బరువు తగ్గడం కోసం ఒక రోజులో ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి ?

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

సాధారణంగా చాలా మంది బరువు తగ్గాలనుకునే వారు తాము తీసుకొనే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అస్సలు తీసుకోకుండా జాగ్రత్తపడుతుంటారు. కానీ, ఇలా చేస్తున్న వారందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు తీసుకొనే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అనేవి అస్సలు లేకపోతే మీ శరీరానికి కావాల్సినంత శక్తి అందదు.

కొంతమంది పరిశోధకులు ఆహారం తీసుకొనే విషయంలో పరిశోధించిన తర్వాత చెబుతున్న విషయం ఏమిటంటే, 20 నుండి 100 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఒక రోజులో గనుక తీసుకున్నట్లైతే, మీరు బరువు తగ్గుతారని, అదే సమయంలో మీ శరీరానికి కావాల్సిన శక్తి కూడా సమకూరుతుందని చెబుతున్నారు.

 How Many Carbs Should One Eat In A Day To Lose Weight

ఇలా చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా, రక్తంలో చక్కెర శాతం కూడా అదుపులో ఉంటుందట. బరువు తగ్గాలని భావించేవారు ఒక రోజులో మరీ తక్కువగా 20 గ్రాముల కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ ను తీసుకోవడం వల్ల మీరు సంతృప్తి చెందుతారు, అదే సమయంలో బరువు కూడా తగ్గుతారు.

ఆహార నియమ నిబంధనల ప్రకారం మనం తీసుకొనే ఆహారంలో 45 నుండి 65 శాతం కార్బోహైడ్రేట్స్ స్వీకరించవచ్చట. మీరు గనుక ఒక రోజులో 2000 క్యాలరీల ఆహారాన్ని గనుక తీసుకుంటున్నట్లైతే, అటువంటి సమయంలో ఆ ఆహారంలో 225 నుండి 325 కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోండి. కానీ, అదే సమయంలో మీరు గనుక బరువు తగ్గాలి అని భావిస్తున్నట్లైతే, 50 నుండి 150 గ్రాముల మధ్య మాత్రమే కార్బోహైడ్రేట్స్ ను తీసుకోండి.

 How Many Carbs Should One Eat In A Day To Lose Weight

ఒకరోజులో ఎంతమేర కార్బోహైడ్రేట్స్ ను తీసుకోవడం ద్వారా మనం బరువు తగ్గవచ్చో ఇప్పుడు మనం చూద్దాం.

బరువు తగ్గడానికి తక్కువ కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారం :

బరువు తగ్గే విషయంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం కంటే కూడా, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ప్రభావంతంగా చేస్తుందని చెబుతున్నారు. పిండి పదార్ధాలు, చక్కెర కలిగిన బ్రెడ్, పాస్తా మొదలగు ఆహారాలను పూర్తిగా నిషేధించాలి. అదే సమయంలో ప్రోటీన్లు, కొవ్వు , ఆరోగ్యకరమైన కాయగూరలను వాటి స్థానంలో తినాలి.

తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆకలి తక్కువ అవుతుందని, దీని వల్ల తక్కువ ఆహారాన్ని తీసుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల బరువు మాత్రమే తగ్గడం కాకుండా, మీ రక్తంలో ఉండే చక్కెర, ట్రై గ్లిజరాయిడ్స్ శాతాలని తగ్గించడంతో పాటు మీ రక్తపోటుని అదుపులో ఉంచుతుంది.

 How Many Carbs Should One Eat In A Day To Lose Weight

మీకు కార్బోహైడ్రేట్స్ అవసరం అవుతున్నాయి అనే విషయం తెలుసుకోవడం ఎలా ?

ఒక వ్యక్తి ఎన్ని కార్బోహైడ్రేట్స్ ని ఒక రోజుకి సగటున తీసుకోవాలి అనే విషయం వయస్సు, లింగ బేధం, శరీర నిర్మాణం, చేసే పనులు, ఆహార సంప్రదాయాలు, ప్రస్తుత జీర్ణ ప్రక్రియ, ఆరోగ్యం, ఇలా చాలావాటి పైన ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు ఎవరైతే, శారీరికంగా ఉత్సాహంగా ఉంటారో, కండరాలు బాగా బలంగా ఉంటాయో, అటువంటి వారు కార్బోహైడ్రేట్స్ ను అధికంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే బరువు ఎత్తడం, పరుగులు తీయడం లాంటి పనులు చేస్తుంటారో, అటువంటి వారు కార్బోహైడ్రేట్స్ ను అధికంగా తీసుకోవచ్చు.

ఎంత కార్బోహైడ్రేట్లను ఒకరోజులో తీసుకోవాలి అనే విషయాన్ని ఎలా నిర్ణయించాలి ?

మీరు తీసుకొనే ఆహారం లో శుద్ధిచేసిన గోధుమ, చక్కెర పదార్ధాలు లాంటి అనారోగ్య కార్బో హైడ్రాట్లను తీసివేసినట్లైతే, మీ శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది. కార్బో హైడ్రేట్లు తీసుకోవడం లో పాటించాల్సిన నియమ నిబంధనలు మీ కోసం.

ఒకరోజుకి 100 నుండి 150 గ్రాములు తీసుకోవాలని భావించినట్లైతే :

సాధారణంగా వ్యక్తులు ఎవరైతే సన్నగా ఉంటారో, ఉత్సాహంగా ఉంటారో, అరోగ్యకరంగా ఉండాలని భావిస్తారో, అదే సమయంలో బరువు కూడా తగ్గాలని అనుకుంటారో అటువంటి వ్యక్తులు ఈ మోస్తరు కార్బో హైడ్రాట్లను తీసుకోవచ్చు. ఈ మోతాదులో కార్బో హైడ్రేట్లు తీసుకోవాలని అనుకునే వారు పండ్లు, ఆరోగ్యకరమైన పిండి పదార్ధాలైన బంగాళ దుంపలు, తియ్యటి బంగాళ దుంపలు, బియ్యం, ఓట్స్ లాంటివి నిర్దిష్టమైన మోతాదులో తీసుకోవచ్చు.

 How Many Carbs Should One Eat In A Day To Lose Weight

ఒకరోజుకి 50 నుండి 100 గ్రాములు తీసుకోవాలని భావించినట్లైతే :

మీరు గనుక బరువుని ప్రభావంతంగా ఖచ్చితత్వంతో తగ్గాలని భావించినట్లైతే, అటువంటి సమయంలో మీ ఆహారంలో కార్బో హైడ్రేట్లు చాలా తక్కువ మోతాదులో ఉండాలి. అలాంటి వారు ఒకరోజుకి ఈ మోతాదులో కార్బో హైడ్రేట్లు తీసుకోవడం మంచిది. ఆకుకూరలు, కూరగాయలు అధికంగా తీసుకోవడం, పండ్లను కొంతమేర తినడం, తక్కువ మోతాదులో కార్బో హైడ్రేట్లు కలిగిన పిండి పదార్ధాలను తీసుకోవచ్చు.

ఒకరోజుకి 20 నుండి 50 గ్రాములు తీసుకోవాలని భావించినట్లైతే :

ఎవరైతే బరువుని చాలా త్వరగా తగ్గించుకోవాలని అనుకుంటారో, అటువంటి వారు తీసుకోవాల్సిన మోతాదు ఇది. ముఖ్యంగా ఎవరైతే, ఊబకాయం లేదా మధుమేహం వ్యాధితో బాధపడుతుంటారో అటువంటి వారు ఇలా పాటించాల్సిన అవసరం ఉంది. తక్కువ కార్బో హైడ్రేట్లు కలిగిన ఆకుకూరలు, కూరగాయలు, పెరుగుతో పాటు బెర్రీస్, అవకాడోస్, గింజలు, విత్తనాలు లాంటివి మీ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

మంచి కార్బో హైడ్రేట్లు, చెడ్డ కార్బో హైడ్రేట్లు :

మంచి కార్బో హైడ్రేట్లు అంటే, ఆరోగ్యవంతమైన కార్బో హైడ్రేట్లు అని అర్ధం. ఇవి మీ ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తాయి. మాంసాహారం, చేప, కూరగాయలు, గింజలు, అవకాడోస్, ఆరోగ్యవంతమైన కొవ్వు, గుడ్లు, బాగా కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు లాంటి ఆహారాలను తీసుకోవచ్చు.

చక్కెర కలిగిన పానీయాలు, పేస్ట్రీ లు, తెల్లటి పాస్తా, తెల్లటి బియ్యం మొదలగు పదార్ధాలు చెడ్డ కార్బో హైడ్రేట్ల పరిధిలోకి వస్తాయి.

English summary

How Many Carbs Should One Eat In A Day To Lose Weight

Eating carbohydrates will keep you satisfied and still make you lose weight. Read this article to know how many carbs should one eat in a day to lose weight.
Story first published: Thursday, March 15, 2018, 19:00 [IST]