బరువు తగ్గటానికి ఏ సూప్ సాయపడుతుంది

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

రెస్టారెంట్ కి వెళ్లగానే మీ మొదటి ఆర్డర్ ఏమవుతుంది? సూప్, కదా? సూప్ వలన మీ కడుపు కొంత నిండి, ఆకలి కొంచెం తగ్గుతుంది. ద్రవపదార్థాలైన సూప్ లు వంటివి ఎక్కువ పరిమాణంలో కూడా తక్కువ క్యాలరీలు కలిగివుండటం వలన బరువు తగ్గటంలో సాయపడతాయి.

అయితే, సూప్ లు బరువు తగ్గటంలో ఎలా సాయపడతాయి? యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ వారి ఆహార సూచనల ప్రకారం, ఉడికించిన లేదా వెచ్చబెట్టిన సూప్ లను తాగేవారికి బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

what soup can help you lose weight

ఎందుకంటే ఫైబర్, ప్రొటీన్లు కడుపునిండేలా చేస్తాయి. అందుకని చిక్కుళ్ళు, కాయగూరలు, సన్నని ప్రొటీన్ మాంసం వంటివి ఉన్న సూప్ లు ఎంచుకోండి.

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రో అండ్ ప్రివెన్షన్ వారి సలహా ప్రకారం చెడ్డార్ ఛీజ్ అలాగే క్రీమ్ ఆధారంగా ఉన్న సూప్ లకి దూరంగా ఉండండి.

బరువు తగ్గే సూప్ లలో విటమిన్ ఎ కోసం క్యారట్లు, నియాసిన్ కోసం బార్లీ, విటమిన్ బి12 ఇచ్చే చికెన్ బ్రెస్ట్ వంటివి వాడాలి.

బరువు తగ్గటానికి ఇంకా ఏ సూప్ లు ఉపయోగపడతాయో కింద చదవండి.

1.చికెన్, రైస్ సూప్

1.చికెన్, రైస్ సూప్

బరువు తగ్గటం కోసం చికెన్, రైస్ సూప్ తినవచ్చు. చికెన్ లో ఎక్కువ ప్రొటీన్ ఉండి కడుపు నిండేట్లా చేసి, చాలాసేపు ఆకలి వేయకుండా చూస్తుంది.అందులో ఉండే సిస్టీన్ అనే అమినోయాసిడ్ డీహైడ్రేషన్ ను నివారించి, గొంతులో వాపుతో పోరాడుతుంది. మరోవైపు బియ్యం కార్బోహైడ్రేట్ అవటం వలన మీకు శక్తిని అందిస్తుంది.

2.బటర్ నట్ స్క్వాష్ సూప్

2.బటర్ నట్ స్క్వాష్ సూప్

కాయగూరల సూప్ విషయానికొచ్చేసరికి, ఒక రకమైన వాల్ నట్ బటర్ నట్ అన్నిటికన్నా మంచిది. ఎందుకంటే ఇది విటమిన్ ఎ, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్లు ఉన్న ఆరోగ్యకరమైన కాయగూరల్లో ఒకటి. బటర్ నట్ సూప్ ఒకసారి తీసుకుంటే 82 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఒబేసిటీ లక్షణాలు కొవ్వు ఏర్పడకుండా నివారిస్తాయి.

3.బ్రొకోలి సూప్

3.బ్రొకోలి సూప్

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్ ఇంకా ఫ్లేవనాయిడ్లు కలిగిన బ్రొకోలి ఒక సూపర్ ఫుడ్. విటమిన్ సి కొల్లజెన్ , ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇస్తుంది. విటమిన్ ఇ మరోవైపు చర్మం లోపలి పొరలను రక్షిస్తుంది. బ్రొకోలిలో కాల్షియం ఎక్కువగా ఉండి బరువు తగ్గడం,ఎముకల ఎదుగుదలలో సాయపడుతుంది.

4.బేక్ చేసిన బంగాళదుంప సూప్

4.బేక్ చేసిన బంగాళదుంప సూప్

బంగాళదుంప సూప్ బరువు తగ్గటంలో చాలా ప్రభావం చూపిస్తుంది, ఆరోగ్యకరం కూడా. బంగాళదుంప సూప్ ను క్రీమ్ ను వాడి చేస్తారు, కానీ మీరు ఇంట్లో ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు.ఈ సూప్ లో కొవ్వు ఉండదు, సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది, విటమిన్ సి, విటమిన్ బి6, ఫైబర్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

బంగాళదుంపలలో అరటిపండు కన్నా ఎక్కువ పొటాషియం ఉంటుంది.

5.ఆవుమాంసం, బార్లీ సూప్

5.ఆవుమాంసం, బార్లీ సూప్

బార్లీలో పోషకాలు ఎక్కువగా ఉండి మీ కడుపు నిండుతుంది. అవయవాల చుట్టూ కొవ్వును కరిగించి ఇది బరువుతగ్గటంలో కూడా సాయపడుతుంది. బార్లీలో 16గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. మరోవైపు, బీఫ్ లో ఐరన్ , ప్రొటీన్,ఇతర అవసరమైన విటమిన్లు, ఖనిజలవణాలు ఎక్కువగా ఉంటాయి. బీఫ్, బార్లీ సూప్ డిన్నర్ సమయంలో తక్కువ కాలరీలున్న సూప్ గా బాగా పనికొస్తుంది.

6.గుమ్మడికాయ సూప్

6.గుమ్మడికాయ సూప్

గుమ్మడికాయ గుండెకి చాలా మంచిది. అందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజూ గుమ్మడికాయ సూప్ తాగటం వలన మీ కంటిచూపు మెరుగయ్యి, రక్తపోటు తగ్గి, మంచి నిద్రపట్టి, గుండె ఆరోగ్యంగా మారుతుంది. మర్చిపోకండి, వీటిల్లో ఉండే ఫైబర్ వలన బరువు తగ్గటంలో కూడా సాయపడతాయి.

7.కాలీఫ్లవర్ సూప్

7.కాలీఫ్లవర్ సూప్

బరువు తగ్గటానికి ఉపయోగపడే మరో కూర కాలీఫ్లవర్. ఒకసారి తినే కాలీఫ్లవర్ పరిమాణంలో 77 శాతం రోజుకి కావాల్సిన విటమిన్ సి ఉంటుంది. రోజూ కాలీఫ్లవర్ సూప్ తీసుకోవటం వలన విటమిన్ కె, పీచుపదార్థం, ఫాస్పరస్, నియాసిన్, రిబోఫ్లేవిన్, ఫోలేట్, విటమిన్ బి6, పొటాషియం,మాంగనీస్ అందుతాయి. ఈ క్రూసిఫెరస్ కూరల్లో బరువు తగ్గటానికి సాయపడే పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది.

English summary

What Soup Can Help You Lose Weight

Individuals who eat clear or broth-based soups may have a better chance at controlling their weight. Because due to the fibre and protein content present in it. The soups that will aid in weight loss are cauliflower soup, broccoli soup, butternut squash soup, rice and chicken soup, vegetable and quinoa soup, beef and barley soup, etc.
Story first published: Tuesday, April 10, 2018, 11:45 [IST]