నోరు తడి ఆరిపోకుండా నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!

By Sindhu
Subscribe to Boldsky

నోరు ఎండిపోవటం అంటే, నోటిలో తడి లేకపోవటం. సాధారణంగా మన నోరు ఎల్లపుడూ తడిగా వుండాలి. అందుకుగాను ప్రతివారూ తగినంత నీటిని తాగాలి. మీ శరీరంలో తగినంత నీరు వున్నదా? లేదా అని తెలుసుకోవడానికి నోటిలో తగినంత ఉమ్మి ఎల్లపుడూ వుందా ? లేదా అనేది చిట్కాగా పాటించాలి. శరీరం నిరంతరం కొనసాగే జీవక్రియ లేదా మెటబాలిజం కొరకు నీటిని కోరుతుంది. తగినంత నీరు శరీరంలో లేనపుడు మీ నోటిలోఊట ఊరదు. జీర్ణక్రియ సాఫీగా సాగదు. మలబద్ధకంఏర్పడుతుంది. నోరంతా ఎండిపోయి అలసట కలుగుతుంది. సాధారణంగా డయాబెటీస్ రోగులలో నోరు ఎండిపోతూంటుంది. ఇది డయాబెటీస్ వ్యాధి లక్షణంగా గుర్తించాలి.

 Is Your Mouth Getting Dried Up Too Often? These Home Remedies Help Treat Dry Mouth Instantly

నోరు ఎండిపోయినపుడు ఎంతో అసౌకర్యంగా చికాకుకలిగిస్తూ వుంటుంది. ఈ రకంగా ఎండిపోయిన నోరు బాక్టీరియాకి కూడా నివాస స్ధానం అవుతుంది. రకరకాల సూక్ష్మ క్రిములు చేరుతూంటాయి. నోటిలో ఊరే లాలాజలం సాధారణంగా మననోటిలోని హాని కలిగించే అనేక రకాల క్రిములను సంహరిస్తుంది. మీరు తినే ఆహారంలో సైతం వుండే హాని కలిగించే క్రిములు లాలాజలంలోని ఎంజైములు, మేలు చేసే బాక్టీరియా వంటి వాటితో తిన్న ఆహారాన్ని మొదటి దశలో జీర్ణం చేస్తాయి. మానవుడు తినే ఆహార జీర్ణక్రియలో మొదటి దశ నోటిలోని లాలాజలంతోనే జరుగుతుంది.

నోటిలో ఏ రకమైన వ్యాధులు రాకుండా చూసుకోవాలి. నోటి ఇన్ఫెక్షన్ కలిగితే అది మీ రక్తంలోని గ్లూకోజ్ స్ధాయిలపై ప్రభావం చూపుతుంది. లాలాజలం అధికంగా వుంటే బాక్టీరియా నోటిలో తక్కువగా వుంటుంది. దంతాలు, చిగుళ్ళపై వుండే యాసిడ్లను లాలాజలం కడిగేసి సమస్ధాయిలో వుంచుతుంది.

నోరు ఎండిన లక్షణాలు ఎలా వుంటాయి?

నోటిలో తడి లేకుండుట ,నోటి మూలలలో మంట పెట్టుట చిగుళ్ళు మంట పెట్టుట దీనినే జింజివైటిస్ అంటారు నాలుక, బుగ్గలు, అంగిడి భాగాలలో క్రిమి వ్యాధులు కలుగుట నోరు ఎండే కారణాలేమిటి? తరచుగా రక్తంలో గ్లూకోజ్ స్ధాయి అధికంగా వుండుట. ఇది డయాబెటీస్ రోగులలో వుంటుంది. ఇతర కారణాలుగా, మీరు తగినంత నీటిని తాగకపోవటం, పొగ త్రాగటం లేదా ఏదేని మందు వేసినపుడు సైడ్ ఎఫెక్ట్ కారణంగా నోరు ఎండిపోవటం.

డ్రై మౌత్ కేవలం ఒక సాధారణ ఆరోగ్య సమస్య మాత్రమే, అయితే కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. డ్రై మౌత్ నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

రోజూ సరిపడా నీళ్ళు తాగాలి:

రోజూ సరిపడా నీళ్ళు తాగాలి:

రోజూ సరిపడా నీళ్ళు తాగడం వల్ల నోట్లో లాలాజలం స్రవిస్తుంది, డ్రై మౌత్ నివారిస్తుంది. కాబట్టి, వాటర్ తో పాటు ఫ్రూట్ జ్యూస్ లు కూడా తాగాలి.

 సోంపు :

సోంపు :

సోంపులో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి లాలాజలం ఉత్పత్తిని పెంచుతుంది. కొన్ని సోంపు సీడ్స్ తీసుకుని, నోట్లో వేసుకుని నమలాలి, వీటిని నమలడం వల్ల డ్రై మౌత్ నివారించబడుతుంది,అలాగే శ్వాసకూడా బాగా ఆడుతుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

ఒక గ్లాసు నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె మిక్స్ చేసి తాగాలి. ఇది లాలాజల ఉత్పత్తిని పెంచుతుంది. లాలాజలం పెరిగిన తర్వాత నోట్లో తడి ఆరడం తగ్గుతుంది.

 అలోవెర:

అలోవెర:

ఒక కప్పు అలోవెర జ్యూస్ ను ప్రతి రోజూ తాగడం వల్ల నోట్లో తడి ఆరడం తగ్గుతుంది, డ్రౌ మౌత్ సమస్య క్రమంగా తగ్గుతుంది.

కేయాన్ పెప్పర్ :

కేయాన్ పెప్పర్ :

సలాడ్స్, సూప్స్ లో కేయాన్ పెప్పర్ ను చిలకరించి తీసుకోవడం వల్ల సలైవా ఉత్పత్తిని పెంచుతుంది. నోరు తడి ఆరిపోకుండా నివారిస్తుంది.

సెలరీ :

సెలరీ :

రెగ్యులర్ గా తయారుచేసుకునే వంటల్లో కొద్దిగా కొత్తిమీరను చేర్చడం వల్ల కూడా లాలాజల ఉత్పత్తి పెరిగి నోరు తడి ఆరిపోకుండా సహాయపడుతుంది.

 యాలకలు:

యాలకలు:

నోడి డ్రైగా మారినప్పుడు ఒకటి రెండు యాలకలను నమలడం మంచిది. ఇది డ్రై మౌత్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అల్లం:

అల్లం:

అల్లం బెస్ట్ హోం రెమెడీ. లాలాజల ఉత్పత్తిని పెంచడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. అల్లం తీసుకుని, చిన్న ముక్కలుగా కట్ చేసి నమలాలి.

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

ఒక గ్లాసు నీటిలో చిటికెడు బేకింగ్ సోడ, సాల్ట్ , షుగర్ , వేసి తాగాలి. ఇది డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది. డ్రౌ మౌత్ ను నివారిస్తుంది.

సాల్ట్ వాటర్ :

సాల్ట్ వాటర్ :

ఒక గ్లాసు వాటర్ లో ఒక చిటికెడు ఉప్పు మిక్స్ చేసి నోట్లో పోసుకుని గార్గిలింగ్ చేయాలి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Is Your Mouth Getting Dried Up Too Often? These Home Remedies Help Treat Dry Mouth Instantly

    Is your mouth getting dried up too often? You have that parched kind of feeling, excessive thirst, you tend to lose the taste of food and this is also accompanied by bad breath.
    Story first published: Tuesday, December 13, 2016, 11:21 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more