For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Body Building Mistakes: బాడీ బిల్డర్లు ఈ తప్పులు అస్సలే చేయొద్దు

చాలా మంది జిమ్ కి వెళ్లి వర్కవుట్స్ చేసినా బాడీ ఏమాత్రం పెరగదు. బాడీలో ఎలాంటి మార్పులు రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే మంచి టోన్డ్ బాడీ కోసం సరైన శిక్షణ అవసరం. ఏం చేయాలి.. ఎలా చేయాలి.. ఎప్పుడు చేయాలి.. ఎలా చేయకూడ

|

Body Building Mistakes: మంచి కండలు తిరిగిన దేహం కావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. టోన్డ్ బాడీ కావాలని మగవాళ్లందరూ అనుకుంటారు. సిక్స్ ప్యాక్, 8 ప్యాక్, కట్ బాడీ కోసం జిమ్ లకు వెళ్తుంటారు. రోజూ క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్లి బరువులు ఎత్తుతుంటారు.

The most common bodybuilding mistakes everyone should avoid in Telugu

చాలా మంది జిమ్ కి వెళ్లి వర్కవుట్స్ చేసినా బాడీ ఏమాత్రం పెరగదు. బాడీలో ఎలాంటి మార్పులు రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే మంచి టోన్డ్ బాడీ కోసం సరైన శిక్షణ అవసరం. ఏం చేయాలి.. ఎలా చేయాలి.. ఎప్పుడు చేయాలి.. ఎలా చేయకూడదు అనేది కచ్చితంగా తెలిసి ఉండాలి. అప్పుడే శరీరం క్రమంగా మార్పు చెందుతుంది.

మంచి శరీరాకృతి, బలమైన ఎముకలు, బలమైన కీళ్లు, స్నాయువులు, మెరుగైన జీవక్రియ, అథ్లెటిక్ సామర్థ్యం, సమతుల్యత వస్తుంది. కాబట్టి జిమ్ కు వెళ్లడమే కాదు, జిమ్ కు వెళ్లే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

సరిగ్గా తినాలి

సరిగ్గా తినాలి

మీరు బరువు పెరగాలనుకున్నా, తగ్గాలనుకున్నా, కండలు తిరిగిన బాడీ కావాలనుకున్నా మంచి ఆహారం తినడం చాలా చాలా ముఖ్యం. కండలు పెరగడమే మీ లక్ష్యం అయితే రోజూ తగినన్ని కేలరీలు తీసుకోవడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. అదనపు కేలరీలు లేకుండా కండలు నిర్మించడం సాధ్యం కాదు. మీరెంత బరువు ఉన్నారు అనే దానిపై రోజూ ఎన్ని కేలరీలు తీసుకోవాలో మీ ఫిట్ నెస్ ట్రైనర్ లేదా డాక్టర్ సలహా ఇస్తారు.

తగినంత ప్రోటీన్ తీసుకోవాలి

తగినంత ప్రోటీన్ తీసుకోవాలి

ప్రోటీన్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కండలు పెంచాలనుకునే వారికి ప్రోటీన్ అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. వారికి ఆహారం నుండి తగినంత ప్రోటీన్ అందదు. అలాంటప్పుడు ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. కండరాలను పెంచడానికి, కణాజాలానన్ని రిపేర్ చేయడానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. ప్రతి పౌండ్ శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. మీరు 150 పౌండ్ల బరువు ఉండే మీరు రోజూ 120 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి.

పుష్కలంగా నీరు తాగాలి

పుష్కలంగా నీరు తాగాలి

మానవ శరీరం మూడింట రెండు వంతులు నీటితో ఉంటుంది. అందులో మూడింట రెండు వంతుల నీరు కండరాల్లో ఉంటుంది. కండరాల కణాలు ప్రోటీన్ మరియు నీటితో ఉంటాయి. కండలు ఎక్కువగా పెరగాలనుకుంటే నీరు ఎక్కువగా తాగాల్సిందే. రోజూ 6 నుండి 8 గ్లాసుల నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. 150 పౌండ్ల బరువు ఉంటే, రోజూ 75 ఔన్సుల నీటిని తాగాలని చెబుతుంటారు.

అతి వద్దు

అతి వద్దు

కండలు పెంచాలనుకోవడం తప్పేం కాదు. కానీ కొన్ని రోజుల్లోనే కండలు తిరిగిన దేహం కావాలనుకోవడం వల్ల ఓవర్ ట్రైనింగ్ చేస్తుంటారు కొంతమంది. వారం మొత్తం వ్యాయామం చేస్తూనే ఉంటారు. దీని వల్ల కండరాలకు విశ్రాంతి ఇవ్వడం కుదరదు. కండరాలకు తగిన విశ్రాంతి ఇచ్చినప్పుడు అవి చక్కగా పెరుగుతాయి. ఓవర్ ట్రైనింగ్ వల్ల కేంద్ర నాడీ వ్యవస్థను ప్రమాదం పడేసినట్లే. అలాగే వ్యాయామం వల్ల రావాల్సిన ఫలితం రాదు.

తగినంత నిద్ర అవసరం

తగినంత నిద్ర అవసరం

వ్యాయామం చేసినంత ప్రయోజనం నిద్ర వల్ల వస్తుంది. నిద్ర లేకపోవడం చాలా అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. రోజూ 7 నుండి 8 గంటలు నిద్ర పోవడం వల్ల రోజంతా ఎనర్జీగా ఉంటారు. జిమ్ లోనూ శక్తి మేర కష్టపడతారు. సరిగ్గా నిద్ర పోవడం వల్ల కండరాలకూ విశ్రాంతి ఇచ్చినట్లు అవుతుంది. సరిగ్గా నిద్ర లేకపోతే అది ఒత్తిడికి దారి తీస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. వ్యాయామ పనితీరుపై ప్రభావం పడుతుంది.

English summary

The most common bodybuilding mistakes everyone should avoid in Telugu

read on to know The most common bodybuilding mistakes everyone should avoid in Telugu
Story first published:Thursday, December 1, 2022, 16:27 [IST]
Desktop Bottom Promotion