For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సునాయాసంగా బరువు తగ్గించేందుకు చిట్కా: తేనె మరియు నిమ్మరసంతో చేసిన పానీయం

సునాయాసంగా బరువు తగ్గించేందుకు చిట్కా: తేనె మరియు నిమ్మరసంతో చేసిన పానీయం

|

ప్రతి ఒక్కరు అవర్-గ్లాస్ లాంటి పొందికైన అవయవ సౌష్టవం కావాలని కోరుకుంటారు. కానీ అది సాధించడానికి కఠిన శ్రమ మరియు అకుంఠిత దీక్ష అవసరం. అలుపు తెప్పించే వ్యాయామం మరియు కఠోర ఆహారనియమాలు పాటించాలి. మనకు ఇష్టమైన ఆహార పదార్థాలను కాకుండా ఆరోగ్యవంతమైన సమతులహారం స్వీకరించాలి.

కానీ ప్రస్తుత ఉరుకుల పరుగులతో కూడిన జీవన శైలి కారణంగా మనం ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడంలో విఫలమవుతున్నాము. మనకు ఆకలి అనిపించిన వెంటనే చిప్స్ లేక బర్గర్లు వంటి చిరుతిళ్ళను ఆశ్రయిస్తాం. వీటిలో ఉండే అధిక కెలోరీలు మన శరీరం లో పేరుకుపోతాయి.

lemon water and jaggery for weight loss

ఇటువంటి అధిక కెలోరీలు మన శరీరంలో కొవ్వులుగా రూపాంతరం చెంది కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచి, ధమనుల ద్వారా జరిగే రక్త ప్రవాహానికి అవరోధంగా మారతాయి. తద్వారా మనం గుండెకు సంబంధించిన రోగాలకు గురవుతాము. ఇటువంటి దుష్పరిణామాలు సంభవించక ముందే, మనం జాగ్రత్త పడి మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. అటువంటి మార్పుల్లో ముఖ్యమైనది తెల్లవారుజామున బెల్లంతో నిమ్మరసం కలిపి తీసుకోవడం. ఈ పానీయం మీ పొట్టలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించి చురుకైన జీవన విధానానికి దోహదపడటమే కాకుండా పలు ప్రయోజనాలను చేకూరుస్తుంది.

నిమ్మకాయ వలన ప్రయోజనాలు:

ఈ నిమ్మజాతి పండులో నిండి ఉన్న విటమిన్లు మీ బరువు కోల్పోవడంలో సహాయపడతాయి. తెల్లవారుజామునే పరగడుపున దీనిని సేవించడం వల్ల మీ బరువు సులభంగా తగ్గుతుంది. దీనికుండే ఆమ్లగుణం మీ కెలోరీలను కరిగించి మీ జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా దీని వలన ఈ కింద తెలుపబడిన వివిధ ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

1.డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది:

1.డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది:

నిమ్మరసానికి డీహైడ్రేషన్ ను తగ్గించే గుణం కలిగివున్నట్లు శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. దీనిలోని నీరు మన దేహాన్ని ఆర్ద్రీకరించి, అందులో పేరుకున్న విషాలను బయటకు నెట్టి వేస్తుంది. మనలో చాలామందికి నీటిని తాగడం ఇష్టముండదు. అటువంటప్పుడు నిమ్మరసాన్ని కలపడం వలన నీటికి రుచి,సువాసన ఏర్పడి తాగాలని కోరిక కలుగుతుంది.

2. గుండెకు మరియు వ్యాధి నిరోధక శక్తికి మేలుకారి:

2. గుండెకు మరియు వ్యాధి నిరోధక శక్తికి మేలుకారి:

సి-విటమిన్ అధికంగా ఉంటుంది కనుక ఇది రక్తపోటును నియంత్రించి హృద్రోగ సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. అంతేకాకుండా జలుబుకు కారణమయ్యే వైరస్లను ఎదుర్కొంటుంది.

3. మీ మేని నిగారింపుకు దోహదపడుతుంది:

3. మీ మేని నిగారింపుకు దోహదపడుతుంది:

మీ చర్మం పై ముడుతలు తగ్గించి, పొడిబారకుండా ఉంచుట వలన మీ మేని మెరుపులీనుతూ ఉంటుంది. మీ శరీరాన్ని లోపలనుండి హైడ్రేట్ చేస్తున్నందున ముడుతలు, పొడిదానం తగ్గుతాయి.

4. మీ జీవక్రియలను వేగవంతం చేస్తుంది:

4. మీ జీవక్రియలను వేగవంతం చేస్తుంది:

నిమ్మరసం మీ బరువును తగ్గించి, జీర్ణశక్తిని పెంచి జీవక్రియను వేగవంతం చేస్తుంది.

5. మీ నోటి దుర్వాసన తగ్గిస్తుంది:

5. మీ నోటి దుర్వాసన తగ్గిస్తుంది:

నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతున్న వారికి నిమ్మరసం మంచి పరిష్కారం చూపిస్తుంది. ఇది లాలాజలం ఊరేటట్లు చేసి నోటికి తేమను చేకూరుస్తుంది. నోరు పొడిబారకుండా ఉండటంతో బాక్టీరియా అభివృద్ధి తద్వారా దుర్వాసన పెరగడం జరగదు.

6. మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడటాన్ని నిరోధిస్తుంది:

6. మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడటాన్ని నిరోధిస్తుంది:

నిమ్మరసంలో ఉండే సి-విటమిన్ మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. దీనిలోని సిట్రిక్ ఆమ్లం శరీరంలో వ్యర్థాలను బయటకు నెట్టివేసి రాళ్లు ఏర్పడనివ్వదు.

బెల్లం వలన ప్రయోజనాలు:

బెల్లం వలన ప్రయోజనాలు:

మనలో చాలా మంది ఆరోగ్యానికి హాని కలుగ చేస్తుందని పంచదార వినియోగాన్ని నివారిస్తుంటారు. మధుమేహ వ్యాధిగ్రస్థులు పంచదార మరియు దానితో తయారు చేసిన తినుబండారాలు తీసుకోరు. అటువంటి వారు కూడా బెల్లం తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. బెల్లంలో అసహజ రుచికారకాలు ఉండనందువల్ల అది పంచదారకు మంచి ప్రత్యామ్నాయం.

దీనిలో సహజ సుక్రోజ్ తో పాటు మంచి రుచి, సువాసన ఉంటాయి. దీనిలో అధిక మొత్తంలో పీచుపదార్థాలు, ఖనిజాలు మరియు ప్రొటీన్లు ఉంటాయి. మనలో ఉండే అధిక కొవ్వును బెల్లం కరిగించి, జీవక్రియను మెరుగు పరిచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బెల్లం జీర్ణప్రక్రియను మెరుగు పరచి మలినాలను బయటకు నెట్టి రక్తాన్ని శుద్ధి చెస్తుంది. అంతే కాకుండా దీనిలో ఉండే పొటాషియం శరీరంలో నీటి సమతుల్యతను పెంపొందిస్తుంది.

కనుక బరువు తగ్గాలనుకునే వారు అనుదినం బెల్లం తీసుకోవచ్చు. ఇది మన శరీరంలో నిలువ ఉన్న కొవ్వును కరిగిస్తుంది. ఇది శరీరంలో ఎలెక్ట్రోలైట్లను సమతూకంలో ఉంచడం వలన తక్కువ సుగర్ వల్ల కలిగే సమస్యలు ఎదురవ్వవు.

ఈ పానియం తయారీ విధానం తెలుసుకుందాం:

ఈ పానియం తయారీ విధానం తెలుసుకుందాం:

నిమ్మరసంకు బెల్లాన్ని జోడించినప్పుడు మన బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది.

దీనిని తయారు చేయడానికి ఒక గ్లాసుడు గోరు వెచ్చని నీటిలో సగం నిమ్మచెక్కను పిండి ఆ రసాన్ని కలపండి.

దీనికి ఒక టేబుల్ స్పూన్ బెల్లాన్ని బాగా కలపండి. ప్రొద్దున్నే పరగడుపున ఈ పానీయం సేవిస్తే జీవక్రియ మెరుగుపడి బరువు తగ్గుతారు.

అంతే కాకుండా ఇది మీకు అవసరమైన శక్తిని సమకూర్చి మిమ్మల్ని ఆరోగ్యంగా, చురుకుగా మరియు ఉత్సాహవంతులుగా మారుస్తుంది.

English summary

Lemon Water and Jaggery for Weight Loss: An Easy Fitness Hack

Drink a glass of lemon water and jaggery every day in the morning to lose weight fast. It will improve your metabolism, boost your immunity, reduce your sugar cravings, and help you slim up fast.
Story first published:Wednesday, March 7, 2018, 16:33 [IST]
Desktop Bottom Promotion