For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wakingup Early: ప్రొద్దున్నే లేచి జిమ్ కు వెళ్లాలనుకుంటాం.. కానీ లేవలేం.. ఏం చేయాలంటే..?

|

Wakingup Early: ప్రొద్దున్నే లేచి జిమ్ కు వెళ్లాలనుకుంటాం. వ్యాయామం చేయాలని, లేదా వాకింగ్, జాగింగ్ చేయాలని అనుకుంటాం. రాత్రి పడుకునే ముందు రేపు ఎట్టి పరిస్థితుల్లో లేవాలని అనుకుంటాం. అలారం కూడా పెట్టుకుంటాం. రేపు ఎలా ఎక్సర్ సైజ్ చేయాలో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాం. కానీ ఉదయం టైం అవుతుంది. అలార్మ్ మోగుతుంది. కానీ మొద్దు నిద్ర వదలదు. ఇంకొక్క 5 నిమిషాలు పడుకుని లేస్తాం అనుకుని మోగుతున్న అలారం స్నూజ్ లో పెట్టేసి పడుకుంటాం. తర్వాత మళ్లీ మోగితే ఆ అలార్మ్ ను మొత్తానికే ఆపేసి.. రేపటి నుండి పోవచ్చులే అనుకుని అటు తిరిగి పడుకుంటాం.

Tips for waking up earlier to workout in Telugu

ఇది ప్రతి ఒక్కరికి జరిగేదే. మీరు జిమ్ కు వెళ్లాలనుకుంటే, మొట్ట మొదట ఫైట్ చేయాల్సింది నిద్రతోనే. మీరు కండలు పెంచాలనుకున్నా.. లేదా బరువు తగ్గాలనుకున్నా.. మొదట పోరాడాల్సింది నిద్రతోనే. నిద్రతో యుద్ధం చేయడం అంత సులువేం కాదు.. అలా అని దానిని జయించలేమనీ కాదు. పట్టుదల, కసి, లక్ష్యం ఉండాలి.

ఉదయమే లేచి వ్యాయామం చేయాలనుకునే వారికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

ఉదయమే లేచి వ్యాయామం చేయాలనుకునే వారికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

1. పడుకునే ముందు వ్యాయామం గురించి ఆలోచించాలి

పొద్దున్నే వర్కవుట్ చేయడానికి ఇది చాలా ముఖ్యమైన దశ. నేను ఉదయమే లేస్తాను అని మనకు మనం ఒకటికి రెండు సార్లు చెప్పుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో లేచి తీరతాను అనుకోవాలి. నిద్రలోకి జారుకున్నప్పుడే లేవడం గురించి ఆలోచించాలి.

2. ఉదయమే ఎందుకు లేవాలనుకుంటున్నారో చెప్పుకోవాలి

2. ఉదయమే ఎందుకు లేవాలనుకుంటున్నారో చెప్పుకోవాలి

ముందు రోజు రాత్రి మనస్సులో ఉదయాన్ని ప్లాన్ చేసినప్పటికీ, కొన్నిసార్లు మీ అలారం మోగడం ప్రారంభించినప్పుడు వాస్తవానికి పని చేయడం కష్టం. అసలు ఉదయమే ఎందుకు లేవాలని అనుకుంటున్నారో చెప్పుకోవాలి. అలా లేవడం ద్వారా మీరేం సాధించగలరో విజువలైజ్ చేసుకోవాలి.

అలా విజువలైజేషన్ నిర్దిష్టంగా ఉండాలి. దానిని చేరుకునే విధంగా ఉండాలి. ఆ కలను నిజంగా చేరుకునే విధంగా ఉండాలి.

3. బెడ్ పక్కనే వ్యాయామ గేర్‌ పెట్టుకోండి.

3. బెడ్ పక్కనే వ్యాయామ గేర్‌ పెట్టుకోండి.

వర్కవుట్ కు వేసుకెళ్లే దుస్తులను మీ మంచం పక్కన పెట్టుకోవాలి. ఇది మీలో వ్యాయామం పట్ల ఆలోచనలు రేకెత్తించడానికి, ఉత్సాహాన్ని పెంచడానికి గొప్పగా పని చేస్తుంది.

4. జిమ్ కు, ట్రైనర్ కు ఫీజు చెల్లించండి

4. జిమ్ కు, ట్రైనర్ కు ఫీజు చెల్లించండి

మీరు కష్టపడి సంపాదించిన డబ్బును వర్కవుట్ క్లాస్‌లో ఉంచినట్లయితే, మీరు దాన్ని పొందేలా చూసుకునే అవకాశం ఉంది. డబ్బు పెట్టినందుకు దాని మేరకు అయినా జిమ్ కు వెళ్లాలని లేకపోతే ఆ డబ్బు వృథా అవుతుందన్న భయం ఉంటుంది. అది జిమ్ కు వెళ్లాలన్న ఆలోచనను రేకెత్తిస్తుంది.

5. ఉదయం చేసే వ్యాయామం వాస్తవానికి దగ్గరగా

5. ఉదయం చేసే వ్యాయామం వాస్తవానికి దగ్గరగా

చేసే వ్యాయామం వాస్తవానికి దగ్గరగా ఉండాలి. మీరు ఉదయం లేచి వ్యాయామం చేయగానే అద్వితీయమైన శక్తి వచ్చేస్తుందని అనుకోవద్దు. రోజూ చేసే వ్యాయామం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో వాస్తవానికి దగ్గరగా ఉండాలి.

6. రోజూ ఒకే సమయంలో నిద్ర లేవాలి

6. రోజూ ఒకే సమయంలో నిద్ర లేవాలి

ఉదయం లేవగానే వ్యాయామం చేస్తున్నారా లేదా అనేది పక్కన బెట్టండి. రోజూ ఉదయం ఒకే సమయానికి నిద్ర లేవడాన్ని అలవాటు చేసుకోవాలి. అలా ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్ర లేస్తే పోను పోను శరీరంలోని జీవ గడియారం ఆ సమయానికి మిమ్మల్ని నిద్ర లేపుతుంది. ఆ సమయం తర్వాత పడుకోవాలనుకున్నా.. నిద్ర పట్టదు.

7. రోజూ ఎంత సమయం నిద్రపోతున్నారో చూసుకోండి

7. రోజూ ఎంత సమయం నిద్రపోతున్నారో చూసుకోండి

రోజూ మీకు ఎంత నిద్ర అవసరం అవుతుందో లెక్క గట్టాలి. ఇది మనిషిని బట్టి వారి అలవాట్లు, జీవన శైలి, చేసే పని, పడే కష్టాన్ని బట్టి ఒక మనిషి నిద్ర ఎంత అవసరం అనేది ఆధారపడి ఉంటుంది. మీకెంత నిద్ర అవసరం ఉంటుంది. ఎన్ని గంటలకంటే తక్కువగా నిద్ర పోతే మీరు రోజంతా అదే ధ్యాసలో ఉంటున్నారో చూడండి.

8. పాత కాలపు అలారం గడియారం వాడండి

8. పాత కాలపు అలారం గడియారం వాడండి

మంచం పక్కనే అలారం పెట్టుకోవడం వల్ల మంచం నుండి పైకి లేవడానికి ముందే దానిని ఆఫ్ చేసేస్తారు. అందుకే అలా కాకుండా ఉండేందుకు పాత కాలపు అలారం గడియారాన్ని వాడటం ఉత్తమమైన పద్ధతి. ఆ పాత కాలపు అలారం గడియారాన్ని కూడా మీ మంచానికి దూరంగా పెట్టుకుంటే.. ఆ అలారం మొగే సమయంలోని మంచం నుండి లేచి ఆఫ్ చేయాల్సి వస్తుంది. దీని వల్ల కొంత నిద్ర మబ్బు వదులుతుంది.

9. లేచిన తర్వాత కదలండి

9. లేచిన తర్వాత కదలండి

సరే, మీరు మేల్కొని ఉన్నారు. మీరు అలానే ఉన్నారని నిర్ధారించుకోవడానికి-మరియు మీరు ముందుగా మేల్కొనే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి

త్వరగా సోషల్ మీడియా స్క్రోల్ చేయాలనే కోరికను నిరోధించండి. అలా ఫోన్ చూడటం ప్రారంభిస్తే అదే పనిని మీకు తెలియకుండానే గంట పాటు చేస్తూనే ఉంటారు. అందుకే నిద్ర లేవగానే ఫోన్ ను ముట్టుకోకుండా.. అసలు మీరు ఎందుకు నిద్ర లేచారో ఆ పనిని ముందు పూర్తి చేయడానికి ప్రయత్నించండని నిపుణులు చెబుతున్నారు. అంటే ఉదయమే నిద్ర లేవగానే వ్యాయామం చేయడం ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

Tips for waking up earlier to workout in Telugu

read on to know Tips for waking up earlier to workout in Telugu
Story first published:Tuesday, September 27, 2022, 12:54 [IST]
Desktop Bottom Promotion