగం నిమ్మతొక్క, గ్రేఫ్ ఫ్రూట్ ొకటి. ఒక కప్పు నీటిలో నిమ్మరసం, గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ , రెండు పుదీనా ఆకులు, చిటికెడు నిమ్మతొక్క వేసి బాగా ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, చల్లారిన తర్వాత తేనె మిక్స్ చేసి తాగాలి.

జింజర్ లెమనేడ్

జింజర్ లెమనేడ్

ఈ డైటరీ క్లాసిక్ గురించి మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఫ్యాట్ బర్న్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. శరీరంలో నీరు , ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఒక గ్లాసు నీళ్ళు సిమ్మర్లో పోసి నిమ్మరసం పిండి, అల్లం ముక్కలు వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత అల్లం ముక్కలు వడగట్ట బాటిల్లో నిల్వ చేసుకుని, భోజనానికి ముందు తాగాలి. ఇది ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది.

అల్లంతో గ్రీన్ టీ

అల్లంతో గ్రీన్ టీ

ఈ యాంటీఆక్సిడెంట్ రిచ్ టీ మద్యహ్నానంలో తాగడం చాలా మంచిది. బరువు తగ్గించడంలో గ్రీన్ టీ ఏవిధంగా సహాయపడుతుందో మనందరికీ తెలిసిన విషయమే. గ్రీన్ టీలో 1001 లక్షణాలున్నాయంటారు. ఇది కొలెస్ట్రాల్ తగ్గించి, జీర్ణశక్తిని పెంచుతుంది. అల్లం రూట్ గ్రీన్ టీ ఆకులును నీళ్ళలో మరిగించి రోజులో రెండు సార్లు తాగితే మీ ఫిగర్ తప్పకుండా మెరుగుపడుతుంది.

English summary

Home Remedy Reduce Belly Fat Using Lemon Ginger

Home Remedy Reduce Belly Fat Using Lemon Ginger Read know more about it...
Desktop Bottom Promotion