పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వుని త్వరగా న్యాచురల్ గా కరిగించే అద్భుతమైన పానీయం!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మీరు ఇలా ఊహించుకోండి. ఒకసారి మీరు మీ స్నేహితులతో కలసి త్రాగడానికి బయటకు వెళ్లారు. ఆ సమయంలో మిమ్మల్ని చూసి చాలా కాలం అయిన ఒక స్నేహితుడు మీ " బీరు వల్ల వచ్చిన పొట్ట " గురించి వ్యాఖ్యలు చేసారు.

అటువంటి సందర్భాల్లో ఉన్న ఏ వ్యక్తి అయినా కొద్దిగా ఎక్కువగా తనను తానూ సరిచేసుకోవాలని భావిస్తారు మరియు కొన్ని సందర్భాల్లో ఆవేదనకు కూడా లోనవుతారు, నిజమేనా ?

పొట్టలోని కొవ్వును కరిగించే అరటిపండు!

This Ancient Miracle Drink Can Reduce Belly Fat

ప్రతి ఒక్క వ్యక్తి తాను ఎలా ఉన్న తనను తానూ స్వీకరించవల్సిందే. తన బాహ్య సౌందర్యం గురించి మరీ ఎక్కువగా పట్టించుకోకూడదు అనే విషయం గుర్తుంచుకోవాలి. అయినప్పటికీ మనల్ని మనం ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి కృషి చేయాలి.

ఎందుకంటే మన శరీరాన్ని దృఢంగా మరియు శక్తివంతంగా ఉంచుకోవడం వల్ల అది మన ఆరోగ్యాన్ని మరింత పట్టిష్టపరుస్తుంది మరియు ఒక వ్యక్తిని బాగా అందంగా చూపించడం కంటే కూడా ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

This Ancient Miracle Drink Can Reduce Belly Fat

అందుచేత మన శరీరంలో ఉన్న అధిక కొవ్వుని కరిగించుకోవాలంటే మనం అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవ్వరైనా సరే ఒకవేళ అవసరానికి మించి బరువుగా ఉన్నట్లయితే, ఆ విషయాన్ని పట్టించుకోకుండా అశ్రద్ధ చేయకండి. ఎక్కువ లావుగా ఉండటం లేదా పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు పేరుకోవడం వల్ల, అది అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

ఈ రోజుల్లో సన్నగా, నాజుకుగా దృఢంగా, శక్తివంతంగా ఉంటూ చదునైన పొట్టని కలిగి ఉండి, ఒక మంచి ఆహార్యాన్ని కలిగి ఉండటం ఏ వ్యక్తికైనా ముఖ్యం. అంతేకాకుండా, సరైన పద్దతిలో వ్యాయామం చేసి తొడలు మరియు చేతుల యొక్క ఆకారాలను కూడా ఒక మంచి ఆకారంలోకి తెచ్చుకోవాలి. ఏ వ్యక్తులకైతే మరీ ఎక్కువ పొట్ట ఉంటుందో అటువంటి వ్యక్తులు నిజజీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటారు. ఇందులో లింగ బేధం ఏమి లేదు స్త్రీ కైనా పురుషుడికైనా ఒక్కటే.

ఒక దురదృష్టకరమైన అంశం ఏమిటంటే, ఇప్పుడు చెప్పే దాంట్లో నిజం కూడా ఉంది. మన శరీరంలో మిగతా శరీర భాగాల కంటే కూడా పొట్ట దగ్గర కొవ్వు అనేది ఎక్కువ పేరుకుపోతుంది. అంతేకాకుండా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వుని కరిగించడం కష్టమైనా విషయం. శారీరక వ్యాయామ నిపుణులు కూడా పొట్ట దగ్గర ఉన్న కొవ్వుని కరిగించాలంటే అంత సులభమైన విషయం కాదు అని చెబుతున్నారు.

వీటికి తోడు ఏ వ్యక్తులకైతే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఉంటుందో, అటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యం పై అది తీవ్ర వ్యతిరేక ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.

బెల్లీ ఫ్యాట్ ను వేగంగా తగ్గించే న్యూట్రీషియన్స్ ఫుడ్స్

This Ancient Miracle Drink Can Reduce Belly Fat

ఈ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు వల్ల స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, గుండె పోటు మరియు క్యాన్సర్ లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

అందుచేత మీకు చేతనైనంత మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది చాలా ముఖ్యమైన విషయం కూడా. అందుకోసం మీ జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

మీరు గనుక పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని త్వరగా మరియు ప్రకృతి సిద్ధంగా కరిగించుకోవాలనుకుంటే, ఇప్పుడు చెప్పబోయే ఈ సహజ విరుగుడిని ప్రయత్నించండి.

కావాల్సిన పదార్ధములు :

దోసకాయ రసం అర గ్లాసు, అల్లం రసం 3 టేబుల్ స్పూన్లు, అలో వీర గుజ్జు 3 టేబుల్ స్పూన్లు.

ఇది ఒక సహజమైన పరిష్కారం. దీనివల్ల మీ యొక్క పొట్ట అనేది చదునుగా మారిపోతుంది. మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకోసం మీరు చేయవల్సిందంతా ఏమిటంటే సరైన కొలతలతో క్రమం తప్పకుండా వాడవలసి ఉంటుంది.

This Ancient Miracle Drink Can Reduce Belly Fat

పొట్ట దగ్గర ఉన్న కొవ్వుని కరిగించుకోవడానికి ఇంటి పరిష్కారం :

అయితే ఈ పరిష్కారాన్ని ఎంతో ప్రభావంతంగా మన శరీరం పై అది పనిచేసి మన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించాలంటే అందుకోసం కొన్ని అతి ముఖ్యమైన జీవన విధాన మార్పులు మనం చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలి మరియు అనారోగ్య కొవ్వు మరియు తీపి ఎక్కువగా ఉండే పదార్ధాలను పూర్తిగా నిషేధిస్తే మంచిది. అంతేకాకుండా ప్రతిఒక్క వ్యక్తి రోజుకి 40 నిముషాలు వ్యాయామం చేయడం ఉత్తమం.

పొట్ట సంబంధిత వ్యాయామాలైన గుంజీలు మొదలైన వ్యాయామాలు కూడా క్రమం తప్పకుండా చేయాలి. అందువల్ల కొవ్వు అనేది త్వరగా కరిగే అవకాశం ఉంది.

This Ancient Miracle Drink Can Reduce Belly Fat

దోసకాయ రసం లో విటమిన్ సి అనేది చాలా ఎక్కువాగా ఉంటుంది మరియు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది మీ యొక్క జీవక్రియను బాగా పెంపొందించి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని చాలా త్వరతగతిన తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

అల్లం లో పొటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి పొట్టలో ఉన్న కొవ్వుని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి.

అలో వీర లో ఒక శక్తివంతమైన పదార్ధం ఉంది. అది కొవ్వుకు సంబంధించిన ఎన్నో ఎంజైములను శరీరం నుండి దూరం చేసి నాశనం చేస్తుంది. అందువల్ల మీకు నాజూకైన మరియు చదునైన పొట్ట మీకు లభిస్తుంది.

ఎలా తయారుచేయాలంటే :

పైన చెప్పబడిన కొలతల ప్రకారంగా అన్నింటిని ఒక గ్లాస్ లో వేయండి.

ఈ గ్లాస్ లో ఉన్న పదార్ధాలన్నింటిని బాగా కలిపి ఒక మిశ్రమంలా తయారుచేయండి.

ఈ పానీయాన్ని ప్రతిరోజూ ఉదయాన్నే అల్పాహారం తీసుకోక ముందే త్రాగండి. ఇలా కనీసం రెండు నెలలు చేయండి. అలా చేయడం వల్ల మీ పొట్ట చుట్టూ ఉన్న అధిక కొవ్వు బాగా తగ్గిపోయి, మీకు ఒక చక్కటి ఆకారాన్ని ఇస్తుంది. ఇలా చేయడం వల్ల అతి తక్కువ సమయంలోనే ఆ అనుభూతిని పొందగలరు మరియు పైన చెప్పబడిన మార్పుని చూడగలరు.

English summary

This Ancient Miracle Drink Can Reduce Belly Fat Quickly & Naturally!

Today, being fit and sporting a flat tummy, or having well-defined abs is all the rage, having a big belly can surely make matters worse for people, regardless of gender!
Story first published: Thursday, September 28, 2017, 11:00 [IST]
Subscribe Newsletter