ప్రతిరోజూ సలాడ్ ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారా?

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

తాజా వెజ్జీస్ తో తయారైన సలాడ్ ని ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా వెయిట్ లాస్ ని గమనించవచ్చు. అయితే, ప్రతి రోజూ సలాడ్ ని తీసుకోవడం ఆరోగ్యకరమేనా?

వెయిట్ లాస్ ప్రోగ్రాం ని అనుసరిస్తున్నప్పుడు, వెయిట్ లాస్ డైట్ గురించి తెలుసుకోవడం మంచిది. సలాడ్స్ ని అలాగే తాజా ఫ్రూట్స్ ని డైట్ లో భాగంగా చేసుకోవడం మంచిదే. అయితే, కేవలం వీటిపైనే ఆధారపడటం ఆరోగ్యకరమేనా అన్న సంగతి తెలుసుకోవాలి.

does eating salad everyday help you lose weight

మీల్ టైం లో కేవలం సలాడ్స్ ను మాత్రమే తినడానికి మీరు ఆసక్తి కనబరిస్తే అదనపు బరువును తగ్గే అవకాశం మెరుగ్గా ఉంటుంది. అయితే, కేవలం సలాడ్స్ పైనే ఆధారపడటం వలన శరీరానికి అందవలసిన పోషకాలు అందవు. పోషకాల లోపం వలన శరీరం పనితీరు ఆరోగ్యకరంగా ఉండదు.

సైజ్ జీరో టార్గెట్ ని అందుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న వారు మీకు ఎదురుపడి ఉండవచ్చు. అందువలన, మీల్ టైం లో వారు కేవలం సలాడ్స్ పైనే ఆధారపడి ఉంటారు.

ఇలా కేవలం సలాడ్స్ పై ఆధారపడటం వలన వారికేం జరుగుతుందన్న సందేహం మీకు కలగవచ్చు? అయితే, వెయిట్ ను తగ్గడంతో పాటు వారి అఫియరెన్స్ కూడా దెబ్బతినడాన్ని మీరు గమనించవచ్చు. నీరసంగా అలాగే కాంతిహీనంగా వారు కనిపిస్తారు.

does eating salad everyday help you lose weight

పోషకాలు పుష్కలంగా కలిగిన సలాడ్ ను తయారుచేయడం ఎలా?

మీరు వెయిట్ ను తగ్గడం కోసం ఎదురుచూస్తున్నట్టయితే, సలాడ్స్ ను రోజు వారి డైట్ లో భాగంగా చేసుకోవడం నిజంగా మెచ్చుకోవలసిన విషయమే . లీఫీ వెజిటబుల్స్ కలిగిన సలాడ్స్ రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి.

సలాడ్స్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువలన, వెయిట్ ను తగ్గడానికి డైటీషియన్స్ వీటిని రికమెండ్ చేస్తారు. అయితే, సలాడ్ ను ఆరోగ్యకరంగా ప్రిపేర్ చేయడంలో అసలు రహస్యం దాగుంది. ప్రతి సలాడ్ ఆరోగ్యకరమైనది కాదు.

ప్రతి మీల్ లో సలాడ్ ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చన్న నమ్మకం కేవలం అపోహ మాత్రమే. హై కేలరీ స్నాక్ పై ఆధారపడే కంటే సలాడ్ పై ఆధారపడటం ఎంతో మంచిది. అయితే, మీరు తీసుకునే సలాడ్ లో పోషకాలు పుష్కలంగా లభించాలన్న విషయాన్ని మీరు గుర్తించి తీరాలి.

does eating salad everyday help you lose weight

హెల్తీ డైట్ అంటే ఏంటి?

సలాడ్ ని తినడం మంచిదే. అయితే, కేవలం సలాడ్ పై ఆధారపడటం వలన పోషకాహార లోపం తలెత్తి శారీరక బలహీనత ఏర్పడుతుంది. హెల్తీ డైట్ లో సలాడ్స్ తో పాటు ఇతర పోషకాహారాలు కూడా భాగం అవుతాయి.

మీరు తీసుకోబోయే సలాడ్ కేలరీస్ లో తక్కువగా ఉంటూ అదే సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా కలిగి ఉండాలి. అటువంటి సలాడ్ ని మీరు క్రియేట్ చేయలేకపోతే మీరు మీ మీల్ మెనూలో ఇతర ఆహారాలకు కూడా స్థానాన్ని అందించాలి.

does eating salad everyday help you lose weight

వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు హెల్తీ సలాడ్ ను ప్రిపేర్ చేయడమెలా?

వెయిట్ ను తగ్గాలన్న ఆలోచనలో శరీరానికి అవసరమైన పోషకాలు అందించకుండా చేయడం వలన మీ ఆరోగ్యం అనేక విధాలుగా దెబ్బతింటుంది. కాబట్టి, మీరు సలాడ్ ను క్రియేట్ చేసుకునేటప్పుడు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

• ఐస్ బర్గ్ లెట్ట్యూస్ ని అవాయిడ్ చేయండి.

• సలాడ్ బేస్ ని ఎంచుకోవడం ముఖ్యమైన విషయం. కేలరీలు తక్కువగా ఉంది పోషకాలు ఎక్కువగా ఉండే స్పినాచ్ వంటి వాటిని ఎంచుకోండి.

• సలాడ్ అనేదే మీ మెయిన్ డిష్ అయినప్పుడు, రెండు లేదా మూడు కప్పుల గ్రీన్స్ ని ప్రిపేర్ చేసుకోండి. సైడ్ డిష్ గా సలాడ్ ని ప్రిఫర్ చేసేటప్పుడు ఒక కప్పు చాలు.

• కాలే లెట్యూస్ ని వాడి సలాడ్ ని ప్రిపేర్ చేయడం మంచి ఎంపిక. ఇందులో, విటమిన్ సితో పాటు విటమిన్ కే పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో పాటు ఎముకలను బలపరచడానికి ఉపయోగపడతాయి. విటమిన్ కే లో బ్లడ్ క్లాటింగ్ సామర్థ్యం అధికంగా లభిస్తుంది.

does eating salad everyday help you lose weight

సలాడ్ ని సంతృప్తి పరిచే ఆహారంగా మార్చుకోవడం ఎలా?

లీఫీ గ్రీన్స్ ని సలాడ్ లో వేయడం ద్వారా కడుపు నిండదు. కాబట్టి, సలాడ్ ను సంతృప్తి పరిచే ఆహారంగా మార్చుకోవడానికి మీరు టాపింగ్ గా గ్రిల్డ్ కాటేజ్ ఛీజ్ ను జోడిస్తే బాగుంటుంది.

గ్రిల్డ్ చికెన్ బ్రెస్ట్ ని సలాడ్ టాపింగ్ గా వేసుకుంటే సలాడ్ ని సంతృప్తి పరిచే మెయిన్ డిష్ గా భావించవచ్చు. అలాగే చిక్ పీస్ తో పాటు మరికొన్ని బీన్స్ ని సలాడ్ లో జోడిస్తే పోషకవిలువలు పెరుగుతాయి. సన్నగా తరిగిన బ్రొకోలీ, కేరట్స్, టమాటో మరియు అవొకాడోలను వేయడం ద్వారా సలాడ్ లోని ఫైబర్ లెవెల్స్ ని పెంపొందించవచ్చు.

మీరు సలాడ్ ని రోజూ తయారుచేసుకుంటున్నప్పుడు సలాడ్ తయారీలో వాడే ఇంగ్రీడియెంట్స్ ను మార్చుతూ ఉండమని డైటీషియన్స్ సూచిస్తున్నారు. సలాడ్ ప్రిపరేషన్ లో టాపింగ్స్ ను మార్చడం ఉత్తమం. ఈ విధంగా, సలాడ్ అంటే మీకు బోర్ కొట్టదు.

సలాడ్

సలాడ్ ని రోజూ కొత్తగా తయారుచేసుకోవడం వలన మీ టేస్ట్ బడ్స్ ని సంతృప్తి పరిచే వారవుతారు. అందులో వాడే ఇంగ్రిడియెంట్స్ ని మారుస్తూ ఉండటం వలన సలాడ్ ఫ్లేవర్ మారుతుంది.

సలాడ్ ని సైడ్ డిష్ గా చేసుకోవడం వలన ఇతర డిష్ లను తీసుకునే మోతాదు తగ్గుతుంది. అయితే, వెయిట్ ని తగ్గడం మెయిన్ గోల్ కాబట్టి సలాడ్ లో లీన్ ప్రోటీన్ తో పాటు వెజ్జీస్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. కేలరీలు ఎక్కువగా ఉండే చేద్దార్ ఛీజ్ లను అవాయిడ్ చేయాలి. ట్యాన్గీ ఫీల్ కోసం కాస్తంత నిమ్మరసాన్ని స్ప్రే చేసుకుంటే మంచిది.

వెయిట్ లాస్ ప్రోగ్రాంని అనుసరించే వారు సలాడ్స్ ని జంక్ ఫుడ్ బదులుగా తీసుకుంటే మంచిది. అలాగే వెయిట్ లాస్ రెజైమ్ ని డిస్టర్బ్ చెసే హై కేలరీ ఫుడ్ కి దూరంగా ఉండటం మరవద్దు.

ఒక్కముక్కలో చెప్పాలంటే, పోషకాహారంతో పాటు హెల్తీ సలాడ్ ని తీసుకుంటూ తగిన వ్యాయామాలు అలాగే యోగాని పాటిస్తూ ఉంటె వెయిట్ లాస్ గోల్ ను మీరు రీచ్ అవడం ఖాయం.

English summary

Does Eating Salad Every Day Help You Lose Weight?

Incorporating salads in your daily diet can be extremely helpful. Salads containing leafy vegetables can be delicious as well as healthy but eating only salad can lead to physical weakness due to lack of important nutrients. To make a salad into a wholesome and satisfying dish, you can consider topping it with grilled cottage cheese or chicken breast.
Story first published: Wednesday, March 7, 2018, 14:00 [IST]