For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తక్కువ సమయంలో వేగంగా బరువు తగ్గించుకోవాలా? క్యాబేజ్ సూప్ తాగండి. ఎలా చేయాలి? ఎప్పుడు తాగాలి?

|

సాధారణంగా బరువు తగ్గాలంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే జిమ్ముకు వెళ్ళాలా ? డైట్ ఫాలో చేయాలా? అయితే మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఈ రెండింటిని మించిన ఒక సీక్రెట్ విషయం మీ బరువును తగ్గిస్తుంది? అదేంటో కాదు, వెయిట్ లాస్ క్యాబేజ్ రిసిపి డైట్ . కాబట్టి, తర్వగా బరువు తగ్గాలనుకునే వారు చాలా సింపుల్ గా క్యాబేజ్ సూప్ రిసిపిని ఫాలో అవ్వడమే. మరి అదెలా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది, ఇందులోని రహస్యమేంటి అన్న విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాబేజ్ సూప్

క్యాబేజ్ సూప్

 • ఈ సింపుల్ క్యాబేజ్ సూప్ రిసిపి మీ శరీరంలో సరైన ప్రదేశంలో ఎలా పనిచేయాలో అలా పనిచేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గించడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇంకా హెల్తీ లైఫ్ స్టైల్ ను ప్రోత్సహిస్తుంది.
 • బరువు తగ్గించే ప్రణాళికలు మరియు డైట్ కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం తీసుకుంటుంది మరియు అందుకు కఠిన ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అయితే క్యాబేజ్ సూప్ రిసిపితో అలాంటి హార్డ్ వర్క్ అవసరం లేకుండానే గొప్ప ఫలితాలను సాధించవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు జతగా అరగంట లేదా ఒక గంట సేపు వ్యాయామం చేస్తే చాలు.
 • ఈ లీఫ్ వెజిటేబుల్ సూప్ మీకు కావల్సిన రుచి అందిస్తుంది. కాబట్టి, దీన్ని మీరు కూడా ఏవిధంగానూ నిరాకరించరు.
 • ఇది శరీరానికి చాలా మంచిది. క్యాలరీలు తక్కువ. ఫైబర్ ఎక్కువ.
 • ప్రతి 100గ్రాముల క్యాబేజ్ సూప్ నుండి కేవలం 15-20క్యాలరీలు మాత్రమే పొందుతారు.
 • దీన్ని సరిగా వండినట్లైతే దీని ఉండే ప్రయోజకరమైన ప్రోటీన్లు మరియు విటమిన్లు మీ శరీరానికి అందుతాయి.
 • ఫర్ఫెక్ట్ వెయిట్ లాస్ క్యాబేజ్ సూప్ డైట్ ను మీరు తయారుచేసుకోవాలంటే, అందులో ఇంకా మీరు క్యారెట్, పార్ల్సే, మష్రుమ్, పచ్చిబఠానీలు, బీన్స్ వంటివి చేర్చుకోవాలి. దాంతో రుచిగాను మరియు శరీరానికి అందాల్సిన పోషకాలు అందుతాయి.
బరువు తగ్గడానికి బెస్ట్ క్యాబేజ్ సూప్ రిసిపి :

బరువు తగ్గడానికి బెస్ట్ క్యాబేజ్ సూప్ రిసిపి :

కావల్సినవి

 • 5 కప్పుల తాజా క్యాబేజీని ముక్కలు.
 • 6-7 కప్పుల నీరు లేదా కూరగాయలు ఉడికించిన నీరు.
 • 3 కొత్తిమీర ఒక కొమ్మ
 • 4-5 బీన్స్
 • 1 ఉల్లిపాయ
 • 4-5 వెల్లుల్లి రెబ్బలు, చక్కగా తరిగిన.
 • 2 సన్నగా తరిగిన పుట్టగొడుగులు.
 • 1 తురిమిన క్యారెట్.
 • సూప్ రుచికి 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా నువ్వుల నూనె.
 • మీ రుచికి తగ్గట్లు చక్కెర మరియు ఉప్పు.
 • తెలుపు మరియు నల్ల మిరియాలు మరియు కొత్తిమీర అలంకరించడానికి మాత్రమే.
తయారుచేయు పద్థతి:

తయారుచేయు పద్థతి:

 • నీళ్లు లేదా వెజిటేబుల్ స్టాక్ ఉడికించడానికి ఒక పెద్ద పాన్ తీసుకోండి.
 • ఇప్పుడు పాన్ లో అన్ని కూరగాయలు వేసి బాగా కలపాలి.
 • తక్కువ మంట మీద 15-20 నిమిషాలు వేడి చేయండి.
 • మీ రుచికి అనుగుణంగా చక్కెర మరియు ఉప్పు కలపండి.
 • మీ సూప్ అలంకరించడానికి మిరియాలు, నూనె మరియు తరిగిన కొత్తిమీర జోడించండి.
 • సూప్ రుచిని ఆస్వాదించాలంటే వేడిగా తాగాలి.
బరువు తగ్గడానికి క్యాబేజ్ సూప్ రిసిపి అందించే ప్రయోజనాలు:

బరువు తగ్గడానికి క్యాబేజ్ సూప్ రిసిపి అందించే ప్రయోజనాలు:

క్యాబేజ్ సూప్ రిసిపి బరువు తగ్గించడానికి అందించే ప్రయోజనాలు ఈ క్రింది విధంగా..

బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది:

బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది:

 • ఇది తక్కువ వ్యవధిలో వేగంగా బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది.
 • ఫలితాలు, వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి.
 • ఈ డైట్ ప్రధానంగా బరువు తగ్గడానికి మాత్రమే.
 • ఈ క్యాబేజీ సూప్ తక్కువ సంతృప్త కొవ్వులు (లో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్) మరియు జీరో కొలెస్ట్రాల్ కలిగి ఉంటాయి.
ఆకలి ఉండదు:

ఆకలి ఉండదు:

 • మీకు కావలసినన్ని సార్లు ఈ సూప్ తీసుకోవచ్చు.
 • మీరు ఈ సూప్ తో పాటు అపరిమిత పండ్లను కూడా తీసుకోవచ్చు.
 • కాబట్టి మీరు ఆకలి బాధలను అనుభవించాల్సిన అవసరం లేదు మరియు మీరు తినడం పరిమితం చేయడం ద్వారా మిమ్మల్ని మీరు శిక్షించుకోవాల్సిన అవసరం ఉండదు.
విటమిన్లు మరియు పోషకాలు:

విటమిన్లు మరియు పోషకాలు:

 • ఈ సులభమైన క్యాబేజీ సూప్ రెసిపీలో చాలా కూరగాయలు ఉన్నాయి. కనుక ఇది విటమిన్లు మరియు పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది.
 • మీరు సూప్ తో పాటు పండ్లు, మాంసం మరియు చేపలను తీసుకోవచ్చు, తద్వారా బరువు తగ్గేటప్పుడు విటమిన్లు మరియు పోషకాలు క్షీణించవు.
 • డార్క్ బెర్రీలు మరియు టమోటాలు మీ శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి.
సులువు మరియు చౌకైనది:

సులువు మరియు చౌకైనది:

 • క్యాబేజీ సూప్ చాలా చౌకైనది మరియు తయారు చేయడం సులభం. ఇంతకంటే ఉత్సాహం కలిగించే విషయం ఏమిటి!
 • మీకు కావలసినన్ని సార్లు, రోజుకు ఒక కప్పు సూప్‌తో పాటు మితంగా ఆహారాన్ని తీసుకోండి.
శక్తిని అందిస్తుంది:

శక్తిని అందిస్తుంది:

 • క్యాబేజీ సూప్ మీ తేలికగా ఉన్న భావనను కలిగిస్తుంది మరియు శక్తిని నింపుతుంది.
 • నెమ్మదిగా మీరు శక్తి స్థాయిల పెరుగుదలను గుర్తిస్తారు మరియు మిమ్మల్ని మీరు మరింత చురుకుగా ఉంటుంది.

కానీ మీరు తప్పక గురించుకోవల్సిన విషయం, ఈ సూప్ డైట్ తో పాటు, 30 నిముషాల వ్యాయామం తప్పనిసరి. ఒక కప్పు సూప్ లో పవర్ ప్యాక్ న్యూట్రీషియన్లు, ప్రోటీన్లు పొందుతారు. దాంతో వ్యాయామానికి తగిన శక్తి పూర్తిగా పొందుతారు. ఈ రెండింటి ఫలితంగా బరువు తగ్గడంలో మంచి రెట్టింపు ఫలితాలను చూస్తారు.

English summary

Cabbage Soup Diet For Rapid Weight Loss

We know that vegetables are extremely nutritious and come with many health benefits. Did you also know that cabbage is a vegetable that can actually help you reduce weight quickly? Yes, weight gain can be extremely unhealthy and also unattractive, if a person is obese or overweight, he/she can suffer from a number of ailments. Imagine walking into a store full of your favourite clothes and not being able to buy any, because they do not come in your size!
Story first published: Thursday, September 19, 2019, 18:25 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more