For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మందులతోనూ బరువు తగ్గొచ్చని మీకు తెలుసా? ఎవరెవరు వాడొచ్చంటే..

వ్యాయామం చేస్తున్నా, డైట్ పాటిస్తున్నా బరువు తగ్గకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇలాంటి వారు మందులతో బరువు తగ్గించుకోవాలని చూస్తున్నారు. అసలు మందులతో ఎలా బరువు తగ్గొచ్చు, ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

|

అధిక బరువు, ఊబకాయం ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఊబకాయం ఒకటే కాదు ఇది వేరే ఇతర రోగాలను కూడా మోసుకువస్తుంది. ఊపిరిత్తుల సామర్థ్యం తగ్గడం, కాలేయానికి కొవ్వు పట్టడం, కీళ్ల నొప్పు, పాదాల నొప్పు, శృంగారంపై ఆసక్తి కోల్పోవడం, అంగస్తంభన లోపం, గుండె జబ్బులు, డయాబెటిస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆరోగ్యంపై స్పృహ పెరిగినమాట వాస్తవం. చాలా మంది బరువు తగ్గించుకునేందుకు ఒళ్లు వంచుతున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే ఆశించిన మేర బరువు తగ్గుతున్నారు. మిగతా వారు కొన్ని రోజులు చేసి బరువు తగ్గడంలేదని నిరాశకు గురై ఎప్పట్లాగే ఉండిపోతున్నారు.

Medicines for weight loss : Prescription Medications to Treat Overweight & Obesity in telugu

వ్యాయామం చేస్తున్నా, డైట్ పాటిస్తున్నా బరువు తగ్గకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇలాంటి వారు, బరువు తగ్గడానికి శ్రమించడానికి ఇష్టపడని వారు ఇప్పుడు మందులతో బరువు తగ్గించుకోవాలని చూస్తున్నారు. అసలు మందులతో ఎలా బరువు తగ్గొచ్చు, ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి, ఎవరైనా మందులతో బరువు తగ్గొచ్చా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గించే మందులు ఎలా పని చేస్తాయి:

బరువు తగ్గించే మందులు ఎలా పని చేస్తాయి:

అధిక బరువు, ఊబకాయం చికిత్సకు ప్రిస్క్రిప్షన్ మందులు వివిధ మార్గాల్లో పనిచేస్తాయి. కొన్ని మందులు తక్కువ ఆకలి కలిగేలా చేస్తాయి. కొన్ని త్వరగా కడుపు నిండిన భావన కలిగేలా చేస్తాయి. మరికొన్ని మందులు తినే ఆహారాల నుండి కొవ్వును గ్రహించడాన్ని శరీరానికి కష్టతరం చేస్తాయి.

ఊబకాయాన్ని ఎలా కొలుస్తారు?:

ఊబకాయాన్ని ఎలా కొలుస్తారు?:

ఎలాంటి వ్యక్తులు బరువు తగ్గించే మందులు వాడొచ్చు?:

శరీర ఎత్తు, బరువు నిష్పత్తి ఆధారంగా బాడీ మాస్ ఇండెక్స్‌ను కొలుస్తారు.

* బీఎంఐ 27.5 నుండి 30లోపు ఉంటే అధిక బరువుగా పేర్కొంటారు.

* 30 నుండి 35 లోపు ఉంటే ఒకటో దశ ఊబకాయంగా పరిగణిస్తారు.

* బీఎంఐ 35 నుండి 40 వరకు ఉంటే రెండో దశ ఊబకాయంగా పేర్కొంటారు.

* 40 కంటే ఎక్కువ బీఎంఐ ఉంటే మూడో దశ ఊపకాయంగా పరిగణిస్తారు.

ఎలాంటి వ్యక్తులు బరువు తగ్గించే మందులు వాడొచ్చు?:

ఎలాంటి వ్యక్తులు బరువు తగ్గించే మందులు వాడొచ్చు?:

ఆహార నియమాలు పాటిస్తున్నా, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గని వారు, ఒకటో దశ ఊబకాయం ఉన్న వారికి బరువు తగ్గించే మందులు వాడాలని వైద్యులు సూచిస్తుంటారు. మందులు వాడటంతో పాటు జీవనశైలి మార్పులు కచ్చితంగా పాటించాల్సిందేనని వైద్యులు చెబుతారు. ఎలాంటి శ్రమ లేకుండా, ఇష్టమొచ్చినవి తింటూ కేవలం మందులతోనే బరువు తగ్గుతుందని అనుకోవద్దని వైద్యులు చెబుతున్నారు.

బీఎంఐ 35 కన్నా ఎక్కువ ఉన్నవారికి బరువు తగ్గించే మందులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. వీరికి మందులతో పాటు బేరియాట్రిక్ పద్ధతులు, సర్జరీలు అవసరం అవుతాయి.

బరువు తగ్గించే మందులు పిల్లలు వాడొచ్చా?:

అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన చాలా మందులు కేవలం పెద్దలకు మాత్రమే. ఒర్లిస్టాట్ NIH(గ్జెనికల్), లిరాగ్లూటైడ్(సక్సెండా)లను మాత్రమే 12 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు వాడేందుకు ఎఫ్‌డీఏ అనుమతినిచ్చింది. సెట్మెలనోటైడ్(ఇమ్సివ్రీ) అనే మందు ఊబకాయానికి కారణమయ్యే అరుదైన జన్యుపరమైన రుగ్మతలు ఉన్న 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న పిల్లలకు ఇవ్వొచ్చని ఎఫ్‌డీఏ పేర్కొంది.

మందులు వాడితే డైట్, వ్యాయామం చేయకపోయినా పర్లేదా?:

బరువు తగ్గించే మందులను వాడినంత మాత్రాన డైట్ పాటించం, వ్యాయామం చేయం అంటే కుదరదు. వ్యాయామాన్ని, డైట్‌ను మందులు భర్తీ చేయలేవు. సరైన జీవనశైలి ఉన్నప్పుడు మాత్రమే బరువు తగ్గించే మందులు సక్రమంగా, ఉత్తమంగా పని చేస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది.

బరువు తగ్గించే మందులతో దుష్ప్రభావాలు:

బరువు తగ్గించే మందులతో దుష్ప్రభావాలు:

ఊబకాయ చికిత్సలో చాలా కాలం నుండి మందులు వాడుతున్నారు. అయితే వీటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఆర్లిస్టాట్‌తో విరేచనాలు, వికారం, వాంతులు వస్తాయి. అలాగే కొన్ని మందులు ఆకలిని తగ్గిస్తాయి. కానీ వీటి వల్ల నిద్రమత్తు వంటి సమస్యలు ఉంటాయి. సెమాగ్లుటైడ్, లిరాగ్లుటైడ్, ఫెంటర్మైన్-టోపిరమేట్, ఈఆర, ఓర్లిస్టాట్, డైథీల్‌ప్రోపియాన్ వంటి మందులు బరువు తగ్గడంలో సహాయపడతాయి.

బరువు తగ్గించే మందుల వల్ల కొందరిలో క్లోమగ్రంథి వాపు, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయి. అలాంటి వారిని పూర్తిగా పరిశీలించిన అలాంటి జబ్బులేమైనా ఉన్నాయేమో పరీక్షించాకే మందులు వాడాల్సి ఉంటుంది.

బరువు తగ్గించే మందుల వల్ల కలిగే ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలు ఎక్కువని కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కొన్ని బరువు నిర్వహణ మందులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగించగా ఆయా మందులను అమెరికా ప్రభుత్వం నిషేధించింది.

బరువు తగ్గించే మందుల దుష్ప్రభావాలు వ్యక్తులను బట్టి మారుతూ ఉండొచ్చు. ఈ దుష్ప్రభావాలు తేలికపాటి నుండి తీవ్రమైనవి ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

English summary

Medicines for weight loss : Prescription Medications to Treat Overweight & Obesity in telugu

read this to know how Prescription medications can reduce weight and Treat Overweight & Obesity in telugu
Story first published:Monday, December 26, 2022, 17:22 [IST]
Desktop Bottom Promotion