2 నెలల్లో తొడల ఆకృతి పొందడానికి 3 ఉత్తమ ఇంటి వ్యాయామాలు!

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

ఊహించండి, మీరు షాపింగ్ కి వెళ్ళినపుడు మీ దృష్టి ఒక సెక్సీ మినీ షర్ట్ మీదపడి మీరు దాన్ని ఇష్టపడితే?! అయితే, మీరు దాన్ని వేసుకోవాలని ప్రయత్నిస్తే, మీరు సెల్ఫ్ కాన్షస్ తో బాధపడతారు. ఎందుకంటే మీ తొడలు కనిపిస్తూ, ఆ లుక్ ని మీరు ఇష్టపడరు!

ప్రతి వ్యక్తీ, ప్రత్యేకంగా స్త్రీలు, వారి శరీర భాగాలను అంగీకరిస్తూ, వారి శరీరంలో ప్రతి భాగాన్నీ ఇష్టపడూ, సాధ్యమైనంత వరకూ ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు.ఇది నిజమైనప్పటికీ, ప్రతి స్త్రీ ఫిట్ గా మంచి ఆకృతి కలిగి ఉండాలని అనుకోవడం కూడా నిజమే.

మంచి ఆకృతి కలిగి ఉండాలి అనుకోవడానికి కారణాలు ఏవైనా, చివరిగా, స్త్రీలు ఆరోగ్యకరమైన మార్గాలు ఎంచుకున్నంత కాలం, నిజంగా వారు సానుకూల లక్ష్యాలను పొందుతారు!

తొడలు మరింత అందంగా కనిపించడానికి, ఆ ప్రదేశం చుట్టూ ఉన్న కండరాలను పెంచుకోవడ౦పై ప్రత్యేకంగా తొడల పై భాగంలో కండరాల పై తప్పక దృష్టి పెట్టాలి.

కాబట్టి, మీరు స్త్రీ అయి ఉండి, ఇంట్లోనే తొడల సరైన ఆకృతి కావాలి అనుకుంటే, మీకు సహాయపడే 3 తేలికైన వ్యాయామాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి!

1.అటూ ఇటూ కదలడం

1.అటూ ఇటూ కదలడం

లాంజెస్ అనేవి తేలికైన, ప్రభావవంతమైన వ్యాయామ రకం, ఇది మీ తొడ కండరాల్ని, మీ పిరుదులను కూడా ధృడ పరుస్తుంది, వాటికి మంచి ఆకృతి కల్పిస్తుంది.

దీన్ని ఇంట్లో చేసుకోవడం ఎలా

రెండు పాదాలు కలిపి నిఠారుగా నించోండి.

మీ కుడికాలు ముదుకు పెట్టి, రెండు పాదాలు నేలకు ఆనేటట్టు ఉంచండి.

ఇపుడు, రెండు మొకాళ్ళూ వంచి, శరీరాన్ని కిందకు దింపండి, మీ ఎడమ మోకాలు నెలకు తాకాలి, కుడి తొడమ నేలకు సమాంతరంగా ఉండేట్టు చూడండి.

మీ పై శరీరం నిఠారుగా ఉండాలి, ముందుకు చూస్తూ ఉండాలి.

ఇపుడు, నిదానంగా మీ కుడి కాలిని యదాస్థానానికి తీసుకురండి.

ఇది ఒకవైపు పూర్తయింది, ఇపుడు, ఎడమ కాలు ముందు పెట్టి అదే పద్ధతిలో తిరిగి చేయండి.

ఈ వ్యాయామాన్ని 3 రౌండ్లు చేయండి, ఒక్కొక్క కాలితో 10 సార్లు (ఒక్కొక్క కాలితో మొత్తం 10 సార్లు) చేయండి.

2.బెంచ్ జంప్ లు

2.బెంచ్ జంప్ లు

ఈ వ్యాయామాలు చాలా ప్రభావవంతమైన, శక్తివంతమైనవి, ఇవి మీ మొత్తం కాలి లోని కండరాలకు బలాన్ని ఇస్తాయి, తొడలు, కాళ్ళ పిక్కలకు కూడా మంచి ఆకారాన్ని ఇస్తాయి. బెంచ్ జంప్ లు అనేక క్యాలరీలను కరిగిస్తాయి కూడా!

ఇవి ఇంట్లోనే చేసుకోవడం ఎలా

ఇవి ఇంట్లోనే చేసుకోవడం ఎలా

మీ ముందు దాదాపు 2 అడుగుల ఎత్తు ఉన్న బెంచ్ లేదా ఒక స్టూల్ ను వేసుకోండి.

స్టూల్ కి ముందు నించుని, భుజం వెడల్పు చేయకుండా కాళ్ళు పెట్టండి.

ఇపుడు, మీరు ఒక చైర్ లో కూర్చున్నట్టుగా మీ మోకాళ్లను వంచి కింద కూర్చోండి.

తరువాత, మీ శరీరం, కాళ్ళపై వత్తిడి పెట్టి, స్టూల్ మీదకు జంప్ చేయండి.

నేలమీదకు దూకి, ఇలా మరలా చేయండి. ఇలా 30 పునరావ్రుతులు చేయండి.

మీరు అంత సురక్షితం కాదు అనుకుంటే, తక్కువ ఎత్తు ఉన్న స్టూల్ వేసుకుని, నిదానంగా ప్రారంభించ౦డి.

3.డాంకీ కిక్స్

3.డాంకీ కిక్స్

ఈ వ్యాయామాలు చాలా తేలికైనవి, ఎక్కువ ప్రభావవంతమైనవి, మీ పిరుడులకు మంచి ఆకృతిని ఇవ్వడమే కాకుండా, మీ తొడల కండరాలకు బలాన్ని అందించడానికి కూడా ఇవి సహాయపడతాయి!

వీటిని ఇంట్లోనే చేయడం ఎలా

వీటిని ఇంట్లోనే చేయడం ఎలా

వ్యాయామం చేసే చాప తీసుకుని, చిన్నపిల్లలు దోర్లినట్లుగా చేయండి.

మీ చెస్ట్, పొట్ట నేలకు తగలాలి, మీ వెన్నుపూస నిఠారుగా ఉండేట్టు చూసుకోండి.

ఇపుడు, సాధ్యమైనంత ఎత్తువరకు మీ ఎడమ కాలిని లేపండి, నిదానంగా తిరిగి;కిందకు తీసుకురండి.

కుడి కాలితో కూడా ఇదే పద్ధతిలో చేయండి.

కుడి కాలితో కూడా ఇదే పద్ధతిలో చేయండి.

ఈ విధానాన్ని, ప్రతి కాలితో 30 సార్లు చేయండి.

సూచన: మీరు ప్రారంభించే ముందు

1.పైన తెలిపిన వ్యాయామాలు చేసేముందు, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ముఖ్యంగా ఇప్పటికే మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారా అనే విషయాన్నీ డాక్టర్ తో సంప్రదించి పరిసీలించుకోండి.

2.ఆరోగ్యకరమైన ఆహరం, జాగింగ్ లేదా పరిగెట్టడం వంటివి ఈ వ్యాయామాల ప్రభావాన్ని మరింత పెంచగలవు.

English summary

3 Best Home Exercises For Shapely Thighs In 2 Months!

Most women would yearn to have shapely thighs and legs. But you cannot attain this without some effort. So, try these simple home exercises to shape up your thighs and legs. Here's one: lunges!
Story first published: Saturday, January 13, 2018, 15:00 [IST]