Just In
- 3 hrs ago
Today Rasi Phalalu :ఓ రాశి నిరుద్యోగులు ఈరోజు మరింత కష్టపడాలి..!
- 14 hrs ago
Vastu Tips:నిద్రించే వేళ ఇవి అస్సలు దగ్గర ఉంచుకోవద్దు...! ఎందుకంటే చెడు ఫలితాలొస్తాయట...!
- 14 hrs ago
కోవిడ్ సమయంలో భయపెట్టిన మంకీ పాక్స్: ఈ రెండింటి మద్య లక్షణాలు ఇవే..
- 17 hrs ago
స్త్రీలు గర్భస్రావం గురించి మూఢనమ్మకాలు అంటే ఏమిటో తెలుసా? ఇదంతా అపోహా..వాస్తవమా...!
Don't Miss
- Automobiles
భారత మార్కెట్లోని Komaki నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ విడుదల.. ధర & వివరాలు
- Sports
చేసిన పొరపాట్లే మళ్లీ: పీకల్దాకా తెచ్చుకుందిగా: రాజస్థాన్ రాయల్స్ ఓటమికి అయిదు కారణాలివే
- Finance
ఇళ్ళ ధరలు భారీగా పెరిగాయ్, హైదరాబాద్లో ఎంత పెరిగిందంటే?
- News
కోనసీమ ఉద్రిక్తత.. అదృశ్య శక్తులను బయటకు లాగుతాం; డీఐజీ పాలరాజు సీరియస్ వార్నింగ్
- Movies
'మేజర్' సెన్సార్ పూర్తి.. స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి మరీ సభ్యుల సెల్యూట్!
- Technology
హువాయి కొత్త ల్యాప్టాప్లను విడుదల చేసింది!! ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీ దైనందిన ఆహారంలో పెరుగును చేర్చడం వలన కలిగే ప్రయోజనాలు
చాలా కాలంగా పెరుగును భారతీయులు తమ ఆహారంలో భాగంగా చేసుకోవడానికి దాని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలే కారణం. ప్రతిరోజూ లేదా తరచుగా మనం పెరుగును అన్నంతో కలిపి తినడం వలన మీ జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయటమే కాక మీ సంపూర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పెరుగన్నం దక్షిణ భారతదేశంలో పుట్టినప్పటికి అది కేవలం దక్షిణ భారతదేశానికి మాత్రమే పరిమితమవ్వలేదు. ఉత్తర భారతంలో కూడా ఇది చాలా ప్రఖ్యాతిగాంచింది, ముఖ్యంగా వేసవిలో. కడుపులో గడబిడగా ఉన్నవారు సాధారణంగా పెరుగన్నం తింటారు.
ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు పెరుగన్నం: పెరుగన్నం మన వంటింట్లో సులువుగా తయారు చేయవచ్చు. దీనివలన పలు ప్రయోజనాలు ఉన్నాయి.
1. కడుపుబ్బరంను నివారిస్తుంది కనుక అజీర్తి, కడుపులో మంట మొదలైన సమస్యలు ఉన్నప్పుడు పెరుగన్నం తినడమే ఉత్తమమైన గృహవైద్యం. పెరుగన్నం జీర్ణకారిగా పేరుగాంచింది.
2. పెరుగన్నాన్ని చల్లగానే తినడం ఉత్తమం. ఇది దేహాన్ని చల్లబరచి సరైన శరీర అంతర్గత ఉష్ణోగ్రతను ఉండేటట్లు చేస్తుంది. కనుక జ్వరాలు ఉన్నప్పుడు కూడా దీనిని నిరభ్యంతరంగా తినవచ్చు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పెరుగన్నం తింటే శరీరాన్ని త్వరగా వేడెక్కనివ్వదు.
3. పెరుగులో యాంటీఆక్సిడెంట్లు, ప్రోబయోటిక్స్ మరియు మంచి కొవ్వులు ఉంటాయి. కనుక పెరుగు తినడం వలన ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇది మెదడుకు బాధలు, నొప్పులను తగ్గించడంలో తోడ్పడుతుంది.
4. బరువు కోల్పోవాలనుకునేవారు కనీసం రోజులో ఒక్కపూటైనా పెరుగన్నం తినాలనుకుంటారు. ఒక గిన్నెడు పెరుగన్నం తింటే కడుపు నిండిన భావన కలిగి అధిక కెలోరీలు ఉండే చిరుతిళ్ళను తినరు. ఫ్రైడ్ రైస్ తో పోలిస్తే పెరుగన్నంలో చాలా తక్కువ కెలోరీలు ఉంటాయి.
5. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక అనారోగ్యంతో బాధపడుతున్నపుడు పెరుగన్నం తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అనారోగ్య సమయంలో శరీరానికి అవసరమైన శక్తిని పంపిణీ చేస్తుంది.
ఇవే కాకుండా పెరుగన్నం తినడం మంచిదని చెప్పడానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి. ఇది పసి పిల్లలు కూడా తినవచ్చు. దీనిలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు అధికంగా ఉండటంతో శరీరానికి అవసరమైన పోషణ లభిస్తుంది.
కారంగా ఉండే ఆహార పదార్థాలు తిన్న తరువాత పెరుగన్నం తింటే కడుపు మండటం, చికాకు నుండి ఉపశమనం లభిస్తుంది. కనుక ఏవైనా వేపుళ్ళు లేదా కారంతో కూడిన వంటలు తిన్నాక పెరుగన్నం తినడం మంచిది. పెరుగు చర్మాన్ని కూడా కాంతివంతంగా మారుస్తుందని పేరు పొందింది. కనుక దీన్ని ఫేస్ ప్యాకులలో కూడా ఉపయోగించవచ్చు.
పెరుగన్నాన్ని తయారు చేయడం ఎలా?
పెరుగన్నాన్ని తయారు చేయడం చాలా సులభం. ఒక గిన్నెలో అన్నాన్ని, పెరుగుని కలిపండి. ఒక కళాయిలో కొద్దిగా నూనె వేసి వేడి చేసి అందులో జీలకర్ర, మినప్పప్పు మరియు కరివేపాకు వేసి చితపటలాడనివ్వండి. దీనిని అన్నం పెరుగుల మిశ్రమంలో బాగా కలపండి. దీనిని వెంటనే తినేయవచ్చు. దీనిని ఎంతో సులువుగా చేసుకోగలిగినందున, మీరు ఒంటరిగా జ్వరంతో బాధపడుతున్నా కూడా దీనిని చేసుకోవచ్చు.
దీనిని క్షణాల్లో తయారు చేయవచ్చు కనుక, మీరు అలసిపోతారు. పెరుగన్నంలోపచ్చిమిర్చి, ఆవాలు, ఎండు ద్రాక్ష మరియు జీడిపప్పు కూడా వేస్తే రుచి ఇంకా రుచి పెరుగుతుంది. దానిమ్మ గింజలు,క్యారెట్, ద్రాక్ష పండ్లు మరియు తురిమిన పచ్చి మామిడి పండ్ల ముక్కలు కూడా పెరుగన్నానికి కలిపితే పోషక విలువలు పెరుగుతాయి.
డయేరియాతో బాధపడుతున్న వారు పెరుగన్నం తినడం శ్రేయస్కరం. కొన్ని మెంతులతో కలిపి తింటే కడుపునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
మెనోపాస్ సమీపిస్తున్న స్త్రీలను కూడా పెరుగన్నం తినమని వైద్యులు సూచిస్తారు. దీని వలన శరీరానికి కాల్షియం సరఫరా పెరుగుతుంది.
పాలతో పోలిస్తే పెరుగు మంచి ఎంపిక. అదికూడా పెరుగన్నం రూపంలో అయితే ఇంకా మంచిది. పాలు తాగితే కడుపు భారంగా అనిపించవచ్చు కానీ పెరుగన్నం తినప్పుడు అలా అనిపించదు. అధ్యయనాల ప్రకారం పెరుగులో ఉండే ప్రోటీన్ పాలలో ఉండే ప్రోటీన్ తో పోలిస్తే త్వరగా అరుగుతుంది. పొటాషియం ఉండటం వల్ల పెరుగు రక్తపోటును నియంత్రిస్తుంది. జాండీస్ నివారణకు పెరుగును తేనెతో కలిపి తీసుకుంటారు.
పెరుగు శరీరానికి చల్లదనం చేకూర్చే పోషకాహారం కనుక ప్రతి ఒక్కరు తమ డైట్ ప్లాన్ లో చేర్చుకోవాలి. పెరుగును అన్నంతో పాటుగా తింటే రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతమవుతుంది.