బరువు తగ్గటానికి 10 తక్కువ క్యాలరీల ఆహారపదార్థాలు

By: Deepthi
Subscribe to Boldsky

గుండె ఆగిపోవటానికి, గుండెజబ్బులకి మరియు ఇతర ఆరోగ్య సమస్యలకి స్థూలకాయం ముఖ్యకారణాలలో ఒకటి. తక్కువ కొవ్వు, చక్కెర మరియు కార్బొహైడ్రేట్లున్న ఆహార పదార్థాలేవో తెలీక చాలామంది వినియోగదారులు తరచూ అవస్థ పడతారు.

మీ శరీరం ఆరోగ్యకరమైన బరువుతో ఉండాలంటే సరైన క్యాలరీలున్న పదార్థాలను ఎంచుకోవటం తప్పనిసరి. మీరు బరువు తగ్గాలనుకుంటే, మీరు తక్కువ కేలరీలున్న ఆహారాన్ని తినడం మొదలుపెట్టాలి.

తక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని తినాలంటే మీ వంటింట్లో తక్కువ కేలరీలుండే వంటకి కావాల్సిన సామాన్లను, మీ ఆహారలిస్టును ఆ ప్రకారం తయారుచేసుకోవాలి.

తక్కువ కేలరీలుండే ఆహారపదార్థాలను చెంచాల లెక్కన లెక్కపెట్టుకుంటూ తినడం కూడా మీ కడుపును నింపుతుంది. ఇదే బరువును కూడా తగ్గిస్తుంది.

బరువు తగ్గటానికి ఉపయోగపడే 10 తక్కువ కాలరీల ఆహారపదార్థాలేంటో ఇక్కడ ఉన్నాయి. చదవండి.

10 Low-Calorie Foods For Weight Loss

1.సలాడ్

సలాడ్లు బరువుతగ్గటంలో ఉపయోగపడే ఒక తక్కువ క్యాలరీల పదార్థం. సలాడ్లలో ఆకుకూరలైన పాలకూర,కేల్, బ్రొకోలీ, టమాటాలు మరియు ఆలివ్స్ వాడతారు, వీటన్నిటిలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఆకుకూరలను తినేముందు ఎప్పుడూ ఉడికించి తినండి.

2.ఆపిల్స్

2.ఆపిల్స్

ఆపిల్స్ లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది, ఇది ఎక్కువసమయం ఆకలి వేయకుండా కడుపు నిండుగా ఉంచుతుంది. అలాగే అందులో ఉండే పీచుపదార్థం కడుపును త్వరగా నింపుతుంది. ఆపిల్స్ ను మీరు ఓట్ మీల్ తోకానీ లేదా ఫ్రూట్ సలాడ్ లాగానో తినవచ్చు. మీరు తీపిదనం జతచేయడానికి సాండ్ విచెస్ లో కూడా వాడవచ్చు.

3.స్ట్రాబెర్రీలు

3.స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలు విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లతో నిండివుండే తక్కువ క్యాలరీలున్న పండ్లు. ఒక కప్పు స్ట్రాబెర్రీలు 50 క్యాలరీలు తగ్గిస్తాయి. మీరు వీటిని సలాడ్లో తరిగి వేసుకోవచ్చు లేదా స్మూతీకి రసంలా చేసుకోవచ్చు లేదా పెరుగుతో తినవచ్చు.

4.ఓట్ మీల్

4.ఓట్ మీల్

ఓట్ మీల్ చాలా నీరును పీల్చుకుంటుంది ఇంకా అందులో చాలా పీచు ఉంటుంది. ఈ రెండూ కలిసి ఉండటం వలన ఆకలి ధ్యాస రాకుండా చేసే మంచి ఆహారపదార్థం అయింది.బరువు తగ్గటానికి ఓట్ మీల్ ఒక మంచి తక్కువ క్యాలరీలున్న పదార్థం. దీనిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి తినవచ్చు.

5.గుడ్లు

5.గుడ్లు

100గ్రాముల గుడ్లలో కేవలం 52 క్యాలరీలుంటాయి మరియు ఈ క్యాలరీలు కూడా ప్రొటీన్ తో నిండి ఉంటాయి. మీ బ్రేక్ ఫాస్ట్ కి ఉడకబెట్టిన గుడ్లు లేదా స్క్రాంబెల్డ్ ఎగ్స్ ను కూడా తినవచ్చు. ఇవి కేవలం 80క్యాలరీలు మాత్రమే కలిగిఉంటాయి. గుడ్లలో పచ్చసొనను వదిలేయకండి, అందులో ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది.

6.బంగాళదుంపలు

6.బంగాళదుంపలు

ఆలూలో సాధారణంగా ఎక్కువగా కార్బొహైడ్రేట్లున్నా, అవి కూడా ఆకలి వేయకుండా ఎక్కువసేపు ఆపగలవు. విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మీరు ఆలూను ఉడకబెట్టవచ్చు లేదా తొక్కుతీయకుండా ఓవెన్ లో వేయించవచ్చు. ఇవి మీకు శక్తినిచ్చే స్నాక్ గా ఉపయోగపడతాయి.

7.చికెన్

7.చికెన్

చికెన్ బ్రెస్ట్ తక్కువ క్యాలరీలున్న ఆహారపదార్థమని మీకు తెలిసివుండదు కదూ! 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్ లో కేవలం 100 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. బోనస్ విషయం ఏంటంటే శరీరానికి చికెన్ ను జీర్ణం చేసుకోటానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది, అలా ఎక్కువ క్యాలరీలను శరీరం నుంచి వాడుకుని బరువు తగ్గుతుంది.

8.రాజ్మా

8.రాజ్మా

రాజ్మా ఒక ఆరోగ్య, ప్రొటీన్లతో నిండి వుండే, పీచు మరియు తక్కువ క్యాలరీలతో నిండి ఉండే ఒక అద్భుత ఆహారపదార్థం. అరకప్పు కిడ్నీ ఆకారంలో ఉండే ఈ చిక్కుళ్ళు లేదా రాజ్మాలో 100 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇవి సంక్లిష్ట కార్బొహైడ్రేట్లు కావడం వలన,మీ శరీరంలో శక్తి ఎక్కువసేపు అదేస్థాయిలో ఎక్కువ నిలిచివుంటుంది.

9.మష్రూమ్స్

9.మష్రూమ్స్

మాంసానికి బదులు పుట్టగొడుగులు మంచి ప్రత్యామ్నాయం. మీరు వాటిని గ్రిల్ చేసినా, వేయించినా, అవి 100 గ్రాములకి 25 క్యాలరీలనే ఇస్తాయి. వాటిల్లో ఉండే జింక్ మరియు పొటాషియం శరీరంలో వివిధ జీవక్రియలను క్రమబద్ధీకరిస్తాయి.

10.క్యాబేజీ కుటుంబానికి చెందిన కాయగూరలు

10.క్యాబేజీ కుటుంబానికి చెందిన కాయగూరలు

క్రూసిఫెరస్ కాయగూరలంటే బ్రొకోలీ, కాలిఫ్లవర్ మరియు క్యాబేజీ వంటివి. వీటిల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండి, కడుపు నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది. వీటిల్లో ప్రొటీన్లు మరియు పీచుపదార్థం కలిసి ఉంటాయి మరియు ప్రొటీన్లు విడిగా కూడా అధికంగా ఉంటాయి. తక్కువ శక్తి సాంద్రత ఉండటం వలన క్రూసిఫెరస్ కాయగూరలు బరువు తగ్గటానికి చాలా మంచివి.

ఈ ఆర్టికల్ పంచుకోండి!

మీకు ఈ ఆర్టికల్ నచ్చినట్లయితే, మీ దగ్గరివారితో పంచుకోండి.

English summary

10 Low-Calorie Foods For Weight Loss

If you are thinking of losing weight, you should start consuming low-calorie foods. Read on to know more about the best low-calorie foods for weight loss.
Story first published: Friday, February 2, 2018, 7:30 [IST]
Subscribe Newsletter