For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊబకాయాన్ని సూచించే 7 సంకేతాలు !

|

ఊబకాయం అనేక అనారోగ్య ఫలితాలకు దారి తీయగలదని మనందరికీ బాగా తెలుసు. మీకు కొద్దిగా ఊబకాయం రావడమనేది ఏమాత్రం చెడు కాదు, కానీ అది ఒక నిర్ణీతమైన పరిధిని దాటినప్పుడు మాత్రం మీకు అనారోగ్య సమస్యలను కలుగచేయుటకు కారణమవుతుంది.

ఈ ఊబకాయం వల్ల పురుషులు గుండె వ్యాధుల ప్రమాదానికి ఎక్కువగా గురవుతూ ఉంటే, స్త్రీలు మాత్రం సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. వయస్సుతో వచ్చే ఊబకాయమనేది హైపర్టెన్షన్, మోకాలి నొప్పులు, బోలు ఎముకల వ్యాధి, వెన్నునొప్పి వంటి అనేక ఇతర వ్యాధులను ప్రేరేపిస్తుంది. మీరు ఇలాంటి అనారోగ్య పరిస్థితులకు దూరంగా ఉంచడం కోసం స్థూలకాయ సమస్యను పరిష్కరించడం అత్యవసరం.

ఇప్పుడు, ఒక వ్యక్తి కొద్దిగా అధికబరువును కలిగి ఉండటానికి & స్థూలకాయాన్ని కలిగి ఉండటానికి మధ్య గల వ్యత్యాసాలను గమనించినప్పుడు మాత్రమే ఊబకాయాన్ని గుర్తించగలడు.

ఇప్పుడు ఇక్కడ ఊబకాయాన్ని సూచించే 7 సంకేతాలున్నాయి ! అవి,

1. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుండటం :-

1. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుండటం :-

మీరు అటుఇటు కదలటానికి చాలా కష్టపడుతున్నట్లుగా మీరు గమనించినట్లయితే, మీరు ఊబకాయంతో బాధపడుతున్నారని దాని అర్థం. ఊబకాయంతో ఉన్నవారి మెడ చుట్టూ కొవ్వు చేరటమనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంచేతనే మీ ఊపిరితిత్తుల నుండి గాలి బయటకు - లోపలికి వెళ్లడం చాలా కష్టతరంగా మారుతుంది (ముఖ్యంగా మీరు ఎక్కువగా శ్రమపడినప్పుడు).

ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ఈ పరిస్థితి వల్ల మీకు అనేక ఇతర అనారోగ్య సమస్యలు ఎదురుకాగలవని సూచిస్తుంది. రోజువారీ పనులను చేయడం వల్ల మీకు సాధారణంగా ఎదురయ్యే పరిస్థితని మీకు అనిపించవచ్చు. మీకు ఎదురైన ఇలాంటి పరిస్థితి గూర్చి డాక్టర్కు తెలియజేయడంతో పాటు, మీరు సరైన చర్యలను తీసుకోవడం వల్ల మరింత చురుకైన జీవనశైలిని మీరు పొందగలరు.

2. వెన్నునొప్పి :-

2. వెన్నునొప్పి :-

ఊబకాయాన్ని తెలియజేసే మొదటి సంకేతం ఇదే. మానవ అస్థిపంజరం నిర్మాణమనేది కొంత శరీర బరువును మోయగలిగేదిగా ఉద్దేశించబడినది. మీ వెన్ను అధిక ఒత్తిడికి గురైనప్పుడు, అది తరచుగా వెన్నునొప్పికి దారితీస్తుంది. ఇటువంటి సందర్భాల్లో, వీలైనంత త్వరగా మీరు ఆర్థోపెడిక్ ఎక్స్పర్ట్ సహాయాన్ని కోవడం ఉత్తమం.

ఇలాంటి సమయంలో మీరు సరైన జాగ్రత్తలను తీసుకోకపోతే స్పిన్డైలోలిసిస్ & వెన్నుపూసలో పగుళ్లు వంటి తీవ్ర పరిస్థితులకు ఇది దారితీయవచ్చు. ఒకవేళ ఇలాగాని జరిగితే, అది మీకు ఒక రకమైన జీవితకాల వైకల్యానికి దారి తీయవచ్చు, తరువాత దానిని నయం చేయటానికి మీకు చాలా కష్టంగా కూడా ఉంటుంది.

3. బయటకు వెళ్లడానికి అయిష్టత :-

3. బయటకు వెళ్లడానికి అయిష్టత :-

స్థూలకాయం వంటి భారీ శరీర నిర్మాణాన్ని కలిగి ఉన్న వ్యక్తుల గూర్చి, భారతీయ సమాజం ఎక్కువగా న్యాయనిర్ణేషిస్తుంది దీని ఫలితంగా, ఊబకాయంతో బాధపడుతున్న ప్రజలు వారి శరీర నిర్మాణం కారణంగా ఎక్కువ అవమానాలకు గురవుతున్నారు. దీనివల్ల వీరు ఇతర వ్యక్తులతో సమావేశం కావడానికి దూరంగా ఉంటూ, తమకు తామే కుంచించుకొని పోవటానికి దారి తీస్తుంది.

ఇలాంటి పరిస్థితుల ప్రభావం వల్ల వారిలో ఆందోళన & నిరాశ వంటివి సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఊబకాయం ఎదురవుతుందని తెలియపరిచే మొట్టమొదటి సంకేతం ఇదే. ఈ విధంగా, మీ చుట్టుపక్కల ఉన్న వారు మిమ్మల్ని ఊబకాయులుగా సంభోదించినట్లయితే మీరు సరైన చర్యలను తీసుకోవడానికి వెంటనే డాక్టర్ను సంప్రదించండి.

4. అనారోగ్యమైన సిరలు :-

4. అనారోగ్యమైన సిరలు :-

రక్త నాళాల గోడలు బలహీనమయినప్పుడు, ఆ రక్త నాళాలు వాటంతట అవే ఉబ్బుతాయి. ఇది చాలా అనారోగ్యకరమైనది & మీ శరీర మొత్తం శక్తిని ప్రభావితం చేస్తుంది.

ఊదా రంగు (లేదా) నీలం రంగులో ఉన్న రక్త కేశనాళికలు బయటవైపుకి ఎర్రని రూపంలో ఉన్నట్లుగా మనకి కనిపిస్తాయి.

అంతర్గతంగా మాత్రం, మీరు నడవటాన్ని ఒక కఠినమైన పనిలా భావించేలా చేస్తుంది. ఒకవేళ మీరే అనారోగ్య సిరలను కలిగి ఉంటే, మీరు మీ శరీర బరువును తగ్గించుకోడానికి సరైన మార్గాలను అన్వేషించాలి.

5. హార్ట్ బర్న్ :-

5. హార్ట్ బర్న్ :-

ఆమ్లత్వం మిమ్మల్ని తరచుగా బాధిస్తే అది కూడా ఊబకాయమును తెలియజేసే మరొక సంకేతం. శరీరంలో కొవ్వు అధిక మొత్తంలో ఉండటం వల్ల మీ జీర్ణవ్యవస్థ పై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది మీ గొంతు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కొవ్వు బాగా వృద్ధి చెందేలాగా ప్రత్యేకమైన దృష్టిని కనబరుస్తుంది.

6. గురక :-

6. గురక :-

ఇది తీవ్రమైన ఆరోగ్యం మాత్రం కాదు, వైద్యపరంగా చెప్పాలంటే, గురక మీ ఆరోగ్యానికి ఏమాత్రం సంబంధించినది కాదు. అయితే, నిజానికి ఊబకాయంతో ఉన్న వారు, ఆరోగ్యవంతమైన బరువు ఉన్న వారి కంటే ఎక్కువగా గురక తీస్తారు.

బరువులో అకస్మాత్తుగా పెరుగుదల వల్ల "అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా" అనే ప్రమాద తీవ్రతను పెంచుతుంది. ఇది మీ మెడ చుట్టూ కొవ్వును పేరుకుపోయేలా చేస్తుంది. ఈ పర్యవసానంగా, ఆ వ్యక్తి మరింత బిగ్గరగా గురక తీస్తారు. ముఖ్యంగా ఇది వైద్యపరమైన అంశముగా మిమ్మల్ని ప్రభావితం చేయకపోయినా, మానసికంగా మాత్రం మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తుంది.

7. సక్రమంగా లేని పీరియడ్స్ :-

7. సక్రమంగా లేని పీరియడ్స్ :-

ఊబకాయం, ఒక మహిళ యొక్క పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. మహిళలలో పీరియడ్స్ సక్రమంగా అవ్వకపోవడనే దీనికి అసలైన సూచిక. శరీరంలోని అదనపు కొవ్వు పొరల ఉనికి కారణంగా, హార్మోన్లలో అసమతుల్యాన్ని పెంచుతుంది, దీని వల్ల నిర్దిష్ట సమయంలో సంభవించవలసిన ఋతుస్రావమనేది ముందుగా గాని, ఆలస్యంగా గాని సంభవించవచ్చు.

English summary

7 Warning signs of Obesity

Most people find it difficult to identify the point where their 'little weight gain' is enough to be deemed as obesity and cause a number of health complications. The first signs of obesity which can be seen to hamper normal life are shortness of breath, back pain, reluctance to go out, varicose veins, heartburn, snoring, and irregular periods.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more