For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వయస్సుకు తగ్గ బరువు లేకపోతే , బరువు పెరగడానికి 12 న్యాచురల్ మార్గాలు

మీరు అతి తక్కువ బరువు కలిగి ఉండటానికి కారణం ఆహారపు అలవాట్లు, భోజనానికి భోజనానికి మద్య విరామం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, నర్వోస మరియు బులిమియా మొదలగు దీర్గాకలి వ్యాధులు కూడా కారణం కావచ్చు.

By Mallikarjuna
|

ఈ మద్యకాలంలో చాలా మంది బరువు తగ్గడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, అయితే అదే విధంగా బరువు పెరగడం కూడా ఒక ఛాలెంజ్ వంటిదే. మీరు మీ వయస్సుకు తగ్గ బరువు లేకుంటే అప్పుడు బరువు పెరగడానికి ఫిట్ గా ఉండటానికి, హెల్తీ బాడీ మెయింటైన్ చేయవల్సి ఉంటుంది.

వయస్సుకు తగ్గ బరువు లేకపోతే అది ఆరోగ్యానికి మంచిది కాదు. వాస్తవానికి , బరువు తగ్గడం వల్ల సన్నగా కనబడుతారు అనుకోవచ్చు, అయితే అది తప్పు. వయస్సుకు తగ్గ బరువు లేకపోవడం వల్ల జుట్టు రాలిపోవడం, లో మజిల్ మాస్, ఓస్టిరియోపోసిస్, అనీమియా, మెనుష్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

12-ways-to-gain-weight-naturally-at-home,

మీరు అతి తక్కువ బరువు కలిగి ఉండటానికి కారణం ఆహారపు అలవాట్లు, భోజనానికి భోజనానికి మద్య విరామం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, నర్వోస మరియు బులిమియా మొదలగు దీర్గాకలి వ్యాధులు కూడా కారణం కావచ్చు.

అయితే బరువు పెరగడం సరైన క్రమంలో ఉండాలి. బరువు పెరగడం కోసం ఏది పడితే అది , అనారోగ్యకరమైన ఆహారాలు, జంక్ ఫుడ్ తినకూడదు. ఇవి మరో రకంగా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కాబట్టి, మీ ఆరోగ్యంగా బరువు పెంచే ఆహారాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.

బరువు పెరగాలంటే న్యాచురల్ మార్గం ఉత్తమమైనది. ఇంట్లోనే న్యాచురల్ గా బరువు పెరగాలనుకుంటే ఇక్కడ 12 మార్గాలున్నాయి.

1. రెడ్ మీట్

1. రెడ్ మీట్

రెడ్ మీట్ లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఎఫెక్టివ్ గా బరువు పెరగడానికి రెడ్ మీట్ సహాయపడుతుంది. రెడ్ మీట్ లో ప్రోటీన్స్, ఐరన్, కొంత మంచి ఫ్యాట్ ఉండటం వల్ల న్యాచురల్ గా హెల్తీగా బరువు పెరగడానికి సహాయపడుతుంది. బరువు పెరగాలంటే ఆలివ్ ఆయిల్ తో ఉడికించడం వల్ల ఫర్ఫెక్ట్ హెల్త్ డైట్ .

2. పీనట్ బట్టర్

2. పీనట్ బట్టర్

పీనట్స్ లో ప్రోటీన్స్, ఫ్యాట్స్ అధికం. కాబట్టి, బరువు పెరగాలని కోరుకునే వారికి ఇది న్యాచురల్ ఫుడ్. ఒక టీస్పూన్ పీనట్ బటర్ లో 100క్యాలరీలున్నాయి. ఇందులో మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి మరియు విటమిన్ ఇలు అధికంగా ఉన్నాయి. పీనట్ బటర్ ను బ్రెడ్ స్లైస్ కు అప్లై చేసి బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాలి.

3. హోల్ ఫ్యాట్ మిల్క్

3. హోల్ ఫ్యాట్ మిల్క్

న్యాచురల్ గా బరువు పెరగాలంటే పాలు తాగాల్సిందే. వెన్న తియ్యకుండా పాలు తాగడం వల్ల ఒక గ్లాసుకు 60 క్యాలరీలు పొందుతారు. పాలలో విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. విటమిన్ డి మరియు విటమిన్ ఎలు అధికం.

4. పండ్లు

4. పండ్లు

వేగంగా బరువు పెరగాలంటే పండ్లు కూడా సహాయపడుతాయి. మామిడి పండ్లు, అరటిపండ్లు, బొప్పాయి, పైనాపిల్ వంటి వాటిలో న్యాచురల్ షుగర్స్ ఉండటం వల్ల బరువు పెరగడానికి మంచి మార్గం. ఈ న్యాచురల్ షుగర్స్ పొట్ట నొప్పి తక్షణ శక్తిని అందిస్తాయి.

5. అవొకాడో

5. అవొకాడో

అవొకాడోలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి డైట్ ఫాలో అయ్యే వారికి సహాయపడుతాయి. సగం అవొకాడోలో 140 క్యాలరీలు మరియు విటమిన్లు, మినిరల్స్ ఫోలిక్ యాసిడ్, పొటాషియం కూడా అధికంగా ఉంటాయి. అవొకాడోను సాలాడ్స్, స్మూతీస్ రూపంలో తీసుకోవచ్చు.

6. వీట్ బ్రెడ్

6. వీట్ బ్రెడ్

హోల్ వీట్ బ్రెడ్ మరో హెల్తీ ఫుడ్. ఆరోగ్యంగా బరువు పెరగడానికి సహాయపడుతుంది. బ్రెడ్ ను బ్రేక్ ఫాస్ట్ కు తీసుకోవడం ద్వారా శరీరానికి కావల్సిన క్యాలరీలు అందుతాయి. బ్రెడ్ లో ఫైబర్ మరియు మినిరల్స్ ఎక్కువ. నార్మల్ వైట్ బ్రెడ్ లో ఇవి ఉండవు.

7. బట్టర్

7. బట్టర్

బట్టర్ లో క్యాలరీలు అధికంగా. వంటనూనెలకు బదులుగా బట్టర్ ను వంటలకు ఉపయోగించవచ్చు. బట్టర్ లో శ్యాచురేటెడె ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. వీటిని పరిమితంగా తీసుకోవాలి. హోల్ వీట్ బ్రెడ్ మీద అప్లై చేసి, బ్రేక్ ఫాస్ట్ కు స్నాక్ రూపంలో తీసుకోవాలి.

8. నెయ్యి

8. నెయ్యి

వెన్న తర్వాత నెయ్యి. నెయ్యిలో వివిధ రకాల ఫ్లేవర్స్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. న్యాచురల్ గా అందుబాటులో ఉండే నెయ్యిని రెగ్యులర్ డైట్ లో ఉపయోగించడం వల్ల ఇందులో యాంటీఆక్సిడెంట్స్, ఫ్యాటీ యాసిడ్స్ జీర్ణశక్తిని పెంచుతాయి. అలాగే యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి.

9. నట్స్

9. నట్స్

బరువు పెరిగాలంటే డ్రైనట్స్ మరో మంచి ఉపాయం. ఇది గ్రేట్ స్నాక్ . ఇది ఫ్యాట్స్ మరియు న్యూట్రీషియన్స్ కు మంచి మూలం. వీటిలో ఫైబర్ ఎక్కువ. పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. నట్స్ తినడం వల్ల మీకు కావల్సిన బెనిఫిట్స్ పొందుతారు..

10. చీజ్

10. చీజ్

చాలా మంది చీజ్ ను ఇష్టపడుతారు. అందుకే మీకు నచ్చిన ఏ ఆహారంతో అయినా తీసుకోవచ్చు. చీజ్ లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ. మేకపాలతో తయారుచేసిన చీజ్ తీసుకోవడం మంచిది. పరిమితంగా తీసుకోవడం మంచిది.

11. బంగాళదుంపలు

11. బంగాళదుంపలు

బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. ఇవి వేగంగా బరువు పెరగడానికి సహాయపడుతాయి. వీటిలో ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువ. విటమిన్ సి ఎక్కువ, పోషకాలు ఎక్కువగా పొందాలనుకుంటే పొట్టుతో సహా తినాలి.

12. అరటి పండ్లు

12. అరటి పండ్లు

తక్షణ ఎనర్జీ పొందాలంటే అరటి పండ్లను తినాల్సిందే. అరటి పండ్లలో పొటాషియం,కార్బోహైడ్రేట్లు, ఇతర న్యూట్రీషియన్లు కూడా ఎక్కువ. తక్షణ శక్తిని అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక్క అరటి పండులో 100 క్యాలరీలుంటాయి.

English summary

12-ways-to-gain-weight-naturally-at-home

It is very necessary to understand that gaining weight the right way and not by hogging on unhealthy foods is a better choice for your body. The best way to gain weight naturally is to go the natural way. Here are 12 ways to gain weight naturally at home.
Story first published:Monday, January 22, 2018, 6:57 [IST]
Desktop Bottom Promotion