చిగుళ్ల వ్యాధి యొక్క ఈ 10 సంకేతాలను ఎట్టిపరిస్థితిలో మీరు నిర్లక్ష్యం చేయకూడదు !

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మనలో చాలామంది ఈ మాటను గూర్చి వినే ఉంటారు, "ఒక వ్యక్తి యొక్క అందమైన చిరునవ్వు ఎప్పటికీ ధరించే ఒక ఆభరణం వంటిదని", అవునా ?

పై మాట అక్షరాలా నిజం, ఎందుకంటే ఒక అందమైన చిరునవ్వును కలిగి ఉండటం వల్ల అందరూ మీ వైపుకే తిరిగి చూస్తారు మరియు వెచ్చదనంతో ఆశీస్సులను పొందడంతో పాటు, ప్రతిచోటా ఉత్సాహాన్ని కూడా నిప్పుతాయి !

అసాధారణమైన రీతిలో నోటి పరిశుభ్రతను నిర్వహించడమనేది చాలా ముఖ్యము. ఎందుకంటే, అలాంటి సమయంలో వచ్చే పళ్ళ మరియు చిగుళ్ల వ్యాధులను సులభంగా గుర్తించవచ్చు.

కావిటీస్ (లేదా) అసాధారణమైన ఇతర పళ్ల సమస్యలను కలిగి ఉన్నప్పుడు - దీర్ఘకాలం చికిత్స చేయకుండా వదిలేస్తే, అవి చాలా పెద్ద సమస్యగా మారవచ్చు మరియు అనుకోకుండా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు!

ఇప్పుడు మన దంతాలను బ్రష్ చేయకుండా మరియు ఒక రోజులో మన దంతాలను పట్టు దారంతో - పళ్ళ మధ్య ఉన్న ఆహారాన్ని తగినన్ని సార్లు క్లీన్ చెయ్యకపోతే, కావిటీస్ మరియు చిగుళ్ల వ్యాధుల వంటివి సంభవించవచ్చు.

అంతేకాకుండా అధిక మోతాదులో చక్కెర పదార్థాలను, కృత్రిమమైన ప్రిజర్వేటివ్స్ ను (సంరక్షణకారులను), రంగులు పూసిన ఆహార పదార్థాలను రోజూ తినడం వల్ల, పళ్ళు మరియు చిగుళ్ల వ్యాధులను వృద్ధి చేసే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

మానవ దంతాలు అనబడే రెండు ప్రాంతాలను మన నోటి లోపల పింక్ కలర్ లో ఉన్న మాంసపు కండరాలతో కలిగి ఉండి, మన దంతాల ఎగువ భాగమును కప్పి ఉంచేదిగానూ మరియు మన పళ్ళకు మద్దతును అందించేదిగా ఉంటాయి.

సాధారణంగా 2 రకాలైన చిగుళ్ల వ్యాధులు ఉన్నాయి - అవి "గింజివిటిస్ మరియు పార్డోంటైటిస్ " గా ఉన్నాయి.

జిన్గైవిటిస్ అనేది చిగుళ్ళ యొక్క వాపు అయినప్పటికీ, పార్డోంటైటిస్ అనేది చిగుళ్ళ యొక్క ఇన్ఫెక్షన్లు.

ఇది సాధారణంగా రెండు పరిస్థితుల్లో అనగా 1) మీ నోరు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల మరియు 2) వంశపారంపర్యంగా కూడా సంభవిస్తాయి.

చిగుళ్ల వ్యాధులను పట్టించుకోకపోవడం వల్ల కావిటీస్, పళ్ళు ఊడిపోవడం, అల్సర్ పుండ్లకు, మరియు గుండె జబ్బులకు కారణమవుతాయి.

కాబట్టి, ఇక్కడ చిగుళ్ల వ్యాధులకు సంబంధించి కొన్ని సంకేతాలు ఉన్నాయి, వాటిని మీరు అస్సలు మరచిపోకూడదు !

1వ లక్షణము :

1వ లక్షణము :

ఎవరైతే చిగుళ్ల వ్యాధులతో బాధపడుతున్నారో, అది గింజివిటిస్ (లేదా) పార్డోంటైటిస్ కావచ్చు. దానివల్ల చిగుళ్ళలో దీర్ఘకాలం పాటు నొప్పులను కలిగి ఉంటాయి, ఇందులో చిగుళ్ళు అనేవి వాపుకు గురయ్యి, మరింత బాధాకరమైనవిగా తయారు అవుతాయి, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ కారణంగా రక్తప్రవాహానికి అవరోధమును ఏర్పరచి ఆ ప్రాంతంలో చీము ఏర్పడుతుంది.

2వ లక్షణము :

2వ లక్షణము :

"గింజివిటిస్ మరియు పార్డోంటైటిస్" అనేవి రెండూ కూడా "చిగుళ్లు ఎర్రబడటం" అనే మరొక లక్షణాన్ని కలిగిస్తాయి. చాలాసార్లు, ఈ ఎర్రదనం మొదటిసారిగా ఎదురైన్నప్పుడు నొప్పిని కలిగి ఉండదు. కాబట్టి, ప్రజలు దానిని పట్టించుకోకుండా అలానే వదిలేస్తారు, చివరికి అది ఇన్ఫెక్షన్కు గురికాబడి - చిగుళ్ల వాపుకు దారితీసినంత వరకూ చికిత్సను చేయించుకోవడానికి ఆసక్తిని చూపించము.

3వ లక్షణము :

3వ లక్షణము :

మీ చిగుళ్ళు మెత్తగా (లేదా) చాలా మృదువుగా మరియు ఉబ్బినట్లుగా గాని ఉంటే, ఆ రెండు రకాలు కూడా చిగుళ్ళ వ్యాధులకు చెందిన మరొక సూచికగా చెప్పవచ్చు. వాపు చిగుళ్ళ కణజాలంలో వాపు ఉండటం వల్ల అది నీటిని ఆకర్షిస్తుంది మరియు వాటిని "ఎడెమాటిస్" గా మారుస్తుంది.

4వ లక్షణము :

4వ లక్షణము :

ఫ్లోస్సింగ్ (లేదా) బ్రషింగ్ చేసే సమయంలో చిగుళ్ల నుండి చాలా తక్కువ మొత్తంలో రక్తస్రావమవ్వడం అనేది సర్వసాధారణం. మీరు బ్రషింగ్ చేసే ప్రతిసారి రక్తస్రావం జరుగుతున్నట్లయితే (లేదా) మరికొన్నిసార్లు చిగుళ్లను తాకకుండానే రక్తస్రావం జరుగుతున్నట్లయితే వెంటనే గమనించి "గింజివిటిస్ (లేదా) పార్డోంటైటిస్" అనే వ్యాధి యొక్క లక్షణమని మీరు గుర్తించవచ్చు.

5వ లక్షణము :

5వ లక్షణము :

మీరు మీ దంతాలను నిరంతరంగా శుభ్రపరచడం, నాలుకను శుభ్రం చెయ్యటం, నోటి దుర్వాసనను పోగొట్టే మౌత్ వాష్లను ఉపయోగించిన తర్వాత కూడా మీరు నిరంతరంగా చెడు శ్వాస సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే అది చిగుళ్ల వ్యాధి యొక్క సూచిక అని చెప్పవచ్చు. ఇన్ఫెక్షన్కు కారణమయ్యే బ్యాక్టీరియా మీ పళ్ళు మరియు చిగుళ్లలో నిల్వ ఉన్న ఆహార పదార్థాలతో కలిసి సమ్మిళితమైనప్పుడు అది చెడు శ్వాసకు దారితీస్తుంది.

6వ లక్షణము :

6వ లక్షణము :

మీరు దెబ్బతిన్న చిగుళ్ల మీద కాస్త ఒత్తిడిని కలిగించినప్పుడు, రక్తంతో కలిసి గానీ (లేదా) రక్తం లేకుండా గానీ ఒక తెల్లటి స్రావము బయటకు రావడమును గమనించినట్లయితే, అది "గింజివిటిస్ (లేదా) పార్డోంటైటిస్" అనే వ్యాధి యొక్క లక్షణమని చెప్పవచ్చు. చీము అనేది చిగుళ్ళ వ్యాధి కారణంగా సృష్టించబడుతుంది.

7వ లక్షణము :

7వ లక్షణము :

మీరు మలినముతో కలిగివున్న (లేదా) నిల్వ ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు మీరు మీ నోటి నుండి హఠాత్తుగా చెడు రుచిని కలిగిన భావననుగాని ఎదుర్కొంటారు. కాని అలా కాకుండా మీరు ఏమి తిన్నా సరే అదే చెడు రుచిని కలిగిన భావననుగాని ఎదుర్కొంటున్నట్లయితే, అది చిగుళ్ళ వ్యాధికి సంబంధించినదా అని మీరు ఒకసారి తనిఖీ చేయాలి ఎందుకంటే చిగుళ్ళ నుంచి కారే చీము నోటితో లాలాజలముతో కలిసి చెడు రుచిని సృష్టిస్తుంది.

8వ లక్షణము :

8వ లక్షణము :

మీ దంతాలు ఇంతకుముందు కనబడినా వాటి కన్నా చాలా పెద్దవిగా (లేదా) పొడవుగా ఉన్నట్లు మీరు గమనించినట్లయితే, అందుకు కారణం చిగుళ్లు తగ్గుతున్నాయనే విషయాన్ని మీరు గుర్తించాలి. "గింజివిటిస్ (లేదా) పార్డోంటైటిస్" అనే వ్యాధి కారణంగా మీ చిగుళ్ళు వాలిపోవడం (లేదా) వెనుకకు పోవడం అనే పరిణామానికి దారి తీసి, మీ దంతాలు మరింత పెద్దవిగా కనిపించేలా చేస్తాయి.

9వ లక్షణము :

9వ లక్షణము :

వదులుగా ఉన్న పళ్ళు (లేదా) కదులుతున్న పళ్ళు అనేవి కూడా చిగుళ్ళ వ్యాధుల యొక్క సంకేతమని కచ్చితంగా చెప్పవచ్చు, కానీ దీనిని చాలామంది పట్టించుకోకపోవచ్చు. మీరు అకాలంగా వదులుగా ఉన్న పళ్ళను కలిగిన భావనను 50 సంవత్సరాల వయసులోపు వారు కలిగి ఉన్నట్లయితే, అది చిగుళ్ళ వ్యాధుల యొక్క లక్షణాలుగా గుర్తించి, డాక్టర్ను సంప్రదించడం మంచిది.

10 వ లక్షణము :

10 వ లక్షణము :

మీకు కావిటీస్ లేనప్పుడు, మృదువైన ఆహారాన్ని నమలడం వలన హఠాత్తుగా నొప్పితో కూడిన బాధను అనుభవించినట్లయితే, గింజివిటిస్ (లేదా) పార్డోంటైటిస్" యొక్క మరొక నిర్దిష్టమైన సంకేతం కావచ్చని గమనించండి. ఆహారాన్ని తినేటప్పుడు మీరు ఎక్కువ నొప్పిని మరియు బాధను కలిగివున్నట్లయితే తప్పకుండా జాగ్రత్తను వహించండి.

ఈ కథనాన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి!

చిగుళ్ల వ్యాధి అనేది అంత సాధారణమైనదే మీరు నమ్మలేరు. కాబట్టి ఈ సమాచారాన్ని మీ వద్ద మాత్రమే ఉంచుకోవద్దు! ఇప్పుడే దీనిని మీ స్నేహితులు చదవటం కోసం భాగస్వామ్యం చేయ్యండి.

English summary

10 Silent Signs Of Gum Disease You Must Never Ignore!

Gum disease is an infection or inflammation of the gums caused by poor oral hygiene. When left untreated for a long time, gum disease can cause a number of health complications. Symptoms of this problem include puffy, red gums that bleed on touch and elongated appearance of teeth because of gingival recession.
Story first published: Thursday, January 11, 2018, 16:35 [IST]