మహిళలు త్వరగా, ఎఫెక్టివ్ గా బరువు తగ్గడానికి బెస్ట్ ఫుడ్స్

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

ప్రస్తుకాలంలో అమ్మాయిలకు.. అబ్బాయిలకు బరువు తగ్గడం అన్నది పెద్ద సమస్యగా మారింది. నేటి జంక్‌ఫుడ్‌, బిజీ లైఫ్‌, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, వండుకునే సమయం లేకపోవడం... ఇలాంటి అనేక కారణాల చేత అంతకంతకూ స్థూలకాయ సమస్య పెరిగిపోతుంది. మరి దీన్నుండి బయటపడాలంటే ఏం చేయాలి... అదీ నీరసం రాకుండా...సౌందర్యానికి ఆపద వాటిల్లకుండా!

ఎందుకంటే, డైటింగ్‌ పేరిట పస్తులుండి ఆసుపత్రుల పాలవుతున్న అమ్మాయిలను మనం చూస్తున్నాం. ఆహారంలో ఈ క్రింది వాటిని భాగంగా చేస్తే ఎలాంటి కొవ్వు లేకుండా పోషకాహారం మీ శరీరానికి అందిస్తున్నట్లే! నాజూగ్గా మారడానికి ఇది ఒక చక్కటి మార్గం.

శారీరకంగా పురుషులకు మహిళలకు తేడా వుంటుంది. మహిళలకు వారి శరీరాన్ని మంచి షేప్ లో వుంచే ఆహారాలు కావాలి. కాని పురుషులకు శరీరాలను బలంగా వుంచే ఆహారాలు కావాలి. బరువు తగ్గేటందుకు ఆహారాలు అనేకం. కాని మహిళలకు తగినవి కొన్ని మాత్రమే. మరి అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

1. సిట్రస్ పండ్లు

1. సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లలో ఫైబర్ మరియు విటమిన్ సి ఎక్కువ. ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతాయి. ఆరెంజ్ మరియు గ్రేప్ ఫ్రూట్ వీటిలో ఉండే విటమిన్ సి కంటెంట్ శరీరంలో ఐరన్ గ్రహించి, బరువు తగ్గించడానికి సహాయపడుతాయి.

2. ఓట్స్ :

2. ఓట్స్ :

ఓట్స్ లో ఫైబర్ మరియు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. ఇది మెటబాలిజం రేటు పెంచుతుంది. ఫ్యాట్ కరిగిస్తుంది. కాబట్టి, రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను తీసుకోవచ్చు. డిన్నర్ కూడా ఒక బౌల్ ఓట్స్ తినడం వల్ల బరుతు తగ్గడం సులభం అవుతుంది.

3. నట్స్ :

3. నట్స్ :

నట్స్ లో మంచి కొవ్వులు ఉంటాయి. బాదం, వాల్ నట్స్, పీనట్స్ వంటి రెగ్యులర్ గా తినడం వల్ల ఇవి పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తాయి, ఆకలి అనిపించినప్పుడు వీటిని తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఇతర జంక్ ఫుడ్స్ తినకుండాచేయడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.

4. గ్రీన్ టీ :

4. గ్రీన్ టీ :

గ్రీన్ టీలో ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి ఫ్యాట్ బర్న్ చేయడానికి సహాయపడుతాయి. రోజుకు రెండు మూడు కప్పులు గ్రీన్ టీ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గించుకోవచ్చు.

5. త్రుణ ధాన్యాలు :

5. త్రుణ ధాన్యాలు :

బ్రౌన్ రైస్, బక్ వీట్, క్వీనా వంటి మరికొన్ని త్రుణ ధాన్యాలు , సులభంగా బరువు తగ్గిస్తాయి, వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. వీటిని తినడం వల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది. ఆటోమాటిక్ గా బరువు తగ్గుతారు. క్యాలరీలు ఖర్చు అవుతాయి. .

6. పసుపు:

6. పసుపు:

పసుపులో యాంటీయాక్సిడెంట్స్, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. పసుపులో ఉండే కుర్కుమిన్ కంటెంట్ ఇన్ఫ్లమేషన్, బాడీ ఫ్యాట్ ను తగ్గిస్తాయి, పసుపును రెగ్యులర్ ఫుడ్స్ తో తీసుకుంటే, బరువు తగ్గడం సులభమవుతుంది.

7. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

7. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మరియు మస్టర్డ్ లీవ్స్ ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తాయి, వీటిలో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ వల్ల మహిళలు రెగ్యులర్ గా తీసుకుంటే బరువు తగ్గడం సులభం అవుతుంది.

8. మెంతులు:

8. మెంతులు:

మెంతులలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. మెంతులు ఆకలిని తగ్గించి బరువు తగ్గిస్తాయి. రెండు మూడు టేబుల్ స్పూన్ల మెంతులు నీటిలో నానబెట్టి, వడగట్టి తీసుకుంటే సులభంగా బరువు తగ్గొచ్చు.

9. పెరుగు:

9. పెరుగు:

ఒక చిన్న బౌల్ లోఫ్యాట్ పెరుగును ఒక కప్పు తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఆకలి తగ్గిస్తాయి, క్యాల్షియం పెరుగుతుంది, బరువు తగ్గుతారు.

10. బీన్స్ :

10. బీన్స్ :

బీన్స్ లో సోలబుల్ ఫైబర్ ప్రోటీన్స్, ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది, బరువు తగ్గిస్తుంది. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో వీటిని చేర్చుకోవడం మంచిది.

English summary

Foods That Help Women To Lose Weight

Dieting and starving is not the best option if you are looking at losing weight. In order to lose weight, there are a few foods like citrus fruits, oats, turmeric and whole grains that can help women to lose weight. Along with the foods, regular exercise is equally important if you are looking at losing weight.
Story first published: Friday, December 22, 2017, 8:00 [IST]