డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఈ 11 రకాల ఆహార పదార్థాలను తినకూడదు !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

డయాబెటిస్తో బాధపడుతున్నవారికి ఎవరికైనా, అది ఉందని నిర్ధారించబడటమే ఒక ముఖ్యమైన విషయముగా ఉంటుంది. డయాబెటిస్ గూర్చి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పలు అవగాహన కార్యక్రమాలు ఉన్నప్పటికీ, ఇప్పటికీ దీనిని చాలా తేలికగా తీసుకుంటారు. ఇది నేటి తరంలో మానవజాతి ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ అనారోగ్యాలలో ఒకటి.

డయాబెటిస్ అంటే ఏమిటి?

డయాబెటిస్ అనేది రక్తంలో చక్కెర (లేదా) గ్లూకోజ్ స్థాయిలను అధికంగా కలిగి ఉన్నప్పుడు సంభవించే శారీరక అనారోగ్యం. ఒక మనిషికి కావలసిన శక్తి వారు తీసుకునే ఆహారం నుంచి పొందిన గ్లూకోజ్ స్థాయిలను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్యాంక్రిస్ అని పిలవబడే ఒక హార్మోను, ఆహారం ద్వారా శరీరం చేత గ్రహించబడిన గ్లూకోజ్ను ప్రాసెస్ చేశాక దాన్ని శరీర కణాలకు చేర్చే బాధ్యతలో సహాయపడతాయి. ఇప్పుడు ఆ గ్లూకోజ్నే శక్తిగా వినియోగించబడుతుంది.

Here-Are-11-Foods-That-Diabetics-Should-Avoid

డయాబెటిక్ రోగిలో, ఇన్సులిన్ తగినంత స్థాయిలో ఉత్పత్తి చేయబడదు. అటువంటి సందర్భాలలో, గ్లూకోజ్ రక్తంలోనే ఉండిపోవడం వల్ల, శరీర కణాలను చేరుకోలేదు. ఇలా రక్తంలో అధిక చక్కెర (లేదా) గ్లూకోజ్లను కలిగి ఉండటం వల్ల చిన్నవైన & తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మధుమేహం కోసం ప్రత్యేకమైన చికిత్స పద్ధతులు లేనప్పటికీ దీనిని మందుల ద్వారా, వ్యాయామము ద్వారా, సముచితమైన డైట్ను పాటించడం ద్వారా నియంత్రించవచ్చు.

డయాబెటిస్లో రకాలు:

మధుమేహంలో 3 రకాలు ఉన్నాయి: అవి,

• మొదటి రకం మధుమేహంలో,

శరీరానికి అవసరమైన ఇన్సులిన్ను ఉత్పత్తి చేయలేదు. శరీర రోగనిరోధక వ్యవస్థ ప్యాంక్రియాస్లోని కణాలను నిస్తేజం చేయడం వల్ల ఇది సంభవిస్తుంది. అటువంటి రోగులలో వీటిని సజీవంగా ఉంచడానికి రోజువారీ ఇన్సులిన్ను తీసుకోవలసి ఉంటుంది.

• రెండవ రకం మధుమేహంలో,

శరీరం అవసరమైన పద్ధతిలో ఇన్సులిన్ తయారు చేయకపోయినా (లేదా) ఇన్సులిన్ను ఉపయోగించడం సాధ్యం కాకపోవచ్చు. ఇది అత్యంత సాధారణమైన మధుమేహం రూపంగా ఉంటుంది.

• గర్భస్థ మధుమేహం అనేది మూడవరకము, ఇది కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో సంభవిస్తుంది. ఇలాంటి వారు తమ శిశువుకు జన్మనిచ్చిన తర్వాత ఈ మధుమేహం ఎక్కువ సమయం ఉండదు. ఏదేమైనప్పటికీ, కొన్ని సందర్భాల్లో, ఇది రెండవ రకమైన మధుమేహం రూపంలో మహిళల జీవితంలోకి సంభవిస్తుంది.

డయాబెటిస్తో బాధపడేవారిలో తలెత్తే ఆరోగ్య సమస్యలు:

గుండె సంబంధిత సమస్యలు,

మూత్రపిండాల వ్యాధులు,

స్ట్రోక్, కంటి సమస్యలు,

దంత వ్యాధులు,

నరాలకు నష్టం వాటిల్లడం,

పాదాల సమస్యలు వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు డయాబెటిస్ కారణమవుతోంది.

డయాబెటిక్ కోసం పాటించవలసిన డైట్ :

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అవసరమయ్యే మందులను ఉపయోగించటం వల్ల డయాబెటిస్ సమస్య నుంచి పూర్తిగా బయట పడాలేమనే నిజాన్ని మనమందరం గ్రహించాలి. ఈ డయాబెటిక్ సమస్యతో బాధపడే వారు కచితంగా డయాబెటిక్ ఫ్రెండ్లీ డైట్ను పాటించాలి. పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తోంది. డయాబెటిక్ రోగులు పిండిపదార్థాలు ఎక్కువగా వున్న కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం చాలా మంచిది.

1. పాస్తా, రైస్ & వైట్ బ్రెడ్ :

1. పాస్తా, రైస్ & వైట్ బ్రెడ్ :

వీటిని ప్రాసెస్ చేసి అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఇవి అధికమైన పిండి పదార్థాలను & తక్కువ ఫైబర్లను కలిగి ఉంటాయి. బాగా శుద్ధిచేసిన పిండి పదార్ధాలను తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచగలదని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

2. చక్కెరను కలిగిన పానీయాలు :

2. చక్కెరను కలిగిన పానీయాలు :

ఈ పానీయాలను అస్సలు తీసుకోకూడదు. వీటిలో పిండి పదార్ధాలు అధికంగా ఉండటమే కాకుండా, ఇన్సులిన్ నిరోధకతతో సంబంధం కలిగి ఉన్న ఫ్రూక్టోజ్లను కూడా కలిగి ఉంటుంది.

3. ట్రాన్స్ ఫ్యాట్స్ :

3. ట్రాన్స్ ఫ్యాట్స్ :

పీనట్ బట్టర్, క్రీమర్లు, స్ప్రెడ్లు, మఫిన్లు, క్రాకర్లు & వివిధ రకాలుగా కాల్చిన ఉత్పత్తుల్లోని ఆహారాలు అధికమైన క్రొవ్వులను కలిగి ఉంటాయి. అవి శరీర వాపులను పెంచి & ఇన్సులిన్ నిరోధకతతో సంబంధమును కలిగి ఉంటాయి.

4. అల్పాహార ధాన్యాలు :

4. అల్పాహార ధాన్యాలు :

ఎక్కువగా ప్రాసెస్ చేయబడే వాటిలో తృణధాన్యాలు ఎక్కువగా ఉంటాయి, ఇవి చాలా ఎక్కువ మోతాదులో పిండి పదార్థాలను కలిగి ఉంటాయి. ఇవి డయాబెటిక్ రోగులకు మంచి అల్పాహారము మాత్రం కాదు.

5. అధిక రుచిని కలిగిన కాఫీలు :

5. అధిక రుచిని కలిగిన కాఫీలు :

అధిక పిండి పదార్థాలు ఉన్నట్లు తెలిసిన ఆహారాలను, మీ డయాబెటిక్ డైట్ జాబితా నుంచి తీసివేయండి. ఎందుకంటే, ఇది ఆరోగ్యకరమైన పానీయం కాదు. ఇది మీ బరువును పెంచుతుంది, కానీ డయాబెటిస్ ఉన్న వారు ఎవరైనా సరే వారి శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. అధిక రుచిని కలిగిన కాఫీల కన్నా, ప్లైన్ కాఫీని తీసుకోవడం చాలా ఉత్తమం.

6. డ్రై ఫ్రూట్స్ :

6. డ్రై ఫ్రూట్స్ :

పండ్లు మంచి పోషకాలను కలిగివున్నప్పటికీ, డ్రై ఫ్రూట్స్ డయాబెటిక్ రోగులకు మంచిగా ఉపయోగపడవు. పండ్లను బాగా ఎండబెట్టినప్పుడు, వాటిలో ఉండే నీటిని కోల్పోయి - ఒకే చోట పోషకాలన్ని కేంద్రీకృతమవుతాయి, అలాగే వాటిలో ఉండే చక్కెర పదార్ధాలన్ని ఒకే చోట కేంద్రీకృతంకావచ్చు.

7. సహజసిద్ధమైన చక్కెరను కలిగిన తేనె :

7. సహజసిద్ధమైన చక్కెరను కలిగిన తేనె :

తెల్లగా ఉన్న చక్కెరకు బదులుగా, చాలా ఎక్కువగా ప్రాసెస్ చేయకపోయని తేనెను వినియోగించడాన్ని కొనసాగించినట్లయితే, దానిలో ఉండే పిండి పదార్థాలు కూడా మధుమేహ రోగులకు హానిని చేయగలదు.

8. ప్యాక్ చేయబడిన స్నాక్స్ :

8. ప్యాక్ చేయబడిన స్నాక్స్ :

ఎక్కువగా శుద్ధి చేసిన పిండిని ఉపయోగించి చేసిన క్రాకర్స్ అనేవి ఖచ్చితంగా ఒక డయాబెటిక్ రోగులకు మంచి ఛాయిస్ కాదు. ఇది పోషకాలను తక్కువగా కలిగి ఉండి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

9. ఫ్రెంచ్ ఫ్రైస్ :

9. ఫ్రెంచ్ ఫ్రైస్ :

నోరూరించే రుచికరమైన స్నాక్స్లో ఇది ఒకటి, అలాగే అనారోగ్యాన్ని కలుగజేసే దానిలో కూడా ఇది ఒకటి. వీటిని బంగాళాదుంపలతో తయారుచేస్తారు, వీటిలో పిండి పదార్ధాలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఫ్రెంచ్ ఫ్రైస్ను బాగా నూనెలో వేయించినవి, ఇది శారీరక వాపులను ప్రోత్సహిస్తుంది.

10. పండ్ల రసాలు :

10. పండ్ల రసాలు :

ఇవి ఒక ఆరోగ్యకరమైన పానీయంగా ఉండటంతో, డయాబెటిక్ ఉన్న వారు దీనిని ఉపయోగించడం వలన కలిగే ఫలితాలు చక్కెర పానీయాలతో సమానంగా ఉంటాయి. పండ్ల రసాలలో చక్కెర, పిండి పదార్థాలు చాలా అధికంగా ఉంటాయి. పండ్ల రసాలు కూడా ఫ్రూక్టోజ్తో పూర్తిగా నిండి ఉంటాయి.

11. ఫ్రూట్-ఫ్లేవర్డ్స్ను కలిగి ఉన్న పెరుగు :

11. ఫ్రూట్-ఫ్లేవర్డ్స్ను కలిగి ఉన్న పెరుగు :

మామూలు పెరుగు ఫ్రూట్-ఫ్లేవర్డ్స్ను కలిగి ఉన్న పెరుగును కలిగి ఉన్న వాటి కంటే చాలా మంచి ఛాయిస్. ఫ్లేవర్డ్స్ను కలిగి ఉన్న పెరుగును, తక్కువ కొవ్వును కలిగిన పాలతో తయారు చేస్తారు, అలాగే ఇవి చక్కెరను, పిండి పదార్థాలను అధికంగా కలిగి ఉంటాయి.

English summary

Here-Are-11-Foods-That-Diabetics-Should-Avoid

You need to be careful about the food and drinks you consume if you are a diabetic. Diabetics are highly prone to various ailments like heart diseases, stroke, kidney diseases, etc. It has been advised that they should avoid foods which are high in carbs, sugar, trans fats, natural sugars along with french fries, fruit-flavoured yogurt, and packaged snacks.