వేగంగా బరువు తగ్గించే బేకింగ్ సోడా + నిమ్మరసం

Posted By:
Subscribe to Boldsky

బేకింగ్ సోడాను వంట‌ల్లో వాడుతార‌ని అంద‌రికీ తెలిసిందే. బేక‌రీల‌లో మ‌న‌కు ల‌భ్య‌మ‌య్యే అనేక ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను వండేట‌ప్పుడు బేకింగ్ సోడాను ఎక్కువగా వేస్తారు. అయితే బేకింగ్ సోడా కేవ‌లం వంట‌ల‌కే కాదు, ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేయ‌డం కోసం కూడా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ముఖ్యంగా బేకింగ్ సోడాతో బరువు తగ్గించుకోవచ్చంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. కానీ బేకింగ్ సోడా ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది.

బరువు తగ్గించుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే ఏ ఒక్కటీ కోరుకున్న ఫలితాన్ని ఇవ్వదు. దాంతో నిరాశ చెందుతుంటారు. అలాంటి వారి కోసం ఒక సింపుల్ హోం రెమెడీ ఒకటి ఉంది. ఇది బరువు తగ్గించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

వేగంగా బరువు తగ్గించే బేకింగ్ సోడా + నిమ్మరసం

ఈ వెయిట్ లాస్ రెమెడీతో చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. మీ రెగ్యులర్ డైట్ లో బేకింగ్ సోడాను చేర్చుకోవడం వల్ల బరువు తగ్గుతారు. మన వంటగదిలో ఉండే ఈ పదార్థానికి నిమ్మరసం లేదా గ్రేఫ్ ఫ్రూట్ జ్యూస్ ను మిక్స్ చేసి తీసుకోవడం వల్ల శరీరంలోని ఫ్యాట్ మీద ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

పది ఆహారాలను రోజూ తీసుకుంటే బరువు తగ్గడం తేలికే!

బేకింగ్ సోడ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. పొట్ట సమస్యలను నివారిస్తుంది. ఫ్యాట్ ను కరిగిస్తుంది. మెటబాలిజం రేటును పెంచి శరీరంలో ఎక్సెస్ ఫ్యాట్ కరిగించడానికి అవసరమయ్యే ఎనర్జీని అందిస్తుంది .

ఇంకా బేకింగ్ సోడా వర్కౌట్స్ సమయంలో శరీరంలో ల్యాక్టిక్ యాసిడ్స్ ను క్రమబద్దం చేయడంలో గొప్పగా సహాయపడుతుంది. ఫ్యాట్ బర్న్ చేయడానికి ఆల్కలైన్ ఫంక్షన్ మెరుగుపరచడానికి బేకింగ్ సోడా గ్రేట్ గా సహాయపడుతుంది. వేగంగా బరువు తగ్గించే బేకింగ్ సోడాతో సింపుల్ హోం రెమెడీ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

వేగంగా బరువు తగ్గించే బేకింగ్ సోడా + నిమ్మరసం

బేకింగ్ సోడా మరియు నిమ్మరసం :

కావల్సిన పదార్థాలు :

1 టీస్పూన్ బేకింగ్ సోడా

½ కప్పు నీళ్ళు

నిమ్మరసం లేదా గ్రేప్ ఫ్రూట్ జ్యూస్

బరువు తగ్గించడానికి బేకింగ్ సోడ

వేగంగా బరువు తగ్గించే బేకింగ్ సోడా + నిమ్మరసం

తయారుచేయు విధానం:

ఒక గ్లాసు నీటిలో బేకింగ్ సోడాను మిక్స్ చేయాలి. బేకింగ్ సోడా పూర్తిగా కరిగిపోయే వరకూ కలపాలి. అందులోనే నిమ్మరసం లేదా గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ మిక్స్ చేయాలి. ఈ డ్రింక్ ను ఉదయం ప్రతి రోజూ పరగడపున తాగాలి. ఈ హోంమేడ్ డ్రింక్ తాగిన అరగంట తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.

ఎఫెక్టివ్ గా బరువు తగ్గించడానికి అద్భుత హోం రెమెడీ : కొబ్బరి నూనె

ఈ హోంమేడ్ డ్రింక్ ను ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటుంటే, ఫ్యాట్ బర్నింగ్ ప్రొసెస్ ను స్పీడ్ అప్ చేస్తుంది. దాంతో ఎఫెక్టివ్ గా బరువు తగ్గుతారు. చాలా తక్కువ సమయంలోనే తప్పనిసరిగా మీలో మార్పును గమనించగలుగుతారు.

English summary

How To Use Baking Soda To Speed Up Weight Loss

Adding a simple ingredient to your diet can actually double your weight loss process. That ingredient is none other than Baking Soda.
Subscribe Newsletter