For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లివర్ సమస్యలను నివారించే ఆయుర్వేదిక్ రెమెడీస్

By Super Admin
|

మన శరీరంలో అతిపెద్ద అవయవం లివర్!లివర్‌(కాలేయం) పెద్ద అవయవమే కాదు అతి ముఖ్యమైన అవయవం కూడా! శరీరంలో ఐదుకి పైగా పనుల్ని నిర్వర్తిస్తోంది. వెయ్యికి పైగా ఎంజైమ్స్‌ని లివర్‌ తయారు చేస్తుంటుంది. శరీరంలో ఎక్కడైనా గాయం అయినప్పుడు రక్తం కొద్దిసేపు కారి, అక్కడ గడ్డకట్టి, రక్తం కారిపోతోందంటే అందుకు అవసరమైన ఎంజైమ్స్‌ని లివరే ఉత్పత్తిచేస్తుంది. అనారోగ్యాలు కలిగినప్పుడు, వాటినుంచి తట్టుకోవడానికి అవసరమైన 'యాంటిబాడీస్‌ని లివరే ఉత్పత్తి చేస్తుంది. లివర్ కొంత మేరకు గాయపడ్డా తిరిగి తన పూర్వస్థితికి చేరుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. మన శరీర అవయవాలన్నింటిలోనూ మూడింట రెండు వంతులు తొలగించినా... మళ్లీ మునపటిలా పెరగగల సామర్థ్యం కాలేయానికి ఉంది. అందుకే దాదాపు 90 శాతం కాలేయం దెబ్బతిన్నప్పటికీ ఒక పట్టాన లక్షణాలు బయటకు కనిపించవు.

లివర్ (కాలేయం)... మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడం, శరీరంలోని కొవ్వు, చక్కెర (గ్లూకోజ్), ప్రొటీన్ శాతాన్ని నియంత్రించడం, శరీరం జబ్బు బారిన పడకుండా భద్రత కల్పించడం (శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడం), రక్తశుద్ధి చేయడం, శరీరంలోని విషాలను హరించడం, మనలో ప్రవేశించే హానికర పదార్థాలను తొలగించడం, జీర్ణప్రక్రియకు దోహదపడే బైల్‌ను ఉత్పత్తి చేయడం, విటమిన్లు-ఐరన్ వంటి పోషకాలను నిల్వ చేయడం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చడం, శరీరంలోని వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రించడం, రక్తం గడ్డకట్టడానికీ, గాయాలు తొందరగా మానడానికీ కావాల్సిన ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేయడం వంటి కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తుంది.

కాలేయం పనిచేయకపోతే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కాలేయం దాదాపు 90శాతం దెబ్బతినేంత వరకూ మనం లక్షణాలు కనిపించవు అన్నాము, కానీ కొన్ని లక్షణాలను మాత్రం త్వరగా గుర్గించినట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించి కాలేయ పరీక్షలు చేయించుకోవాలి. అలసట, బలహీనత, బరువుతగ్గడం, వికారం, వాంతి, చర్మం రంగు ఎల్లోగా మారడం ఇది జాండీస్ కు సంకేతం. కాలేయం దెబ్బతిన్న కనీసం 75శాతం లివర్ టిష్యులు అవసరం అవుతాయి. కాలేయం దెబ్బతిన్నా తిరిగి చాలా సులభంగా ఈ కణాలను పునరుత్పత్తి చేసుకోగలదు. అయితే శరీరానికి సరిపడనంత అందక పోతే, కొన్ని రకాల కాలేయ సమస్యలకు ఆయుర్వేదిక్ రెమెడీస్ ద్వారా చికిత్సనందివచ్చు. అయితే ఆ ఆయుర్వేదిక్ రెమెడీస్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం...

ఆమ్లా:

ఆమ్లా:

ఉసిరి కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ డ్యామేజ్ ను నివారిస్తుంది. ఇది లివర్ ఫంక్షన్ ను రీస్టోర్ చేస్తుంది . రోజులో రెండు మూడు సార్లు ఆమ్లా జ్యూస్ ను త్రాగవచ్చు. లేదా ఉసిరికాయను తినొచ్చు. ఆమ్లా(ఉసిరికాయ)లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ ఫంక్షన్స్ క్రమంగా జరగడానికి సహాయపడుతుంది. కొన్ని పరీశోధనల ద్వారా ఇది నిరూపితమైనది. అందుకు మీరు చేయాల్సింది: రోజుకు 4-5ఉసిరికాయలను నేరుగా తీసుకోవచ్చు. * లేదా సలాడ్స్ లేదా తురుమి, పెరుగులో మిక్స్ చేసి, సాల్ట్ వేసుకొని తినవచ్చు.

లికోరైస్:

లికోరైస్:

లివర్ ఫెయిల్యూర్ కు లికోరైస్ ఒక ఉత్తమ హోం రెమెడీ. లికోరైస్ తో టీపౌడర్ ను తయారుచేసుకోవాలి. దీన్నిటీలో మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు త్రాగాలి. లివర్ వ్యాధులను నేచురల్ గా నివారించే మూలిక.ఇది మరోక అద్భుతమైనటువంటి హోం రెమెడీ . నాన్ ఆల్మహాలిక్ ఫ్యాటీ లివర్ కండీషన్స్ . కాలేయ సమస్యల నివారణ కోసం ఈ లికోరైస్ ను ఆయుర్వేదిక్ ఔషధాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

* అందుకు మీరు చేయాల్సింది: లికో రైస్ ను పౌడర్ చేయాలి. ఈ పౌడర్ లో బాగా మరిగించిన నీటిని పోసి, కొన్ని నిముషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోరువెచ్చగా మారిన తర్వాత వడగట్టి, రోజుకు రెండు సార్లు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.

పసుపు:

పసుపు:

ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఇన్ ఫెక్షన్ మరియు ఇది కాలేయంలో టాక్సిన్ ను తొలగించే ఒక ఉత్తమ యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. మరియు ఇది లివర్ వ్యాధులకు దారితీసే వైరల్ ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. ఇది హైపటైటీస్ ను నివారించడానికి సహాయపడుతుంది . తేనె మరియు పాలలో ఒక చెంచా మిక్స్ చేసి వెంటనే త్రాగాలి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

లివర్ వ్యాధులను నివారించడంలో ఇది ఒక ఉత్తమ నేచురల్ హోం రెమెడీ . . ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి . లివర్ లోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయడానికి ఇది సహాయపడుతుంది . మీరు ఖచ్చితంగా రెండు కప్పుల గ్రీన్ టీని ప్రతి రోజు తీసుకోవచ్చు.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో సెలీనియం మరియు అల్లిసిన్ అధికంగా ఉంటుంది. వెల్లుల్లి ఘాటయిన వాసన ఇచ్చే వెల్లుల్లి గుండెకు నేస్తం, క్యాన్సర్ కు ప్రబల శత్రువు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కాలేయాన్ని శుభ్రం చేసే గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. దీన్ని నేరుగా వేయించకూడదు.

బీట్ రూట్ :

బీట్ రూట్ :

ఈ దుంపల్లో ఉండే ఫ్లెవనాయిడ్స్ కాలేయం చురుకుగా పనిచేయడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ రెండు వెజిటేబుల్స్ లివర్ క్లీనింగ్ లో చాలా గ్రేట్ గా సహాయపడుతాయి.

English summary

Ayurvedic Remedies For Liver Problem

Ayurvedic Remedies For Liver Problem, Ayurvedic Remedies For Liver Problem,The liver is one of the busiest and the most important organ in the body. From flushing out toxins from the body to aiding us in digestion, liver helps us in a multitude of problems and performs a multitude of tasks.
Story first published: Wednesday, September 7, 2016, 10:04 [IST]
Desktop Bottom Promotion