For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెరకు రసంతో బరువు పెరుగుదలకు చెక్ పెట్టొచ్చట.. అదెలాగో చూడండి...

బరువు తగ్గడంలో చెరకు రసం సహాయపడుతుందనడానికి గల 7 ప్రధాన కారణాలు

|

వేసవి కాలములో దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో కొబ్బరి నీళ్ళతో పాటుగా చెరకు రసం కూడా ఉంటుంది. అద్భుతమైన రుచితో పాటు, అనేక పోషక లక్షణాలను కూడుకుని ఉన్న కారణంగా, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆస్వాదించేలా ఉంటుంది ఈ పానీయం. ఒక గ్లాసు చెరకు రసం కేవలం మీ దప్పికను తీర్చివేయడమే కాకుండా, వేసవి తాపాన్ని సమర్థవంతంగా ఎదుర్కునే క్రమంలో మీకు తక్షణ శక్తిని అందివ్వగలుగుతుంది. వేసవి కాలంలో తరచుగా, మన శరీరంలోని ఎలెక్ట్రోలైట్స్ చెమట రూపంలో అధికంగా కోల్పోవడం జరుగుతుంటుంది. క్రమంగా శరీరం డీహైడ్రేషన్ సమస్యలకు గురవ్వడం, అధిక మొత్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుముఖం పట్టడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వేసవిలో ఈ పరిస్థితులను అధిగమించడానికి సరైన పరిష్కారంగా చెరకు రసం ఉంటుంది.

కానీ, చెరకు రసం బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుందని ఎంతమందికి తెలుసు. చెరకు అధికంగా చక్కెరలతో నిండి ఉంటుంది కదా, అలాంటిది బరువు తగ్గడంలో ఎలా సహాయం చేస్తుంది అని అందరికీ అనుమానం కలుగవచ్చు. అయితే, సరైన సమయంలో సరైన పరిమాణంలో వినియోగించిన ఎడల, చెరకు రసం మీ బరువును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Sugarcane Juice For Weight Loss: 7 Reasons It May Help You Shed Kilos Faster!

100 గ్రాముల చెరకు రసంలో కేవలం 270 కేలరీల శక్తి మాత్రమే ఉంటుందని మీకు తెలుసా?

1. ఫ్యాట్ ఫ్రీ :

1. ఫ్యాట్ ఫ్రీ :

చెరకులో ఎటువంటి కొవ్వు పదార్ధాలు ఉండవు. మరియు సహజ సిద్దమైన తీపిని కలిగి ఉంటుంది. అందువలన, ఎటువంటి అదనపు కృత్రిమ స్వీటెనర్లను జోడించనవసరం లేదు. క్రమంగా మీరు చెరకు రసం తీసుకునేటప్పుడు అధిక కొవ్వులని అందిస్తున్నామని ఆందోళన చెందనవసరం లేదు.

2. ఎక్కువ మొత్తంలో ఫైబర్ :

2. ఎక్కువ మొత్తంలో ఫైబర్ :

చెరకు పీచు పదార్ధాలలో అధికంగా ఉంటుంది. అందుకే, బరువు కోల్పోవాలనుకునే వారికి సూచించదగిన పానీయంగా ఉంటుంది. ముడి చెరకు రసంలో అధికంగా 13 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుందని చెప్పబడింది. దీనిలోని ఫైబర్ నిక్షేపాల మూలంగా, ఆహారం మీదకు మనసు వెళ్ళకుండా చేస్తుంది. క్రమంగా ఆహారం తక్కువగా తీసుకోవడం సాధ్యపడుతుంది కూడా.

3. శక్తిని పెంచుతుంది :

3. శక్తిని పెంచుతుంది :

మీరు నిస్సత్తువ మరియు అలసటతో బాధపడుతున్న ఎడల, ఒక గ్లాసుడు చెరకు రసం మీ శక్తి స్థాయిలను తక్షణమే పునరుద్ధరించగలదు. కేవలం రోజూవారీ కార్యకలాపాలలోనే కాకుండా, వ్యాయయం తర్వాత శరీరంలో ఎలక్ట్రోలైట్స్ నింపి తక్షణ శక్తిని అందించేలా కూడా దోహదం చేస్తుంది. ముఖ్యంగా జిమ్ వెళ్ళేవారు, తరచుగా చెరకు రసం తీసుకోవడం ఎంతో ఉత్తమంగా సూచించబడుతుంది.

Most Read:నాకు ఫాంటసీ సెక్స్ అంటే బాగా ఇష్టం, నేను రోజుకొకరితో శృంగారంలో పాల్గొంటాను, బాగా సంతృప్తికలుగుతుందిMost Read:నాకు ఫాంటసీ సెక్స్ అంటే బాగా ఇష్టం, నేను రోజుకొకరితో శృంగారంలో పాల్గొంటాను, బాగా సంతృప్తికలుగుతుంది

5. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది :

5. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది :

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉన్న ఎడల, అనారోగ్యకర రీతిలో బరువు పెరిగేందుకు దారితీస్తుంది. చెరకు రసంలో ఎటువంటి కొలెస్ట్రాల్ ఉండదు మరియు రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే లక్షణాలతో కూడుకుని ఉంటుంది. క్రమంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది.

6. ఆరోగ్యకర జీర్ణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది :

6. ఆరోగ్యకర జీర్ణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది :

ఆరోగ్యకరమైన ప్రేవులు మరియు జీర్ణ వ్యవస్థ, బరువు తగ్గడంతో ముడిపడి ఉంటుంది. ప్రేగు కదలికలను మెరుగుపరిచేందుకు, మలబద్ధకం నుండి ఉపశమనం పొందేందుకు మరియు శరీరంలో ఆమ్ల తత్వాలను తగ్గించేందుకు, మరియు గుండెలో మంటను తగ్గించుటకు ఎంతగానో సహాయం చేస్తుంది. దీనికి కారణం, దీనిలో ఉండే ఫైబర్ నిక్షేపాలే. క్రమంగా ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహించేందుకు, ఆయుర్వేదంలో కూడా చెరకు రసాన్ని సిఫార్సు చేయడం జరిగింది.

6. జీవక్రియలను పెంచుతుంది :

6. జీవక్రియలను పెంచుతుంది :

చెరకు రసం శరీరంలో విషతుల్య పదార్ధాలను రసాయనాలను తొలగించి నిర్విషీకరణ గావిస్తుంది. క్రమంగా శరీరంలోని అసంబద్దమైన చెడు కారకాలను విసర్జించడంలో కీలకపాత్ర పోషిస్తూ, చెడు కొలెస్ట్రాల్ తగ్గుదలలో సహాయం చేస్తూ, మంచి జీవక్రియలను ప్రోత్సహిస్తుంది.

ఇప్పుడు మీకు, చెరకు రసం గురించి ఒక అవగాహన వచ్చింది కదా. శరీరానికి తక్షణ శక్తిని అందించే క్రమంలో భాగంగా ఇతర కృత్రిమ చక్కెరలు కలిపిన పానీయాలు, ఆహార పదార్ధాల మీద ఆధారపడే కన్నా, చెరకు రసం తీసుకోవడం మూలంగా అద్భుతమైన లాభాలను పొందవచ్చు. కాని మధుమేహం వంటి, చక్కెర ఆధారిత దీర్ఘకాలిక సమస్యలతో భాద పడేవారు మాత్రం, వైద్యుని సలహా పాటించడం ఉత్తమం.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

<strong>Most Read:ఉదయం పూట శృంగారంలో పాల్గొంటే అక్కడ బాగా నొప్పి వస్తుంది, తట్టుకోలేకపోతున్నా, కారణం ఏమిటి?</strong>Most Read:ఉదయం పూట శృంగారంలో పాల్గొంటే అక్కడ బాగా నొప్పి వస్తుంది, తట్టుకోలేకపోతున్నా, కారణం ఏమిటి?

English summary

Sugarcane Juice For Weight Loss: 7 Reasons It May Help You Shed Kilos Faster!

Sugarcane Juice For Weight Loss: 7 Reasons It May Help You Shed Kilos Faster,How to lose weight by drinking sugarcane juice? Read this article here to learn the benefits of sugarcane juice for weight loss.
Desktop Bottom Promotion