For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్ట వద్ద పేరుకున్న కొవ్వును కరిగించడానికి ఐదు ఉత్తమ వ్యాయామాలు!

|

మీ ఛాతీ కండరాలకు మరియు కటి భాగం మధ్యలో ఉండే ప్రాంతం, దాన్ని బొజ్జ అనండి , పొట్ట అనండి, లేదా మరేమైనా అనండి, తగ్గడానికి మొండికేసే ఈ పొట్ట వద్ద కొవ్వు, బరువు తగ్గలనుకునే మన లక్ష్యానికి భారీ సవాలు విసురుతోంది. అయితే, మీ కొరకు మేము ఒక శుభవార్త మోసుకొచ్చాము!

నిజానికి,పొట్ట వద్ద పేరుకున్న కొవ్వు కోల్పోవడానికి, సమతుల ఆహారం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు తగినంత సమయం నిద్రపోవడం మాత్రమే అవసరం. అంతే! నిశ్చలంగా ఉండే మీ జీవనశైలిని తుంగలో తొక్కి, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకుంటే, బల్లపరుపుగా మరియు బిగుతుగా ఉండే , పొట్ట మీ సొంతమవుతుంది. మీ ఆరోగ్యకరమైన జీవనశైలికి, మీ పొట్ట ఒక సంకేతం.

5 Best Exercises To Burn Belly Fat

తీరైన ​​దేహం మీకు గర్వకారణమే కాక మిమ్మల్ని ధృఢంగా తయారు చేసి తక్కువగా గాయపడేటట్టు చేస్తుంది. ఎందుకంటే, మీ భుజాలు మరియు తుంటి భాగం మధ్యలో ఉండే ప్రతి కండరం, వ్యాయామం మూలంగా లభించే కదలికలలో పాల్గొంటుంది.

కండరాలకు సరైన కదలికలు కలిగించే వ్యాయామాలు చేస్తే, నాజూకైన మరియు దృఢమైన నడుమును మీ సొంతం చేరుకోవచ్చు. ఈ వ్యాసం ద్వారా మీ ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి మార్గాన్ని సులభతరం చేసే ఐదు రకాల వ్యాయామాలను మేము తెలియజేస్తున్నాం. ఈ వ్యాయామాలు ద్వారా భుజం మరియు నడుము మధ్య ఉండే కండరాలు ఉక్కులా తయారవడంతో పాటు, మీ జీవక్రియ కూడా మెరుగుపడుతుంది.స్

1. బర్పి- వీలైనంత ఎక్కువ కండరాలు ఈ వ్యాయామం వలన ప్రభావితం కావడం చేత మీ పొట్ట వద్ద కొవ్వును కోల్పోతారు. బర్పి ఆ పనిని సమర్ధవంతంగా చేస్తుంది. ముందుగాక్ ఒక పుష్ అప్ చేసి, తరువాత జంప్ చేసి, మళ్ళీ మొదటి భంగిమలోకి తిరిగి వెళ్ళడం వలన మీ శరీరం లో ప్రతి కండరం ప్రభావితం అవుతుంది.

ఎలా ప్రారంభించాలి: ముందుగా పుష్ అప్ భంగిమతో మొదలుపెట్టి, ఒక పుష్ అప్ చేసాక, త్వరగా వ్యతిరేక దిశలోకి మారి జంప్ చేసి నిలబడాలి. ఇలా చేస్తే ఒక పర్యాయం పూర్తైనట్లు!

2. పర్వతారోహణ వ్యాయామం ( మౌంటెన్ క్లయింబర్) - దీనిని మూవింగ్ ప్లాంక్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాయామంలో కష్టతరమైన అంశం ఏమిటంటే, మీరు నేల మీది నుండి కాలు పైకెత్తిన ప్రతిసారీ, మీ శరీరం స్థిరంగా మరియు నేరుగా ఉంచడానికి ప్రతి కండరము పనిచేస్తుంది.

మీరు విరామం తీసుకుంటూ కూడా దీన్ని చేయవచ్చు. ముందుగా మీరు 20 నిమిషాలు తరబడి , ఎన్ని సార్లు చేయగలరో, అన్నిసార్లు చేయండి. తరువాత 10 నిమిషాలు విరామం తీసుకుని, మరలా నిముషాల పాటు పునరావృతం చేయండి. ఈ విధంగా చేస్తే, ఇది మీ హృదయ స్పందన వేగం పెరిగి, కేలరీలు కరిగిపోతాయి.

ఎలా చేయాలి? : మీ భుజాలు కిందుగా చేతులను పుష్ అప్ భంగిమలో ఉంచి, శరీరం ఒక సరళ రేఖలో ఉండేలా పెట్టండి. ఈ భంగిమ నుండి, మీ కుడి పాదం నేల నుండి పైకి ఎత్తి, కుడి మోకాలును మరియు ఛాతీ వైపుగా తీసుకుని రండి. తిరిగి పాదముతో నేలను మొదటి భంగిమలోకి రండి. ఇలా పలుమార్లు కాలనీ మారుస్తూ పునరావృతం చేయండి.

3. కెటిల్ బెల్ స్వింగ్- ఇది కేలరీలను కరిగించే అత్యుత్తమమైన వ్యాయామాలలో ఒకటి. ఒక భారీ ఇనుప బంతికి కదిలించడం ద్వారా, మీ శరీరంలోని కొవ్వును త్వరగా కరిగించడానికి, గ్లూట్స్, హిప్స్ మరియు క్వాడ్లు వంటి కండరాలను ఉపయోగించి ఈ వ్యాయామం చేస్తాము. దీని ఫలితంగా, మీ హృదయ స్పందన వేగం విపరీతంగా పెరుగుతుంది.

శాస్త్రీయంగా చెప్పాలంటే, బెల్ ను పై భాగానికి తీసుకుని వచ్చినప్పుడు, అది మిమ్మల్ని ముందుకు లాగడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మీ ఉదర కాండరాలు, నిలుచుని ప్లాంక్ చేస్తున్న తీరుగా మలచబడతాయి.

ఎలా చేయాలి? : ఒక కెటిల్ బెల్ ని పట్టుకుని నిల్చొని ఉండండి. తరువాత, కొంచెం ముందుకు వంగి మీ కాళ్ళ మధ్యగా కెటిల్ బెల్ ని ఊపండి. తరువాత, మీ గ్లూట్స్ బిగబట్టి, తుంటిని ముందుకు నెడుతూ కెటిల్ బెల్ ని భుజం ఎత్తు తిరిగి తీసుకురండి.

4. మెడిసిన్ బాల్ స్లామ్- మెడ్ బాల్ స్లామ్ వంటి తీవ్రమైన కదలికలను కలిగించే వ్యాయమం చేయడానికి,మీ మెడ కండరాల నుండి మీ కటి వద్ద ఉండే కండరాల వరకు అన్ని కలిసి పని చేయవలసి ఉంటుంది. మీరు బంతిని ఎంత ఎక్కువ శక్తిని ఉపయోగించి విసిరితే, మీ గుండె కొట్టుకునే వేగం అంత పెరిగి, మీ పొట్ట వద్ద పేరుకున్న మొండి కొవ్వు కరుగుతుంది.

మీ తల మీదుగా బంతిని పట్టుకొని, బలంగా నేలపై విసిరి కొట్టి తిరిగి పెట్టుకోండి. ఇలా పలుమార్లు పునరావృతం చేయండి.

5. డంబ్ బెల్ ఓవర్ హెడ్ లూంజ్- మీ తలపై మీదుగా ఒక డంబ్ బెల్ పట్టుకుని ఉండండి. అకస్మాత్తుగా దానిని కిందికి తీసుకుని వచ్చినప్పుడు , మీ మొండెం భాగంలో ఉన్న కాండరాలన్నీ ఆ బరువును భరించాలి కనుక, ప్రతి కాండరంలో కదలిక కలుగుతుంది. అనిపిస్తుంది. లోడ్ ప్రతి ప్రతినిధి మారుతుండటంతో, బరువు మీ కండరాలు కలిసి పనిచేయాలి, తద్వారా మీ బరువు నేరుగా పైన ఉంటుంది. ఇలా పలుమార్లు బరువును పైకి ఎత్తుతున్నప్పుడు, మీ వీపు మరియు నడుము భాగంలో ఉండే కండరాలు కూడా వ్యాయామంలో పాల్గొంటాయి. భుజాలలో చురుకైన కదలికలు లేకపోవడం మరియు గ్లూట్స్ బలహీనంగా ఉండటం వలన కూడా పొట్ట వద్ద కొవ్వు పెరుకుపోతుంది.

ఎలా చేయాలి?: మధ్యస్థమైన / తక్కువగా బరువు బరువు ఉన్న ఒక డంబ్ బెల్స్ జత అవసరం. మీ తల మీదుగా వాటిని తీసుకుని వెళ్ళండి. ఒక అడుగు ముందుకు వేస్తూ, అకస్మాత్తుగా డంబ్ బెల్ ను కదలించండి. కొంతసేపు ఆ భంగిమలో నిలిచి ఉండి, కాలిని ముందుకు కదపండి. ఇలా ఒక్కోసారి ఒక్కో కాలును ఉపయోగిస్తూ, ముందుకు కదులుతూ, వ్యాయామాన్ని పునరావృతం చేయండి.

English summary

5 Best Exercises To Burn Belly Fat

That area in between your pecs and lower half-be it gut, beer belly, love handles, or whatever else you call it-is the most stubborn and resistant to weight loss. However, we've got good news for you! Losing belly fat is actually all about clean, balanced eating, consistent workouts, and regular, restorative sleep. That's all! Dump that sedentary lifestyle that you're leading right now and brace a disciplined one to soon get a flat, firm belly-the outward sign which shows that you keep fit and watch what you eat.
Story first published: Tuesday, July 17, 2018, 7:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more