For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాహుబలి హీరో ప్రభాస్ డైట్ అండ్ ఫిట్నెస్ రహస్యాలేంటో తెలుసా...

బాహుబలి హీరో ప్రభాస్ డైట్ అండ్ ఫిట్నెస్ రహస్యాలేంటో మీరూ చూడండి.

|

మరో వారం రోజుల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' విడుదల కానుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

Diet and Fitness Secrets of Baahubali Hero Prabhas in Telugu

ఈ నేపథ్యంలోనే ఆ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. జిగేలు రాణి పూజా హెగ్డేతో కలిసి ప్రేమాయణం నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Diet and Fitness Secrets of Baahubali Hero Prabhas in Telugu

బాహుబలి పర్సనాలిటీ, మిర్చి లాంటి పౌరుషం.. కండలు తిరిగిన ప్రభాస్ బాడీని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న ప్రభాస్ కు అమ్మాయిల్లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Diet and Fitness Secrets of Baahubali Hero Prabhas in Telugu

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. యంగ్ రెబల్ స్టార్ అందరినీ ఆకర్షించేందుకు తను ఎలాంటి డైట్ ఫాలో అవుతారు.. ఎలాంటి వర్కవుట్లు చేస్తారు.. తన ఫిట్నెస్ రహస్యాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రాత్రిపూట బిర్యానీ తినడం వల్ల శరీరంలో జరిగే కొన్ని భయానక విషయాలు!రాత్రిపూట బిర్యానీ తినడం వల్ల శరీరంలో జరిగే కొన్ని భయానక విషయాలు!

పిట్నెస్ విషయంలో..

పిట్నెస్ విషయంలో..

ఫిట్నెస్ పై అవగాహన ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి బాహుబలి ప్రభాస్ లా కనిపించాలని కోరుకుంటాడు. బ్రహ్మాండమైన, బలమైన కండలు, పర్ఫెక్ట్ ఫిట్నెస్ తో హ్యాండ్సమ్ గా కనిపించే హీరోల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అందరికీ ఫిట్నెస్ విషయంలో ఐకాన్ గా ఉంటాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

ప్రతిరోజూ జిమ్ లో..

ప్రతిరోజూ జిమ్ లో..

బాహుబలి, సాహో వంటి సినిమాల్లో నటించేందుకు గాను ప్రభాస్ కొన్ని సంవత్సరాల పాటు ప్రతిరోజూ ఎంతసేపు వర్కవుట్లు చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ప్రతిరోజూ తను 3 నుండి 6 గంటల వరకు వర్కవుట్లు చేసేవారట. కొన్నిసార్లైతే 4 నుండి 6 గంటల వరకు జిమ్ లోనే గడిపేవారట. మనం ఫిట్ గా ఉండాలంటే.. బాహుబలి హీరో అంత కష్టపడాల్సిన అవసరం లేదు.

ఉదయాన్నే రన్నింగ్..

ఉదయాన్నే రన్నింగ్..

మీరు కూడా ప్రభాస్ మాదిరిగా ఫిట్నెస్ సంపాదించుకోవాలనుకుంటే.. ఉదయాన్నే రన్నింగ్, స్విమ్మింగ్ మరియు సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. అలాగే భారీ వెయిట్ లిఫ్టింగ్ వంటివి రెగ్యులర్ గా చేయాలి. ఇక మీ బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు పావు వంతు వర్కౌట్లు, ముప్పావు వంతు డైట్ మీద ఫోకస్ పెట్టాలట. అందుకే తను ప్రతి సినిమాలోనూ ఎంతో అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు.

వ్యాయామానికి ముందు ఎంత తినాలి మరియు ఏమి తినాలి...వ్యాయామానికి ముందు ఎంత తినాలి మరియు ఏమి తినాలి...

వెయిట్ విషయంలో..

వెయిట్ విషయంలో..

బాహుబలి తర్వాత సాహో సినిమా కోసం ప్రభాస్ ఏకంగా పది కేజీల వరకు బరువు తగ్గడం గమనార్హం. అందుకోసం తను నిత్యం స్విమ్మింగ్, సైక్లింగ్ తో పాటు వాలీబాల్ కూడా ఆడేవారట. తన వెయిట్ ను కంట్రోల్ చేసుకోవడంలో ఎక్కువ శ్రద్ధ చూపుతారట.

డైట్ విషయంలో..

డైట్ విషయంలో..

హీరో ప్రభాస్ ఫిట్నెస్ విషయంలో చాలా కఠినంగా ఉంటారట. ఈ విషయాన్నీ తన జిమ్ ట్రైనర్ స్వయంగా చెప్పడం గమనార్హం. డైట్ విషయంలోనూ అంతే ఫోకస్ పెడతారట. ఏడు రోజుల పాటు కఠినమైన డైట్ ను ఫాలో అవుతారట. తను తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు కచ్చితంగా ఉండేలా చూసుకుంటారట. అలాగే చేపలు, బాదం, గింజలు, కోడిగుడ్డు, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటారట.

గంట పాటు వాకింగ్..

గంట పాటు వాకింగ్..

హీరో ప్రభాస్ సినిమా షూటింగ్ కోసం బయటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు వర్కౌట్స్ చేయడం మాత్రం ఆపరట. తనతో పాటు జిమ్ కు సంబంధించిన వస్తువులన్నీ తీసుకెళ్తారట. ఒకవేళ ఎలాంటి వస్తువులు లేకపోయినా, ప్రతిరోజూ 100 స్క్వాట్స్ చేస్తారట. అలాగే కనీసం గంట పాటు వాకింగ్ చేస్తారట.

English summary

Diet and Fitness Secrets of Baahubali Hero Prabhas in Telugu

Here are the diet and fitness secrets of baahubali hero prabhas in Telugu. Have a look
Story first published:Thursday, March 3, 2022, 19:41 [IST]
Desktop Bottom Promotion