For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెల్లీ ఫ్యాట్ ను తగ్గించేందుకు ఉపయోగపడే 7 అద్భుతమైన ఇంగ్రిడియెంట్స్ ఇవే

|

బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. బెల్లీ ఫ్యాట్ అనేది ఫిజికల్ అపియరెన్స్ ను దెబ్బతీస్తుంది. ఆలాగే, ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం చూపుతుంది. పొత్తికడుపు చుట్టూ పేరుకోబడిన కొవ్వుని విసెరల్ ఫ్యాట్ అనంటారు. దీని వలన డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలు కొన్ని తలెత్తే ప్రమాదం ఉంది. అందువలన, ఈ విషయాన్ని ఇగ్నోర్ చేయడం మంచిది కాదు.

కాబట్టి, డైట్ లో కొన్నిమార్పులు చేర్పులు చేసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వాటితో పాటు, ఈ హోమ్ రెమెడీస్ ను పాటించడం ద్వారా బెల్లీ చుట్టూ పేరుకుపోయిన అదనపు కొవ్వును తొలగించుకోవడం సులభమవుతుంది. లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులను చేసుకోవడం ద్వారా కూడా బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు.

Heres How These 7 Ingredients Exactly Cut Your Belly Fat

మీ కిచెన్ క్యాబినెట్ లో లభ్యమయ్యే ఈ 7 సమర్థవంతమైన ఇంగ్రిడియెంట్స్ ద్వారా పొత్తికడుపు చుట్టూ పేరుకోబడిన కొవ్వును మీరు సులభంగా తగ్గించుకోగలుగుతారు.

1. వెచ్చటి నిమ్మరసం:

1. వెచ్చటి నిమ్మరసం:

రోజు ప్రారంభంలో ఒక గ్లాసుడు వెచ్చటి నీటిలో అర చెక్క నిమ్మ రసాన్ని కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది. అలాగే, ఈ నీటిలో కాస్తంత తేనెను కలిపితే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి ఇదొక ఉత్తమమైన పద్దతి.

ఎలా పనిచేస్తుంది:

నిమ్మకాయ అనేది డిటాక్సిఫికేషన్ ప్రక్రియకు అమితంగా తోడ్పడుతుంది. లివర్ ని డిటాక్సిఫై చేయడం ద్వారా ఫ్యాట్ ను త్వరగా కరిగించడానికి తోడ్పడుతుంది. ఫ్యాట్ ను మెటాబాలైజ్ చేయడం వలన పొత్తికడుపులో ఫ్యాట్ అనేది పేరుకుని ఉండదు. వెచ్చటి నీరు మెటాబాలిజం ను బూస్ట్ చేస్తుంది. తద్వారా, వ్యవస్థను శుభ్రపరుస్తుంది.

2. వెల్లుల్లి:

2. వెల్లుల్లి:

ఒబెసిటీపై పోరాడే సామర్థ్యం వెల్లుల్లిలో కలదు. వివిధ అధ్యయనాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. శరీరంలోని కొవ్వును పేరుకోనివ్వకుండా నియంత్రించే గుణం వెల్లుల్లిలో కలదు. అలాగే, శరీరంలోని బ్లడ్ సర్క్యూలేషన్ ని పెంపొందించేందుకు వెల్లుల్లి తోడ్పడుతుంది. రోజూ రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను నమలడం ప్రారంభిస్తే పొత్తికడుపు చుట్టూ పేరుకుపోయిన కొవ్వులో తగ్గుదలను మీరు తొందరగానే గమనించే ఆస్కారం ఉంది. వివిధ సలాడ్స్ లో తాజా వెల్లుల్లి పేస్ట్ ను వేసుకుని తీసుకున్నా కూడా ఫలితం ఉంటుంది.

ఎలా పనిచేస్తుంది:

గార్లిక్ లో డైజెస్టివ్ అలాగే ప్యూరిఫయింగ్ ప్రాపర్టీలు కలవు. ఇవి టాక్సిన్స్ ను తొలగించి కొలోన్ అలాగే లివర్ పనితీరును మెరుగుపరిచేందుకు తోడ్పడతాయి. అలిసిన్ అనే కాంపౌండ్ వెల్లుల్లిలో లభిస్తుంది. ఇది కొలెస్టరాల్ లెవెల్స్ ని తగ్గించేందుకు తోడ్పడుతుంది. వెల్లుల్లిలోనున్న యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు ఉబ్బిన టిష్యూలలో పేరుకున్న అదనపు ఫ్లూయిడ్ ను తొలగించేందుకు తోడ్పడతాయి. అంతేకాక, ఇది ఆకలిని తగ్గించేందుకు తోడ్పడుతుంది. అందువలన, కేలరీలను తీసుకోవడం తగ్గుతుంది.

3.అల్లం:

3.అల్లం:

అల్లంలో అద్భుతమైన ఔషధ గుణాలున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే, దీని గురించి ఎక్కువగా ప్రాచుర్యం లేని విషయం ఏంటంటే ఇది వెయిట్ లాస్ కి అమితంగా తోడ్పడుతుంది. అల్లం టీను తీసుకోవడం ద్వారా వెయిట్ లాస్ జరుగుతుంది. తద్వారా, బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఒక కప్పుడు నీటిని మరిగించి అందులో కొన్ని అల్లం ముక్కలను వేయండి. ఇప్పుడు అల్లం ముక్కలను పదినిమిషాల పాటు ఆ నీటిలో నాననివ్వండి. ఆ తరువాత వడగట్టి కొంత తేనెను జోడించండి. లేదా కొంత నిమ్మరసాన్ని జోడించి ఈ టీను తీసుకోండి.

ఎలా పనిచేస్తుంది:

అల్లం శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అందువలన, కొవ్వు కరగడానికి తోడ్పడుతుంది. అల్లం టీను మీల్స్ మధ్యలో రోజుకు మూడు సార్లు తీసుకుంటే మెటబాలిజం బూస్ట్ అవడం ద్వారా బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. దీని వలన కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా, కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. ఇది శరీరంలోని స్ట్రెస్ హార్మోన్ ను తగ్గిస్తుంది. స్ట్రెస్ హార్మోన్ వలన కూడా శరీర బరువు పెరగడం అలాగే బెల్లీ ఫ్యాట్ పేర్కొనడం జరుగుతుంది. స్ట్రెస్ హార్మోన్ ని తగ్గించడం ద్వారా బెల్లీ ఫ్యాట్ సమస్య వేధించదు.

4. గ్రీన్ టీ:

4. గ్రీన్ టీ:

గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే, దీనిని మోడరేట్ గా అంటే రోజుకు రెండు లేదా మూడు కప్పులను తీసుకుంటే అద్భుతాలను మీరు గమనించవచ్చు. గ్రీన్ టీ బ్యాగ్ ను ఒక కప్పుడు హాట్ వాటర్ లో అయిదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు స్టీప్ చేయండి. ఇందులో రెండు లేదా మూడు మింట్ లీవ్స్ ను కూడా జోడిస్తే అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. తేనెను కలపడం ద్వారా ఈ టీలో తీపిని జోడించవచ్చు. మీల్స్ కు ముందు గ్రీన్ టీ ను తీసుకోండి.

ఎలా పనిచేస్తుంది:

గ్రీన్ టీ మెటబాలిజాన్ని బూస్ట్ చేస్తుంది. తద్వారా ఫ్యాట్ ను బర్న్ చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఈ గ్రీన్ టీను తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది. కేట్ చిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో లభిస్తాయి. ఇవి వెయిట్ లాస్ కి తోడ్పడతాయి.

5. ఆపిల్ సిడర్ వినేగార్:

5. ఆపిల్ సిడర్ వినేగార్:

ఫుడ్ కి ఫ్లేవర్ ని జోడించడంతో పాటు బెల్లీ ఫ్యాట్ ను కరిగించేందుకు ఆపిల్ సిడర్ వినేగార్ అద్భుతంగా తోడ్పడుతుంది. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సిడర్ వినేగార్ ను ఒక గ్లాసుడు వెచ్చటి నీటిలో కలిపి మీల్స్ కి ముందు తీసుకోండి.

ఎలా పనిచేస్తుంది:

మీ ఆకలిని ఇది తగ్గిస్తుంది. ఎక్కువ సేపు ఆకలి కలగకుండా చూస్తుంది. జపాన్ కి చెందిన ఒక సైంటిఫిక్ ట్రయల్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సిడర్ వినేగార్ ను ఆహారంలో జోడించడం ద్వారా వెయిట్ లాస్ కి తోడ్పడుతుందని అలాగే శరీరంలోని ఫ్యాట్ పెర్సెంటేజ్ తగ్గుతుందని తెలుస్తోంది. అందువలన, బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం సులభం.

6. అలోవెరా జ్యూస్:

6. అలోవెరా జ్యూస్:

బెల్లీ ఫ్యాట్ ను త్వరగా తగ్గించుకోవాలనుకుంటే అలోవెరా జ్యూస్ ను ప్రిఫర్మొ చేయండి. అయితే, ఇది లాక్సేటివ్ గా పనిచేస్తుందని గుర్తుంచుకుని దీనిని మితంగా తీసుకోండి. రెండు టేబుల్స్ స్పూన్ల అలోవెరా జ్యూస్ లో ఒక టీస్పూన్ జీలకర్ర పొడిని కలిపి, ఈ మిశ్రమాన్ని అరగ్లాసుడు వెచ్చటి నీటిలో జోడించండి. ఈ పానీయాన్ని ప్రతి రోజూ ఉదయాన్నే తీసుకోండి.

ఎలా పనిచేస్తుంది:

అలోవెరాలో స్టెరాల్స్ లభిస్తాయి. ఇవి పొత్తికడుపు వద్ద కొవ్వును తగ్గించేందుకు తోడ్పడతాయి. ఇది నేచరుల్ గా లాక్సేటివ్ కాబట్టి డైజెషన్ ని మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది. పెద్ద ప్రేగు పనితీరు కూడా మెరుగుపడుతుంది. అందువలన, జీర్ణకోశము కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

7. కొబ్బరినూనె:

7. కొబ్బరినూనె:

బెల్లీ ఫ్యాట్ ను కరిగించేందుకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను వాడటం మంచిది. అంతకంటే ఎక్కువ వాడితే ఆరోగ్యంపై దుష్ప్రభావం కలిగే ప్రమాదం ఉంది.

ఎలా పనిచేస్తుంది:

కొబ్బరినూనెలో నుండే ఫ్యాటీ యాసిడ్స్ మెటబాలిజాన్ని బూస్ట్ చేయడం ద్వారా బెల్లీ ఫ్యాట్ ను కరిగించేందుకు అమితంగా తోడ్పడతాయి. ఈ నూనెలో లభించే ఫ్యాట్స్ అనేవి ఎనర్జీకి సోర్స్ గా పనిచేస్తాయి. ఇంకా, థెర్మోజెనిక్ గా పనిచేసి శరీరంలోని ఫ్యాట్ ను త్వరగా కరిగిస్తాయి.

ఈ రెమెడీస్ తో పాటు ఆరోగ్యకరమైన లైఫ్ స్టయిల్ ను పాటించి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే వెయిట్ ను ఆరోగ్యకరంగా తగ్గించుకోవచ్చు.

English summary

Here's How These 7 Ingredients Exactly Cut Your Belly Fat

Shedding belly fat is not an easy thing to do; what makes the abdominal fat an issue is that it is capable of causing various diseases ranging from cancer, diabetes, heart ailments and so on. Including these 7 ingredients can help you shed belly fat naturally: warm lemon water, garlic, ginger, green tea, apple cider vinegar, aloe vera juice and coconut oil.
Story first published:Friday, May 11, 2018, 17:38 [IST]
Desktop Bottom Promotion