For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడానికి రొయ్యలు ఏవిధంగా సహాయపడుతాయో తెలుసా

|

సీఫుడ్ గురించిన ఆలోచన వస్తే మీ మనస్సులో స్పురించే మొదటి విషయం ఏమిటి ? రొయ్యలు, ష్రిమ్ప్స్(చిన్న రొయ్యలు), పీతలు అవునా ? రొయ్యలు పౌష్టికాహారంగా ఉండడమే కాకుండా, బరువు కోల్పోవడంలో కూడా ఉత్తమంగా సహాయం చేయగలదని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. బరువు తగ్గడంలో రొయ్యలు ఎలా సహాయపడగలవో ఈ కథనంలో తెలుసుకుందాం.

వాస్తవానికి, రొయ్యలు మరియు ష్రిమ్ప్స్ విషయంలో ప్రజలు ఒకింత గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఇవి చూసేందుకు ఒకేవిధంగా ఉంటూ, ఇంచుమించు ఒకే రుచిని కూడా కలిగి ఉంటాయి. అయితే ఇవి రెండూ భిన్న జాతులకు చెందినవిగా చెప్పబడుతాయి. రొయ్యలు మంచి నీటి నుండి మాత్రమే వస్తాయి, కానీ ష్రిమ్ప్స్ మంచి నీరు మరియు ఉప్పు నీటిలో సైతం మనుగడ సాగించగలవు.

Prawns

ష్రిమ్ప్స్ చల్లని మరియు వెచ్చని నీటిలో కూడా జీవించగలవు. అవి చల్లని జలాలలో ఉంటే, పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి. ఐతే, ష్రిమ్ప్స్ కన్నా రొయ్యలు చాలా పెద్దవిగా ఉంటాయి. అంతే కాకుండా కండ పుష్ఠిని కలిగి, ఎక్కువ మాంసంతో కూడుకుని ఉంటాయి.

రొయ్యలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలంగా ఉంటాయి. అంతేకాకుండా శరీరానికి అవసరమైన ప్రోటీన్ మొతాదులను సరైన మొత్తాలలో కలిగి ఉండి, కణజాలాల నిర్మాణానికి దోహదపడుతాయి. అంతేకాకుండా, అధిక బరువును కోల్పోవడంలో కూడా సహాయపడుతుంది.

రొయ్యలు కొవ్వు నిక్షేపాలలో తక్కువగా ఉంటాయి :

రొయ్యలు సహజంగానే కొవ్వు నిక్షేపాలలో తక్కువగా ఉంటాయి. కేవలం 0.16 గ్రాముల ఫ్యాట్ ఉండే రొయ్యలు, అసంతృప్త కొవ్వులకు ఒక అద్భుతమైన మూలంగా ఉంటాయి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉత్తమంగా సహాయపడగలదు. బరువును తగ్గించడంలో కొవ్వు నిక్షేపాలలో తక్కువగా ఉండే రొయ్యలు ఒక పరిపూర్ణ ఎంపిక అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. వాటిని ఆస్పరాగస్, వేయించిన చిక్కుళ్ళు వంటి ఇతర తక్కువ క్యాలరీలు కలిగిన కూరగాయలతో కూడా కలిపి తీసుకోవచ్చునని సూచించబడుతుంది.

రొయ్యలు ప్రోటీన్ నిక్షేపాలకు మంచి మూలం :

2 ఔన్సుల రొయ్యల సర్వింగ్లో 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం సమర్థవంతంగా బరువును తగ్గించడంలో, మరియు బరువును నిర్వహించడంలో సహాయపడుతుందని చెప్పబడుతుంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రోటీన్ మీ శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది. క్రమంగా ఎక్కువ కేలరీలను కరిగించడంలో సహాయపడుతుంది. మరియు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.

రొయ్యలు మీ జీవక్రియలను క్రమబద్దీకరిస్తూ, హార్మోనుల నిర్వహణలో ఉత్తమ ప్రభావాలను కలిగి ఉంటాయి. GLP-1, PYY మరియు CCK వంటి ఆకలిని తగ్గించే హార్మోనుల స్థాయిలను పెంచుతాయి. ఆకలి సంబంధించిన ప్రధాన హార్మోన్ అయిన ఘ్రెలిన్ స్థాయిలను కూడా తగ్గించగలుగుతుంది. ఇది మీకు అనారోగ్యకర జంక్ ఫుడ్ మీదకు మనసు వెళ్ళకుండా చూడగలుగుతుందని చెప్పబడుతుంది.

రొయ్యలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి :

రొయ్యలు బరువు తగ్గించడంలో ఉత్తమంగా సహాయపడగలదా ? అంటే అవుననే చెప్పాలి. రొయ్యలు కూడా ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కు అద్భుతమైన మూలంగా ఉంటాయి. ప్రధానంగా ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, పాలీ - అన్ శాచ్యురేటెడ్ (అసంతృప్త) ఫ్యాటీ ఆమ్లాలుగా ఉంటాయి. వీటిని తరచుగా వినియోగిస్తున్న ఎడల పొట్ట చుట్టూ మరియు తొడల వద్ద పేర్కొన్న కొవ్వు నిక్షేపాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ సమస్యలకు ఉత్తమ నివారిణిగా ఉండగలదని చెప్పబడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించడంలో మరియు అనారోగ్యకర కొవ్వు కణాలను సంహరించడంలో ఉత్తమంగా సహాయపడగలవు.

రొయ్యలలోని పోషక ప్రయోజనాలు :

రొయ్యలలో, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడే అసంతృప్త కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. రొయ్యలలో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ ఇ మొదలైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుండా, గణనీయ మొత్తాలలో ఉండే విటమిన్ B12, విటమిన్ B6 మరియు నియాసిన్లు మీ శరీరంలోని శక్తి స్థాయిలను పెంచడంలో సహాయం చేస్తూ, ఎర్ర రక్త కణాలను పెంపొందించడంలో కూడా కీలక పాత్రను పోషిస్తాయి. మరియు నరాల సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

రొయ్యలు ఇనుము నిక్షేపాలలో సమృద్ధిగా ఉంటాయి, ఇనుము శరీరానికి అవసరమైన ఒక ఉత్తమమైన ఖనిజం. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో సహాయపడే కీలక ఖనిజంగా ఉంటుంది. రొయ్యలలోని ఇతర ఆవశ్యక ఖనిజాలుగా జింక్, సెలీనియం, కాపర్, మరియు మెగ్నీషియం ఉన్నాయి.

జింక్ మరియు సెలీనియం, ఈ రెండు ఖనిజాలు శరీర రోగ నిరోధక వ్యవస్థను ఆరోగ్యకరరీతిలో ప్రోత్సహిస్తాయి. కాపర్, ఫాస్ఫరస్ మరియు మెగ్నీషియం అనేక జీవక్రియ ప్రక్రియల్లో ఉత్తమంగా సహాయపడతాయి మరియు దృఢమైన ఎముక పుష్ఠిని నిర్వహిస్తుంది.

దుష్ప్రభావాలు :

రొయ్యలు అత్యధిక పోషక నిల్వలను కలిగి ఉన్నప్పటికీ, ఇవి సోడియం నిల్వలలో కూడా అధికంగా ఉంటాయని చెప్పబడుతుంది. క్రమంగా ఇది ఆస్టియోపొరాసిస్, గుండె జబ్బులు మరియు రక్తపోటు ప్రమాదాన్ని పెంచవచ్చు. కావున పరిమిత మోతాదును అనుసరించాలని సూచించబడుతుంది.

రొయ్యలను తీసుకునే విధానం :

రొయ్యలను సరైన పద్దతిలో గ్రిల్ చేయడం, ఆవిరిపట్టడం, లేదా వేయించడం వంటి పద్దతుల ద్వారా తీసుకోవచ్చు. రొయ్యలు ఎల్లప్పుడూ తాజాగా, శుభ్రంగా ఉండేలా ఎంచుకోవాలి. పొడిగా కనిపించే రొయ్యలు లేదా విరిగిన షెల్ కలిగిన వాటిని నివారించండి. వీటిని వండటానికి ముందు వాటి షెల్ తొలగించి సిద్దపరచుకోవాలి.

బరువు తగ్గడంలో సహాయపడేలా రొయ్యలను వండేందుకుగల వివిధ మార్గాలు :

1. పోచింగ్ :

1. పోచింగ్ :

ఈ వంట పద్ధతిలో తక్కువ ఉష్ణోగ్రతలో రొయ్యలు వండటం జరుగుతుంది. నీటిలోని రొయ్యలు నెమ్మదిగా ఉడుకుతాయి. తాజా మూలికలు, లెమన్ జ్యూస్ మరియు కొన్ని అదనపు దినుసులు జోడించడం ద్వారా, ఉత్తమ ఫ్లేవర్ తో ఆస్వాదించడానికి వీలుగా ఉంటుంది.

2. ఉడికించడం లేదా ఆవిరిపట్టడం :

2. ఉడికించడం లేదా ఆవిరిపట్టడం :

రొయ్యలు వండేందుకు ఉత్తమంగా సరిపోయే మరో వంట పద్ధతి ఇది. రొయ్యలను, పార్స్లీ వంటి మూలికలతో కలిపి సీల్ చేసి, ఒక అల్యూమినియం ఫాయిల్లో తీసుకుని, అందులో ఉల్లిపాయలను, మరికొన్ని అవసరమైన దినుసులను వేసి, 5 నుండి 10 నిమిషాలపాటు 300 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఓవెన్లో ఉడికించాలి. లేదా ఒక మైక్రోవేవ్ స్టీమర్ లేదా మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో రొయ్యలు, సిట్రస్ రసాలు, మరియు వేయించిన ఉల్లిపాయలను వేసి రొయ్యలు గులాబీ రంగులోకి మారే వరకు అధిక ఉష్ణోగ్రతపై ఉడికించి తీసుకోవచ్చు.

3. పాన్లో కొద్దిగా నూనె వేసి వేయించడం (ఫ్రై) :

3. పాన్లో కొద్దిగా నూనె వేసి వేయించడం (ఫ్రై) :

నూనెలో వేసి రొయ్యలను వేయించడం ఉత్తమ వంటకంగా ఉంటుంది. ఇది సమృద్దిగా ఉండడమే కాకుండా రుచికరంగా కూడా ఉంటాయి. నూనెను తక్కువ వేడితో వేడిచేసి తర్వాత మూలికలను, మరియు దినుసులను జోడించి కలిపిన రొయ్యలను వేసి వేయించవలసి ఉంటుంది. అవి దృఢంగా అయ్యే వరకు పాన్లో వేడిచేసి, పాత్రలోకి తీసుకుని సర్వ్ చేయండి.

4. నూనెలో వేయించడం :

4. నూనెలో వేయించడం :

శెనగపిండి, తాజా మూలికలు, మసాలాలను జోడించి తయారుచేసిన పిండిలో రొయ్యలను కలిపి, ఆపై ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. త్వరితగతిన తయారయ్యే వంటకమే కాకుండా, రుచికరంగా కూడా ఉంటుంది.

English summary

Here's How Prawns Are Good For Weight Loss

Prawns are naturally low in fat, with only 0.16 grams of fat. Prawns contain 10 grams of protein in a 2 ounce serving and they are also an excellent source of omega 3 fatty acids. Prawns contain vitamins and minerals like calcium, phosphorous, copper, potassium, vitamin A, vitamin E, etc. Prawns can be consumed by grilling, steaming and stir-frying them.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more