Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
పుట్టిన రోజునాడు కంగనా చెప్పిన ఆరోగ్య సూత్రాలు
గిరజాల జుట్టుతో ఆకర్షణీయంగా కనిపించే అందాల తార జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్, తన ప్రతి అడుగులోనూ కొత్తదనాన్ని చూపిస్తూ ప్రేక్షకుల మతులు పోగొడుతుంటుంది. సూటిగా మాట్లాడడం లో, తప్పులను వేలెత్తి చూపుటలో తనకు తానే సాటి అన్నట్లు కనపడే కంగనా, తన స్వభావంతో ప్రజల హృదయాలను సైతం గెలుచుకుంది.
నేడు కంగనా రనౌత్ పుట్టిన రోజు సందర్భంగా, ఆమె చెప్పిన కొన్ని ఆరోగ్య సూత్రాలను గురించి ఈ వ్యాసంలో పొందుపరచడం జరిగినది. కంగనా యే క్షణంలో అయినా బిగువైన నిర్మాణాత్మకమైన శరీరాన్ని కలిగి ఉండి , ఫిట్ గా, ఆరోగ్యంగా కనిపిస్తూ ఎందరికో ఆదర్శంగా ఉంటుంది. కంగనా కు తన శరీరాన్ని సన్నగా నాజూగ్గా ఉంచడం గురించిన అవగాహన ఉంది, దీనికారణంగా బరువు పెరగడం ఆమె విషయంలో కష్టమైన విషయంగా చెప్పుకొస్తుంది.

తన బరువు నియంత్రణ గురించి, మరియు తాను పాటించే ఆహార నియమాల గురించి కంగనా చెప్పిన ప్రకారం, తను ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకుంటూ, రోజూవారీ వ్యాయామంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంది. కంగనా పోషకాలతో కూడిన ఆహారాన్ని అనుసరిస్తుంది. మరియు సినిమాల్లో తన పాత్రకు అనుగుణంగా డైట్ లో మార్పులు తీసుకుంటుంది.

కంగనా రోజువారీ వ్యాయామ ప్రక్రియ:
కంగనా తన వ్యాయామాన్ని సమయానుసారం, రోజువారీ చర్యలలో భాగంగా అనుసరిస్తుంది. ఏ ఒక్కరోజు కూడా వ్యాయామం చేయకపోవడం కానీ, ఆలస్యం చేయడం కానీ చేయదు. అంత కఠినంగా వ్యవహరిస్తుంది వ్యాయామం విషయంలో.
వారానికి కనీసం 5 సార్లు జిమ్ కి వెళ్ళడం, రోజులో కనీసం 2 గంటలు జిమ్ కి కేటాయించడం విధిగా మార్చుకుంది. లీనా మొర్గే అను శిక్షకురాలి మార్గదర్శకం లో జిమ్ ట్రైనింగ్ తీసుకుంటుంది. అనేకరకాల ఫిట్నెస్ ప్రక్రియలను అనుసరించడం, కంగనాకు అలవాటు. మరియు గుండె సంబంధిత వ్యాయామాలు, విశ్రాంత వ్యాయామాలుమ, శక్తి వ్యాయామాలు , యోగా మొదలైనవి తన వ్యాయామంలో భాగంగా చేర్చుకుంది.
తొడ కండరాల వ్యాయామానికై జర్మన్ సెట్, పుల్లప్స్, పుషప్స్, రన్నింగ్, క్వాట్స్, లోయర్ బ్యాక్ పెయిన్, బ్యాక్ వ్యాయామం, మొదలైన అనేక విధానాలను అనుసరిస్తుంది.
రోజులో కంగనా 45 నిమిషాలపాటు యోగాకి కేటాయిస్తుంది. శరీరాకృతుల నిర్మాణానికి, నిస్తేజం నుండి ఉపశమనానికి యోగాను ఆశ్రయిస్తుంది. మరియు విధిగా మానసిక ప్రశాంతతకోసం 10 నిమిషాలు ద్యానం కూడా చేయడం పరిపాటి.

ఆహార ప్రణాళిక:
కంగనా ఎప్పుడూ పోషకాహారాలకే ప్రాధాన్యతనిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన కార్భో హైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటుంది. ఆహారంలో పిండి పదార్ధాలు, క్రొవ్వులు మరియు ప్రోటీన్ల సమతుల్యకరమైన నిష్పత్తిలో ఉండేలా చర్యలు తీసుకుంటుంది. వీటిలో 50 శాతం కార్బోహైడ్రేట్లు, 25 శాతం ప్రోటీన్లు మరియు 25 శాతం ఆరోగ్యకరమైన కొవ్వులు ఆమె ఆరోగ్యకర శరీరానికి సహాయపడుతాయి. ఆమె ఆహారంలో ప్రధానంగా వోట్మీల్, స్టార్చ్, ప్రోటీన్ షేక్, గుడ్లు, కూరగాయలు, గ్రిల్డ్ చికెన్, పప్పు, టోఫు మొదలైనవి ఉంటాయి.
అల్పాహారం కోసం, ఆమె ప్రత్యేకమైన గంజి లేదా జావ మరియు తృణధాన్యాలు తీసుకుంటుంది.
మిడ్-డే ప్రోటీన్ షేక్స్ మరియు పండ్లు ఉండేలా స్నాక్స్ తీసుకుంటుంది
భోజనం కోసం తాజా సలాడ్, పప్పు, బియ్యం, ఉడికించిన కూరగాయలు మరియు రెండు చపాతీలు.
సాయంత్రం స్నాక్స్ కోసం, బ్రౌన్ బ్రెడ్ను ఇష్టపడుతుంది.
రాత్రి భోజనానికై , ఆమె ఉడికించిన కూరగాయలు లేదా సలాడ్ మరియు ఏదైనా ఒక సూప్ తీసుకోవడం పరిపాటి.

కంగానా ఎక్కువగా శాఖాహారానికి ప్రాధాన్యమిస్తుంది:
కంగానా రనౌత్ నిజానికి మాంసాహారి, నాన్-వెజ్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టం ప్రదర్శించేది. కానీ ఇటీవల, ఆమె శాఖాహారిగా మారింది. ఆమె రోజులో రెండు గంటలకు ఒకసారి తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకొనుటకు ఇష్టపడుతుంది.
ఆమె అనారోగ్యకర ఆహారాలైన జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్ మరియు చక్కెర కలిగిన ఆహారాలను తీసుకోవడానికి ఇష్టపడదు. కొన్నిసార్లు, ఆమె ఆహార కోరికలను అరికట్టడానికి పిజ్జాలను తీసుకుంటుంది.
ఆమె శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుటకు, రోజుకు కనీసం 10 నుండి 12 గ్లాసుల నీటిని తీసుకుంటుంది.

కంగనా చెప్పిన ప్రధాన ఆహార , వ్యాయామ చిట్కాలు :
సమతుల్య సమతుల్యమైన ఆహారం తీసుకోండి.
అనారోగ్య వ్యర్థ ఆహారాలను నివారించండి.
మీ మనస్సు మరియు శరీరాన్ని సమతుల్యం చేయడానికి రోజువారీ ధ్యానం , వ్యాయామo చేయండి అంటూ సెలవిచ్చింది కంగనా.



Click it and Unblock the Notifications