For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లోబ్లడ్ ప్రెజర్ నుండి వెంటనే ఉపశమనం కలిగించే బెస్ట్ ఫుడ్స్

|

బ్లడ్ ప్రెజర్ లేదా అధిక రక్తపోటు అనేది తీవ్రంగా పరిగణించాల్సిన వ్యాధి. ప్రస్తుత కాలంలో చాలా మంది లో బ్లడ్ ప్రెజర్ లేదా లో బిపికి గురి అవుతున్నారు. బిపి సాధారణ స్థాయి (నార్మల్)కంటే కూడా ఇంకా తక్కువ ఉండటమే మంచిది! అయితే ఒకటి బిపి 90/60mmHg కంటే తక్కువ ఉండి, కళ్ళు మసకలుగా కనబడటం, కళ్ళుతిరగడం, ఒళ్ళు చల్లబడి చెమటలు పోయటం వంటి లక్షణాలు కనిపించినప్పుడు దానిని అస్వస్థత తాలూకు లోబిపి గా భావించవచ్చు.

అధిక రక్తపోటులో రక్తనాళాలలో రక్తం నిరంతరం అధికమవుతుంది. అధిక రక్తపోటుకు కారణాలు అనేకం ఉంటాయి. అధిక రక్తపోటు, ఒత్తిడి, ఉప్పు అధికంగా తినటం, డాయాబెటీస్ వంటివి అధిక ర్తపోటుకు కారణాలుగా చెప్పవచ్చు. అధిక రక్తపోటు ఉంటే, గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అపుడు మీరు ఆహారం, మెడిసిన్ ల ద్వారా దానిని నియంత్రించాలి. డాక్టర్లు ఆరోగ్యకర ఆహారాన్ని సూచిస్తూ, కొన్ని మందులు వ్రాసి ఇస్తారు. అవి పాటిస్తే మీ రక్తపోటు స్ధాయి తగ్గుముఖం పడుతుంది.

లోబిపి (లోబ్లడ్ ప్రెజర్ ను) కొన్ని ప్రత్యేకమైన ఆహారాలతోనే కంట్రోల్ చేసుకోవాలి. ఈ ఆహారాలు ఒత్తిడిని క్రమబద్దం చేసి, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. సహాజంగా లోబిపితో బాధపడేవారు , అదనపు ఉప్పు పదార్థాలు లేదా అదనపు స్వీట్ తీసుకోవడం వల్ల రక్తంలో ఇన్సులిన్ తిరిగి పునరుద్దరించబడుతుంది .

ఈ రెండు పదార్థాలు మాత్రమే కాదు వీటితో పాటు మరికొన్ని ఇతర పదార్థాలు కూడా వెంటనే మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఇది వెంటనే ప్రభావం చూపుతుంది . లోబిపిని కంట్రోల్ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను మీకోసం తెలుగు బోల్డ్ స్కై కొన్ని పరిచయం చేస్తున్నది. ఇవి లో బ్లడ్ ప్రెజర్ ను నార్మల్ లెవల్స్ కు తీసుకొస్తాయి. మరి అవేంటో ఒకసారి తెలుసుకుందాం .

 ఉప్పు:

ఉప్పు:

తరచూ లో బిపితో బాధపడుతుంటే, బ్లడ్ పెజర్ లెవల్స్ తక్కువకు పడిపోతుంటే వెంటనే చిటికెడు ఉప్పును ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి, తాగాలి. ఇది బ్లడ్ ప్రెజర్ ను ఇన్ స్టాంట్ గా పెంచుతుంది.

గ్లూకోజ్:

గ్లూకోజ్:

రెండు టేబుల్ స్పూన్ల గ్లూకోజ్ లో చిటికెడు ఉప్పు మిక్స్ చే చేసి ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేయాలి. దీన్ని తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ లెవల్స్ త్వరగా పెరుగుతుంది . కాబట్టి, లోబిపి ఉన్నవారు ఎక్కడికి వెళ్లినా వెంటన గ్లూకోజ్ ను తీసుకెళ్ళడం మంచిది.

నీళ్ళు:

నీళ్ళు:

కొన్ని సందర్భాల్లో డీహైడ్రేషన్ వల్ల కూడా లో బ్లడ్ ప్రెజర్ వస్తుంది. అందువల్ల శరీరానికి సరిపడా వాటర్ తాగాలి. లోబ్లడ్ ప్రెజర్ ఉన్నప్పుడు, ఎక్కువ నీళ్ళు తాగాలి. నీరు తాగడం వల్ల ఇన్ స్టాంట్ గా బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను పెంచుతుంది.

ఎండు ద్రాక్ష:

ఎండు ద్రాక్ష:

ఎక్కడికెళ్ళిన వెంటనే గుప్పెడు ఎండుద్రాక్షన పట్టుకెళ్ళడం మంచిది. లోబిపి తగ్గించడానికి ఎండుద్రాక్ష బెస్ట్ ఫుడ్. బ్లడ్ ప్రెజర్ తగ్గినప్పుడు, వెంటనే 10 నుండి 15 ఎండు ద్రాక్షను తినాలి. వీటని రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పరగడుపున తినాలి.

తేనె:

తేనె:

లో బ్లడ్ ప్రెజర్ ఉన్నవారు, ఒక చిన్న బాటిల్ తేనెను చేతిలో ఉంచుకోవాలి. మీరు అలసటగా లేదా కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంటే, బిపి లెవల్స్ తగ్గిపోతున్నట్లు గుర్తించాలి. అటువంటి సమయంలో ఒక టీస్పూన్ తేనెలో చిటికెడు ఉప్పు మిక్స్ చేసి గ్లాసు నీటిలో మిక్స్ చేయాలి. దీన్ని వెంటనే తాగేయాలి. ఈ హానీ వాటర్ బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ఇన్ స్టాంట్ గా పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

Foods To Eat To Prevent Low Blood Pressure

You are travelling in the bus, train or you are at your workplace and suddenly, you start sweating, the surrounding tends to become dark and you get to the verge of collapsing. These are a few of the basic symptoms you might have when your blood pressure goes down.
Story first published: Friday, September 9, 2016, 14:12 [IST]
Desktop Bottom Promotion