For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చల్లని నిమ్మకాయ నీళ్ళు బరువు తగ్గడంలో ఎలా సహాయం చేస్తుంది?

చల్లని నిమ్మకాయ నీళ్ళు బరువు తగ్గడంలో ఎలా సహాయం చేస్తుంది?

|

నిమ్మకాయ సిట్రస్ పండ్ల జాతికి చెందింది, దీనిని తరచుగా వేడి మరియు చల్లని పదార్ధాలలో కలిపి తీసుకోవడం జరుగుతుంటుంది. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న అనేక మంది ప్రజలు వేడి నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడానికి మొగ్గు చూపిస్తుంటారు.

కొందరు రోజులో మొదటగా స్వీకరించే పదార్ధాలలో నిమ్మకాయను ప్రధానంగా ఉండేలా చూసుకుంటారు కూడా. గ్రీన్ టీ, లెమన్ టీ, నిమ్మకాయ నీళ్ళు, తేనె మరియు నిమ్మరసం కలిపిన నీళ్ళు మొదలైనవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. క్రమంగా ఇలా నిమ్మరసం ఆహార ప్రణాళికలో చేర్చడం ద్వారా బరువు తగ్గడంలో సహాయం చేస్తుందని నమ్ముతారు. కానీ ఎక్కువ మందికి తెలీని విషయం ఏమిటంటే, కేవలం వేడి నీటిలోనే కాకుండా, చల్లని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం ద్వారా కూడా, బరువు తగ్గడంలో సహాయం చేయగలదని. ఇలా చల్లని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి ఈ వ్యాసం దోహదం చేస్తుంది.

Can Drinking Cold Lemon Water Really Help You Lose Weight?

బరువు కోల్పోవడం కోసమే కాకుండా, నిమ్మరసం మీ శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూడడంలో సహాయం చేస్తుంది. శరీరంలోని శక్తిస్థాయిలను పెంచడమే కాకుండా, మెరుగైన జీర్ణక్రియలను సైతం ప్రోత్సహిస్తుందని చెప్పబడింది. అందుకే ఎక్కువగా జీవక్రియల సమస్యలతో ఉన్నవారి ఆహార ప్రణాళికలో నిమ్మజాతి పండ్లను జోడించవలసినదిగా వైద్యులు సూచిస్తుంటారు.

చల్లని నిమ్మరసం తీసుకోవడం ద్వారా బరువు ఎలా తగ్గుతుందో ఇప్పుడు చూద్దాం.

1.కేలరీలు తక్కువ

1.కేలరీలు తక్కువ

చల్లని నిమ్మరసం కేలరీలలో తక్కువగా ఉంటుంది. నీటిలో ఎటుతిరిగీ సున్నా కేలరీలు ఉంటాయి, ఇందులో ఎటువంటి అనుమానమూ లేదు. మరియు నిమ్మకాయలో 17 కేలరీల శక్తి ఉంటుంది. మీరు ఈ నిమ్మరసాన్ని సగం గ్లాసు నీటితో కలిపినా, కేలరీల సంఖ్యలో ఏమాత్రం మార్పు ఉండదు. 39కేలరీలు కలిగిన గ్లాసు నారింజరసం తీసుకునేకన్నా, బదులుగా నిమ్మరసం తీసుకోవడం ద్వారా అదనపు ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇందులో పోషకాలలో ఎక్కువగా, కాలరీలలో తక్కువగా ఉంటుంది.

2. జీవక్రియలను పెంచుతుంది

2. జీవక్రియలను పెంచుతుంది

శరీరంలోని జీవక్రియలను మెరుగుపరుచుకోవడానికి నిమ్మకాయ నీరు ప్రసిద్ధి చెందింది, ఇది బరువు కోల్పోవడంలో సహాయపడుతుంది. పరిశోధనల ప్రకారం, మీ శరీరం సరైన స్థాయిలో నీటి నిల్వలతో కూడుకుని ఉంటే, అది మైటోకాండ్రియా పనితీరును సైతం మెరుగుపరుస్తుంది. మైటోకాండ్రియా కణాల నుండి పోషకాలను వేరు చేసి, విచ్చిన్నం చేసి, శక్తిగా మారుస్తుంది. క్రమంగా జీవక్రియలను క్రమబద్దీకరిస్తుంది.

3. మీ కడుపును నిండుగా ఉంచుతుంది

3. మీ కడుపును నిండుగా ఉంచుతుంది

నిమ్మరసం తీసుకోవడం మీ కడుపును నిండుగా ఉండటానికి సూచించదగిన గొప్ప మార్గం. నిమ్మరసం, అవాంఛిత ఆహార కోరికల నుండి మిమ్మల్ని నిరోధిస్తుంది. 2008లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, అల్పాహారం ముందు సగం లీటరు నిమ్మరసం కలిపిన నీటిని తీసుకోవడం ద్వారా 13శాతం కేలరీలను తీసుకోవడం తగ్గించవచ్చని వెల్లడించారు. మరో అధ్యయనం ప్రకారం, భోజనం సమయంలో నిమ్మరసం కలిపిన నీటిని త్రాగడం ద్వారా ఆకలి తగ్గుతుందని తేలింది.

దీనికి కారణం నిమ్మరసం కలిపిన నీటిలో కేలరీలు తక్కువగా ఉండటం, మరియు కడుపు నిండిన అనుభూతిని ప్రోత్సహించడం. క్రమంగా కాలరీలను తీసుకోవడం తగ్గుతుంది.

4. శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది

4. శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది

చల్లని నిమ్మరసం, ఎటువంటి సారూప్యతలు లేకుండా వెచ్చని నిమ్మరసం వలనే ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించి శరీర భౌతిక స్థితిగతుల మెరుగుదలకు సహాయపడుతుంది. నిమ్మరసం కలిపిన నీరు మీ శరీర జీవక్రియలను మెరుగుపరచి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

5. ఫ్రీ రాడికల్స్ తొలగించడంలో :

5. ఫ్రీ రాడికల్స్ తొలగించడంలో :

నిమ్మకాయలలో ఉన్న విటమిన్-సి శరీరంలో ఆక్సీకరణ స్థాయిల ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. శరీర కణాలలోని సమ్మేళనాల ఆక్సీకరణను తగ్గించడంలో విటమిన్-సి పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్, LDL (చెడు) కొవ్వులతో సంబంధం కలిగి ఉంటాయి.

ఆహారప్రణాళికలలోని అధిక సంతృప్త కొవ్వులు మరియు చక్కెరలు, ROS ఫ్రీ రాడికల్స్ మరియు ఆక్సిడైజ్ అయిన LDL స్థాయిలను పెంచుతుంది. ఈ ఆక్సిడైజ్డ్ LDL అథెరోస్క్లెరోసిస్ ఫలకాలు ఏర్పడటానికి దారితీస్తుంది, క్రమంగా గుండె జబ్బులకు దారి తీస్తుంది. నిమ్మరసం కలిపిన నీరు సేవించడం మూలంగా, ఫ్రీ రాడికల్ కణాలతో పోరాడటానికి మరియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి దోహదం చేస్తాయి. దీనికి కారణం నిమ్మరసం కలిపిన నీరు, కేలరీలలో తక్కువగా ఉండటంతో పాటు,కడుపునిండిన అనుభూతికి లోనుచేయడమే. క్యాలరీలను తీసుకోవడం తగ్గించడానికి ప్రభావవంతమైన మార్గంగా నిమ్మకాయ నీళ్ళు సహాయపడగలదు.

బరువును కోల్పోయే క్రమంలో భాగంగా నిమ్మకాయ నీళ్ళను ఎంత మోతాదులో రోజులో స్వీకరించవచ్చు?

బరువును కోల్పోయే క్రమంలో భాగంగా నిమ్మకాయ నీళ్ళను ఎంత మోతాదులో రోజులో స్వీకరించవచ్చు?

బరువు తగ్గడానికి నిమ్మకాయ నీరు తాగడానికి ముందు మీరు పరిగణించవలసిన మూడు ప్రధాన విషయాలు పరిమాణం, సమయం మరియు ఉష్ణోగ్రత.

మానవ శరీరం ఒక సమయంలో కేవలం 375 మిల్లీలీటర్లను మాత్రమే జీవక్రియలకు ఉపయోగిస్తుంది. మీరు 375 మిల్లీలీటర్ల కన్నా ఎక్కువ త్రాగాలని కోరుకుంటే, ఒక గంట తర్వాత మరలా తీసుకోవచ్చు.

150 పౌండ్లు (68 కిలోలు) బరువుకన్నా తక్కువ ఉన్నవ్యక్తి, 8 నుండి 12 ఔన్సుల(236 నుండి 354 ml) నిమ్మరసంను చల్లని నీటితో తీసుకోవలసి ఉంటుంది. మరియు 150 పౌండ్లకు మించిన బరువున్న ఒక వ్యక్తి ఒక రోజులో రెండుమార్లు నిమ్మరసం అదే స్థాయిలో తీసుకోవచ్చు. ఉదయం సమయం నిమ్మరసాన్ని తీసుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడుతుంది.

బరువు తగ్గించుకోవడం కోసం లెమన్ వాటర్ చేయడం ఎలా ?

బరువు తగ్గించుకోవడం కోసం లెమన్ వాటర్ చేయడం ఎలా ?

కావలసినవి:

1 నిమ్మకాయ

1 గ్లాసు నీరు

విధానం:

నిమ్మకాయను ముక్కలు చేసి ఒక గ్లాసులో రసాన్ని తీసుకోండి.

గ్లాసులో మీరు తాగగలిగిన నీటితో నింపండి. తాజా పుదీనా, తులసి లేదా లావెండర్ వంటి తాజా మూలికలను జోడించవచ్చు కూడా.

కొన్నిగంటలు రిఫ్రిజిరేటర్లో పెట్టి, చల్లబడిన తర్వాత తీసుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Can Drinking Cold Lemon Water Really Help You Lose Weight?

Lemon is a citrus fruit which is mostly consumed by infusing it in the water - be it warm or cold. Cold lemon water can also help in weight loss - it's low in calories, boosts metabolism, combats free radicals, keeps you satiated, and removes toxins from the body. If you are less than 150 pounds use half a lemon's juice in 8 to 12 ounces of cold water.
Desktop Bottom Promotion