For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లాట్ బెల్లీ కోసం నేచరుల్ డీటాక్స్ వాటర్

ఫ్లాట్ బెల్లీ కోసం నేచరుల్ డీటాక్స్ వాటర్

|

సినిమాలలో అలాగే యాడ్స్ లో ఫ్లాట్ బెల్లీను కలిగిన వారిని చూసి మీకు ఆశ్చర్యం కలుగుతోందా? మీ బెల్లీను చూసుకొని దిగులు చెందుతున్నారా? దిగులు చెందకండి. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అలాగే బెల్లీ ఫ్యాట్ ను తొలగించుకునేందుకు కూడా పరిష్కారాలు ఉన్నాయి.

ఇక అసలు విషయంలోకి వస్తే, ఊబకాయం అలాగే అధిక బరువు వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. స్థూలకాయం అనేది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అదే సమయంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా కూడా చేయగలదు. అయితే అదృష్టవశాత్తూ, స్థూలకాయం సమస్యని తగ్గించుకుని ఫ్లాట్ బెల్లీను పొందటం ఎంతో సులభం. సులభమని నిర్లక్ష్యం వహించకుండా అంకితభావంతో ముందుకు సాగితే మంచి ఫలితాలను పొందగలుగుతారు.

అయితే, ముందుగా అసలీ ఊబకాయం సమస్యకి దారితీసే ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఒత్తిడికి లోనవ్వడం, ఆహారపుటలవాట్లు సరిగ్గా లేకపోవటం, యాక్టివ్ గా లేని లైఫ్ స్టైల్ తో పాటు మరికొన్ని ఫ్యాక్టర్స్ ఊబకాయం సమస్యకు దారితీస్తాయి. వీటి వలన పొట్ట కూడా పెరుగుతుంది. పొట్ట పెరగడంతో అందం దెబ్బతింటుంది. అప్పట్నుంచి, బెల్లీను ఫ్లాట్ గా చేసేందుకు ప్రయత్నాలను ఆరంభించడం జరుగుతుంది. ఫ్లాట్ బెల్లీ కోసం అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారా? డోంట్ వర్రీ. ఫ్లాట్ బెల్లీ ను ఈ డీటాక్స్ వాటర్ సహాయంతో పొందవచ్చు. ఎటువంటి అదనపు శ్రమ లేకుండా బెల్లీను ఫ్లాట్ గా చేసుకోవచ్చు. ఇది సురక్షితం కూడా.

అయితే, ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతూ మీరు మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. బాలన్స్డ్ డైట్ ను తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీస్ ను మీ రొటీన్ లో భాగం చేసుకోవాలి. అదే సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెడిటేషన్ మరియు యోగా వంటిని సాధన చేయడం ప్రారంచించాలి. వీటన్నిటినీ పాటిస్తూ ఈ డీటాక్స్ డ్రింక్ ను తీసుకుంటే మీ బెల్లీ ఫ్లాట్ గా మారేందుకు తయారౌవుతుంది. ఇంకెందుకాలస్యం ఈ డీటాక్స్ డ్రింక్ గురించి తెలుసుకుందామా మరి.

బెల్లీను ఫ్లాట్ గా చేసే స్ట్రాబెర్రీ గ్రేప్ ఫ్రూట్ డీటాక్స్ డ్రింక్:

బెల్లీను ఫ్లాట్ గా చేసే స్ట్రాబెర్రీ గ్రేప్ ఫ్రూట్ డీటాక్స్ డ్రింక్:

కావలసిన పదార్థాలు

రెండు లీటర్ల నీరు,

మూడు నుంచి ఐదు స్ట్రాబెర్రీస్,

ఒక దోసకాయ మరియు

ఒక గ్రేప్ ఫ్రూట్.

ఈ పదార్థాలతో డీటాక్స్ డ్రింక్ ను ఎలా తయారుచేసుకోవాలో

ఈ పదార్థాలతో డీటాక్స్ డ్రింక్ ను ఎలా తయారుచేసుకోవాలో

ఈ పదార్థాలతో డీటాక్స్ డ్రింక్ ను ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం. ఈ డీటాక్స్ డ్రింక్ అనేక విధాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

తయారుచేసే విధానం:

తయారుచేసే విధానం:

ఒక పాత్రలోకి రెండు లీటర్ల నీటిని తీసుకోండి. పైన చెప్పిన మోతాదులో స్ట్రాబెర్రీస్, కుకుంబర్ అలాగే గ్రేప్ ఫ్రూట్ ను స్లైస్ చేసుకోండి. ఈ పదార్థాలను నీటిలో కలపండి. ఈ పాత్రను ఫ్రిజ్లో అరగంట సేపు ఉంచండి. ఆ తరువాత ఈ నీటిని తీసుకోండి. ఈ డీటాక్స్ డ్రింక్ ఊబకాయంతో పాటు అలసటను తగ్గిస్తుంది. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బెల్లీను ఫ్లాట్ గా మారుస్తుంది.

ఈ డీటాక్స్ డ్రింక్ లో వాడిన పదార్థాల వలన కలిగే ప్రయోజనాలు:

ఈ డీటాక్స్ డ్రింక్ లో వాడిన పదార్థాల వలన కలిగే ప్రయోజనాలు:

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీలో విటమిన్ సి మరియు విటమిన్ K పుష్కలంగా లభిస్తాయి. అలాగే, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, మాంగనీస్ మరియు పొటాషియం ఈ ఫ్రూట్ లో సమృద్ధిగా లభిస్తాయి. ఈ ఫ్రూట్ లో అనేక ఔషధ విలువలు కలవు. ఇవి, అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. పైగా, స్ట్రాబెర్రీలో ఫ్యాట్, కొలెస్ట్రాల్ అలాగే సోడియంలు లభించవు. కేలరీలు కూడా తక్కువగానే లభిస్తాయి. అందువలన, ఇది లో కేలరీ ఫుడ్ గా పేరొందింది. డయాబెటిస్ వంటి ఆరోగ్యస్థితులకు కూడా స్ట్రాబెర్రీ చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఈ డీటాక్స్ డ్రింక్ లో స్ట్రాబెర్రీను జోడించడం వలన ఈ డ్రింక్ సుగుణాలు మరింత పెరుగుతాయి.

దోసకాయ

దోసకాయ

ఒక దోసకాయలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అలాగే, ఇది నీటిని పుష్కలంగా కలిగి ఉంటుంది. వివిధ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో ఇది సహాయపడుతుంది. దోసకాయ అనేది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం, పొటాషియం తో పాటు ఎన్నో న్యూట్రిషనల్ వాల్యూస్ ను పొందవచ్చు.

గ్రేప్ ఫ్రూట్:

గ్రేప్ ఫ్రూట్:

గ్రేప్ ఫ్రూట్ ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది ఎన్నో విధాలుగా ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు సహాయపడుతుంది. దీనిని డైట్ లో భాగం చేసుకోవడం ద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలను తొలగించుకోవచ్చు. ఇది సిట్రస్ పండ్లలో ఉత్తమమైనది. దీని యొక్క సుగుణాలను తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. గ్రేప్ ఫ్రూట్ లో విటమిన్ ఏ (కెరోటినాయిడ్స్ రూపంలో) తో పాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. అలాగే, డైటరీ ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఈ డైటరీ ఫైబర్ వలన వెయిట్ లాస్ సాధ్యపడుతుంది. గ్రేప్ ఫ్రూట్ ను హెల్దీ వెయిట్ లాస్ డైట్ లో భాగంగా చేసుకోవడం ద్వారా ప్రయోజనాలను పొందుతారు.

ఈ డీటాక్స్ డ్రింక్ వెయిట్ లాస్ కు తోడ్పడుతూ

ఈ డీటాక్స్ డ్రింక్ వెయిట్ లాస్ కు తోడ్పడుతూ

ఈ డీటాక్స్ డ్రింక్ వెయిట్ లాస్ కు తోడ్పడుతూ శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించేందుకు కూడా అమితంగా తోడ్పడుతుంది. మరికెందుకాలస్యం, ఈ డీటాక్స్ డ్రింక్ తో ప్రయోజనాలను పొందండి మరి.

ఈ డీటాక్స్ డ్రింక్ ను మీరు ఆల్రెడీ ప్రయత్నించారా?

ఈ డీటాక్స్ డ్రింక్ ను మీరు ఆల్రెడీ ప్రయత్నించారా?

ఈ డీటాక్స్ డ్రింక్ ను మీరు ఆల్రెడీ ప్రయత్నించారా? మరి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ సెక్షన్ లో తెలియచేయండి.

English summary

natural vitamin detox water for flat belly

natural vitamin detox water for flat belly, In this article we clearly mention natural detox water for a flat belly, read on.
Story first published:Tuesday, July 31, 2018, 17:33 [IST]
Desktop Bottom Promotion