For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వయసు 40 మీద పడిన వారికి సూచించదగిన బరువుతగ్గే సూచనలు

|

నిజానికి 40సంవత్సరాల వయసు అంటే వయసు మీద పడడం కాదు. కానీ శక్తి క్షీణత ప్రారంభమయ్యే దశగా చెప్పబడుతుంది. నిద్రలేమి, నిశ్చల జీవనశైలి, వ్యాయామానికి సరైన సమయం కేటాయించలేకపోవడం మొదలైన అంశాల కారణంగా ఈ దశ ప్రారంభమవుతుంది. కానీ భాధపడాల్సిన అవసరం లేదు. మీరు తలచుకుంటే, ఇదివరకటిలా, లేదా మీరు ఆశించే చురుకైన జీవనాన్ని, దేహధారుడ్యాన్ని కూడా తిరిగిపొందవచ్చు. కాని అన్నిటికన్నా మానసిక స్థైర్యం, సంకల్పం ముఖ్యం.

ఇక్కడ “ఎందుకు” అనే ప్రశ్నకి ఆస్కారమే లేదు. కొందరు వయసు రీత్యా ఏదైనా నిర్ణయాలను తీసుకోవాలన్న ఆలోచనలు చేయాలన్నా భయపడుతారు. కానీ, ఒక సరైన ప్రణాళికను అవలంభించడం ద్వారా ఆశించిన ఎటువంటి ఫలితాన్నైనా పొందవచ్చు.

ఇప్పుడు ఇక్కడ పొందుపరుస్తున్న కొన్ని ముఖ్యమైన పద్దతులను అనుసరించడం ద్వారా, మీరు ఆశించిన ఫలితాలను పొందగలరు.

The Complete Weight-Loss Guide For Men over 40

ఈవ్యాసంలో తమ దేహ దారుడ్యాన్ని కోల్పోయిన 40 వయసు పైబడిన వ్యక్తులకు, తమ బరువును తేలికగా కోల్పోయి తిరిగి రూపాన్ని సంతరించుకునేలా సహాయం చేయగలిగిన అంశాలను పొందుపరచడం జరిగింది.

బరువు కోల్పోయే ప్రక్రియలో ముఖ్యమైన అంశాలు:

అధిక బరువును కోల్పోయే ప్రక్రియలో భాగంగా, ముఖ్యంగా రెండు విషయాలను అర్ధం చేసుకోవలసి ఉంటుంది.

1.సరైన ఆహార ప్రణాళిక

2. క్రమం తప్పని వ్యాయామం

పొట్టచుట్టూ ఉన్న కొవ్వుని తగ్గించుకునే క్రమంలో భాగంగా యుక్తవయసులోని వారితో పోల్చినప్పుడు, 40 వయసు మీద పడిన వాళ్ళు, తమ ఆహారపు అలవాట్లలో మరియు వ్యాయామాలలో కొన్ని భిన్న పద్దతులను అవలంబించవలసి ఉంటుంది. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం, కాలరీలు అధికం కాకుండా, సరైన పద్దతిలో వ్యాయామం చేయడం వంటివి ముఖ్యమైనవి.

అలాగని మీ ఆహారంలో పూర్తిగా కోత విధించాలని, ఆహార శైలినే పూర్తిగా మార్చేయ్యాలని మేము చెప్పడంలేదు.

మాంసం మరియు ఆల్కహాల్ నుండి దూరంగా ఉండటం, పిండి పదార్ధాలను తగ్గించడం, చేపల మీద దృష్టి పెట్టడం, ప్రతి భోజనంలో 25-30 గ్రాముల అధిక-నాణ్యత ప్రోటీన్లు ఉండేలా చూసుకోవడం. మొదలైనవి.

మీరు మీ వ్యక్తిగత పోషకాహార నిపుణుడి సూచనల ప్రకారం ఆహారాన్ని తీసుకోవచ్చు లేదా మీ ఆహార ప్రణాళికలో మార్పులు చేస్కోవచ్చు.

ఒక నిర్ణయంతో మీరు సరైన ఆహారపు అలవాట్లకు సిద్దపడి, క్రమంగా అలవాటు పడిన ఎడల, నెమ్మదిగా మీరు వ్యాయామానికి కూడా సిద్దం కావొచ్చు. తద్వారా ఒక జీవన శైలి పెంపొందుతుంది. రోజులో కనీసం ౩౦ నిమిషాల వ్యాయామం చేయడం ద్వారా ఎన్నో సమస్యల నుండి దూరంగా ఉండవచ్చని నిపుణులు చెప్తున్నారు కూడా. సాధారణ వ్యాయామాలైన కార్డియో, స్విమ్మింగ్, బ్రిస్క్ వాక్, రన్నింగ్ నుండి నిపుణుల సలహా మరియు సూచనలతో కాస్త మోతాదును కూడా పెంచవచ్చు.

బరువు నష్టం కోసం సరైన ప్రేరణ పొందండి:

ఏది కూడా రాత్రికి రాత్రే ఫలితాలు వచ్చేయాలి అంటే జరగదు. సాధన ముఖ్యం. కొందరికి వారాలలో ఫలితాలు కనిపిస్తే కొందరికి నెలలు పట్టవచ్చు. మారిన జీవన శైలి, పట్టుదల, క్రమశిక్షణ మొదలైవని ఎన్నో ఇందులో ప్రధాన అంశాలుగా ఉంటాయి.

అదేవిధంగా ఏదో ఒక అలవాటు మారినంత మాత్రాన ఫలితాలు వచ్చేయాలని కూడా లేదు, కొన్ని ఉపాయాలు కూడా పాటించవలసి ఉంటుంది. వాటి గురించిన వివరణలు ఈ వ్యాసంలో తెలియబరుస్తున్నాం.

బరువును తగ్గించుకోడానికి ముందు

బరువును తగ్గించుకోడానికి ముందు

1.బరువును తగ్గించుకోడానికి ముందు మిమ్ములను మీరు ప్రశ్నించుకోవాలి. అసలు నిజంగా మీరు బరువు తగ్గాల్సిన అవసరం ఉందా? మీరు పాటించే విధానాల వలన మీ ఆరోగ్య పరిస్థితులకు ఏమైనా ఆటంకాలు ఏర్పడుతాయా? మీ జీవన శైలిలో ఆకస్మిక మార్పులు కుటుంబాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తాయి? ఇలా మీకంటూ ఒక అవగాహన ఉండాలి.

ఈ నిర్ణయం పూర్తిగా మీమీదే ఆధారపడి ఉంటుంది. మీరు మీ లక్ష్యానికి కట్టుబడి ఉన్నప్పుడే, ఒక ప్రయోజనాన్ని కూడా పొందగలరని మరువకండి. కావున నిర్ణయాలలో లోతైన ఆలోచనలు ముఖ్యం.

 ఒక లక్ష్యం నిర్ధారించుకోండి –

ఒక లక్ష్యం నిర్ధారించుకోండి –

2. ఒక లక్ష్యం నిర్ధారించుకోండి - దేనికైనా ఒక ప్రేరణ ముఖ్యం, క్రమంగా లక్ష్యాలు, అంచనాలు మొదలైనవి జతకూడుతాయి. నియమ నిబద్దతలతో సాధించగలిగిన లక్ష్యాలు ఎదురుగా ఉన్నప్పుడు కూడా ఫలితాలను పొందలేకపోతే, అది మన పట్టుదలలో లోపం ఉన్నట్లే. సాధించలేని లక్ష్యాలను గురించి కాదు, కానీ ఏ లక్ష్యాన్నైనా సాధించడానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గంలో ఒడిదుడుకులు ఎదురైనా పోరాడి గెలవాలి. దీనికి ఆత్మస్థైర్యం, దృఢనిశ్చయం అవసరం అని మరవొద్దు.

మీ ప్రోగ్రెస్ ట్రాక్ -

మీ ప్రోగ్రెస్ ట్రాక్ -

3. మీ ప్రోగ్రెస్ ట్రాక్ - మీ పురోగతిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవడం కూడా మీ లక్ష్య సాధనలో ఉపయోగపడుతుంది. మీ లక్ష్యాలను విస్మరించకుండా ముందుకు సాగడంలో ఈ అలవాటు మీకు సహాయం చేస్తుంది. మీరు బరువు తగ్గే క్రమంలో పాటిస్తున్న విషయాలను, బరువులో మార్పులను ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవడం కూడా ముఖ్యమే అని మరవకండి.

మద్దతు అవసరం -

మద్దతు అవసరం -

4. మద్దతు అవసరం - బరువు తగ్గాలి అన్న ఆలోచన మీ ఒక్కరిలోనే ఉంచకండి, నలుగురితో ఎందుకు మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు అని పంచుకోండి. ముఖ్యంగా మీ ప్రియమైన వారితో పంచుకోవడం , నిపుణుల సలహాలు తీసుకోవడం వంటి చర్యలకు ఉపక్రమించాలి.

మీ ఆరోగ్య సంబంధిత మరియు ఫిట్నెస్ విషయాలలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మమ్ములను సంప్రదించండి. బోల్డ్స్కీ తరపున మా వంతు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటాము.

40 సంవత్సరాల మీదపడిన వ్యక్తులు ఆశించిన రీతిలో బరువు కోల్పోవుటలో పాటించవలసిన దశలు:

మీరు 40 సంవత్సరాలుగా ఎన్నో అనుభవాలు కలిగి ఉన్నారు. యుక్తవయసుని దాటి వచ్చిన మీకు సవాళ్లు ఒక లెక్క కాదని మీకు మరియు మాకు కూడా తెలుసు. కానీ, కొందరిలో ఉన్న నిరాశావాదం వారిని వెనక్కి లాగుతుంటుంది. భవిష్యత్ సంతోషానికి ఆరోగ్యం కూడా తోడవ్వాలి, లేకుంటే జీవితంలో అనేక ప్రతికూల సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది.

ఆహార ప్రణాళిక, వ్యాయామం మరియు కొన్ని అదనపు ట్రిక్స్ తెలపడం ద్వారా మీ బరువు తగ్గించుటలో, లేదా పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించడంలో సహాయం చేయగలము. కానీ పాటించాల్సిన భాద్యత మాత్రం మీదే.

అన్నిటికన్నా నిద్ర ముఖ్యం!

అన్నిటికన్నా నిద్ర ముఖ్యం!

#1- అన్నిటికన్నా నిద్ర ముఖ్యం! మీరు రోజులో కనీసం 6-7 గంటల నిద్రను కలిగి ఉండాలి. నిద్రలేమి జీవక్రియలపై ప్రభావాన్ని చూపి, బరువు తగ్గడంలో అవసరమైన హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది. క్రమంగా మీరు ఎంత కష్టం చేసిన ఆశించిన ఫలితాలు పొందడానికి ఎక్కువ సమయం పడుతుంది, లేదా ఆశాజనక ఫలితాలు పొందలేకపోవచ్చు కూడా.

బరువు కోల్పోవాలి అని మీరు ఎందుకు కోరుకుంటున్నారు

బరువు కోల్పోవాలి అని మీరు ఎందుకు కోరుకుంటున్నారు

# 2- బరువు కోల్పోవాలి అని మీరు ఎందుకు కోరుకుంటున్నారు అన్న విషయాన్ని కలలో కూడా మరవకండి. ఆ ఆలోచన మీకు మరింత ప్రేరణగా మారుతుంది. మీరు పాటించే ప్రతి అంశం పట్ల దినచర్యలు నాట్ చేసుకోండి.

సాధారణ మరియు స్థిరమైన ఆహారం వైపుకు

సాధారణ మరియు స్థిరమైన ఆహారం వైపుకు

# 3 సాధారణ మరియు స్థిరమైన ఆహారం వైపుకు జీవనశైలి మార్పులను చేయండి. ఆహారపు నియమాల గురించి అనేక వ్యాసాలలో వివరణలు ఇవ్వడం జరిగినది.

జిమ్ లో వ్యాయామం చేయక పోయినా

జిమ్ లో వ్యాయామం చేయక పోయినా

# 4- జిమ్ లో వ్యాయామం చేయక పోయినా, రోజువారీ కార్యకలాపాలలో భాగంగా కనీసం 30-45 నిమిషాలు వ్యాయామం ఉండేలా చూసుకోండి. మీ శరీరానికి సరైన ఆకృతిని అందివ్వడంలో కనీసం రోజువారీ కదలిక అవసరం, క్రమంగా మీ ఆకలి స్థాయిలను కూడా నియంత్రించవచ్చు. ముఖ్యంగా కార్డియో వ్యాయామాలకు, ఆస్కారం ఇవ్వండి.

 పైన చెప్పిన దశలు మీకు సత్ఫలితాలను ఇస్తున్న ఎడల

పైన చెప్పిన దశలు మీకు సత్ఫలితాలను ఇస్తున్న ఎడల

# 5- పైన చెప్పిన దశలు మీకు సత్ఫలితాలను ఇస్తున్న ఎడల, అధికారిక వ్యాయామాలకు వెళ్ళడం ప్రారంభించండి. అత్యుత్తమ ఫలితాలను పొందడానికి నిపుణుని సలహాలు తీసుకుని ప్రణాళికా బద్దంగా చర్యలను పాటించవలసి ఉంటుంది.

మీ ప్రియమైన వ్యక్తుల ఆరోగ్యాలతో కూడా మీ సంతోషాలు ముడిపడి ఉంటాయి. ఇక్కడ సమస్య మీకే ఉండనవసరం లేదు, ఒకవేళ మీ ప్రియమైన వారు అధిక బరువు సమస్యలతో భాదపడుతున్న ఎడల, వారి పట్ల సరైన జాగ్రత్త తీసుకుని, వారికి సూచనలు చేయాల్సిన అవసరం కూడా మీకుంది. ఇది వరకు అనేక వ్యాసాలలో, ఆహార ప్రణాళికలు, వ్యాయామాల గురించిన అనేక వివరాలు అందివ్వడం జరిగినది. మీ జీవన శైలిలో మార్పులు తీసుకుని వచ్చే క్రమంలో బోల్డ్స్కీ పేజీ ఎంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తున్నాము.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆరోగ్య సంబంధిత అంశాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.

English summary

The Complete Weight-Loss Guide For Men over 40

Although, post 40, most men tend to get out of shape due to sleep deprivation and sedentary lifestyle, there's no reason why, even at this age, you can't turn your fitness and physique quotient around. You need to get into a healthier diet, sign up for a couple of daily activities, and be motivated enough to execute them on a daily basis. That's the key.
Story first published: Thursday, July 12, 2018, 17:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more