For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్వైకల్ స్పాండిలోసి అంటే ఏమి? లక్షణాలు? నివారణ మార్గాలు...

|

భుజాలు, మెడ ఒకటే నొప్పి...ఏ పని చేయాలన్నా కష్టమవుతుతోంది. ఎందుకిలా...అంటుంటారు చాలా మంది. మారిన జీవనశైలి, ఎక్కువ దూరం ప్రయాణించి ఉద్యోగాలు చేయడం, రోజులో 2-4 గంటల సమయం ప్రయాణానికి కేటాయించడం, ఆఫీసులో ఎక్కువ సమయం కంప్యూటర్‌పై పనిచేయడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరిగి సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్యకు దారితీస్తుంది... సెర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏమిటి?.స్పాండి అంటే వెన్నెముక , లోసిస్ అంటే సమస్య అని అర్ధము . ప్రతి వెన్నుపూస నడుమ గల దూరము పెంచే లేదా తగ్గించే విధముగా అనుసంధానమై ఉండే కణజాలము సహజముగా క్షీణదశము రాగల , వెన్నుపూసను ప్రభావితము చేసే ఓ రకమైన ఆర్థ్రైటిస్ నే స్పాడిలైటిస్ లేదా స్పాండిలోసిస్ అంటారు . ఇది మెడభాగము లో అయితే సెర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు.

ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య మెడనొప్పి. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కొంచెం ఎక్కువగానే ఉంటోంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు దీని బారినపడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చుని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పకోవచ్చు. తలవంచితే మెడనొప్పులే...ముఖాన్ని నిటారుగా నిలబెట్టేది మెడ. మహిళల్లో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో మెడనొప్పి కూడా ఒకటి. నిరంతరం చేసే పనులు, కొన్ని సంప్రదాయ పద్ధతులు ఇందుకు ఎక్కువగా కారణం అవుతున్నాయి.

మరికొన్ని కారణాలు: వెన్నెముకకు దెబ్బలు తగలటం, అధిక బరువును ఒక్కసారిగా ఎత్తడం, సరి అయిన డ్రైవింగ్ పద్ధతులను పాటించకుండా ఎక్కువగా డ్రైవింగ్ చేయడం వలన వెన్నుపూసల మధ్య ఒత్తిడి అధికమై ఈ సమస్య వస్తుంది. వయస్సు పెరిగే కొద్ది వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదల వలన కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వలన కూడా ఇది వస్తుంది. (ఆంకిలైజింగ్ స్పాండిలైటిస్) క్షయవ్యాధి వెన్నెముకకు పాకడం వలన ఇది వస్తుంది. (Potts disease) .ప్రస్తుత పరిస్థితులలో ఎక్కువగా కంప్యూటర్‌మీద పనిచేయడం వలన చిన్న వయస్సువారు కూడా స్పాండిలైటిస్ బారిన పడుతున్నారు.

లక్షణాలు
తల, మెడ నొప్పితో కండరాలు బిగుసుకొనిపోతాయి. మెడ నుంచి భుజాలు, చేతులకు నొప్పి, తిమ్మిర్లు వ్యాపిస్తాయి. చేతి కండరాలు బలహీనపడటం, కళ్లు తిరగడం, భుజాలు, చేతి వేళ్లలో స్పర్శ తగ్గిపోవడం, అరుదుగా మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది. నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఉంటుంది. మెడ బిగుసుకుపోయినట్లుగా కావడంతో నొప్పి ప్రారంభమవుతుంది. నొప్పి క్రమంగా భుజాలకు పాకుతుంది. తలను కదల్చలేకపోతారు. తీవ్రమైన ఒత్తిడిపడుతున్నట్లుగా ఉంటుంది. చెవుల్లో శబ్దాలు వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తలనొప్పి, బీపీ పెరిగిపోవడం జరుగుతుంది. నొప్పి క్రమంగా చేతులకు విస్తరిస్తుంది.

నిరక్ష్యం చేస్తే...
సర్వైకల్ స్పాండిలైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇతర సమస్యలు మొదలయ్యే అవకాశంఉంది. దీర్ఘకాలిక మెడ నొప్పి, మల, మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, కండరాలు పటుత్వాన్ని కోల్పోవడం వంటి సమస్యలు మొదలవుతాయి.

సర్వైకిల్ స్పాండిలోసిస్ ను కొన్ని ప్రత్యేకమైన మెడికేషన్స్, లైఫ్ స్టైల్ మార్పులు మరియు కొన్ని సింపుల్ హోం రెమెడీస్ తో తగ్గించుకోవచ్చు . మరి ఆ సింపుల్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం..

 రెగ్యులర్ వ్యాయామం:

రెగ్యులర్ వ్యాయామం:

సర్వైకల్ స్పాండిలోసిస్ కు ముఖ్య కారణం వ్యాయామలోపం. కాబట్టి ప్రతి రోజూ కొన్ని సింపుల్ గా ఉండే ఫిజికల్ ఎక్సర్ సైజులు చేయడం వల్ల ఉపశమనం పొందవచ్చు. తలను ముందుకు వెనకకు, మరియు ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేయడం మంచిది. లెఫ్ షోల్డర్ టు రైట్ షోల్డర్ కు రొటేట్ చేయడం మంచిది. ఇలా ప్రతి రోజూ రెండు, మూడు సార్లు చేస్తే మంచిది . ఇలా చేయడం వల్ల మెడనొప్పి నివారించుకోవచ్చు.

హాట్ అండ్ కోల్డ్ కంప్రెసర్:

హాట్ అండ్ కోల్డ్ కంప్రెసర్:

మెడనొప్పి నివారించుకోవడానికి మరో సింపుల్ రెమెడీ ఇది. నొప్పి ఉన్న ప్రదేశంలో కోల్డ్ అండ్ హాట్ కంప్రెసర్ ను ఉపయోగించాలి. హాట్ కంప్రెసర్ బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది, సోర్ మజిల్స్ ను రిలాక్స్ చేస్తుంది. కోల్డ్ కంప్రెసర్ వాపును మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

ఎప్సమ్ సాల్ట్ బాత్ :

ఎప్సమ్ సాల్ట్ బాత్ :

సర్వైకల్ స్పాడిలైటిస్ సమస్యతో బాధపడే వారు ఎప్సమ్ సాల్ట్ బాత్ ను రెగ్యులర్ గా చేసుకుంటే మంచిది . ఎప్సమ్ సాల్ట్ లో ఉండే మెగ్నీషియం శరీరంలోని పిహెచ్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది . ఇది మెడ, మరియు భుజాల యొక్క స్టిప్ నెస్ ను, ఇన్ఫ్లమేషన్, తగ్గిస్తుంది. ఎప్సమ్ సాల్ట్ లో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేసి తర్వాత స్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

గమనిక: కిడ్నీ, హార్ట్ లేదా డయాబెటిస్ సమస్యలున్నవారు ఈ హోం రెమెడీని అనుసరించకూడదు.

 వెల్లుల్లి:

వెల్లుల్లి:

సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలను నివారించడంలో వెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అనాల్జిక్ లక్షణాలుండటం వల్ల మెడ, భుజం నొప్పి, వాపు, ఇన్ల్ఫమేషన్ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. రెగ్యులర్ గా పచ్చి వెల్లుల్లి రెబ్బలను కాలీ పొట్టతో తిని, నీళ్ళు త్రాగాలి. గార్లిక్ క్యాప్సిల్స్ ను డాక్టర్ ప్రిస్క్రిప్సన్ తో తీసుకోవడతో నొప్పి నివారించుకోవచ్చు

. పసుపు:

. పసుపు:

పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వల్ల సర్వికల్ స్పాండిలోసిస్ ను నివారించుకోవచ్చు. అంతే కాకుండా పసుపు బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది . ఇది మజిల్ స్టిప్ నెస్ మరియు పెయిన్ ను నివారిస్తుంది. ఒక టీస్పూన్ పసుపును పాలలో మిక్స్ చేసి తక్కువ మంట మీద 5 నిముషాలువ ేడి చేసి గోరువెచ్చగా మారిన తర్వాత తేనె కలుపుకొని రోజూ రెండు సార్లు త్రాగితే ఉపశమనం కలుగుతుంది.

నువ్వులు:

నువ్వులు:

మరో పాపులర్ ఆయుర్వేదిక్ రెమెడీ, సర్వైకల్ స్పాండిలోసిస్ ను నువ్వులతో నివారించుకోవచ్చు . నువ్వుల్లో క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్, జింక్, ఫాస్పరస్ మరియు విటమిన్ కె మరియుడిలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మరియు మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . మెడనొప్పిని తగ్గించడానికి నువ్వుల నూనె కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొద్దిగా గోరువెచ్చని నువ్వుల నూనెను నొప్పి ఉన్న ప్రాంతంలో అప్లై చేసి 10 నిముషాల తర్వాత హాట్ కంప్రెసర్ తో మసాజ్ చేసుకోవాలి. ఇలా రోజూ మూడు నాలుగు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

అల్లం:

అల్లం:

అల్లం మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. అల్లం ఒక ఆయుర్వేద మూలిక. ఈ మూలికలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది. దాంతో మెడచుట్టు, భుజాల వద్ద నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

ప్రతి రోజూ జింజర్ టీని 3సార్లు త్రాగడం వల్ల గ్రేట్ గా పనిచేస్తుంది. వేడి నీటిలో అల్లముక్కలు వేసి ఉడికించి, ఆ నీటిని వడగట్టి, తేనె మిక్స్ చేతి తీసుకోవాలి.

 ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇందులో ఉండే ఆల్కలైజింగ్ లక్షణాలు వల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ ను నివారించడంలో చాలా మేలు చేస్తుంది . ఇది మెడీ మరియు భుజాల వద్ద చాలా ఎఫెక్టివ్ గా నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఒక కాటన్ టవల్ ను ఆపిల్ సైడర్ వెనిగర్లో డిప్ చేసి మెడచుట్టు అప్లై చేయాలి . ఇలా రోజూ రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కేయాన్ పెప్పర్:

కేయాన్ పెప్పర్:

మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ కేయాన్ పెప్పర్. ఇందులో క్యాప్ససిన్ ఉంటుంది.ఇది అనాల్జిక్ లక్షణాలను, అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీల క్షణాలను కలిగి ఉంటుంది . ఇది నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఒక చెంచా కేయాన్ పెప్పర్ పౌడర్ ను గోరువెచ్చని నూనెలో మిక్స్ చేసి నొప్పి, వాపు ఉన్న ప్రాతంలో అప్లై చేసి బ్యాడేజ్ చుట్టాలి. కొన్ని గంటల తర్వాత దీన్ని శుభ్రం చేసుకోవాలి.

వేప:

వేప:

వేపలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. నొప్పి నివారణ లక్షణాలు మెండుగా ఉన్నాయి. ఇది నొప్పిని, ఇన్ఫ్లమేషన్ మరియు వాపును తగ్గిస్తాయి .

ఒక చెంచా వేప పౌడర్ లో కొద్దిగా నీళ్ళు పోసి, పేస్ట్ ను వేడి చేయాలి. నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ పేస్ట్ ను అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Top 10 Home Remedies for Cervical Spondylosis: Health Tips in Telugu

Top 10 Home Remedies for Cervical Spondylosis, Cervical spondylosis, also known as cervical osteoarthritis and neck arthritis, is a very common age-related condition that affects the joints in the neck. It occurs because of wear and tear of the cartilage, tissues and bones of the cervical spine. These changes
Story first published: Tuesday, November 24, 2015, 13:19 [IST]
Desktop Bottom Promotion