For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా చేస్తే ఎలాంటి ఎక్సర్ సైజ్ లు అవసరం లేదు.. ఈజీగా బరువు తగ్గొచ్చు

మీరు సరైన క్రమంలో ఆహారం తీసుకుంటే ఈజీగా బరువు తగ్గొచ్చు. ఇలా చేస్తే మీరు జిమ్ కు వెళ్లకుండానే 3 నుంచి 6 నెలల్లో బరువు తగ్గుతారు.

|

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బరువు పెరుగుతుంటారు. మీ ఆహారపు అలవాట్లను పక్కాగా మార్చుకుని పరిమితంగా తింటే మీ బరువు కచ్చితంగా అదుపులో ఉంటుంది. ఈ కింద తెలిపిన ప్రకారం మీరు సరైన క్రమంలో ఆహారం తీసుకుంటే ఈజీగా బరువు తగ్గొచ్చు. ఇలా చేస్తే మీరు జిమ్ కు వెళ్లకుండానే 3 నుంచి 6 నెలల్లో బరువు తగ్గుతారు.

# 1. భోజనం చేసే ముందు ఒక గ్లాస్ నీరు తాగండి

# 1. భోజనం చేసే ముందు ఒక గ్లాస్ నీరు తాగండి

భోజనం చేయడానికి కొద్దిగా ముందుగా ఒక గ్లాస్ నీరు తాగితే బరువు తగ్గేందుకు అవకాశం ఉంది. కొన్ని పరిశోధనల ప్రకారం 44% మంది ఇలా చేయడం వల్ల బరువు తగ్గారని తేలింది. క్రమంగా 3 నెలల పాటు ఇలా చేస్తే కచ్చితంగా బరువు తగ్గే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.

# 2. నెమ్మదిగా నములుతూ తినండి

# 2. నెమ్మదిగా నములుతూ తినండి

ఎవరైతే తినేటప్పుడు వేగంగా తింటూ ఉంటారో వారు ఎక్కువగా బరువు పెరుగున్నట్లు కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. నెమ్మదిగా ఆహారనా్ని నములుతూ తినే వారు కొద్దిగా తిన్న తర్వాత వారికి కడుపు నిండదనే భావన ఏర్పడుతుంది. ఫాస్ట్ గా తినేవారికి మాత్రం ఈ భావన కలగదు. దీంతో వాళ్లు ఎక్కువగా తింటారు. ఫలితంగా లావు అవుతూ ఉంటారు. అందువల్ల మీరూ తినేటప్పుడు కాస్త నెమ్మదిగా తిన్నారనుకో ఈజీగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

# 3 ఎలక్ట్రానిక్ డిస్ట్రాక్షన్ ఎఫెక్ట్

# 3 ఎలక్ట్రానిక్ డిస్ట్రాక్షన్ ఎఫెక్ట్

మీరు టీవీలో ఏదైనా కార్యక్రమం చూస్తూ తినడమో లేదా సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తూ తినడమో చేయకూడదు. ఇలా చేయడం వల్ల తినే తిండిపై ధ్యాస ఉండదు. ఎక్కువగా తినేస్తారు. కాబట్టి తినేటప్పుడు ఎప్పుడు కూడా అలా చేయకండి. ముందు తినండి. తర్వాత మీరు కావాలంటే టీవీ చూడండి. ఈ విషయాన్ని హార్వర్డ్ యూనివర్సిటీ వెల్లడించింది.

# 4. తినడానికి చిన్న ప్లేట్లు ఉపయోగించండి

# 4. తినడానికి చిన్న ప్లేట్లు ఉపయోగించండి

ఇలా చేయడం కూడా చాలా మంచిది. దీంతో మీరు ముందుగా ప్లేట్ లో పెట్టుకున్న ఆహారం అయిపోగానే మీకు కడుపునిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో మళ్లీ తినరు. అదే పెద్ద ప్లేట్లు ఉపయోగిస్తే అందులో ఎక్కువ ఆహారం పెట్టుకున్న కూడా అది మీకు తక్కువగానే కనిపిస్తుంది. దీంతో ఎక్కువగా తినేస్తారు. అంతేకాకుండా మీరు ప్లేట్ లో పెట్టుకున్ ఫుడ్ మొత్తం తినకుండా వేస్ట్ చేసే అవకాశం ఉంది. అందువల్ల తినడానికి చిన్న ప్లేట్ ఉపయోగించండి. దీంతో కూడా మీరు బరువు తగ్గుతారు.

# 5. ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోండి

# 5. ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోండి

మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

దీంతో మీ జీర్ణక్రియ బాగా సాగుతుంది. అలాగే మీ శరీరంలో ఉండే కొవ్వు కూడా ఈజీగా కరగడానికి ప్రోటీన్స్ బాగా ఉపయోగపడతాయి. ఒక అధ్యయనం ప్రకారం ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల 3 నెలల్లో 5 కిలోల బరువు తగ్గొచ్చని వెల్లడైంది. కాబట్టి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటూ ఉండండి.

# 6 . ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి

# 6 . ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి

ఫైబర్ ఎక్కువగా తినడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే అదనపు కొవ్వు చేరదు. స్లిమ్ గా ఉండేందుకు ఈ ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది. బీన్స్, డ్రమ్ స్టిక్లు, వోట్స్, యాపిల్స్, ఆరెంజ్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అన్ని రకాల పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

# 7. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవొద్దు

# 7. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవొద్దు

కూల్ డ్రింక్స్, పంచదార ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవొద్దు.

వీటిని ఒక్క గ్లాస్ తాగితే కూడా మీ శరీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోతుంది. అందువల్ల వీటిని తాగకుండా ఉండండి. దీంతో శరీరంలోకి ఫ్యాట్ చేరదు.

# 8. అన్ హెల్త్ స్నాక్స్ తినకండి

# 8. అన్ హెల్త్ స్నాక్స్ తినకండి

వీలైనంత వరకు మీరు స్నాక్స్ తినకండి. చాలామంది టైమ్ పాస్ కోసమని కొన్ని రకాల స్నాక్స్ ను ఇంట్లో సిద్ధంగా పెట్టుకుని ఉంటారు. వీటి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ తింటూనే ఉంటారు. వీటిలో ఎలాంటి పోషకాలుండవు. అందువల్ల వీటికి దూరంగా ఉండడం మంచిది. వీటిని తినొద్దండి. వీటి వల్ల కేవలం ఫ్యాట్ వస్తుంది తప్ప ఇంకెలాంటి ఆరోగ్యం ఉండదు.

# 9. లిఫ్ట్ కన్నా మెట్లనే ఎక్కువగా ఉపయోగించండి

# 9. లిఫ్ట్ కన్నా మెట్లనే ఎక్కువగా ఉపయోగించండి

చాలామంది ఆఫీసుల్లో ఎక్కువగా మెట్ల కన్నా లిఫ్ట్ నే వినియోగిస్తుంటారు. ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్లేందుకు కూడా లిఫ్ట్ లోనే వెళ్తుంటారు. దీని బదులుగా మెట్లు ఎక్కి వెళ్లడం చాలా మేలు. మరి మా ఆఫీస్ 25 వ అంతస్తులో ఉంది. నేనేమి చేయాలని అని మాత్రం అనకండి. అలా ఉంటే కొన్ని ఫ్లోర్లు మెట్లు ఎక్కి తర్వాత లిఫ్ట్ ఉపయోగించండి.

# 10. భోజనం వండండి

# 10. భోజనం వండండి

తినేంత ఈజీకాదు వండడం. మీరు తినే దాన్ని మీరు తయారు చేసుకుంటే కొన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. మీరు తినే వంటకంలో ఉప్పు, నూనె, మొదలైనటువంటి అన్నీ ఎంత మోతాదులో వేసుకోవాలో మీకు తెలుస్తుంది. అలాగే దీనివల్ల మీరు ఎంతో హ్యాపీగా ఫీలవుతారు. మీరే తయారు చేసకుని ఉంటారు కాబట్టి అందులో ఎలాంటి అనర్థక పదార్థాలు వేసి ఉండరు. దీంతో ఆ ఆహారం మీ ఆరోగ్యానికి బాగా హెల్ఫ్ చేస్తుంది.

# 11. భోజనానికి ముందు సూప్ తాగండి

# 11. భోజనానికి ముందు సూప్ తాగండి

మీరు భోజనం తినే ముందు కొద్దిగా సూప్ తాగండి. దీనివల్ల మీరు ఎక్కువగా తినడానికి అవకాశం ఉండదు. అయితే సూప్ లు కూడా ఎక్కువగా ఫ్యాట్ ఉన్నపదార్థాలతో తయారు చేసినవి తాగకండి.

# 12. మద్యం తాగకండి

# 12. మద్యం తాగకండి

ఆల్కహాల్స్ మీ జీర్ణక్రియను మందగించేలా చేస్తాయి. అంతేకాకుండా మద్యం తాగడం వల్ల మీ శరీరం లో కొవ్వు శాతం కూడా పెరిగిపోతుంది. బీరు వంటి వాటిలో ఫ్యాట్ ను పెంచే ఎక్కువ క్యాలోరీస్ ఉంటాయి. దీంతో మీలో ఫ్యాట్ పెరిగిపోతుంది. అందువల్ల మద్యానికి దూరంగా ఉండండి.

# 13 యోగా చేయండి

# 13 యోగా చేయండి

యోగా వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. దీంతో మీరు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. అలాగే మీరు బరువును కోల్పొయి స్లిమ్ గా మారొచ్చు. కొన్ని రకాల ఆసనాలు ఇందుకు బాగా ఉపయోగపడతాయి.

# 14. రెడ్ ప్లేట్స్ ఉపయోగించండి

# 14. రెడ్ ప్లేట్స్ ఉపయోగించండి

ఎరుపు అనేది డేంజర్ ను సూచిస్తుంది. సైకాలాజికల్ గా మనం ఎరుపు అనగానే ప్రమాదకరంగా భావిస్తాం. అందువల్ల ఈ ప్లేట్లలో మనం తింటే ఎక్కువగా తినడానికి అవకాశం ఉండదు. చిప్స్, జంతికలు వంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని తినేటప్పుడు మీరు కచ్చితంగా రెడ్ ప్లేట్స్ ఉపయోగించండి. ఎందుకంటే నీలి లేదా తెలుపు రంగుల ప్లేట్లలో కన్నా ఎరుపు రంగు ప్లేట్లలో తింటే మనం చాలా తక్కువగా తింటాం.

# 15. గ్రీన్ టీ తాగండి

# 15. గ్రీన్ టీ తాగండి

గ్రీన్ టీ తాగడం వల్ల మీరు ఈజీగా బరువు తగ్గుతారు. మీలో ఉండే ఫ్యాట్ ను మొత్తం కరిగించడానికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల గ్రీన్ టీ ఎక్కువగా తాగండి.

# 16. నీళ్లు తాగండి

# 16. నీళ్లు తాగండి

చాలామంది వాళ్లు తినేటప్పుడు నీటికి బదులుగా పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ వంటివి తాగుతూ ఉంటారు. దీని వల్ల శరీరంలోకి అదనంగా కొవ్వు చేరుతుంది. అలాకాకుండా భోజనం చేసేటప్పుడు కేవలం నీరు మాత్రమే తాగాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలోకి ఫ్యాట్ చేరదు. మీరు స్లిమ్ గా ఉండొచ్చు.

# 17. త్వరగా నిద్రపోండి

# 17. త్వరగా నిద్రపోండి

ప్రతిరోజు మీరు రాత్రి పూట ఎక్కువ సేపు మేల్కొనకండి. అలాగే కనీసం రోజుకు 8 గంటల పాటు నిద్ర అవసరం. నిద్ర సరిగ్గా లేకుంటే కూడా అధిక బరువు పెరిగే అవకాశం ఉంది. సరైన సమయానికి సక్రమంగా నిద్రపోతే మీరు ఎలాంటి అనారోగ్యాలకు గురికారు.

# 18. ఒక రోజును తినడానికే కేటాయించడం సరికాదు

# 18. ఒక రోజును తినడానికే కేటాయించడం సరికాదు

కొందరు రోజూ పని ఒత్తిడితో ఫుల్ ఎంజాయ్ చేయలేకపోయాం... వీకెండ్ లో ఒక రోజు రెస్టారెంట్ కు వెళ్లి ఫుల్ గా తిందామనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు. దీని వల్ల మీరు ఎక్కువగా ఫుడ్ తింటారు. దీంతో ఈజీగా బరువు పెరిగిపోతారు. అందువల్ల వీలైనంత వరకు ఇలా చేయకండి.

# 19. బ్లాక్ కాఫీ

# 19. బ్లాక్ కాఫీ

బ్లాక్ కాఫీ కూడా మీరు త్వరగా బరువు తగ్గేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు ఉదయమే లేస్తేనే కాఫీ తాగే అలవాటు ఉంటే బ్లాక్ కాఫీ తాగండి. దీంతో ఒకవారంలో 500 కేలరీల బరువు తగ్గుతారు. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మధుమేహం వంటి వ్యాధుల బారిన పడరు.

# 20. వాటర్ బాటిల్ తీసుకుని వెళ్లండి

# 20. వాటర్ బాటిల్ తీసుకుని వెళ్లండి

మీరు ఎక్కడికి వెళ్లినా మీ వెంట వాటర్ బాటిల్ తీసుకుని వెళ్లండి. దాదాపు 60 % మంది దాహం వేసిన నీరు తాగకుండా ఉంటారు. దీనివల్ల శరీరంలో ఫ్యాట్ పెరిగిపోతుంది. ఇలా చేయడం సరికాదు. మీ దగ్గర నీళ్ల బాటిల్ ఉంటే మీకు ఎప్పుడు నీళ్లు తాగాలనిపిస్తే అప్పుడ తాగొచ్చు. మీరు స్లిమ్ గా మారేందుకు ఇది కూడా బాగా దోహదం చేస్తుంది.

# 21. ఆలివ్ ఆయిల్ ఉపయోగించండి

# 21. ఆలివ్ ఆయిల్ ఉపయోగించండి

వీలైంనంత వరకు ఆలివ్ ఆయిల్ ఉపయోగించండి. అది బాగా ధర ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. కానీ మీరు దీని కోసం రూ. 500 ఖర్చుపెట్టలేకపోతే తర్వాత రూ. 5,00,000 గుండె శస్త్రచికిత్సల కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. అందువల్ల మీరు ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడానికి ప్రయత్నించండి. దీంతో మీరు అధిక బరువు పెరగకుండా ఉంటారు.

# 22. ఫ్యాట్ లేని ఆహారం తీసుకోవడం వల్ల ఫలితం లేదు

# 22. ఫ్యాట్ లేని ఆహారం తీసుకోవడం వల్ల ఫలితం లేదు

అస్సలు కొవ్వు పదార్థాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గిపోతాం అనుకోవడం పొరపాటు. మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్లు. కొవ్వు పదార్థాలు మన శరీరానికి అవసరం. అందువల్ల కొవ్వు పదార్థాలుండే ఫుడ్స్ ను మితంగా తీసుకుంటూ ఉండాలి. సాల్మొన్, వాల్నట్, ఆలీవ్ ఆయిల్, అవకాడొలు వంటి వాటిని ఎక్కువగా తింటూ ఉండాలి.

# 23. కొన్ని రకాల స్నాక్స్ ను మీ బ్యాగులో ఉంచుకోండి

# 23. కొన్ని రకాల స్నాక్స్ ను మీ బ్యాగులో ఉంచుకోండి

మీకు ఆకలి అయినప్పుడు వెంటనే కాస్త హెల్తీ స్నాక్స్ తినాలి. లేదంటే మరింత ఆకలి పెరుగుతుంంది. దీంతో మీరు ఎక్కువగా తినే అవకాశం ఉంది. ఇది అధిక బరువు సమస్యకు దారితీస్తుంది. మీ బ్యాగ్ లో ఎప్పుడూ కొన్ని రకాల హెల్తీ స్నాక్స్ ఉంచుకోండి. ఈ విషయాన్ని మీరు మరిచిపోకండి.

# 24. శాఖాహారం తీసుకోండి

# 24. శాఖాహారం తీసుకోండి

క్రమం తప్పకుండా శాఖాహార ఆహారాన్ని తినే వ్యక్తులు మాంసాహారం తీసుకునే వారి కంటే త్వరగా బరువు తగ్గుతారు. అందువల్ల వీలైనంత వరకు శాఖాహార భోజనాన్ని తినండి.

# 25. ఫ్రిజ్ లో పండ్లు ఉంచుకోండి

# 25. ఫ్రిజ్ లో పండ్లు ఉంచుకోండి

ఫ్రిజ్ లో మీకు కనిపించేటట్లుగా పండ్లు, ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని ఉంచుకోండి. ఎందుకంటే మీకు ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే వీటిని తినొచ్చు.

# 26. ఒత్తిడికి గురవ్వకండి

# 26. ఒత్తిడికి గురవ్వకండి

ఒత్తిడికి గురైతే ఎక్కువగా తినేస్తాం. ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది శరీరంలో ఫ్యాట్ పెరిగేందుకు కారణం అవుతుంది. అందువల్ల ఒత్తిడికి గురికావొద్దు. పరోక్షంగా ఇది మీరు బరువు పెరిగేందుకు కారణం అవుతుంది. ఒత్తిడికి గురైనప్పుడు వెంటనే బుక్ చదవడమో లేదంటే మీకు నచ్చిన పని చేయడమో మంచిది. అలాగే రోజు ఉదయం 5 నిమిషాల పాటు ధ్యానం చేయండి.

# 27. మీ డెస్క్ పై ఎలాంటి ఫుడ్స్ పెట్టుకోవొద్దు

# 27. మీ డెస్క్ పై ఎలాంటి ఫుడ్స్ పెట్టుకోవొద్దు

ఆఫీసులో మీ డెస్క్ పై ఎలాంటి ఫుడ్స్ పెట్టుకోకండి. ఎందుకంటే మీకు ఎప్పడైన ఆకలి వేస్తే వెంటనే వాటిని తినాలనుకుంటారు. అందువల్ల మీరు పని చేసే ప్రాంతంలోగానీ, లేదంటే మీ ఇంట్లోగానీ ఇలాంటి ఫుడ్స్ పెట్టుకోవొద్దు.

# 28. ఫ్రైస్ వద్దు

# 28. ఫ్రైస్ వద్దు

మీకు ఆకలిగా ఉన్నప్పుడు వీలైనంత వరకు బాగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తినకండి. దీనివల్ల చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అలాగే అధిక బరువుకు ఈ ఫుడ్స్ కారణం అవుతాయి. వీటి బదులుగా సలాడ్స్ తీసుకోండి.

# 29. డైట్ ఫుడ్స్, డైట్ డ్రింక్స్ తీసుకోవొద్దు

# 29. డైట్ ఫుడ్స్, డైట్ డ్రింక్స్ తీసుకోవొద్దు

డైట్ ఫుడ్స్, డైట్ డ్రింక్స్ తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఇలాంటి ఫుడ్స్ లో ఎక్కువగా చక్కెరకు బదులుగా అస్పర్టమే అనే రసాయనాలను ఉపయోగిస్తారు. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. వీటి వల్ల బరువు పెరగిపోతారు.

# 30. తక్కువగానే తినండి

# 30. తక్కువగానే తినండి

రోజు 100 కేలరీలు తీసుకుంటే చాలు. అందువల్ల మీరు వీలైతే ఆహారం తక్కువగా తీసుకునేందుకు ప్రయత్నించండి. పూర్తిగా కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు తక్కువగా తినడానికి ప్రయత్నించండి.

# 31. సోషల్ డిన్నర్స్ వద్దు

# 31. సోషల్ డిన్నర్స్ వద్దు

మీరు ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ కు వెళ్తే అక్కడి ఎక్కువగా తినాల్సి వస్తుంది. అందువల్ల అలాంటి డిన్నర్స్ కు వెళ్లకుండా ఉండండి. ఎందుకంటే స్నేహితులతో కలిసి అనుకోకుండా ఎక్కువగా తినేస్తారు. అందువల్ల వీలైనంత వరకు సోషల్ డిన్నర్స్ కు వెళ్లొద్దు.

# 32. 300 కేలరీల కన్నా తక్కువగా తినండి

# 32. 300 కేలరీల కన్నా తక్కువగా తినండి

మీరు 300 కేలరీలకు తక్కువగా ఉన్న స్నాక్స్ మాత్రమే తీసుకోండి. అలాగే మాక్రోలయుట్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలు ఉండే వాటినే స్నాక్స్ గా తినండి.

# 33. మీరు 3 నుంచి 4 గంటలకొకసారి తినండి

# 33. మీరు 3 నుంచి 4 గంటలకొకసారి తినండి

మీరు ప్రతిరోజు రాత్రి 12 గంటలకు నిద్రపోతుంటే కచితంగా కనీసం 4 నుంచి 6 సార్లు మీరు తినాలి. అయితే ప్రతి సారి తగితనం మోతాదులోనే తినాలి. తినకుండా ఉండడం వల్ల శరీరంలో కొవ్వు పెరగిపోతుంది. ఈ సూత్రాలన్నీ పాటిస్తే మీరు జిమ్ కు వెళ్లకుండానే ఈజీగా బరువు తగ్గొచ్చు.

English summary

weight loss hacks lose weight without exercise

you want to lose weight the easy way, huh? Well, the following psychological hacks will definitely help you achieve that over time (think: 3 - 6 months).
Desktop Bottom Promotion