చేతుల చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించుకోవడానికి ప్రయత్నించి మరియు నిరూపించబడ్డ పద్ధతులు

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

చేతుల చుట్టూ ఎక్కువగా కొవ్వు పేరుకుపోవడం వల్ల స్లీవ్ లెస్ టాప్స్ ని వేసుకోవాలంటే చాలా సిగ్గుపడుతుంటారు. ఈ క్రింద చెబుతున్న చిట్కాలు ప్రయత్నించి, నిరూపించబడ్డవి. వీటిని పాటించడం వల్ల మీ చేతులు సాధారణ స్థితికి చేరుకుంటాయి. అతి తక్కువ సమయంలోనే మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది.

మాములుగా మహిళలు ఎదుర్కొనే సమస్యలలో, కొవ్వు వల్ల అటు ఇటు ఊగిసలాడుతున్న చేతుల సమస్య అతి సాధారణమైన సమస్య. బాగా కొవ్వు పేరుకుపోయిన లేదా వేలాడుతున్న చేతిని చూసి, వ్యక్తి యొక్క బాహ్య సౌందర్యాన్ని లెక్కకట్టేస్తారు.

పొట్ట మాత్రమే కాదు, టోటల్ బాడీ ఫ్యాట్ కరిగించే టాప్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్

మీ శరీరాకృతి ఎంతో అందంగా ఉన్నా, చేతులు లావుగా ఉంటే అందవిహీనంగానే కనపడతారు. ఈ సమస్యతో పురుషులే కాదు స్త్రీలు కూడా బాధ పడుతూ కష్టాలను ఎదుర్కొంటున్నారు.

చెయ్యి చుట్టూ పేరుకుపోయి ఉన్న కొవ్వుని తగ్గించుకొనే చిట్కాలు :

చాలా మంది మనుష్యులు వారి శరీర పరిమాణం మరియు నిర్మాణంతో పోల్చి చూసినప్పుడు వాళ్ళ చేతులే ఎక్కువగా లావుగా కనపడుతుంటాయి. అది చూడటానికి కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది.

మెడ, గడ్డం మరియు ముఖం కొవ్వు కరిగించడానికి 10 చిట్కాలు

చేతుల దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల, చేతులు అలా ఎటు కాకుండా లావు అయిపోతాయి. శరీరంలో ఎక్కడ కొవ్వు పేరుకుపోయిన కరిగించుకోవచ్చు కానీ, ఈ చేతుల దగ్గర పేరుకుపోయిన అధిక కొవ్వుని కరిగించుకోవాలంటే కొద్దిగా ఎక్కువ కష్టపడాలి.

ఈ కొవ్వు చేతుల దగ్గర పేరుకుపోయే కొద్దీ, మన చేతుల దగ్గర చర్మం ఎక్కువగా ఊగిస లాడుతూ కనపడుతుంది. ఇలా చేతులు ఊగిసలాడటానికి వయస్సు పెరగడం కూడా ఒక కారణం. ఇరవై సంవత్సరాలు దాటినా తర్వాత మన శరీరం మనం తినే ఆహారాన్ని కొవ్వుగా మార్చి, శరీరంలోని వివిధ ప్రదేశాల్లో పోగు చేస్తుంటుంది. ఇందువల్ల మనలో కండ పెరిగే తత్వం తగ్గిపోతుంది.

చేతుల చుట్టూ పేరుకుపోయి ఉన్న మొండి కొవ్వుని కరిగించుకొనే మార్గాలు కింద చెప్పబడి ఉన్నవి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

1. కండరపుష్టి(బైసెప్స్ కర్ల్) అనే వ్యాయామం ద్వారా :

1. కండరపుష్టి(బైసెప్స్ కర్ల్) అనే వ్యాయామం ద్వారా :

కండరపుష్టి(బైసెప్స్ కర్ల్) అనే వ్యాయామం చేయడం ద్వారా మీ యొక్క చేతులు చుట్టూ ఉన్న కొవ్వుని త్వరగా కరిగించుకోవచ్చు. సులువైన మార్గాలలో ఇది కూడా ఒకటి. కేవలం మీరు మీ కండలను 180 డిగ్రీల కోణంలో పైకి కిందకు అనే ప్రక్రియ చేయడం ద్వారా మీ చేతులు చుట్టూ ఉన్న కొవ్వుని తగ్గించుకోవచ్చు.

2. ఎక్కువ ప్రోటీన్లను తీసుకోండి :

2. ఎక్కువ ప్రోటీన్లను తీసుకోండి :

మీ చేతి కండలను మంచి ఆకారంలోకి తీసుకొని రావాలంటే అదనపు ప్రోటీన్లు శరీరానికి అవసరమవుతాయి. అందుచేత మీరు తీసుకొనే ఆహారంలో ఎక్కువ ప్రోటీన్లు ఉండేలా చూసుకోండి.

ప్రోటీన్లు తీసుకోవడం వల్ల మాములుగా పెరిగే కండ కన్నా 25 శాతం అధికంగా కండ పెరిగే అవకాశం ఉందని పరిశోధనలు మరియు అధ్యయనాలు చెబుతున్నాయి. చేతుల చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించే ఉత్తమ చిట్కాలతో ఇది కూడా ఒకటి.

3. డిప్స్ చేయడం ద్వారా :

3. డిప్స్ చేయడం ద్వారా :

డిప్స్ అనే వ్యాయామం ప్రతిరోజూ చేయడం ద్వారా మీ చేతులు అతి కొద్ది కాలంలోనే సన్నబడతాయి. మీ రెండు చేతులను మీ భుజాలకు సరి సమానంగా పెట్టుకొని, ఒక స్టాండ్ ను ఆధారంగా చేసుకొని తమ శరీరాన్ని ఒక క్రమపద్ధతిలో పైకి కి క్రిందకి లేవడం అనే వ్యాయామాన్ని డిప్స్ అంటారు. ఇలా చేయడం వల్ల మీ శరీరంలోని పై భాగం చూడటానికి చాలా శక్తివంతంగా మారుతుంది. ఆ అనుభూతిని కూడా మీరు పొందగలరు.

4. ద్రాక్ష పళ్ళు తినడం ద్వారా :

4. ద్రాక్ష పళ్ళు తినడం ద్వారా :

చేతులు చుట్టూ ఉన్న కొవ్వు సమస్యను అధిగమించడంలో మనం తీసుకొనే ఆహరం కూడా చాలా కీలకం. మీరు ప్రతి రోజు తీసుకొనే ఆహారంలో ద్రాక్ష పళ్ళు ఉండేలా చూసుకోండి. ప్రతి రోజు ఓ అర కప్పు ద్రాక్షపళ్ళు రసం తాగడం ద్వారా మీ చేతుల యొక్క కొవ్వుతో పాటు శరీరం యొక్క కొవ్వు కూడా గణనీయంగా తగ్గుతుంది. అది మీరు గుర్తించగలరు.

5. గుండెకు సంబంధించిన(కార్డియో) వ్యాయామాన్ని ప్రయత్నించండి :

5. గుండెకు సంబంధించిన(కార్డియో) వ్యాయామాన్ని ప్రయత్నించండి :

చేతులు చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించడంలో, గుండెకు సంబంధించిన వ్యాయామం(కార్డియో) చేయడం చాలా ఉత్తమమైనది. ఒక విధంగా చెప్పాలంటే, ఆ రకమైన కొవ్వుని కరిగించడంలో ఇది రారాజు. శక్తి శిక్షణ తీసుకునే వారికంటే కూడా, ఈ గుండె సంబంధిత వ్యయామాల్లో పాల్గొనే వారు రెండు రేట్లు అధికంగా తమ బరువుని తగ్గించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియలో కండలు పెరగకుండా చెయ్యి చుట్టూ ఉన్న కొవ్వు ఎలా కరిగించుకోవచ్చో తెలుసుకోవచ్చు.

చేతులలో కొవ్వు కరించే10 చక్కటి వ్యాయామాలు

6. పుష్ అప్స్ చేయడం ద్వారా :

6. పుష్ అప్స్ చేయడం ద్వారా :

అన్ని వ్యాయామాల కంటే కూడా పుష్ అప్స్ చేయడం అనేది చేయి చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించుకోవడానికి ఉత్తమమైన మార్గం. పుష్ అప్స్ చేయడం ద్వారా మీ కండలు మరియు చేతికి వెనకభాగం గల త్రిసిర కండరాలు ఒక మంచి రూపాన్ని సంతరించుకొంటాయి. దానితో పాటు చేతుల చుట్టూ పేరుకుపోయి ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది.

7. పొద్దున్నే మొదలు పెట్టండి :

7. పొద్దున్నే మొదలు పెట్టండి :

ప్రతిరోజూ మీ రోజుని ప్రొదున్న లేవగానే వ్యాయాయం చేయడం ద్వారా మొదలు పెడితే, మీ చెయ్యి చుట్టూ ఉన్న కొవ్వుని రికార్డు వేగం తో కరిగించుకోవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం అల్పాహారం తిని జిమ్ము కు వెళ్లిన వారికంటే కూడా అల్పాహారం తీసుకోకుండా జిమ్ము కు వెళ్లిన వారిలో 20 శాతం ఎక్కువ కొవ్వు కరుగుతుంది.

English summary

How To Lose Stubborn Arm Fat

Best methods to lose stubborn arm fat are doing biceps curl, increasing protein intake, etc. Read to know about the best tips to lose arm fat.
Story first published: Tuesday, August 29, 2017, 8:00 [IST]