మేకపాలల్లో ఖర్జూరాల్ని నానబెట్టి తింటే లైంగిక శక్తి వస్తుంది.. తేనె+ఖర్జూరాలు తింటే ఏమొస్తుంది?

Written By:
Subscribe to Boldsky

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాల‌ను తేనె అందిస్తుంది. అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు ఇందులో ఉన్నాయి. యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు తేనెలో ఉండ‌డం వ‌ల్ల తేనె మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి బ‌లాన్ని ఇస్తుంది.

అదేవిధంగా ఎండు ఖ‌ర్జూరం పండ్ల‌ను కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. దాంతో కూడా మ‌న‌కు అనేక లాభాలే క‌లుగుతాయి. అయితే తేనెలో వారం రోజుల పాటు నాన‌బెట్టిన ఎండ ఖ‌ర్జూరం పండ్ల‌ను తింటే చాలా లాభాలున్నాయి.

ఆరోగ్యానికి మేలు

ఆరోగ్యానికి మేలు

తేనెలో వారం రోజుల పాటు నానబెట్టిన ఎండ ఖర్జూరం పండ్లను తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తేనె, ఎండు ఖర్జూరం మిశ్రమం తినడం వల్ల దగ్గు, జలుబు వంటి శ్వాస సమస్యలు పోతాయి. జ్వరం తగ్గుతుంది. నిద్రలేమితో బాధపడే వారు ఈ మిశ్రమం తాగితే ఫలితం ఉంటుంది.

ఐరన్‌, కాల్షియం

ఐరన్‌, కాల్షియం

ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా తగ్గిపోతాయి. గాయాలు త్వరగా మానుతాయి. మహిళలకు కావల్సిన ఐరన్‌, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తహీనతను నివారించి ఎముకలను దృఢంగా చేస్తాయి. సీజనల్ గా వచ్చే వివిధ రకాల అలర్జీలు పోతాయి. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.

జార్‌ను వారంపాటు అలాగే ఉంచాలి

జార్‌ను వారంపాటు అలాగే ఉంచాలి

ఒక జార్‌లో 3/4 వంతు తేనె తీసుకోవాలి. అందులో విత్త‌నాల‌ను తీసిన ఎండు ఖ‌ర్జూరం పండ్ల‌ను వేయాలి. అనంత‌రం మూత బిగించి జార్‌ను బాగా షేక్ చేయాలి. అనంత‌రం ఆ జార్‌ను వారం పాటు అలాగే ఉంచాలి. అవ‌స‌రం అనుకుంటే మ‌ధ్య మ‌ధ్య‌లో ఆ జార్‌ను షేక్ చేయ‌వ‌చ్చు. వారం త‌రువాత జార్‌ను తీసి రోజుకు ఒక‌టి రెండు చొప్పున ఆ ఖ‌ర్జూర పండ్ల‌ను తినాలి. దీంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ద‌గ్గు, జ‌లుబు పోతాయి

ద‌గ్గు, జ‌లుబు పోతాయి

తేనె, ఎండు ఖ‌ర్జూరం మిశ్ర‌మం తిన‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస స‌మ‌స్య‌లు పోతాయి. జ్వ‌రం త‌గ్గుతుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి రెట్టింపు అవుతుంది. దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి. తేనె, ఎండు ఖ‌ర్జూరం మిశ్ర‌మం తిన‌డం వ‌ల్ల నిద్ర బాగా ప‌డుతుంది. నిద్ర‌లేమితో బాధ‌ప‌డే వారు ఈ మిశ్ర‌మం తాగితే ఫ‌లితం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళ‌న వంటివి కూడా త‌గ్గిపోతాయి. గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. యాంటీ బ‌యోటిక్ గుణాల వ‌ల్ల గాయాలు, పుండ్లు త్వ‌ర‌గా త‌గ్గుతాయి.

జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది

జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది

తేనె, ఎండు ఖ‌ర్జూరం మిశ్ర‌మం తిన‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. చిన్నారుల‌కు రోజూ ఈ మిశ్ర‌మం తినిపిస్తే వారు చ‌దువుల్లో బాగా రాణిస్తారు. పెద్ద‌లు కూడా ఈ మిశ్ర‌మం తింటే మ‌తిమ‌రుపు తగ్గుతుంది. మ‌హిళ‌ల‌కు కావ‌ల్సిన ఐర‌న్‌, కాల్షియం పుష్క‌లంగా ల‌భిస్తాయి. ఇవి ర‌క్త‌హీన‌త‌ను నివారించి ఎముక‌ల‌ను దృఢంగా చేస్తాయి.

అల‌ర్జీలు పోతాయి

అల‌ర్జీలు పోతాయి

తేనె, ఎండు ఖ‌ర్జూరం మిశ్ర‌మం తిన‌డం వ‌ల్లసీజ‌నల్ గా వ‌చ్చే వివిధ ర‌కాల అల‌ర్జీలు పోతాయి. ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్‌ల‌కు విరుగుడుగా ఈ మిశ్ర‌మం ప‌నిచేస్తుంది. క్యాన్స‌ర్ క‌ణ‌తులు వృద్ధి చెంద‌వు.

జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌ం

జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌ం

తేనె, ఎండు ఖ‌ర్జూరం మిశ్ర‌మం తిన‌డం వ‌ల్ల జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. పేగుల్లో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. చెడు బాక్టీరియా నాశ‌న‌మ‌వుతుంది. క‌డుపులో క్రిములు ఉంటే చ‌నిపోతాయి.

ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు

ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు

తేనె, ఎండు ఖ‌ర్జూరం మిశ్ర‌మం తిన‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ర‌క్తం బాగా పెరుగుతుంది. రక్త‌హీన‌త ఉన్న‌వారికి ఇది మేలు చేస్తుంది. బీపీ త‌గ్గుతుంది. గుండె సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. కొవ్వు క‌రిగిపోతుంది.

ఖర్జూరాల్లో సల్ఫర్‌ ఖనిజం

ఖర్జూరాల్లో సల్ఫర్‌ ఖనిజం

ఇక ఖర్జూరాల్లో సల్ఫర్‌ ఖనిజం పుష్కలంగా ఉంటుంది. ఇది అలర్జీలు, సైనస్‌లతో బాధపడే వాళ్లకు ఎంతో మంచిది. ఎందుకంటే ఆహారంలో భాస్వరం దొరకడం చాలా అరుదు. ఖర్జూరాల్లో చక్కెరలు, ప్రోటీన్లు, విటమిన్లు, సమృద్ధిగా ఉండటం వల్ల బరువు తక్కువగా ఉండే వారికి పుష్టినిస్తాయి. ఒక ఖర్జూరం నుంచి 27 క్యాలరీలు లభిస్తాయి. ముఖ్యంగా గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వెంటనే శక్తిని అందిస్తాయి.

గుండె పనితీరును మెరుగు

గుండె పనితీరును మెరుగు

ఖర్జూరాల్లోని విటమిన్లు నరాల పనితీరును ప్రభావితం చేస్తాయి. ఇందులోని పొటాషియం మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. అందుకు వయసు రీత్యా కాస్త మందకొడిగా ఉండే వృద్ధులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. గుండె బలహీనంగా ఉండే వాళ్లు రాత్రి పూట ఎండు ఖర్జూరాన్ని నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వాటిని మెత్తగా పేస్టు చేసుకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి హుద్రోగాలను రాకుండా చేస్తాయి.

మేకపాలల్లో ఖర్జూరాల్ని నానబెట్టి..

మేకపాలల్లో ఖర్జూరాల్ని నానబెట్టి..

ఖర్జూరాలు లైంగిక శక్తికి దోహదం చేస్తాయి. రాత్రికి మేకపాలల్లో ఖర్జూరాల్ని నానబెట్టి ఉదయాన్నే వాటిని రుబ్బి తేనె, యాలకుల పొడి, జోడించి తింటే లైంగికపరమైన సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయి. ముఖ్యంగా సంతాన లేమితో బాధపడే పురుషులకు ఎంతో మేలు. దీర్ఘకాలికంగా డయేరియాతో బాధపడే వాళ్లు ఖర్జూర పండ్లు తింటే వాటిల్లోని పొటాషియం వల్ల వ్యాధి తగ్గుముఖం పడుతుంది.

దంతాలను సంరక్షిస్తుంది

దంతాలను సంరక్షిస్తుంది

దంతాల మీద ఎనామిల్‌ను సంరక్షించడంలో ఖర్జూరాలను మించింది లేదు. నిజానికి ఎనామిల్‌ ఎముక కన్నా దృఢమైన హైడ్రాక్సీ ఎపటైట్స్‌ అనే పదార్థాలతో రూపొందుతుంది. ఆహారంలో ఉండే బాక్టీరియా కారణంగా ఎనామిల్‌ క్రమంగా తగ్గిపోతుంది. అదే ఖర్జూరాల్ని రోజూ తినడం వల్ల అందులోని ఫ్లోరిన్‌ దంతాల మీద పాచి చేరకుండా చూడటంతో పాటు ఎనామిల్‌తో చర్య పొంది హైడ్రాక్సీఫ్లోరో ఎపటైట్‌గా మారి మరింతగా దంతాలను సంరక్షిస్తుంది.

మలబద్ధకం తగ్గుతుంది

మలబద్ధకం తగ్గుతుంది

పీచు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఖర్జూర పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే పొట్ట, కాలేయ, మూత్ర నాళ, క్లోమ, అండాశయ, క్యాన్సర్లు రావని, వచ్చినా వాటిని నివారించొచ్చు. వారానికి మూడు సార్లు ఖర్జూరాలు తింటే మలబద్ధకం తగ్గుతుంది.

ఎముకలకు బలం

ఎముకలకు బలం

ఎడారి ఫలాల్లో సెలీనియం, మాంగనీస్‌, కాపర్‌, మెగ్నీషియం, వంటి ఖనిజాలు పుష్కలం. ఇవి ఎముకలకు ఎంతో బలం. అందుకే వృద్ధులు ఆహారంలో భాగంగా వీటిని తీసుకుంటే ఆస్టియోపొరోసిస్‌ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

జీర్ణశక్తికి ఊతమిస్తాయి

జీర్ణశక్తికి ఊతమిస్తాయి

ఖర్జూరాల్లోని నికోటిన్‌ పేగుకు సంబంధిం చిన వ్యాధులను రానీయకుండా చేస్తుంది. పేగులో జీర్ణశక్తికి తోడ్పడే మంచి బాక్టీరియా పెరిగేలా చేయడానికి ఖర్జూరాల్లోని అమైనో ఆమ్లాలు జీర్ణశక్తికి ఊతమిస్తాయి. ఐరన్‌ పుష్కలంగా ఉండే ఖర్జూరాలు రక్తహీనత, అలసట, నీరసాన్ని దూరం చేస్తాయి.

గర్భిణీలకు ఎంతో మేలు

గర్భిణీలకు ఎంతో మేలు

రోజుకో ఖర్జూరపండు తింటే కళ్లకు మంచిది. ఇందులో ఉండే ఏ విటమిన్‌ రేచీకటిని నివారిస్తుంది. గర్భిణిలకు ఎడారి ఫలాలు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా గర్భాశయ కండరాలు వ్యాకోచిం చేలా చేయడంతో పాటు బిడ్డ పుట్టాక పాలు పడేందుకు కారణమవుతాయి. గర్భస్త శిశువులో జ్ఞాపకశక్తి, తెలివితేటలు వృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయి. వీటిల్లో ఉండే ఫ్లేవనాయిడ్‌ పాలీఫినాలిక్‌ యాంటీ ఆక్సిడెంట్లు, టానిన్‌లుగా పనిచేస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్లు, పోట్టలో మంట వంటివి రాకుండా చేస్తాయి.

English summary

30 jaw dropping health benefits of dates with honey

30 jaw dropping health benefits of dates with honey
Story first published: Wednesday, May 2, 2018, 11:00 [IST]