For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HBD Ram Charan: రామ్ చరణ్ లాంటి బాడీ కావాలంటే ఇలా ట్రై చేయండి...

రామ్ చరణ్ కు ఎక్కువగా గుర్రపు స్వారీ అంటే ఇష్టం. అలాగే అప్పుడప్పుడు హిల్ స్టేషన్స్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక వినయ విధేయ రామ మూవీ తెరపై చూపించిన లుక్ కోసం చరణ్ చాలా కష్టపడ్డారు.

|

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్లేస్ ను రీప్లేస్ చేసే సత్తా ఉన్న హీరో రామ్ చరణ్ తేజ్. ప్రస్తుతం RRR సినిమాలో రాముని పాత్రలో కనిపించి అందరినీ అలరించారు. ఈ సినిమాలో చరణ్ బాడీ చూస్తే ఏంట్రా బాబు.. ఏం తింటున్నాడు ఈయన అనుకునేటట్లుగా ఉంది.

ఎలాంటి వర్క్ అవుట్స్ చేస్తే ఇలాంటి బాడీ వస్తుందబ్బా అని యూత్ మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ తీసుకునే డైట్, ఆయన జిమ్ లో వర్కవుట్స్ పై ఓ లుక్కేద్దామా.

చాలా కేర్

చాలా కేర్

ఫిట్ నెస్ విషయంలో ఈ మెగా పవర్ స్టార్ చాలా కేర్ తీసుకుంటారు. అంతేకాదు యూత్ కూడా ఫిట్ నెస్ ను కాపాడుకోండి అంటూ కూడా మెసేజ్ లు ఇస్తుంటాడు.

బాస్కెట్ బాల్

బాస్కెట్ బాల్

చరణ్ కు చిన్నప్పటి నుంచి బాస్కెట్ బాల్ అలాగే వాలీబాల్ క్రీడలంటే బాగా ఇష్టం. ఇప్పటికీ వీలు కుదిరితే అప్పుడప్పుడు ఆడుతూ ఉంటాడు. ఇక స్కూల్ లెవెల్ లోనే హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్నాడు చరణ్.

రన్నింగ్ చేయడం

రన్నింగ్ చేయడం

అలాగే చిన్నప్పటి నుంచే రన్నింగ్ చేయడం ప్రాక్టీస్ చేశాడు. ఇక రోజూ జిమ్ కు వెళ్లడం, బాడ్మింటన్ ఆడడం చరణ్ కు బాగా ఇష్టం.

కార్డియోపై శ్రద్ద

కార్డియోపై శ్రద్ద

చరణ్ రోజూ జిమ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా కార్డియోపై శ్రద్దపెడతారు. అలాగే సైక్లింగ్ కూడా ఎక్కువగా చేస్తారు. ఓన్లీ బాడీ బిల్డింగ్ కోసం వర్క్ జిమ్ లో వర్క్ అవుట్స్ చేయడమే కాదు మధ్యమధ్యలో ఆయన రన్నింగ్ తో పాటు కొన్ని రకాల ఔట్ డేర్ గేమ్స్ ఆడేందుకు ప్రిపరెన్స్ ఇస్తుంటారు.

Most Read :ఇలా చేస్తే జిమ్ కు వెళ్లకుండానే బరువు తగ్గొచ్చుMost Read :ఇలా చేస్తే జిమ్ కు వెళ్లకుండానే బరువు తగ్గొచ్చు

తోటలో పండిన కూరగాయలే

తోటలో పండిన కూరగాయలే

రామ్ చరణ్ తేజ్ ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటారు. ఆయన ఎక్కువగా ఆయన తోటలో పండిన కూరగాయలే తింటూ ఉంటారు. మాంసహారంతో పాటు శాకాహారానికి కూడా ఎక్కువగా ప్రిపరెన్స్ ఇస్తారు.

గుర్రపు స్వారీ

గుర్రపు స్వారీ

రామ్ చరణ్ కు ఎక్కువగా గుర్రపు స్వారీ అంటే ఇష్టం. అలాగే అప్పుడప్పుడు హిల్ స్టేషన్స్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక వినయ విధేయ రామ మూవీ తెరపై చూపించిన లుక్ కోసం చరణ్ చాలా కష్టపడ్డారు.

ప్రత్యేకంగా ఒక డైట్

ప్రత్యేకంగా ఒక డైట్

ఇందుకోసం రామ్ చరణ్ తేజ్ ప్రత్యేకంగా ఒక డైట్ కూడా ఫాలో అవుతున్నాడు. అలాగే జిమ్‌ లో రోజూ రకరకాల వర్క్ అవుట్స్ కూడా చేస్తున్నాడు. ఇటీవల చరణ్ భార్య ఉపాసన ట్విటర్ లో అందుకు సంబంధించిన వివరాలు కూడా పోస్ట్ చేసింది.

వీవీఆర్ డైట్ బై రాకేశ్ ఉదియారా

వీవీఆర్ డైట్ బై రాకేశ్ ఉదియారా

రామ్ చరణ్ వీవీఆర్ డైట్ బై రాకేశ్ ఉదియారా అంటూ అంటూ ఉపాపన చేసిన పోస్ట్ లో చరణ్ రోజూ తీసుకునే ఆహారం గురించి అన్ని వివరాలున్నాయి. రోజూ ఉదయం 8 గంటలకు చరన్ 3 ఎగ్ వైట్స్, 2 ఫుల్ ఎగ్స్, 3/4 కప్ ఓట్స్ బాదంపాలతో కలిపి తీసుకుంటారు.

Most Read :ఇంటిలోనే ఒక జిమ్ తయారు చేయండి!Most Read :ఇంటిలోనే ఒక జిమ్ తయారు చేయండి!

వెజిటబుల్‌ సూప్‌

వెజిటబుల్‌ సూప్‌

ఇక మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు 1 పెద్ద కప్పు నిండా వెజిటబుల్‌ సూప్‌ తాగుతారు. అలాగే మధ్యాహ్నం ఒకటిన్నరకు చికెన్ బ్రెస్ట్ 200గ్రాములు తీసుకుంటారు. ఇక 3/4 కప్ బ్రౌన్‌ రైస్ తో పాటు 1/2 కప్ వెజిటబుల్‌ కర్రీ చరణ్ తింటారు.

గ్రిల్లిడ్‌ చేపలు

గ్రిల్లిడ్‌ చేపలు

ఇక సాయంత్రం నాలుగు గంటలకు గ్రిల్లిడ్‌ చేపలను 250 గ్రాములు తీసుకుంటారు. అలాగే స్వీట్ పొటాటో ను ఒక రెండొందల గ్రాములు తీసుకుంటారు. 1/2 కప్ గ్రీన్‌ వెజిటబుల్స్ ను చరణ్ తీసుకుంటారు.

విత్తనాలను తింటారు

విత్తనాలను తింటారు

ఇక సాయంత్రం 6 గంటలకు లార్జ్ మిక్స్డ్ గ్రీన్ సలాడ్ ను తింటారు. అలాగే ఒక పావుకపు అవకాడో తీసుకుంటారు. ఒక చిన్న బౌల్ నిండా ఏవైనా విత్తనాలను తింటారు.

ఆకలివేసినట్లు అనిపిస్తే

ఆకలివేసినట్లు అనిపిస్తే

ఇక ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరుదాకామధ్యలో ఆకలివేసినట్లు అనిపిస్తే నట్స్ తింటారు. లేదంటే కొన్ని రకాల పచ్చి కూరగాయాలను తింటారు.

Most Read :పురుషుల జిమ్ కిట్ లో ఉండాల్సిన వస్తువులు.!Most Read :పురుషుల జిమ్ కిట్ లో ఉండాల్సిన వస్తువులు.!

శనివారం

శనివారం

ఇక శనివారం ఉదయం 45- 60 నిమిషాల దాకా కార్డియో చేస్తారు. అలాగే సాయంత్రం 30 నిమిషాల పాటు చేస్తారు. ఇన్నర్ థైస్ కోసం కొన్ని రకాల వ్యాయామాలు చేస్తారు. బార్బెల్ స్టిప్ లెగ్ డెడ్ లిఫ్ట్స్ 4 సెట్స్ చేస్తారు. అలాగే లైయింగ్ లెగ్ కర్ట్స్ 4 సెట్స్ చేస్తారు.

ఒంటి కాలిపై నిలబడడం 4 సార్లు ప్రాక్టీస్ చేస్తారు. అలాగే కొన్ని రకాల యాబ్స్ కూడా చేస్తారు. హ్యాంగింగ్ లెగ్ రైజెస్ 4 సెట్స్ చేస్తారు.

శుక్రవారం

శుక్రవారం

ఇక శుక్రవారం ఉదయం 45- 60 నిమిషాల దాకా కార్డియో చేస్తారు. అలాగే ఈవెనింగ్ 30 నిమిషాల పాటు చేస్తారు. బాడీ బ్యాక్ షేప్ కోసం కొన్ని రకాల వ్యాయామాలు చేస్తారు. ఒన్ ఆర్మ్ డంబుల్ ప్రాక్టీస్ 4 సెట్స్ ఉంటుంది. దాంతో పాటు కొన్ని రకాల వ్యాయామాలు చేస్తారు.

Most Read :జిమ్ కు మొదటసారి వెళ్లేముందు గుర్తు ఉంచుకోవాల్సిన 9 అతిముఖ్యమైన చిట్కాలుMost Read :జిమ్ కు మొదటసారి వెళ్లేముందు గుర్తు ఉంచుకోవాల్సిన 9 అతిముఖ్యమైన చిట్కాలు

గురువారం

గురువారం

అలాగే గురువారం కూడా కార్డియో చేస్తారు. ఆ రోజు ఉదయం చెస్ట్ కోసం ఫ్లాట్ బెంచ్ మిషన్ ప్రెసెస్ 4 సెట్స్ చేస్తారు. ఇక ట్రై సెస్స్ కూడా చేస్తారు.

బుధవారం

బుధవారం

బుధవారం చరణ్ చేసే కార్డియో ఇలా ఉంటుంది. కల్వెస్ 3 సెట్స్ చేస్తారు. యాబ్స్ ఫ్లోర్ క్రంచెస్ 4 సెట్స్ చేస్తారు.

Most Read :అమ్మాయి ఒళ్లు ఒంపులు తిరగాలన్నా.. అబ్బాయి బాడీ అందంగా మారాలన్నా ఆ భంగిమల్లో వర్కవుట్స్ బెస్ట్Most Read :అమ్మాయి ఒళ్లు ఒంపులు తిరగాలన్నా.. అబ్బాయి బాడీ అందంగా మారాలన్నా ఆ భంగిమల్లో వర్కవుట్స్ బెస్ట్

మంగళవారం

మంగళవారం

మంగళవారం కూడా ఉదయం 45- 60 నిమిషాల దాకా కార్డియో చేస్తారు. అలాగే ఈవెనింగ్ 30 నిమిషాల పాటు చేస్తారు. క్వాడ్స్ చేస్తారు. లెగ్ ఎక్సెటెన్షన్ 4 సెట్స్ చేస్తారు.

సోమవారం

సోమవారం

సోమవారం కూడా ఉదయం 45- 60 నిమిషాల దాకా కార్డియో చేస్తారు. అలాగే ఈవెనింగ్ 30 నిమిషాల పాటు చేస్తారు. షోల్డర్స్ కి సంబంధించిన వ్యాయామాలు చేస్తారు. బైసెప్స్ కూడా చేస్తారు. ఇలాంటి డైట్ పాటించి రోజూ సరైన వ్యాయామాలు చేయడం వల్లే చరణ్ బాడీ లుక్ అలా ఉంది. ఇక ప్రతి రాత్రి డిన్నర్ చేసిన తర్వాత ఉదయం లేచే వరకు ఏమీ తినరు. కనీసం మంచి నీళ్లు కూడా తాగరు.

Most Read :అలా వ్యాయామం చేస్తే బాడీ రాదు.. పైగా ఉన్న బాడీ షేప్ కూడా పోతదిMost Read :అలా వ్యాయామం చేస్తే బాడీ రాదు.. పైగా ఉన్న బాడీ షేప్ కూడా పోతది

పన్నెండు గంటలు

పన్నెండు గంటలు

పన్నెండు గంటలు ఫుడ్ తో పాటు కొన్ని పదార్థాలు తీసుకోవడం మరో పన్నెండు గంటలు ఏమీ తినకుండా ఉపవాసం ఉండడం రామ్ చరణ్ డైట్ లోని ప్రత్యేకత. దీంతో శరీరంలో విష పదార్థాలు మొత్తం బయటకు వెళ్తాయి. మంచి బాడీ బిల్డప్ చేయొచ్చు.

FAQ's
  • రామ్ చరణ్ తేజ ఎప్పుడు జన్మించారు?

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 1985వ సంవత్సరంలో మార్చి 27వ తేదీన కొణిదెల చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించారు. ఈయన చిన్నతనంలో ఎక్కువగా తమిళనాడులోని చెన్నైలో పెరిగారు. ఆ తర్వాత హైదరాబాదులో సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడి నుండే సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. తాజాగా RRR సినిమాలో అల్లూరి సీతారామారాజు, పోలీసు పాత్రలో అదరగొట్టారు. తన నటనను చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు.

English summary

Tollywood Hero Ram Charan Workout and Diet plan

tollywood hero ram charan workout and diet plan
Desktop Bottom Promotion