For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నైట్ షిప్ట్ పనిచేసేవారు ఓబేసిటి తగ్గించుకోవడానికి తినాల్సిన హెల్తీ ఫుడ్స్..!

|

నైట్ షిఫ్ట్ పనిచేసే వారు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఫుడ్స్ తీసుకోవడానికి టైమింగ్స్ ఉండవు. దాంతో నిద్రమోల్కోవడానికి, ఆకలి తగ్గించుకోవడానికి ఇన్ స్టాంట్ గా కొన్ని స్నాక్స్, మరియు జంక్ ఫుడ్స్ తీసుకుంటుంటారు. నిద్రలేమి, ప్లస్ జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల నైట్ షిఫ్ట్ పనిచేసేవారు త్వరగా ఓబేసిటికి గురౌతున్నారు. నైట్ వర్క్ చేసేవారికి ఇది ఒక మేజర్ ప్రాబ్లెమ్ అని చెప్పవచ్చు.

డే షిఫ్ట్ పనిచేసే వారికంటే నైట్ షిఫ్ట్ పనిచేసే వారే ఎక్కువగా ఓబేసిటికి గురౌతున్నారని రీసెంట్ గా జరిపిన పరిధోనల్లో వెల్లడైనది. ఎందుకిలా జరగుతుంది? నేచర్ లోని రూల్ ప్రకారం మన శరీరం డేటైమ్ లో చురుకుగా పనిచేస్తుంది. అందుకోసం రాత్రుల్లో శరీరానికి విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తుంది. దీనికి విరుద్దంగా నడుచుకున్నప్పుడు మన శరీరానికి నేచర్ కూడా సహకరించదు. మనం పుట్టినప్పటి నుండి మన శరీరం ఒక పద్దతికి అలవాటు పడి ఉంటుంది. ఆ అలవాటును సెడెన్ గా మార్చి నైట్ షిఫ్ట్, డేషిఫ్ట్ లని పనిచేయడం వల్ల బాడీలో రిథమ్ తప్పుతుంది. దాంతో స్ట్రెస్ లెవల్స్ పెరుగుతాయి, ఓబేసిటికి కారణమవుతుంది.

అలాగే ఆహారం తీసుకునే విషయంలో కూడా సమయ పాలన పాటించకపోవడం వల్ల ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ మీద ఎక్కువ ఆధారపడటం వల్ల, నిద్రమేల్కోవడానికి ఫ్యాట్ స్నాక్స్ ఎక్కువగా తీసుకోవడం..ఇవన్నీ ఓబేసిటికి కారణమవుతుంది. వీటికి తోడు, నైట్ షిప్ట్ లో సరైన నిద్ర, తిండి లేకపోవడం వల్ల స్ట్రెస్ లెవల్స్ తగ్గించుకోవడానికి స్మోక్ చేస్తుంటారు. మరింత అదనంగా అనారోగ్యానికి, ఓబేసిటికి కారణమవుతుంది. ఈ కారణాలన్నింటి వల్ల ఓబేసిటి ఒక్కటే కాదు, ఆరోగ్య పరంగా నిద్రలేమి, హార్ట్ ససమస్యలు, స్ట్రెస్ .. ఇతర ప్రమాదకర పరిస్థితులను కూడా ఎదుర్కోవల్సి వస్తుంది.

అందువల్ల నైట్ షిప్ట్ పనిచేసే వారు ఓబేసిటి తగ్గించుకోవడానికి సరైన ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. ఓబేసిటిని నివారించే 10 సూపర్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

బ్రౌన్ రైస్ :

బ్రౌన్ రైస్ :

బ్రౌన్ రైస్ లో విటమిన్స్, ఐరన్, జింక్, ప్రోటీన్స్, ఫైబర్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. బ్రౌన్ రైస్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నేచురల్ గా బరువు తగ్గించుకోవడానికి ఇది ఒక ఉత్తమ ఆహారం.

ఫ్రూట్ బౌల్ :

ఫ్రూట్ బౌల్ :

నైట్ షిప్ట్ పనిచేసే వారు ఓబేసిటికి కారణమయ్యే చిప్స్, పిజ్జాలు, బర్గర్స్ మరియు పాస్టరీస్ వంటి స్నాక్స్ తినడానికి బదులుగా ఒక బౌల్ నిండా ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోండి. ఆపిల్, అరటి, బొప్పాయి,కివి వంటి ఫ్రూట్ పొట్ట నింపి, ఎనర్జీని అందివ్వడంతో పాటు ఓబేసిటిని తగ్గిస్తాయి.

వెజిటేబుల్ సలాడ్స్ :

వెజిటేబుల్ సలాడ్స్ :

వెజిటేబుల్ సలాడ్స్ లో క్యారెట్, స్పినాచ్, మరియు లోక్యాలరీ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల ఓబేసిటి తగ్గించుకోవచ్చు. నైట్ షిఫ్ట్ పనిచేసేవారికి ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి.

మొలకలు:

మొలకలు:

మొలకలు త్రుణధాన్యాలతో తయారుచేసుకోవచ్చు. వీటిలో క్యాలరీలు మరియు ఫ్యాట్ తక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్స్, క్యాల్షియం, మరియు ఫైబర్స్ ఎక్కువ. మరో హెల్తీ బెనిఫిట్ ఏంటే వీటిని తిన్న తర్వాత త్వరగా ఆకలవ్వదు. అంతే కాదు నైట్ షిఫ్ట్ పనిచేసేవారిలో ఊబకాయం తగ్గిస్తుంది.

బాదం:

బాదం:

నైట్ షిప్ట్ వర్కర్స్ స్నాక్స్ గా చిప్స్ మరియు చాక్లెట్స్ తినడానికి బదులుగా బాదం లేదా ఇతర లోక్యాలరీ డ్రై నట్స్ తీసుకోవడం మంచిది. వీటిలో విటమిన్స్, మెగ్నీషియం, మరియు ఫైబర్ వంటి న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి . బరువును నేచురల్ గా తగ్గించుకోవడానికి బాదం గ్రేట్ ఆప్షన్ .

మరమరాలు(బొరుగులు):

మరమరాలు(బొరుగులు):

స్నాక్స్ గా బొరుగులు తినొచ్చు. వీటిలో ఫ్యాట్ ఉండదు , అలాగే పొట్టనింపుతుంది.వ్యాయామం చేయకుండా బరువు తగ్గడానికి ఇవి కూడా సహాయపడుతాయి.

 ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో లిక్విడ్ ను గ్రహించడానికి సహాయపడుతుంది. పొట్ట నిండిన అనుభూతి కలిగిస్తుంది. ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేస్తుంది. ఓవర్ గా తినకుండా కంట్రోల్ చేస్తుంది. నేచురల్ గా బరువు తగ్గిస్తుంది.

 ఓట్స్ అండ్ మిల్క్:

ఓట్స్ అండ్ మిల్క్:

నైట్ షిప్ట్ పనిచేసే వారు హై క్యాలరీలున్న పిజ్జాలు బర్గర్లు తినడం కంటే, లోఫ్యాట్ మిల్క్ తో పాటు ఓట్స్ తీసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. వీటిలో క్యాల్షియం, మినిరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫుడ్స్ ఓబేసిటిని తగ్గిస్తుంది.

పెరుగు:

పెరుగు:

పెరుగులో లోఫ్యాట్ పెరుగును తీసుకోవడం మంచిది. లోఫ్యాట్ పెరుగులో ప్రోటీన్స్, క్యాల్షియం, పొటాషియం, విటమిన్స్ మరియు రిబోఫ్లోవిన్స్ ఎక్కువ. నేచురల్ గా బరువు తగ్గించుకోవడానికి లోఫ్యాట్ పెరుగు బెస్ట్ ఆప్షన్.

ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ లు మరియు ఫ్లూయిడ్స్ తీసుకోవడం మంచిది:

ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ లు మరియు ఫ్లూయిడ్స్ తీసుకోవడం మంచిది:

ఓబేసిటికి కారణమయ్యే కోక్, సోడ, ఇతర ఏరియేటెడ్ డ్రింక్ తాగడానికి బదులుగా వాటి ప్లేస్ లో ఫ్రూట్ జ్యూస్ లు, సరిపడా నీళ్ళు తాగడం మంచిది . ఇవి శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచడం మాత్రమే కాదు, ఓబేసిటిని కూడా నివారిస్తాయి . ముఖ్యంగా నైట్ షిప్ట్ పనిచేసేవారిలో ఇవి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

English summary

10 Foods That Help Prevent Obesity Among Night Shift Workers

Several researches and studies have also confirmed that those working in night shifts are more obese than those working in day shift. So why does this happen? It is because according to the law of nature human beings are structured to work during day time and rest during the night. So when the natural body rhythm gets disturbed while working in night shifts, it leads to increasing stress and results in obesity.
Story first published: Tuesday, August 23, 2016, 17:57 [IST]
Desktop Bottom Promotion