బెల్లీ ఫ్యాట్ ని కరిగించేద్దామిలా..!

Posted By: Bharath Reddy
Subscribe to Boldsky

పొట్ట ప్రతి ఒక్కరినీ వేధించే ఒక సమస్య. కొందరు అందంగా ఉంటారు. హైట్ బాగానే ఉంటారు. కానీ బెల్లీ ఫ్యాట్

తో ఇబ్బందిపడుతుంటారు. ఇన్ షర్ట్ చేసినప్పుడు లోలోపల కాస్త కుమిలిపోతుంటారు. దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఇది సిగ్గు పడాల్సిన సమస్య కూడా కాదు. కొన్ని చిట్కాలు పాటిస్తే మీరూ స్లిమ్ గా మారొచ్చు. బెల్లీ ఫ్యాట్ ను పూర్తిగా కరిగించొచ్చు. అయితే కొవ్వును కరిగించుకోవడానికి చాలా మంది చాలా చేస్తుంటారు. తిండి మానేసి కడుపు మాడ్చుకుంటారు. కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. అలాగే మరికొందరు గంటల తరబడి కసరత్తులు చేస్తుంటారు. కానీ పొట్ట మాత్రం తగ్గదు.

బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఇవి మాత్రమే చేస్తే సరిపోదు. ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి. మీరు బెల్లీ ఫ్యాట్‌ను కరిగించుకోవాలని తపన పడుతున్నట్లయితే మీ మెనూలో కొన్నింటిని చేర్చుకోవాలి. వాటిని కొన్ని రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. వాటి ద్వారా మీరూ ఈజీగా నాజుగ్గా తయారుకావొచ్చు. ఇక మీరు ఏ డ్రెస్ వేసుకున్నా అట్రాక్షన్ గా నిలుస్తారు. అందరిలో అదిరిపోతారు. ఇంతకు ముందు మీరు దేనివల్ల అయితే బాధపడ్డారో ఆ సమస్య నుంచి దూరం అవుతారు. పది సూత్రాలు పాటిస్తే చాలు పది మంది మిమల్ని మెచ్చుకునే రీతిగా మీరు మారుతారు. అవి ఏవో మీరు పాటించలేని చిట్కాలు మాత్రం కాదు. రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేస్తే చాలు. శరీరంలోని కొవ్వును తగ్గించే వాటికి ప్రాధాన్యం ఇస్తే చాలు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఏవేవో ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తూ స‌మ‌యం వృథా చేసుకోకండి. ఈ టిప్స్‌ ఓసారి పాటించి చూడండి. దీంతో మీ శ‌రీరంలో పొట్ట ద‌గ్గ‌ర కొవ్వును సుల‌భంగాత‌గ్గించుకోవ‌చ్చు.

నిమ్మ ఎంతో మేలు

నిమ్మ ఎంతో మేలు

ఒక గ్లాసు గోరు వెచ్చ‌ని నీటిలో కొంత నిమ్మ‌ర‌సం వేసి బాగా క‌లపాలి. ఉద‌యాన్నే ప‌ర‌గడుపున ఈ మిశ్ర‌మం తాగితే అధికంగా ఉన్న పొట్ట త‌గ్గిపోతుంది. ఒక క‌ప్పు గోరు వెచ్చని నీటిలో 1/4 టీస్పూన్ నిమ్మ‌ర‌సం, తేనె 2 టీస్పూన్లు, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పొడిల‌ను క‌లిపి అనంత‌రం వ‌చ్చే ద్రవాన్ని వ‌డ‌క‌ట్టి తాగితే మంచి ఫ‌లితం ఉంటుంది. పొట్ట సుల‌భంగా త‌గ్గిపోతుంది.

అల్లంతో సమస్య మాయం

అల్లంతో సమస్య మాయం

అల్లం వాడకం వల్ల పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది. అల్లం తురిమి గ్రీన్ టీలో మిక్స్ చేసి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో అల్లం రసం 1 టీస్పూన్, నువ్వుల నూనె 1 టీ స్పూన్‌ వేసి బాగా క‌ల‌పాలి. ఈ ద్ర‌వాన్ని రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

జీలకర్ర ఎంతో బాగు

జీలకర్ర ఎంతో బాగు

జీలకర్ర ఫ్యాట్ ని తగ్గించడంతో పాటు చెడు కొవ్వును చేరనివ్వదు. జీలకర్రలో ఉండే విటమిన్స్ మనం తిన్న ఆహారం త్వరంగా జీర్ణం కావడానికి ఉపయోగపడతాయి. రాత్రి జీలకర్రను నానా పెట్టి ఉదయం దాన్ని నీటిలో బాగా మరిగించండి. ఆ జీలకర్రను నమిలి ఊసేయండి. 5 గ్రాముల జీలకర్రను పెరుగులో వేసుకొని రోజూ తింటూ ఉండండి. ఇక రుచిగా తినాలని అనుకున్నవారు 3 గ్రాముల జీలకర్రను తేనేలో కలిపి తింటూ ఉండండి. బ్రౌన్ రైస్ వెజిటేబుల్ సూప్ లో జీలకర్రను వేసుకోండి. అల్లం నిమ్మకాయలతో తీసుకుంటే ఇంకా మంచిది. క్యారెట్ ని చిన్న చిన్న ముక్కలు చేసి అందులో అల్లం నిమ్మకాయ వేసి దానిపైన జీలకర్రను చల్లి రోజు రాత్రి అన్నం తినే ముందు తింటే చాలా మంచిది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పొట్ట లో మార్పు కనిపిస్తుంది.

నీరు తాగితే సమస్య దూరం

నీరు తాగితే సమస్య దూరం

శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోయి, బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే నీరు అధికంగా తాగాలి. నీరు శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది.. నీరు ఎక్కువగా తాగటం వల్ల పొట్ట ప్లాట్ గామారుతుంది. శరీరంలో తగినంత నీరు ఉంటే

అదిరిటన్షన్, బ్లోటింగ్ వంటి లక్షణాలను నియంత్రిస్తుంది. అలాగే నీరు అధికంగా కలిగిన ఆహారం తీసుకోవాలి.వాటర్ మెలోన్ ,పీయర్స్ వంటివి తింటే మంచిది. వాటర్ డైట్‌తో బరువు తగ్గించుకోవాలంటే రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. భోజనానికి ముందు రెండు కప్పుల నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల భోజనం సమయంలో మీరు తక్కువగా తినడానికి సాయపడుతుంది. దీని వల్ల బరువు కూడా తగ్గుతారు. పొట్ట నిండా నీళ్లు ఉండేలా చూసుకోండి. ఇలా నీళ్లు తాగాడం వల్ల శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ క్యాటచిన్స్ లభిస్తాయి. ఇవి బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. రోజూ రెండు కప్పుల గ్రీన్ టీని తాగాలి . ఉదయం పరగడపున గోరువెచ్చని గ్రీన్ టీకి, కొద్దిగా తేనె మిక్స్ చేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

తేనేతో మంచి ఫలితం

తేనేతో మంచి ఫలితం

పంచదారతో పోలిస్తే తేనెలో కెలొరీలు అధికంగా ఉంటాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 2 టేబుల్ స్పూన్ల తేనెను వేసి బాగా క‌లిపి ఆ ద్ర‌వాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగితే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రిగిపోతుంది. అలాగే తేనె, నిమ్మరసం, దాల్చిన చెక్క తాగితే బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది. వంటకాల్లో బెల్లం, పంచదారకు బదులు తేనెను వాడితే మంచిది.

ఓట్స్ కొవ్వును కరిగించేస్తాయి

ఓట్స్ కొవ్వును కరిగించేస్తాయి

ఓట్స్‌లో అధిక పీచుపదార్థం ఉంటుంది కాబట్టి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రొటీన్ల కోసం చేపల్ని తినాలి. పీచు ఎక్కువగా ఉండే ఓట్‌మీల్‌తో మీ ఉదయాన్ని ప్రారంభించండి. ఓట్స్‌ ఒక్కటీ తినలేం అనుకుంటే దాంతో కాస్త గరంమసాలా పొడిని కలుపుకోవచ్చు. లేదంటే ఏదైనా పండ్లతో కలిపి కూడా తినొచ్చు. అప్పుడు పీచుతోపాటూ వ్యాధి నిరోధకశక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు కూడా అందుతాయి.

క్యారెట్ ఖతర్నాక్ గా పని చేస్తుంది

క్యారెట్ ఖతర్నాక్ గా పని చేస్తుంది

క్యారెట్ జ్యూస్ ఫ్యాట్ తగ్గడానికి చాలా సహాయం చేస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువగానూ, పీచు పదార్థం ఎక్కువగానూ ఉంటుంది. ఉదయం పూట ఒక పెద్ద గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగితే.. మళ్లీ భోజనం సమయం వరకు మీకు ఆకలి కూడా వేయదు. అంతేకాకుండా అందులోని ఫైబర్ కొవ్వును కరిగిస్తుంది. దీంతో సులభంగా ఫ్యాట్ తగ్గుతుంది. ఈ క్యారెట్ తో సగం యాపిల్, సగం నారింజ, కొంచెం అల్లం కలిపి మొత్తం కలిపి జ్యూస్ చేసుకుని తాగితే మరింత ప్రయోజనం ఉంటుంది.

క్యాబేజీ

క్యాబేజీ

కూరగాయలన్నింటిలోనూ.. ఫైబర్ ఎక్కువగా క్యాబేజీలో ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వున కరిగించేందుకు సహాయం చేస్తుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. దీని రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. అలాగే దీని ద్వారా తయారు చేసిన జ్యూస్ తాగితే ఎక్కువగా సేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ లో ఉంటాం. దీనిని ఆపిల్, నిమ్మ లేదా క్యారెట్, బీరూట్ వంటివి కలిపి జ్యూస్ చేసుకోని కూడా తాగవచ్చు.

పాలకూర

పాలకూర

పియర్‌ని పేస్ట్‌లా చేసుకోవాలి. అందులోకి ఒక నిమ్మకాయ రసం, ఒక దోసకాయ, కొన్ని పాలకూర ఆకులు కలిపి జ్యూస్ తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్‌ని పడుకునే ముందు కనీసం ఒకవారం రోజులు తాగడం వల్ల మంచిప్రయోజనం ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.ఇక మనం రోజుకు మూడు సార్లు ఆహారాన్ని తీసుకుంటాం. అలా కాకుండా నాలుగైదుసార్లు తీసుకొంటే ఆరోగ్యానికి మంచిది. దీని వల్లజీవక్రియ యాక్టివ్ గా పని చేస్తుంది. పొట్ట దగ్గర పేరుకొన్న కొవ్వు త్వరగా కరుగుతుంది. ఈ సూత్రాలన్నీ పాటిస్తే మీ బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది.

English summary

10 Quick Natural Tips To Lose Belly Fat

Quick Natural Tips To Lose Belly Fat. Read to know more about it..
Story first published: Tuesday, October 24, 2017, 17:47 [IST]