For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు వెయిట్ లాస్ ప్లాన్ లో వున్నప్పుడు తినదగ్గ చిరుతిళ్ళు !!

By Lakshmi Bai Praharaju
|

మధ్యాహ్నం నాలుగు గంటలు కాగానే, మీ కడుపులో ఎలుకలు పరుగెత్తడం మొదలౌతుంది. ఇక మీరు బరువు పెరగకుండానే ఆకలి ఎలా తీర్చుకోవాలా అన్న ఆందోళనలో వుంటారు.మరి, ఓ వ్యక్తీ వెయిట్ లాస్ ప్లాన్ లో వున్నప్పుడు, అతను లేక ఆమె తను తినే తిండి గురించి ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవాలిగా!

కాలరీలు ఎక్కువగా వున్న ఏ ఆహారం అయినా మీ నడుము చుట్టుకొలతకు మంచిది కాదు, పైగా బరువు పెంచుతుంది. కానీ ఆకలి దంచేస్తుంటే మనసు ఆటోమేటిక్ గా డైట్ మర్చిపోయి దగ్గరి స్టాల్ లో వున్న సమోసా నో బర్గరో తినమని ప్రేరేపిస్తుంది. కానీ దాని వల్ల మీ శరీరానికి అదనపు నష్టం జరుగుతుంది, పైగా మీరు పడ్డ శ్రమ, చేసిన వ్యాయామాలు అన్నీ వృధా అయిపోతాయి.

Snacks You Can Eat When Losing Weight

అందువల్ల “ఇక నేను ఖాళీ కడుపుతో వుండి ఆకలి చంపేసుకోవాలా?” అని మీరు అనుకోవచ్చు. లేదు, అది ఇంకా పెద్ద తప్పవుతుంది ఎందుకంటే మీరు చాలా సేపు తినకుండా వుంటే మీ శరీరం శక్తి నివ్వడానికి మరింత కొవ్వును నిల్వ చేస్తుంది.

కానీ మీరు రెండు గంటలకోసారి ఆహారం తీసుకుంటూ వుంటే శరీర౦లో మెటబాలిజం మెరుగై అదనపు కొవ్వు నిల్వ కాకుండా ఉంటు౦ది.
అందువల్ల మీ శరీరానికి మేలు చేసే ఆరోగ్యకరమైన చిరుతిళ్ళు తీసుకుని ఆకలిని జయించండి. ఇదుగో జాబితా సిద్ధంగా వుంచాం, చూడండి...

 •గింజ ధాన్యాలు :

•గింజ ధాన్యాలు :

గింజ ధాన్యాలు ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కల్పిస్తాయని మనకు తెలుసు. ఓ గిన్నెడు జీడి పప్పు, అక్రూట్ లు, బ్రెజిల్ నట్లు – సరిపడా బాదం పప్పులతో కలిపి తీసుకుంటే మీ ఆకలి తీరి, మీరు ప్రశాంతంగా పని చేసుకోగలుగుతారు. పైగా, గింజ ధాన్యాల్లో డయాబెటిస్, హృద్రోగం వంటి వాటి ప్రమాదం నివారించే, బరువు తగ్గించే అసంతృప్త కొవ్వు పదార్ధాలు వుంటాయి.

•వేయించిన శనగపప్పు :

•వేయించిన శనగపప్పు :

ప్రోటీన్, బైబర్ ఎక్కువగా ఉన్న ఈ శనగపప్పు మీకు కావలసినంత శక్తిని అందిస్తాయి, అస్దిరమైన ఆకలిని శాంతింపచేస్తుంది. ఇవి మీరు బరువు తగ్గడానికి సహాయపడే, ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడే ఆహార పదార్ధాలు. అరకప్పు వేయించిన శనగపప్పు లో 6 గ్రాముల ఫైబర్, 7గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి, ఇవి మీ ఆరోగ్యకరమైన ఆహారానికి ఉపయోగకరంగా ఉంటాయి.

అరటిపండు + పీనట్ బటర్:

అరటిపండు + పీనట్ బటర్:

అరటిపండు, పీనట్ బటర్ లో ఉండే పోషక విలువల గురించి ఎవరికీ తెలీదు. ప్రతిరోజూ ఉదయం పీనట్ బటర్ తినే వారికి రోజులో అస్దిరమైన ఆకలి లేకుండా చేస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి. అరటిపండు, మరోవైపు, పంచదార అదనంగా లేకుండా, అరటిపండుతో పీనట్ బటర్ తో తయారుచేసిన సాండ్ విచ్ శరీరానికి ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, విటమిన్స్ ని తగినంత మొత్తంలో అందిస్తుంది.

గ్రీక్ యోగర్ట్:

గ్రీక్ యోగర్ట్:

ఒక వ్యక్తి బరువు తగ్గే పనిలో ఉన్నపుడు పెరుగు మంచి అపెటైజర్ గా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఒక చిన్న కప్పు సాదా పెరుగు తింటే ఆకలి తగ్గి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గ్రీక్ యోగర్ట్ లో 6 గ్రాముల కార్బ్స్, 17 గ్రాముల ప్రోటీన్, 100 గ్రాముల కేలరీలు ఉంటాయి. బరువు తగ్గడం కోసం మీరు మీ చార్ట్ లో ఈ ఆరోగ్యకర ఆహారాన్ని ఒక భాగంగా చేసుకోండి.

డార్క్ చాకొలేట్స్:

డార్క్ చాకొలేట్స్:

మీకు చాకొలేట్స్ అంటే ఇష్టమా, కానీ ఇవి మీ శరీరానికి అదనపు బరువును అందిస్తాయని భయపడుతున్నారా? అయితే, డార్క్ చాకొలేట్ ని ప్రయత్నించండి, ఇవి మీ ఆకలి కేకలను తగ్గిస్తాయి, బ్లడ్ షుగర్ స్థాయిలను స్ధిరంగా ఉంచుతాయి, శరీర బరువును సరిగా నిర్వహిస్తాయి. వీటితోపాటు, ఇవి మీ మనసుకి జ్ఞానాన్ని ఇచ్చి, పనిలో ఉత్సాహాన్ని పెంచుతాయి. డార్క్ చాకొలేట్ లో ఓలిక్ యాసిడ్, పల్మిటిక్ యాసిడ్, స్టెరిక్ యాసిడ్ ఉన్నాయి, ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిని ప్రభావితం చేయదు కాబట్టి ఇది ఒక ఆరోగ్యకరమైన అల్పాహార ఎంపిక.

ఓట్మీల్:

ఓట్మీల్:

ఓట్స్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండడానికి సహాయపడే ఫైబర్ ని అధిక సంఖ్యలో కలిగి ఉంటాయి కాబట్టి మీ పొట్టను శాంతపరుస్తుంది. ఇది రక్తంలోని చక్కర స్థాయిని నియంత్రిస్తుంది కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు కూడా సిఫార్సు చేయబడిన అల్పాహారం. ఓట్మీల్ వడ్డన చాలా ఆరోగ్యకరమైనది, ఇది దాదాపు 6 గ్రాముల ఫైబర్ ని కలిగి ఉంటుంది.

టొమాటో + కీరదోస సలాడ్:

టొమాటో + కీరదోస సలాడ్:

కీరదోసలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఇవి మీ పొట్ట నిండుగా ఉండేట్టు చేసి, పొట్టను శాంతింపచేస్తుంది. మరొకవైపు, టమాటోలు ఆరోగ్యకరమైన అల్పాహార ఎంపికలో అద్భుతాలను చేయవచ్చు. మీరు టొమాటో, కీరదోస ముక్కలకు, నిమ్మరసం జతచేసి, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ సీజనింగ్ తో ఆరోగ్యకర సలాడ్ చేయవచ్చు. ఒక నిండు కప్పు సలాడ్ శరీరానికి పోషకాలను అందిస్తుంది అలాగే గొప్ప అపెటైజర్ గా పనిచేస్తుంది.

పైనాపిల్ + సీ సాల్ట్:

పైనాపిల్ + సీ సాల్ట్:

పైనాపిల్ మాంగనీస్, ఫైబర్ వంటి అద్భుతమైన పోషకాలు కలిగి ఉంది. ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరిచి, బరువు తగ్గడానికి సహాయపడితే, మాంగనీస్ కొవ్వు మెటబాలిజం లో చికిత్సగా పనిచేసి, రక్తంలో చక్కర స్థాయిని తగ్గిస్తుంది. సీ సాల్ట్ తో కూడిన ఈ పండును తీసుకోవడం వల్ల మీ శరీరంలోని అవాంచిత విషపదార్ధాలను తొలగించవచ్చు. ఇది మంచి ఆకలిని కలిగించి, మీ ఆరోగ్యానికి మంచి ప్రయోజనాన్ని కలుగచేస్తుంది.

అవకడో:

అవకడో:

బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి అవకడో ఒక మంచి అల్పాహార ఎంపిక. 50 గ్రాముల అవకడో వినియోగంతో 80 గ్రాముల క్యాలరీలు తగ్గుతాయి, మీ కడుపును తగినంత శాంతింపచేస్తుంది. మీరు చికెన్ అవకడో, లైమ్ సూప్, అవకడో వెజ్జీ పన్ని మొదలైన ఆరోగ్యకరమైన డిషెస్ లో అవకడో ని ఉపయోగించి ఆకలిని తీర్చుకోవచ్చు.

సజ్జలు + కొబ్బరి పాలు:

సజ్జలు + కొబ్బరి పాలు:

మీ కడుపు దాహంతో పాటు, అసంఖ్యాకంగా ఆకలితో ఉంటె, సజ్జలు, కొబ్బరిపాలతో చేసిన పానీయం ఈ రెండిటినీ శాంతపరుస్తుంది. సజ్జగింజలు ఫైబర్, ఒమేగా-3 ఫాట్, విటమిన్లు, ప్రోటీన్లు మొదలైనవి అధికంగా కలిగి ఉంటుంది. ఈ విత్తనాలను నీటిలో నానపెట్టి, కొబ్బరి పాలతో సున్నితమైన పానీయం తయారుచేసి తీసుకుంటే అది మీ మనసుకు తాజాదనాన్ని కలిగించి, మీ ఆకలిని నియంత్రిస్తుంది.

ద్రాక్షపళ్ళు + తేనె:

ద్రాక్షపళ్ళు + తేనె:

తేనె దోషరహిత చర్మాన్ని అందించి, బరువు తగ్గించే అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంది. ద్రాక్షపళ్ళతో దీనిని కలిపి తింటే రుచి ఇంకా బాగా ఉంటుంది. దానికోసం మీకు కావాల్సిందల్లా, ద్రాక్షపళ్ళు లేదా దాని రసం, బాగా కలిపి, కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్, ఒక చెంచా తేనెతో కలపాలి. ఈ స్మూతీ ఆకలిని కలిగించి, కడుపును నిండుగా చేస్తుంది.

ఎండిన ఆల్బకరా:

ఎండిన ఆల్బకరా:

ఎండిన ఆల్బకరా కడుపు నిండుగా ఉండేట్టు చేసి, అకాల ఆకలిని తగ్గిస్తుంది. ఇది మీ శరీర బరువును నియంత్రించడానికి సహాయపడే ఆహార ఫైబర్ ని కలిగి ఉంటుంది, ఇది ఒక అద్భుతమైన అల్పాహార ఎంపిక. కాబట్టి, మీరు బరువు తగ్గే పనిలో ఉంటే ఇవి కొన్ని అందుబాటులో ఉన్న చిరుతిళ్ళు. బాగా తిని, చురుకుగా ఉండండి.

English summary

Snacks You Can Eat When Losing Weight

Therefore, satiate your hunger by munching down on some healthy snacks which are beneficial for your body. Here we have the list ready for you, take a look.
Desktop Bottom Promotion