శరీర బరువును తగ్గించుకోవడానికి రాత్రి సమయంలో తీసుకోవాల్సిన అల్పాహారాలు !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మొదటి నుంచి రాత్రిపూట అల్పాహారమును తీసుకోవటం అనేది ఒక చెడు అలవాటు కాదు, మీరు అలా తీసుకునే ఆహారంలో పోషక విలువలను కలిగి ఉన్నట్లయితే - అది మీ ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగి చేస్తాయి. ఇలాంటి ఆహార పదార్థాలు మీ శరీరానికి మంచే చేస్తాయి గానీ, చెడు చేయదు. ఈ ఆహార పదార్ధాలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి అందువల్ల మీరు త్వరగా శరీర బరువు కోలరీర బరువు కోల్పోవటానికి సహాయపడుతుంది మరియు మీ శరీరానికి అవసరమైన ప్రోటీన్లను, విటమిన్లను మరియు మినరల్స్ను మీ రోజువారీ వినియోగం ద్వారా శరీరానికి అందజేస్తుంది.

Best Nighttime Snacks For Weight Loss

కాబట్టి మీరు రాత్రి పడుకునే సమయంలో ఆకలితో ఉండి మంచం పైన అటూ ఇటూ దొర్లుతూ ఉండే బదులుగా, మీ పొట్టను పూర్తిగా నింపి - మీకు మంచి నిద్రను కలుగజేస్తూ, మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందించి మీ శరీర బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.

Best Nighttime Snacks For Weight Loss

ఒక కప్పు నిండా ధాన్యాలను తీసుకోండి :

ఓల్మీట్ (లేదా) మొక్కజొన్నలు (లేదా) గోధుమ (లేదా) తవుడుతో ఉన్న గోధుమలు కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి, వీటితో పాటు అదనంగా ప్రోటీన్లను కలిగిన పాలను కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకోవడం చాలా మంచిది. వీటిలో ఏ మాత్రం చక్కెరను జోడించవద్దు, ఇందులో ఉపయోగించే చెక్కర మీ బరువును పెంచుతుంది మరియు రాత్రి సమయంలో మీకు మంచి నిద్రను అందించలేదు.

Best Nighttime Snacks For Weight Loss

ఒక కప్పు పెరుగును వినియోగించండి :

ఇది మిమ్మల్ని నిద్రపుచ్చడంలో సహాయపడటమే కాకుండా అందులో ఉన్న ట్రిప్టోఫాన్ను మీ కడుపును ఉపశమనాన్ని కలుగజేస్తుంది మరియు జీర్ణక్రియలో సహాయపడుతుంది. మీరు అజీర్ణం మరియు ఛాతీ-మంటల నుండి విముక్తిని పొందటం వలన రాత్రిళ్లు మీరు సుఖంగా నిద్రపోతారు.

Best Nighttime Snacks For Weight Loss

రాత్రిళ్లు పండ్లను తినండి :

రాత్రిపూట మీరు తీసుకునే అల్పాహారంలో యాపిల్ వంటి పండ్లను, అరటి పండ్లను తీసుకోండి. అవి ఎక్కువకాలం పాటు మీ కడుపు నిండినట్లుగా ఉంచి, రాత్రిళ్ళు మీకు మంచి నిద్రను కలుగజేస్తాయి, అలాగే వీటిలో పీచు పదార్థాలు పుష్కలంగా లభ్యమవుతాయి. ఈ పీచు పదార్థాలు మీ ప్రేగులలో ఉన్న వ్యర్దాన్ని తొలగించి, మీ పొట్టను శుభ్రపరచడానికి మరియు శరీర బరువును కోల్పోయేలా చెయ్యడానికి సహాయపడతాయి.

Best Nighttime Snacks For Weight Loss

మీరు ఎక్కువగా క్యారెట్లను తినడానికి ఇష్టపడినట్లయితే, రాత్రిపూట తీసుకునే అల్పాహారంలో వీటిని చేర్చుకోండి. మీ పొట్టను పూర్తిగా నింపడమే కాకుండా, మీ శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు మినరల్స్ అందచేయడమే కాకుండా, పీచు పదార్ధం లక్షణాలను కలిగి ఉండటం వల్ల మీకు సులభంగా విరేచనం అవుతుంది.

Best Nighttime Snacks For Weight Loss

మీరు రాత్రిపూట స్నాక్స్ వంటి ఆహారాలలో కొన్ని లీన్ ప్రోటీన్లను కలిగిన చేపలను తినడాన్ని కూడా ప్రయత్నించవచ్చు. వీటిలో ప్రోటీన్లు, టిప్ప్తోన్లు అధికంగా ఉండి, తక్కువ క్రొవ్వును కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి మిమ్మల్ని కేవలం మీరు నిద్రపోవటానికి మాత్రమే సహాయపడకుండా, మీ శరీర బరువును కోల్పోవడానికి కూడా మీకు సహాయం చేస్తుంది.

Read more about: snacks weight loss carrot apple banana
English summary

Best Nighttime Snacks For Weight Loss

The snacks that we have mentioned are pretty low in calories, and so they can help you to lose weight and at the same time might help to increase your daily consumption of vitamins, proteins and minerals.
Story first published: Friday, March 9, 2018, 10:46 [IST]