Just In
- 56 min ago
తమకు కాబోయే వారిలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఏమి కోరుకుంటారో తెలుసా...
- 57 min ago
ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా ప్రసిద్ధ గృహ నివారణ, ఇందులోని అద్భుతమైన ప్రయోజనాలు..
- 2 hrs ago
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- 3 hrs ago
జనన నియంత్రణ ఉన్నప్పటికీ గర్భం వచ్చే ప్రమాదం
Don't Miss
- Sports
ఆసీస్ పర్యటనలో నా విజయ రహస్యం ఇదే: మహ్మద్ సిరాజ్
- Automobiles
కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి
- News
సుప్రీం తీర్పుతో డైలమాలో సర్కారు, ఉద్యోగులు- ఎస్ఈసీకి సహకారం ? కీలక చర్చలు
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వెయిట్ లాస్ : రోజులో 10,000 అడుగులు నడవడమనేది వ్యాయామానికి సమానంగా ఉంటుందా? నిపుణులు ఏమంటున్నారు?
వెయిట్ లాస్: రోజులో 10,000 అడుగులు నడవడమనేది వ్యాయామానికి సమానంగా ఉంటుందా?
బరువు తగ్గడానికి చిట్కాలు:
మీరు ఈరోజు 10,000 అడుగులను పూర్తి చేశారా? ఒక రోజులో ఇలా ఎక్కువగా అడుగులు వేయడం వల్ల బరువు తగ్గడానికి, లేదా ఆరోగ్యంగా ఉండేందుకు మీకు సహాయపడుతుందని మీరు భావిస్తున్నారా? అది ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం. రోజులో 10,000 అడుగులు నడవడమనేది ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, మరియు రోజువారీ పనులను సులభంగా నిర్వహించడానికి సహాయపడుతుందని అనేక అధ్యయనాలలో తేలింది. సెలెబ్రిటీ ఫిట్‌నెస్ నిపుణుడైన వినోద్ చన్నా ప్రకారం, ఒక రోజులో 10,000 అడుగులు అనేది ఒక రోజులో తప్పనిసరిగా చేయవలసిన శారీరక శ్రమగా ఉంటుంది.
బరువు తగ్గడంలో పనిచేసే ఉపాయాలు :
బరువు తగ్గడమనేది అంత సులభమైన విషయం కాదు. కాని ఈ ప్రయత్నాలు దీర్ఘకాలిక జీవనశైలి మార్పులతో పాటుగా, మీ పౌండ్లను శక్తిగా మార్చడంలో సహాయపడుతాయి.

బరువు తగ్గించే చిట్కాలు:
రోజులో 10,000 అడుగులు వేయడం, ఒక రోజు వ్యాయామానికి సమానంగా ఉంటుందా?
"ప్రతిరోజూ అవసరమయ్యే శారీరిక, మానసిక చైతన్యానికి, మరియు ఫిట్‌నెస్ లెవల్స్ కాపాడుకోవటానికి మానవ శరీరానికి రోజులో కనీసం పదివేల అడుగులు ప్రాథమిక అవసరంగా ఉంటుంది" అని శిల్ప శెట్టి కుంద్రా, జాన్ అబ్రహం, షమితా శెట్టి మరియు జెనీలియా దేశ్‌ముఖ్ వంటి వారికి శిక్షణ ఇచ్చే చన్నా తెలిపారు.
ఒక రోజులో శారీరక శ్రమను అనుసరించి కనీసం 10,000 అడుగులు నడవడం ముఖ్యంగా ఉంటుంది.

10,000 అడుగులు వేయడం వ్యాయామంగా
కానీ 10,000 అడుగులు వేయడం వ్యాయామంగా మాత్రం పరిగణించబడదని ఆయన నొక్కి చెప్పారు. "10,000 అడుగులు నడవడం అంటే కనీసం ఒక గంట పాటు కొద్దిపాటి వేగంతో నడవాలి, అదేక్రమంలో భాగంగా, శరీరం చురుకుగా ఉండాల్సిన అవసరం ఉంది. లేచి కూర్చోవడం, పైకి లేయడం వంటి ప్రాథమిక కార్యకలాపాలు చేయడంలోకూడా మీకు ఇబ్బందులు ఎదురైతే, మీ జీవనశైలి నిశ్చలంగా ఉందని అర్థం. కాబట్టి, మీరు శారీరకంగా చురుకుగా ఉండాలి, అందువల్ల రోజులో కనీసం ఇలా 10000 అడుగులైనా నడవండి "అని చన్నా వివరించాడు.
నివసించే ప్రాంతాలలో సరైన నడక స్థలం లేని వారికి, నడకకు వెళ్ళలేని వ్యక్తుల కోసం, చన్నా ఈ క్రింది వాటిని సూచిస్తున్నారు:

ప్రయాణానికి వాహనాలను కాకుండా, ప్రజా రవాణాను ఎంచుకోండి :
మీ వాహనాలను మీ పని ప్రదేశం నుండి కొంత దూరంలో ఉంచండి, తద్వారా మీరు దానిని చేరుకోడానికి నడవగలరు. లేదా వీలైనంతగా ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించండి.
పైన పేర్కొన్నది సాధ్యం కాకపోతే ఇంట్లోనే స్కిప్పింగ్ తాళ్ళు, స్పాట్ జంపింగ్ లేదా జాగింగ్ వంటివి అనుసరించవచ్చు. అదేవిధంగా ఎలివేటర్‌కు బదులుగా మెట్లు ఎక్కడం మంచిది. ప్రతి గంట పనికి, కొంత విరామం తీసుకుని, కొంత దూరం నడవండి

ఫిట్‌నెస్ ట్రాకర్
"అదేవిధంగా ఫిట్నెస్ ట్రాకర్ అనుసరించడం కూడా మీకు సహాయం చేస్తుంది. మీ ఫిట్‌నెస్ ట్రాకర్, మీరు చేసే ప్రతి కదలికను లెక్కించడం మీద దృష్టి పెడుతుంది. దీనిలోని పెడో మీటర్ మీ అడుగులను లెక్కించడంలో సహాయపడుతుంది." అని ఆయన వివరించారు. కాబట్టి వీలయితే, బడ్జెట్లోనే ఒక ఫిట్నెస్ ట్రాకర్ తీసుకోవడం మంచిదిగా సూచించబడుతుంది.

బాటమ్ లైన్ ఏమిటంటే
బాటమ్ లైన్ ఏమిటంటే, ప్రతి ఒక్కరూ రోజులో 10,000 అడుగులను అనుసరించడం మంచిదిగా నిపుణులు సూచిస్తున్నారు. క్రమంగా, ప్రాథమిక స్థాయి మానసిక చైతన్యానికి, శారీరిక నొప్పులను నివారించడానికి, చురుకుగా ఉండటానికి ఈ నడక మీకు సహాయం చేస్తుంది.

ఫిట్నెస్ నిపుణుడు
ఫిట్నెస్ నిపుణుడు, అల్టిమేట్ ఎక్స్‌సెల్ వ్యవస్థాపకుడైన కిడ్డీ కౌల్ ఈ విధంగా చెప్తున్నారు, "10,000 అడుగుల లక్ష్యాన్ని చేరుకోవటానికి, పనికి మద్యలో చిన్న చిన్న విరామాలు తీసుకొని, కాసేపు నడవండి. అంతేకాకుండా, అక్కడికక్కడే జాగ్ చేయవచ్చు కూడా. కొన్ని డాన్స్ మూమెంట్స్ వంటివి అనుసరించడం మీ 10,000 అడుగుల లక్ష్యాన్ని సరదాగా పూర్తిచేస్తుంది.
రోజులో 10,000 దశలను పూర్తి చేయడానికి మీరు ఆన్-ది-స్పాట్ జాగింగ్ చేయవచ్చు

శరీరం లోని ప్రతి కదలిక కూడా ముఖ్యమైనది
"శరీరం లోని ప్రతి కదలిక కూడా ముఖ్యమైనదిగానే ఉంటుంది" కాబట్టి, ఈ లక్ష్యాన్ని సాధించడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు రోజూవారీ పనులను, కాస్త బద్దకాన్ని పక్కన పెట్టి అనుసరిస్తే సరిపోతుంది" అని ఆమె వివరిస్తున్నారు.
"ఈ రోజు ఊబకాయం అనేది, అనేక రకాల వ్యాధులకు ప్రధాన కారణంగా ఉంది. ఈ ఊబకాయం, సరైన శారీరిక శ్రమ లేకపోవడం, జీవక్రియల అస్తవ్యస్తం, అసంబద్దమైన జీవనశైలి, అనారోగ్యకర ఆహారపు అలవాట్లతో ముడిపడి ఉంటుంది.

స్తబ్ధతతో కూడిన జీవనశైలి
ఈరోజుల్లో సగటు వ్యక్తి, తగినంత నడకను అనుసరించడం లేదు. క్రమంగా, ఈ స్తబ్ధతతో కూడిన జీవనశైలి కూడా మీ ఊబకాయానికి కారణంగా ఉంటుందని ఆమె పేర్కొంది.

ఈ అడుగుల లక్ష్యాన్ని సాధించడానికి
ఈ అడుగుల లక్ష్యాన్ని సాధించడానికి, మీరు మీ దినచర్యలో భాగంగా స్క్వాట్స్, పుషప్స్, బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలను చేర్చవచ్చు. ఇవి, రోజంతా మంచి భంగిమలను నిర్వహించడానికి సహాయపడతాయి, అని కౌల్ చెప్తుంది.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.