For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

weight loss tips:వేడినీళ్లను తాగితే మీ పొట్ట వెన్నలా కరిగిపోతుందట...!

|

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు విపరీతంగా బరువు పెరిగిపోయారట. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా బాడీలో కొవ్వు పెరిగిపోతోంది.

దీంతో ప్రతి ఒక్కరూ తాము వెంటనే బరువు తగ్గాలని ఉదయాన్నే నడక మొదలెట్టాలని అనుకుంటూ ఉంటున్నారు. కానీ మార్నింగ్ వెదర్ చల్లగా ఉండటం.. మరోపక్క వర్షాలు కురుస్తుండటంతో చాలా మంది ఇంటి నుండి బయటికి అడుగు పెట్టలేకపోతున్నారు.

మరికొందరు ఈ చల్లని వాతావరణానికి బద్దకంతో కనీసం బెడ్ పై నుండి లేవలేకపోతున్నారు. దీంతో ఆటోమేటిక్ గా బరువు పెరిగి వేలాడే పొట్ట పెరిగిపోతుంది. అయితే ఎలాంటి నడకకు వెళ్లకుండా.. గంటల కొద్దీ జిమ్ లో గడపకుండా పొట్టలోని కొవ్వుని ఎలా తగ్గించాలి.. వేలాడే పొట్టని వెన్నలా ఎలా కరిగించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

kiwi fruit: ప్రతిరోజూ కివి పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా...kiwi fruit: ప్రతిరోజూ కివి పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా...

మానవ శరీరంలో..

మానవ శరీరంలో..

మనందరికీ నీళ్లతోనే పండుగ. నీళ్లు ఉంటేనే పండుగ. సకల జీవకోటి రాశుల మనగుడకు నీరే జీవనాధారం. ఇదే బహిరంగ రహస్యమే. ఈ నీళ్లు కేవలం మన దాహార్తిని తీర్చడమే కాదు. మన బాడీ సక్రమంగా పని చేయడానికి మరియు మనల్ని అనేక వ్యాధుల నుండి దూరం చేయడానికి కూడా సహాయపడుతుంది. మానవ శరీరం సుమారు 70 శాతం నీటితోనే కవర్ అయ్యి ఉంటుందట. అందుకే మన బాడీలోని వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేయాలంటే ప్రతి ఒక్కరూ రోజుకు రెండు లేదా మూడు లీటర్ల నీటిని తాగాలి.

కొవ్వు కరిగించేందుకు..

కొవ్వు కరిగించేందుకు..

అయితే మనలో చాలా మంది చల్లని నీటిని తాగుతూ ఉంటాం. కొందరేమో వేడి నీటిని తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల లాభం మరియు నష్టాలు రెండూ ఉన్నాయి. మీరు గంటలకొద్దీ వ్యాయామం చేసిన తర్వాత ఒక చల్లని గ్లాసు తాగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అదే సమయంలో మీరు వేడి నీరు తాగితే మీ బాడీలో ఉండే పాయిజన్ మొత్తం బయటకు పోయేందుకు సహాయపడుతుంది. దీని వల్ల మీరు తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది.

బరువు తగ్గేందుకు..

బరువు తగ్గేందుకు..

మనలో చాలా మంది వేడి నీరు తగ్గితే కిలోల కొద్దీ బరువు తగ్గేందుకు సహాయపడుతుందని చాలా మంది భావిస్తారు. ఓ అధ్యయనం ప్రకారం, ఎక్కువ నీరు తాగడం వల్ల ఒక వ్యక్తి పొట్ట వెన్నలా కరిగిపోతుందని తేలింది. దీనికి కారణం నీరు సంపూర్ణత్వం యొక్క భావాలను పెంచుతుంది. ఈ నీటి వల్ల మీ బాడీలో పోషకాలను గ్రహించడానికి మరియు విష వ్యర్థాలను బయటకు పంపేందుకు సహాయపడుతుంది.

ఎప్పుడు తాగాలంటే..

ఎప్పుడు తాగాలంటే..

వేడి నీటిని రెగ్యులర్ గా తాగడం వల్ల మీ పొట్ట వేగంగా తగ్గే ప్రక్రియ పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. అయితే ఆ నీటిని భోజన సమాయానికి ముందు 500 మిల్లి లీటర్ల నీరు తాగడం వల్ల జీవక్రియ ముప్పై శాతం వరకు పెరుగుతుందని అధ్యయనం వివరించింది.

జీర్ణ వ్యవస్థ మెరుగ్గా..

జీర్ణ వ్యవస్థ మెరుగ్గా..

మీరు వేడి నీటిని తరచుగా తాగడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత కూడా మారుతూ ఉంటుంది. వేడి నీరు తాగితే.. మీ బాడీ వెచ్చని ఉష్ణోగ్రతను భర్తీ చేయడానికి, మన శరీర అంతర్గత ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అలాగే ఇది జీవక్రియను సక్రమంగా పని చేసేలా సహాయపడుతుంది. అలాగే మీ పొట్టలో పేరుకుపోయిన కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది. దీని వల్ల మీ జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది. అలాగే మీ ఆకలిని కూడా దాదాపు తగ్గించేస్తుంది.

రోజంతా ప్రశాంతంగా..

రోజంతా ప్రశాంతంగా..

మీరు ప్రతిరోజూ వేడి నీరు తాగితే మీ జీర్ణక్రియ ప్రక్రియ సజావుగా పని చేసేందుకు ఇది ఒక కందెన ఏజెంట్ లా పని చేస్తుంది. ఇది మన పొట్టలో జీర్ణించుకోవడానికి కష్టంగా అనిపించే ఆహార పదార్థాలను కూడా కరిగిస్తుంది. దీని వల్ల మీ నాడీ వ్యవస్థను కూడా శాంతపరుస్తుంది. మీ నాడీ వ్యవస్థ ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో.. అప్పుడు మీకు శరీర నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే మీ పేగులను సంకోచిస్తుంది. దీని వల్ల మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు వేడినీరు తాగే వారికి ఎక్కువగా చెమట పట్టొచ్చు. అయితే ఇలా చెమట పట్టడం వల్ల బాడీలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది చెమట రంధ్రాల నుండి విషాన్ని తొలగిస్తుంది.

సూప్ తాగినా..

సూప్ తాగినా..

వేడి నీరు తాగడం ఇష్టం లేని భోజనం చేయడానికి సరిగ్గా గంట ముందు సూప్ తాగడం వల్ల ఆకలి తగ్గుతుందట. అయితే సూప్ అంటే ఏ ఇన్ స్టంట్ సూపో కాకుండా, బయట రెస్టారెంట్లలో దొరికే వాటిని కాకుండా.. మీరే తాజా కూరగాయలను ఉడికించి తయారు చేసిన సూప్ అయితే చాలా బెటర్. ఇలా చేయడం వల్ల మీకు ఆకలి తక్కువై.. మీ పొట్ట కంట్రోల్ లో ఉంటుంది.

English summary

Benefits of Drinking Hot Water for Weight Loss in Telugu

Here are the benefits of drinking hot water for weight loss in Telugu. Have a look
Story first published: Tuesday, September 14, 2021, 11:30 [IST]