For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సామాజిక ఆందోళనలను, మీ భావోద్వేగాలను అణుచుకోవడానికి ఈ పది చిట్కాలు పాటించండి.

|

దాదాపుగా అనేకమంది ఏదైనా గుంపు, వర్గం లేదా సామాజిక సమూహాలలో మాట్లాడునప్పుడు వారి మానసిక స్థాయిలలో హెచ్చుతగ్గులకు లోనై, తడబాటు, ఆతృత తద్వారా ఆందోళనలకు లోనవడం చూస్తూనే ఉంటాము. ఈ అలవాటు కాలక్రమేణా వారి జీవితాలపై పెను ప్రభావాలను కూడా చూపిస్తూ ఉంటాయి.

ఈ సామాజిక ఆందోళనలు, సహజంగా సమాజం పట్ల ఏర్పడిన హేయభావం, లేదా భయం వలన కూడా కారణం కావొచ్చు. కొందరికి సమాజం అన్నీవేళలా వెన్నంటి ఉంటుంది అన్న భావనని కలిగిస్తే, కొందరు మాత్రం ఈ సమాజంలో అందరూ ఎవరి ఎవరి స్వార్ధాలకు వారు బానిసలు అన్న ఆలోచనలను కలిగి ఉంటారు. తద్వారా నీడని కూడా నమ్మలేని స్థితులలో, ఎవరు తమ గురించి ఏమనుకుంటారో అన్న భావన నుండి ఇలాంటి ఆందోళనలు, విసుగులు ప్రారంభమవుతాయి.

ఇలాంటి ఆందోళనలకు గురవుతున్నారు అని చెప్పడానికి కొన్ని సంకేతాలు కూడా ఉన్నాయి. ఇతరుల చర్యలను గురించిన ఆలోచనలు చెయ్యడం, సామాజిక పరిస్థితుల పై తీవ్రమైన భయము, చింత కలుగడం. మీరు మాట్లాడే ప్రతి మాటగురించి, అవతలి వారి ఆలోచనలను అంచనా వేయడం. అసురక్షిత వాతావరణానికి మానసిక స్థాయిలు మారడం, అవతలి వారి గురించి ఎక్కువగా తీర్మానించుకోవడం, ఇలాంటివన్నీ సంకేతాలే.

ఇలాంటి ఆందోళనలు తగ్గించుకోవడానికి పాటించవలసిన చిట్కాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.

మీ ఆలోచనలను భాగస్వామ్యం చేయడం మొదలుపెట్టండి:

మీ ఆలోచనలను భాగస్వామ్యం చేయడం మొదలుపెట్టండి:

మీ ఆందోళనలను దాచిపెట్టడం వలనే, సగం ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి. సామాజిక ఆందోళన అధిగమించడానికి చాలా ముఖ్యమైన దశ కుటుంబం మరియు మిత్రులతో మీ అనుభవాన్ని భాగస్వామ్యం చేయడమే. చాలా మంది సిగ్గుతో వారి ఆందోళనలను పంచుకునేందుకు అయిష్టంగా ఉంటారు. కానీ మీ ప్రియమైన వారితో చర్చించడం వలన, మీ ఆందోళనలు తగ్గడానికి వారు కూడా సహకరిస్తుంటారు.

మీ ఆలోచన నిజం కాదు:

మీ ఆలోచన నిజం కాదు:

మీరు ఆందోళనకు లోనవడాన్ని నిజమని భావించినప్పుడు మాత్రమే ఆ ఆందోళనలు మిమ్ములను నియంత్రించే స్వభావాన్ని సైతం తెచ్చుకోగలవు. ఈ సామాజిక ఆందోళనలు పెరిగేకొలదీ అనేక ప్రతికూల ప్రభావాలకు, మరియు ప్రమాదకర పరిస్థితులకు లోనవుతుందని మీరు త్వరగానే గ్రహించవలసి ఉంటుంది. చమటలు పట్టడం, అధికమైన హృదయ స్పందనలు ఈ ఆందోళనలకు సంకేతాలుగా ఉంటాయి. కావున సానుకూల దృక్పధాలు అలవరచుకోవడం ప్రారంభించండి.

మీ ఆలోచన సరళిని మార్చండి:

మీ ఆలోచన సరళిని మార్చండి:

ఆందోళనలు కలిగిన క్షణంలో హృదయస్పందనల వేగం పెరగడం గమనిస్తూ ఉంటాము. కావున అలాంటి సమయంలో మీఆలోచనలను అదే పని మీద కేంద్రీకరించడం కూడా సరికాదు. కావున ఆ ఆలోచనలకు కాస్త విరామం ఇచ్చి, వేరే పనిమీద దృష్టిని కేంద్రీకరించడం మంచిది. అలాగని సంబంధం లేకుండా కాదు. మీరు ఎవరితో అయినా మాట్లాడునప్పుడు ఈ సమస్య ఎదుర్కుంటే, మాట్లాడడం తగ్గించి వినడం మీద ఆలోచనను మళ్లించండి.

భయాలకు భయపడకండి,ఎదుర్కోండి:

భయాలకు భయపడకండి,ఎదుర్కోండి:

సామాజిక పరిస్థితులకు భయపడి పారిపోవడం సరైన పద్దతిగా ఎప్పుడూ సూచించబడదు. మనిషి నిరంతర అన్వేషిగా ఉండాలి, భయాలను ఎదుర్కున్నప్పుడే అనేక ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. పరిస్థితుల నుండి పారిపోవడం వలన, పిరికివానిగా ముద్ర వేయించుకోవడం తప్ప ఏలాభం ఉండదు. ఆందోళనలు కలిగినప్పుడు ఒక ఛాలెంజ్ తో సమస్యలను ఎదుర్కొని నిలబడడం వలన నెమ్మదిగా మీ ఆందోళనలు తగ్గుముఖం పడుతాయి. ఎవరైనా కొత్త వ్యక్తులతో మాట్లాడాలంటే భయంగా అనిపిస్తే, మీ స్నేహితుడిని వెంట తీసుకుని వెళ్ళండి. కానీ పరిస్థితులను ఎదుర్కోండి.

భద్రత ఆలోచనలను పక్కన పెట్టండి:

భద్రత ఆలోచనలను పక్కన పెట్టండి:

కొందరు ఎవరితో అయినా మాట్లాడాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా అనేక భద్రతాపరమైన చర్యలు తీసుకుంటూ ఉంటారు. అనగా గుంపులో తెలిసినవాళ్ళు ఉన్నారో లేదో చూడడం వంటివి. ముందు అలాంటి పద్దతులు మారాలి. కొందరు అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సన్ గ్లాసెస్ ధరించడం, ఫోన్ చూడడం లేదా ఆందోళనలు తగ్గడం కోసం బయటకి వెళ్ళడం వంటివి చేయడం చూస్తూనే ఉంటాము. ఒక్కోసారి ఇలాంటివి హెల్ప్ చేస్తుంటాయి కూడా.

పరిపూర్ణమైన వ్యక్తిగా కనపడాలన్న ఆలోచనలు తగ్గిoచుకోండి :

పరిపూర్ణమైన వ్యక్తిగా కనపడాలన్న ఆలోచనలు తగ్గిoచుకోండి :

ఈ ప్రపంచంలో ఏ ఇతర వ్యక్తి కూడా పరిపూర్ణుడు కాదు, ఈ విషయాన్ని నిర్ధారించుకోవలసిన అవసరం ఉన్నది. ఎవరిలో అయినా అనుకూల ప్రతికూల కోణాలు ఉంటాయి, అవి ఆయా సందర్భాలలోనే బయటపడుతూ ఉంటాయి. చాలామంది మిమ్మల్ని అయిష్టపడే వారు ఉంటారు అని మీ భావన, కానీ మిమ్మల్ని, మీ ఆలోచనలను ఇష్టపడే వారు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్నే ఇష్టపడాలని నియమాలు లేవు కదా.

మీ జీవితoలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి:

మీ జీవితoలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి:

ఈ అలవాటు ఉన్న వారు ఎవరైనా తమ ఆందోళనా స్థాయిలను తమకు తెలీకుండానే తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని అర్ధం. మీకు ఆందోళనగా అనిపించినప్పుడు మీ ప్రియమైన వ్యక్తులతో సమయం గడపడం, ఇష్టమైన పనులు చేయడం, కళలు, సంగీతానికి సమయం కేటాయించడం వంటివి చేయండి. తద్వారా నెమ్మదిగా మీ ఆందోళనాస్థాయిలు తగ్గుముఖం పడుతాయి.

తప్పులు చేయడం మానవ సహజం:

తప్పులు చేయడం మానవ సహజం:

మీరు మీరు చేసే పని ఉత్తమంగా ఉండాలని కోరుకుంటూ, తద్వారా ప్రజల మెప్పును ఆశిస్తున్నారా. అయితే ఈ పద్దతి మానుకోండి. అలా ఆశించడం ద్వారానే ఆందోళనలు ఎక్కువ అవుతాయి. తప్పులు చేయడం మానవసహజం, ప్రతి తప్పు మనకు ఒక పాఠం నేర్పిస్తుంది అన్న సూక్తిని గుర్తుంచుకోవడం మంచిది.

ఆత్మ విమర్శ చేసుకోండి:

ఆత్మ విమర్శ చేసుకోండి:

కొన్ని విషయాలు మీకు మీరు అనుమానపడేలా చేస్తుంటాయి. అలాంటి సందర్భాలలో ఒకరి నిర్ణయాలపై ఆధారపడకుండా ఆత్మ విమర్శ చేసుకోవడం మేలు. తద్వారా ఒక పరిష్కారం మీకు లభిస్తుంది.

సామాజిక పరిస్థితులను తెలుసుకుని మెలగండి :

సామాజిక పరిస్థితులను తెలుసుకుని మెలగండి :

ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం సామాజిక ఆందోళనలని గురించి పూర్తిగా అవగాహనకు వచ్చిన ప్రజలు, అనేక సామాజిక పరిస్థితుల్లో మరింత సంతోషంగా ఉండగలరు. ఈ ఆందోళనా హెచ్చుతగ్గులను అంచనా వేయడం తద్వారా పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ అనేకమంది వారి వారి జీవితాలను సుగమం చేసుకున్నారు కూడా.

English summary

10 Tips For Overcoming Social Anxiety

10 Tips For Overcoming Social Anxiety,Social anxiety, as it is simply put, is the fear of social situations. A person living with social anxiety can be frustrated. Read here to know about the tips for overcoming social anxiety.
Desktop Bottom Promotion