వెయిట్ లాస్ కి సహకరించే 10 బ్రేక్ ఫాస్ట్ ఐడియాస్

Subscribe to Boldsky

బ్రేక్ ఫాస్ట్ అనేది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచేందుకు ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంతే కాక, వెయిట్ లాస్ కి కూడా బ్రేక్ ఫాస్ట్ తోడ్పడుతుంది. ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ ని శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించే విధంగా ప్లాన్ చేసుకోవడమనేది సింపుల్ ట్రిక్. ఇక్కడ, వెయిట్ లాస్ కోసం ఏం తినాలో మీరు తెలుసుకుంటారు.

దాదాపు సగం మంది రోజూ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తూ ఉంటారు. తద్వారా, కేలరీలను కట్ చేయవచ్చని వారి అభిప్రాయం. కానీ, మిడ్ మార్నింగ్ లేదా లంచ్ లో ఎక్కువగా ఆకలి మీదుండటంతో వారు అధిక మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటారు. బ్రేక్ ఫాస్ట్ స్కిప్పర్స్ వారి కేలరీల ఇంటేక్ ను లంచ్ లో అలాగే డిన్నర్ లో పెంచుకుంటారు.

weight loss breakfast menu

బ్రేక్ ఫాస్ట్ ద్వారా లభించే బెనిఫిట్స్ అనేవి లెక్కకట్టలేనంతవి. బ్రేక్ ఫాస్ట్ ను ప్రతి రోజూ ఒక అలవాటుగా తీసుకోవాలి. దాదాపు 78 శాతం మంది ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ ను తీసుకుంటారని అలాగే 90 శాతం మంది అప్పుడప్పుడూ బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తారని ఒక సర్వే తెలుపుతోంది.

బ్రేక్ ఫాస్ట్ అనేది రోజులో ముఖ్యమైన మీల్. అటువంటి బ్రేక్ ఫాస్ట్ లో ఎటువంటి ఫుడ్ ను ఇంక్లూడ్ చేయాలో తెలుసుకుంటే మీ ఆరోగ్యాన్ని మీరు సంరక్షించుకోగలుగుతారు. ఎక్కువగా, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలాగే హోల్ గ్రెయిన్స్ ని డైట్ లో భాగంగా చేసుకోవాలి.

వెయిట్ లాస్ కి సహకరించే బ్రేక్ ఫాస్ట్ ఐడియాస్ ను ఇక్కడ పొందుబరిచాము.

1. రాస్ప్ బెర్రీస్ మరియు చియా సీడ్స్ పుడ్డింగ్:

1. రాస్ప్ బెర్రీస్ మరియు చియా సీడ్స్ పుడ్డింగ్:

ఒక కప్పుడు రాస్ప్ బెర్రీస్ లో 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. జర్నల్ న్యూట్రిషన్ కి చెందిన ఇటీవలి రీసెర్చ్ ప్రకారం ఎక్కువ ఫైబర్ ను తీసుకోవడం ద్వారా శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. వెయిట్ లాస్ గోల్ ను అఛీవ్ చేయగలుగుతారు. ప్రతి 1000 కేలరీలు 8 గ్రాముల ఫైబర్ ని తీసుకోవటం ద్వారా 4½ పౌండ్ల వెయిట్ లాస్ ను మీరు గమనించగలుగుతారు. రాస్ప్ బెర్రీస్ లో విటమిన్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఎలాజిక్ యాసిడ్ అనే ఫినోలిక్ కాంపౌండ్ లు ఇందులో ఎక్కువగా లభిస్తుంది. ఇది క్యాన్సర్ సెల్ గ్రోత్ ను అరికడుతుంది.

2. ఓట్ మీల్:

2. ఓట్ మీల్:

ఓట్ మీల్ అనేది వెయిట్ లాస్ ను అనేకరకాలుగా ప్రోత్సహిస్తుంది. మొదటగా, ఇందులో ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. మీ టమ్మీని ఎక్కువసేపు ఫుల్ గా ఉంచుతుంది. తద్వారా, ఆకలి త్వరగా వేయదు. ఇంకొకటి ఏమనగా, ఓట్ మీల్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ ను తీసుకుంటే శరీరంలో అదనపు ఫ్యాట్ అనేది కరిగిపోతుంది. ముఖ్యంగా, అబ్డోమెన్ లోని పేరుకుపోయిన విజెరాల్ ఫ్యాట్ ను తొలగిస్తుంది.

4. ఎగ్స్:

4. ఎగ్స్:

వెయిట్ లాస్ ఫుడ్స్ లో ఎగ్స్ అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలో హై క్వాలిటీ ప్రోటీన్ లభ్యమవుతుంది. అలాగే హెల్తీ ఫ్యాట్స్ తో పాటు మరెన్నో ఎసెన్షియల్ విటమిన్స్ మరియు మినరల్స్ కూడా లభ్యమవుతాయి. ఎగ్స్ లో లభించే యూనిక్ ప్రాపర్టీస్ అనేవి వెయిట్ లాస్ కి అనేకవిధాలుగా తోడ్పడతాయి. ఒక పెద్ద ఎగ్ లో దాదాపు 78 కేలరీలు లభిస్తాయి. పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా, ఎగ్ యోల్క్ లో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి, ఎగ్ ని బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా చేసుకోండి.

5. బ్లాక్ బీన్స్:

5. బ్లాక్ బీన్స్:

బ్లాక్ బీన్స్ లో సాల్యుబుల్ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది బెల్లీ ఫ్యాట్ పై పోరాటం చేస్తుంది. బీన్స్ అనేవి టమ్మీని ఫుల్ గా ఉంచడమే కాకుండా మీరు స్లిమ్ గా అయ్యేందుకు కూడా తోడ్పడుతుంది. సాల్యుబుల్ ఫైబర్ ని ప్రతి రోజూ దాదాపు 10 గ్రాముల వరకు డైట్ లో పెంచుతూ ఉంటే వెయిట్ లాస్ గోల్ ని త్వరగా రీచ్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ లో బ్లాక్ బీన్స్ ను ఆమ్లెట్ లా లేదా సాల్సాలా తీసుకోవచ్చు.

6. పీనట్ బటర్:

6. పీనట్ బటర్:

ప్రొసెస్డ్ పీనట్ బటర్ అనేది షుగర్, సాల్ట్ మరియు పీనట్ ఆయిల్ తో ఫిల్ అయి ఉంటుంది. అందువలన, ఆర్గానిక్ పీనట్ బటర్ ను తీసుకోవడం మంచిది. పీనట్ బటర్ లో మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు జీన్స్ ను రేగులేట్ చేసే జెనిస్టెయిన్ అనే కంపౌండ్ లభిస్తుంది. పీనట్ బటర్ ని మార్నింగ్ స్మూతీలలో కలిపి తీసుకోండి. అందులో ఆల్మండ్ మిల్క్ మరియు అరటిపండ్లను కలపండి. ఈ హెల్తీ డ్రింక్ అనేది హెల్తీ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్ ని పెర్ఫెక్ట్ గా బాలన్స్ చేయడానికి తోడ్పడుతుంది.

7. ఆల్మండ్ బటర్:

7. ఆల్మండ్ బటర్:

నట్స్ ని తక్కువగా తీసుకునే వారు నట్స్ ని తరచూ తీసుకునే వారికంటే ఎక్కువగా ఓవర్ వెయిట్ సమస్యతో ఇబ్బంది పడతారు. నట్స్ లో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. అలాగే నట్స్ అనేవి ఆకలిని తగ్గిస్తాయి. ఎక్కువసేపు కడుపు నిండిన భావనని కలిగిస్తుంది. ఆల్మండ్ బటర్ లో ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ మరియు మోనో అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ లభిస్తాయి. ఆల్మండ్ బటర్ లోని బెనిఫిట్స్ ను పొందేందుకై, హోల్ గ్రెయిన్ టోస్ట్ లో ఆల్మండ్ బటర్ ని స్ప్రెడ్ చేసుకుని తినవచ్చు.

8. సాల్మన్:

8. సాల్మన్:

సాల్మన్ లో ప్రోటీన్ మరియు ఒమేగా-3 ఫ్యాటీ ఏసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు తోడ్పడతాయి. స్మోక్డ్ సాల్మన్ ని హోల్ గ్రెయిన్ టోస్ట్ పై అవొకాడో తో తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. సాల్మన్ అనేది లీన్ ప్రోటీన్ సోర్స్. ఇది వెయిట్ లాస్ కి తోడ్పడడంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని అరికట్టడానికి తోడ్పడుతుంది. తద్వారా, టైప్ 2 డయాబెటిస్ సమస్యను అరికడుతుంది.

9. చికెన్ బ్రెస్ట్:

9. చికెన్ బ్రెస్ట్:

చికెన్ బ్రెస్ట్ ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే వెయిట్ లాస్ గోల్ ని రీచ్ అవగలుగుతారు. చికెన్ బ్రెస్ట్ లో లభించే పోషకాల కాంబినేషన్ అనేది మిమ్మల్ని రోజంతా ఎనర్జటిక్ గా అలాగే ఫుల్ గా ఉంచేందుకు తోడ్పడుతుంది. ఇందులో లభించే ప్రోటీన్ కంటెంట్ వలన దీనిని ఎక్కువగా వెయిట్ లాస్ ఫుడ్స్ కి రికమెండ్ చేస్తూ ఉంటారు. ప్రతి 3 ఔన్సుల సెర్వింగ్ లో 25 గ్రాముల ప్రోటీన్ లభ్యమవుతుంది. బ్రేక్ ఫాస్ట్ మీల్స్ లో 25 గ్రాముల ప్రోటీన్ లభ్యమయితే కడుపు నిండిన భావన పెరుగుతుంది. కాబట్టి, ఆ రోజులో ఆహారాన్ని మితంగానే తీసుకుంటారు.

10. బెర్రీస్:

10. బెర్రీస్:

బెర్రీస్ ను బ్రేక్ ఫాస్ట్ కి తగిన ఫ్రూట్స్ గా భావించవచ్చు. ఇందులో గుండె ఆరోగ్యానికి మంచి చేసే యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. అలాగే, ఇందులో సాటియేటింగ్ ఫైబర్, విటమిన్ సి మరియు విటమిన్ కే లు కూడా లభిస్తాయి. బెర్రీస్ లో పోలీఫెనాల్స్ అనబడే సహజ కెమికల్స్ లభ్యమవుతాయి. ఇవి ఫ్యాట్ ఫార్మింగ్ ను అడ్డుకుని వెయిట్ లాస్ కు తోడ్పడతాయి. వీటిని సెరెల్, ఓట్ మీల్, అలాగే వెయిట్ లాస్ షేక్స్ లో జోడించి బ్రేక్ ఫాస్ట్ ను ఎంజాయ్ చేయండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    These Are The 10 Best Breakfast Ideas For Weight Loss

    The benefits of breakfast are innumerable. Eating breakfast should be a daily habit and 78 percent of the people reportedly eat breakfast every day and almost 90 percent skip their breakfast. The best breakfast ideas for weight loss are having raspberries and chia seeds pudding, oatmeal, yogurt, eggs, black beans, chicken breast, berries, etc..
    Story first published: Saturday, April 14, 2018, 16:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more