పొట్ట చుట్టూ అధిక కొవ్వు సమస్యలా? ఈ ఆహారపదార్థాలు ప్రయత్నించి వెంటనే అధికపొట్టను తగ్గించుకోండి

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఇటీవలి అధ్యయనంలో ప్రపంచ జనాభాలో కొత్త సంవత్సరం రిజల్యూషన్లలో బరువు తగ్గడం, ఆరోగ్యకరమైన ఆహరం తినడం పైస్థానంలో నిలిచాయి. కనీసం 21% మంది వీటినే కోరుకుంటున్నారు. ఆశ్చర్యకరంగా ఉంది కదూ? నిజానికి కాదు.

గత కొన్ని సంవత్సరాలుగా, కొత్తరకపు అనారోగ్యాలు, జీవనవిధాన వ్యాధులు మరియు తక్కువ జీవనకాల ప్రమాణం, వీటివల్ల అందరూ ఆరోగ్యంగా తినటం, వ్యాయామం ప్రాముఖ్యత అర్థం చేసుకుంటున్నారు.

స్త్రీ పురుషులిద్దరిలో ఈ ఫిట్ నెస్ పిచ్చి ఒత్తిడికి దారితీస్తోంది. పురుషులు కండలుదిరిగి, సిక్స్ పాక్ పొందాలని భావిస్తుంటే, స్త్రీలు ఆరోగ్యకరంగా, యాక్టివ్ గా ముఖ్యంగా పొట్ట కొవ్వులేకుండా ఉండాలని కోరుకుంటున్నారు.

అధికపొట్ట అనేక కారణాల వలన వస్తుంది. అది హార్మోనల్ మార్పుల వల్ల, సోమరి జీవనవిధానం, కొవ్వు పదార్థాలను ఎక్కువ తినడం లేదా జన్యుపరంగా కూడా రావచ్చు.

బానపొట్టను తగ్గించుకోటానికి అనేక మార్గాలున్నాయి. అందులో మేటిది సహజంగా కొవ్వును కరిగించే పదార్థాలున్న డైట్ ను పాటించడం. అసలు విషయం ఏంటంటే తక్కువ కేలరీలున్న ఆహారం తినడం. ఇదే శరీరం శక్తి కోసం కొవ్వును కరిగించేలా చేస్తుంది.

పొట్ట చుట్టూ కొవ్వును తొందరగా కరిగించటానికి సాయపడే, మీరు ఆశ్చర్యపోయేలా 10 మేటి ఆహారపదార్థాలు మీ కోసం,ఇవిగో.

1.పప్పులు

1.పప్పులు

పప్పులలో తక్కువ కేలరీలు ఉండి, అమినో ఆసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ శక్తిస్థాయిని తగ్గకుండా చేసి, అదే సమయంలో మీరు తీసుకునే కేలరీలను నియంత్రిస్తాయి. దీనివల్ల శరీరం ఎక్కువ కొవ్వును సులభంగా కరిగిస్తుంది.

2.గుడ్లు

2.గుడ్లు

ఆశ్చర్యకరంగా, కడుపు చుట్టూ కొవ్వుకి గుడ్లను కూడా నిందిస్తారు. కానీ గుడ్లలో ఉండే ప్రత్యేకమైన అమినో యాసిడ్ ల్యూసిన్ పొట్టలో కొవ్వును తగ్గించటానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

3.అవకాడోలు

3.అవకాడోలు

అధిక కొవ్వు ఉంటుందని నిరాకరింపబడే మరో పదార్థం అవకాడో.కానీ ఇది కూడా కొవ్వును కరిగిస్తుంది. అవకాడోలో ఉండే పీచుపదార్థం మరియు మోనోసాట్యురేటడ్ ఫ్యాటీ యాసిడ్లు మీకు ఎక్కువసేపు కడుపు నిండి ఉండేట్లుగా చేసి, అనారోగ్యకరమైన ఆహారం మిమ్మల్ని తినకుండా చేస్తాయి. ఎందుకంటే జంక్ ఫుడ్ యే పొట్ట కొవ్వుకి ముఖ్య కారణం.

4.ఓట్’స్

4.ఓట్’స్

ఓట్లకి అనేక లాభాలున్నాయి. వీటిల్లో పీచు ఎక్కువగా ఉండి ఇవి ఆకలి కలగకుండా చేస్తాయి, మరియు కొవ్వు తక్కువగా ఉండి, వండటం కూడా చిటికెలో అయిపోతుంది. ఇంకా దీన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చటానికి ఓట్లపై తాజా పళ్ళు మరియు నట్లు వేసుకోవడం వలన ఏ మాత్రం అలసట లేకుండా పూర్తి పోషణ లభించేలా చేస్తుంది.

5.ఆకు కూరలు

5.ఆకు కూరలు

ఆకుకూరలలోని యాంటీఆక్సిడెంట్ శక్తులు మీ ఆరోగ్యాన్ని దీర్ఘకాలంలో కూడా కాపాడటంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. వీటిల్లో ఉండే పీచుపదార్థం పొట్ట చుట్టూ కొవ్వును నేరుగా తగ్గిస్తుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను కూడా శుభ్రపరిచి,మొత్తంమీద బరువును అదుపులో ఉంచుతాయి.

6.ఆస్పరాగస్

6.ఆస్పరాగస్

ఆస్పరాగస్ లో లైకోపీన్ మరియు విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ మరియు ప్రొటీన్ కూడా ఎక్కువగా ఉండి పొట్ట చుట్టూ కొవ్వును సమర్థవంతంగా పోగొడుతుంది మరియు గుండెకి కూడా చాలా మంచిది.

7.కినోవా

7.కినోవా

ఆరోగ్యం పిచ్చి ఉన్నవాళ్ళలో ఇది ఆల్రెడీ చాలా ఫేమస్. రాబోయే కాలం సూపర్ ఫుడ్ అయిన కినోవాలో మరొక కలికితురాయి. పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించటంలో ఇది చాలా ఉత్తమమైనది.

8.గ్రీన్ టీ

8.గ్రీన్ టీ

గ్రీన్ టీలో శరీరంలో కొవ్వుకణాలను విభజించమనే సిగ్నల్ పంపే శక్తి ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామంతో పాటు గ్రీన్ టీ తాగటం మీ మొండి పొట్ట కొవ్వును వదిలించుకోటానికి మేటి మార్గం.

9.ఆరోగ్యకరమైన నూనెలు

9.ఆరోగ్యకరమైన నూనెలు

కొబ్బరి మరియు ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ నూనె వంటి ఆరోగ్యకరమైన నూనెలు నిజానికి కొవ్వును కరిగించటంలో సాయపడతాయి. వీటిల్లో వుండే అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు మీకు ఎక్కువసేపు ఆకలి కలగనివ్వకుండా చూసి మెటబాలిజం పెంచుతాయి.

10.డార్క్ చాక్లెట్

10.డార్క్ చాక్లెట్

ఈ లిస్టులో అన్నిటికన్నా మేటిది, ఇప్పటికే చాక్లెట్ ప్రియులందరి నోరూరుతోంది కదూ! డార్క్ చాక్లెట్లో ఉండే చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పొట్ట చుట్టూ పేరుకున్న అధిక కొవ్వును కరిగించటంలో సాయపడతాయి. మీ కడుపు నిండుగా కూడా ఉంచి ఆకలిని దూరం చేస్తుంది.

English summary

Belly Fat Woes? Try These Foods That Instantly Burn Belly Fat

There are many reasons on why fat accumulates around your belly. But you can get rid of it by eating certain foods, like pulses, eggs, avocados, oats, and green tea. These low-calorie high-fibre foods keep you full for longer, speeding up your metabolism, and getting rid of your belly fat.
Subscribe Newsletter