అలోవెరా (కలబంద) సాయంతో మీ శరీర బరువును తగ్గించగల 5 ఉత్తమమైన మార్గాలు !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

అలోవెరా (కలబంద) లో ఉన్న ముఖ్యమైన లక్షణాలు మీ ఆరోగ్య సంరక్షణ కోసం అత్యంత ఉపయోగకారిగాను మరియు అందులో ఉన్న సమ్మేళనాలు మీ ఆరోగ్యంపట్ల జాగ్రత్తవహిస్తాయి.

దీనిని ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మీ శరీర బరువును తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది. మీ శరీర బరువును తగ్గించుకోవడానికి కలబందను ఎలా ఉపయోగించాలో తెలుసుకొని, మంచి ఉత్తమమైన చిట్కాలను ఆచరించడంవల్ల మీరు ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు మీ ప్రయాణాన్ని ప్రారంభించగలరు.

5 Ways To Lose Weight With Aloe Vera,

ఈ కలబంద రసం వల్ల జీర్ణక్రియను ప్రోత్సహిస్తూ, జీవక్రియ వేగాన్ని పెంచడంలో చాలా అద్భుతమైన పాత్రను పోషిస్తుంది. మెరుగైన జీవక్రియ అంటే మీ శరీరంలో వున్న కేలరీలను మరియు కొవ్వును వేగంగా కరిగించి వేస్తుంది. ఇలా మీ శరీర వ్యవస్థ శుభ్రంగా ఉన్నట్లయితే, మీ చర్మం కూడా శుభ్రంగా అవుతుంది. కాబట్టి మీరు నిరంతరంగా వ్యాపించే మొటిమలతో అలసిపోయినట్లయితే ఈ కలబంద రసం మీ చర్మాన్ని సంరక్షించే ఒక వరంలాంటిది. మీ శరీర బరువును తగ్గించడానికి కలబంద రసాన్ని ఉపయోగించవలసిన 5 - సహజమైన మార్గాల జాబితాను మీ ముందుకు తీసుకు వచ్చాము.

1. అలోవెరా (కలబంద) రసంతో మీ శరీరం బరువును తగ్గించుకోవడం :

1. అలోవెరా (కలబంద) రసంతో మీ శరీరం బరువును తగ్గించుకోవడం :

మీరు అలోవెరా (కలబంద) రసాన్ని వినియోగించడం వల్ల మీ జీర్ణ వ్యవస్థను మరియు మీ శరీర శక్తిని బాగా పెంచుకోండి. అందుకోసం మీకు కావాల్సిన పదార్థాలు :

1 గ్లాస్ అలోవెరా (కలబంద) రసం,

1 టేబుల్ స్పూను తేనె

1 టీ స్పూను నిమ్మరసం

ఈ మూడు మిశ్రమాలను బాగా కలిపి వ్యాయామానికి ముందు (లేదా) తర్వాత ఈ రసాన్ని తీసుకోవడం వల్ల మీలోని శక్తి వనరులు బాగా పెరగడాన్ని మీరు గమనించవచ్చు. మీరు చేసే వ్యాయామంలో చురుకుగా పాల్గొనేందుకు అది సహాయపడుతుంది. ఈ రసం మీలోని జీర్ణ ప్రక్రియను వేజీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తూ, మీ శరీర బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

2. శరీర బరువును తగ్గించే అలోవెరా జెల్ :

2. శరీర బరువును తగ్గించే అలోవెరా జెల్ :

అలోవెరా జెల్లో విరోచనకారి లక్షణాలను కలిగి ఉన్న కారణంగా, దానిని ఉపయోగించే ముందు డాక్టర్ సలహాలను తీసుకోవడం మంచిది, లేదంటే ఇది మీకు అలర్జీ కలిగించవచ్చు.

ఈ జెల్ తయారీ విధానంలో, మనకు తాజా కలబంద రసం అవసరమవుతుంది. కలబంద ఆకుని మొదలు నుంచి చివరి వరకు చాకుతో కట్ చేసి, అందులో ఉన్న జెల్ను బయటకు తీయాలి. ఇప్పుడు మీకు నచ్చిన ఒక గ్లాసు పండ్లరసాన్ని తీసుకుని అందులో 1 టేబుల్ స్పూను కలబంద జెల్ను కలపాలి. ఇలా తయారైన పదార్ధాన్ని ఒక్కసారిగా గుటకలు వేస్తూ మింగాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే మీరు కోరుకున్న ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెడతారు.

3. కలబంద-పాలకూరల స్మూతీ:

3. కలబంద-పాలకూరల స్మూతీ:

విసుగుచెందే సోమవారం కోసం మీరు ఈ స్మూతీని తీసుకోవడం చాలా మంచిది !

ఈ స్మూతీ కోసం లేత పాలకూరను,

అరకప్పు కలబంద రసాన్ని,

ఒక కప్పులో 1/3 వంతు నీటిని,

కొన్ని అల్లం ముక్కలను మరియు చిటికెడు ఉప్పును తీసుకోవాలి.

పైవన్ని పదార్థాలు బాగా చిక్కగా అయ్యే వరకు బాగా కలుపుతూ స్మూతీని తయారుచేసుకోవాలి.

మీరు వ్యాయామంలో చురుకుగా పాల్గొన్నడానికి కావలసిన శక్తిని పొందటం కోసం, వ్యాయామం చేసే ముందు ఈ స్మూతీని తప్పక తీసుకోవాలి. ఇలా మీరు చేయడం వల్ల కలబందలో ఉన్న సుగుణాలను పొందటమే కాకుండా, పాలకూరలో ఉన్న ఆరోగ్యకరమైన పోషక పదార్థాలను కూడా పొందగలరు.

4. అలోవెరా-బెర్రీల స్మూతీ:

4. అలోవెరా-బెర్రీల స్మూతీ:

ఇది చాలా రుచికరమైన స్మూతీలలో ఇది కూడా ఒకటి. ఈ స్మూతీని తయారుచేయడం కోసం ఈ పదార్ధాలు అవసరమవుతాయి. అవి :

అరకప్పు అలోవెరా రసం,

1 టేబుల్ స్పూను చియా గింజలు,

తాజాగా ఉన్న కొబ్బరి తురుము

అరకప్పు బ్లూబెర్రీలు మరియు కొన్ని తులసి ఆకులు.

ఈ పదార్థాలన్నింటినీ కలిపి బాగా మిక్స్ చేయండి. ఇలా తయారైన మిశ్రమాన్ని ఒక్క గుటకలో త్రాగండి. ఈ స్మూతీని ఏ మాత్రం వృధా చేయకూడదు. ఎందుకంటే ఇది చాలా మంచిది. మీరు కోరుకున్న అందమైన, ఆరోగ్యమైన శరీరాకృతిని పొందటం కోసం ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని ఆస్వాదిస్తూ వినియోగించండి.

 5. వేసవి కోసం అలోవెరా-స్మూతీ:

5. వేసవి కోసం అలోవెరా-స్మూతీ:

ఈ స్మూతీని తీసుకోవడం వల్ల మీరు ఈ వేసవికాలంలో త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా ? అయితే మీరు ఈ చిట్కాను అమలు చేయండి.

ఈ తియ్యని స్మూతీ తయారీ కోసం మీకు కావలసినవి :

అరకప్పు తాజా కలబంద రసం,

అరకప్పు పాలకూర,

1 టీస్పూను నిమ్మరసం,

దోసకాయ సగం,

అరకప్పు తాజా మామిడి రసం,

2 నారింజ పండ్ల రసాలు (పిక్కలు లేని),

అరకప్పు కొబ్బరి నీరు.

ఈ పదార్థాలన్నింటిని బాగా తెలిపే స్మూతీలా తయారు చేయాలి. ఈ స్మూతీలో ఉన్న సువాసన, ఎంత వీలైతే అంత త్వరగా ఈ స్మూతీని తీసుకోవాలి అనే భావనను కలిగిస్తుంది.

English summary

5 Ways To Lose Weight With Aloe Vera

The properties of aloe vera make it one of the most useful and magical ingredient for health care. Its daily use has proven to improve overall health as well as help you lose weight. Start your journey towards a healthy lifestyle with our finest tips on how to use aloe vera for weight loss.
Story first published: Wednesday, March 14, 2018, 8:00 [IST]