కీటో డైట్ అనుసరిస్తున్నారా? అయితే ఈ కొన్ని తక్కువ కార్బొహైడ్రేట్ల అపోహలు మీరు ఎన్నటికీ నమ్మకూడదు

Subscribe to Boldsky

మీరు కూడా బరువు తగ్గే లేదా ఫిట్ గా మారాలనే ప్రయాణం మొదలుపెట్టిన వారైతే, మీరు కూడా రకరకాల డైట్లతో ప్రయోగాలు చేసి ఉండుంటారు, కదా?

ఉదాహరణకి, కండల పరిమాణం పెంచుకోవాలనుకునే వారు ప్రొటీన్ ఎక్కువుండే ఆహారాన్ని ;బరువు తగ్గాలనుకునే వారు కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటారు.

అందుకని,ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులను బట్టి, ఆశయాలను బట్టి వివిధ రకాల డైట్లు ఉంటాయి మరియు అందరికీ ఒకే రకం డైట్ పనిచేయదు.

నిజానికి, కొన్ని రకాల డైట్లు పాటించడం వలన, మీరు ఏదన్నా ప్రత్యేకమైన వ్యాధితో బాధపడుతుంటే, అది మరీ అపాయకరంగా మారవచ్చు!

ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి పోషకలోప సమస్యలతో బాధపడుతూ చాలా తక్కువ కేలరీల డైట్ పాటిస్తే,వారి స్థితి మరింత పాడవుతుంది.

అందుకే మీరు పాటిస్తున్న డైట్ గురించి లోతుగా తెలుసుకోవటం చాలా ముఖ్యం మరియు వాటిని పాటించేముందు మీ శరీరంపై, మీపై అవి ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవటం ముఖ్యం.

ఇక ఇప్పుడు కీటో డైట్ లేటెస్ట్ గా చాలామంది అనుసరిస్తున్న డైట్ . దీని గురించిన కొన్ని అపోహలు ఇక్కడ ఇవ్వబడ్డాయి, వీటిని మీరు ఎన్నడూ నమ్మకండి!

కీటో డైట్ అంటే ఏమిటి?

కీటో డైట్ అంటే ఏమిటి?

మొదటగా, కీటో డైట్ గురించిన అపోహలను తెలుసుకునేముందు, మీరు ముందుగా ఈ డైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి.

‘కీటోజెనిక్' డైట్ కి చిన్నపదమైన కీటో డైట్ పద్దతిని పాటించేవారు కార్బొహైడ్రేట్లను పూర్తిగా తమ రోజువారీ ఆహారం నుంచి తొలగించాలి. ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువుండే ఆహారపదార్థాలను చేర్చుకోవాలి. ఈ డైట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కొవ్వును ఎక్కువగా కరిగించటానికి శరీరానికి ప్రేరణనివ్వటం. ఇది కార్బొహైడ్రేట్లను కరిగించటం బదులు ప్రొటీన్ల సాయంతో శరీరాన్ని ఎక్కువ కేలరీలు కరిగించేలా చేయటం! బరువు తగ్గటంలో కీటో డైట్ చాలా విజయవంతమైంది.

అపోహ#1 ఇదొక వ్యామోహం కోసం చేసే డైట్

అపోహ#1 ఇదొక వ్యామోహం కోసం చేసే డైట్

చాలామంది కీటో డైట్ ను ‘ఫాడ్ డైట్ (వ్యామోహంకి పోయి చేసే క్రాష్ డైట్)' అనగా అది దీర్ఘకాలికంగా ఏ ప్రభావం చూపదని మరియు కేవలం అప్పటికప్పుడు ఫలితాలు మాత్రమే కన్పిస్తాయని భావిస్తారు. కానీ అనేక పరిశోధనలు, సర్వేల ప్రకారం కీటో డైట్ దీర్ఘకాలికంగా కూడా మంచి ప్రభావాన్నే చూపిస్తుందని, దానికి కావాల్సిన అన్ని అర్హతలన్నీ శాస్త్రీయంగా పరీక్షించబడ్డాయని తేలింది.

అపోహ#2 దాన్ని పాటించడం చాలా కష్టం

అపోహ#2 దాన్ని పాటించడం చాలా కష్టం

మీ రోజువారీ ఆహరంలోంచి చాలామటుకు కార్బొహైడ్రేట్లను తీసెయ్యాలి అంటే తెల్ల అన్నం, బ్రెడ్ వంటివి. ఇవి చాలామందికి ప్రధాన ఆహారం కాబట్టి ఇది పాటించడం చాలా కష్టంగా కన్పిస్తుంది. కానీ ఇతర డైట్లలాగానే, ఇది కూడా అలవాటవడానికి కొంత సమయం పడుతుంది,ఇక తర్వాత అంత కష్టంగా ఉండదు!

అపోహ#3 కేవలం నీటి బరువును తగ్గిస్తుంది

అపోహ#3 కేవలం నీటి బరువును తగ్గిస్తుంది

కీటో డైట్లో కొవ్వు పదార్థాలను పూర్తిగా కట్ చేయం కాబట్టి, కేవలం కార్బొహైడ్రేట్లే పోతాయి కాబట్టి కొంతమంది ఇది బరువును ఏమీ తగ్గించదు, తాత్కాలికంగా నీటిబరువును మాత్రమే తగ్గిస్తుందని నమ్ముతారు. కానీ కీటో డైట్ శరీరంలో కొవ్వును కూడా కరిగిస్తుందని నిరూపితమైంది!

అపోహ #4 గుండెకు మంచిది కాదు

అపోహ #4 గుండెకు మంచిది కాదు

ఇది మరొక ప్రాచుర్యంలో ఉన్న అపోహ. చాలామంది కీటో డైట్ గుండె ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని భావిస్తారు. కానీ ఈ అపోహకి శాస్త్రీయపరంగా ఆధారం లేదు. నిజానికి అనారోగ్యకర కార్బొహైడ్రేట్లను తినటం మానేయటం వలన, చాలామంది న్యూట్రిషన్ నిపుణులు ఇది గుండెకు కూడా చాలా మంచిదని భావిస్తారు!

అపోహ#5 మీరు తక్కువ తింటేనే ఇది పనిచేస్తుంది

అపోహ#5 మీరు తక్కువ తింటేనే ఇది పనిచేస్తుంది

రోజుకి కొన్ని కేలరీలను మాత్రమే తీసుకోగలిగే కొన్ని డైట్లలాగా కాకుండా, కీటో డైట్ పాటించేవారు వారి బిఎంఐ కి తగ్గట్టుగా క్రమం తప్పకుండా మామూలుగానే తినవచ్చు, కేవలం కార్బొహైడ్రేట్లు లేకుండా. అందుకని కీటో డైట్ ఎలా డిజైన్ చేయబడిందంటే మీరు ఆకలితో మాడకుండా ఉన్నా కూడా మీరు ఫలితాలు చూడవచ్చు!

అపోహ #6 దీనిలో ప్రొటీన్లు ఎక్కువ ఉంటాయి

అపోహ #6 దీనిలో ప్రొటీన్లు ఎక్కువ ఉంటాయి

కీటో డైట్ పాటించేవారు అధిక కార్బొహైడ్రేట్లను తీసేయాలన్నారని, దాని స్థానంలో అధిక ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను జతచేయమన్నారని మీరు రోజుకి కావాల్సినంత ప్రొటీన్ పొందుతున్నారని అర్థం కాదు. అది మీ ఆహారంలో ఎంత ప్రొటీన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకున్నారన్నదానిపై ఆధారపడి ఉంటుంది. చాలామంది అవసరమైనంత ప్రొటీన్ తీసుకోవాలని విస్మరించి పోషకలోపాలలో చిక్కుకుంటారు.

అపోహ #7 మెదడుకు ఆరోగ్యకరమైనదా

అపోహ #7 మెదడుకు ఆరోగ్యకరమైనదా

ఇప్పుడు మనలో చాలామంది కీటోజెనిక్ డైట్ ఆరోగ్యకరమైనది అని ఒప్పుకుంటున్నాం, కదా? సరే ఇది ఇతర డైట్ లకంటే ఆరోగ్యకరమైనదైనా, దీని లోపాలు దీనికి కూడా ఉన్నాయి. మీ శరీరానికి సరిపోయినంత కార్బొహైడ్రేట్లు అందకపోవటం వలన, మీ మెదడు పనితీరు ప్రభావితమయ్యి, మెల్లగా తగ్గిపోతుంది. అంటే మీకు తాత్కాలికంగా అలసట, కళ్ళు తిరగటం, ఏకాగ్రత లేకపోవటం వంటివి జరగవచ్చు.

అపోహ#8 మీ వ్యాయామం చేసే శక్తి తగ్గిపోతుంది

అపోహ#8 మీ వ్యాయామం చేసే శక్తి తగ్గిపోతుంది

ముందు పాయింట్లో చెప్పినట్లు తక్కువ కార్బొహైడ్రేట్ల డైట్ కీటో, మీ మెదడు పనితీరును తగ్గించి తాత్కాలిక అలసటను కలిగిస్తుంది. కానీ మీరు సరైనంత ప్రొటీన్ మరియు ఖనిజలవణాలను మీ ఆహారం ద్వారా తీసుకుంటే, వ్యాయామం చేసేటప్పుడు కూడా ఏ సమస్యలు ఉండవు, ఎందుకంటే అనేక మంది వ్యాయామ నిపుణులు కూడా కీటో డైట్ యే అనుసరిస్తారు!

ఈ ఆర్టికల్ ను పంచుకోండి!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    8 Low-carb Diet Myths You Must Never Believe

    There are many types of diets out there for people who want to lose weight or get fit. The keto diet has become popular lately, as it is proven to be very effective. Here are some myths about it that you should never believe.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more