For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సగా, 3000 సంవత్సరాలనాటి సహజసిద్ద వైద్యం.

10 రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సగా, 3000 సంవత్సరాలనాటి సహజసిద్ద వైద్యం.

|

మనుషులుగా, మనకు వ్యాధులు ఎన్నటికీ సుపరిచితంగానే ఉంటాయి. చిన్నవయసు నుండి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వ్యాధికి గురవుతూనే ఉంటాము. అంతటి అవినాభావ సంబంధాలు వ్యాధులతో ఉంటాయి అన్నది జగమెరిగిన సత్యం. నాకు జీవితంలో దగ్గు కూడా రాలేదు, రాదు అని ఎవరైనా అంటే, అది ఖచ్చితంగా గొప్పలు చెప్పుకోడానికే తప్ప వాస్తవానికి కాదు.

ప్రతి వ్యక్తి, వారి జీవితకాలంలో తీవ్రమైన అనారోగ్యాలకు గురికాకపోయినా కూడా, కొన్ని చిన్నచిన్న వ్యాధులకైనా ప్రభావితమవడం జరుగుతుంది. దీనికి జీవనశైలి, వాతావరణ కాలుష్యం, తీసుకునే ఆహారం వంటి అనేకరకాల అంశాలు వెనుకగల కారణాలుగా ఉంటాయి. కొన్ని ప్రత్యక్ష కారకాలుగా ఉంటే, కొన్ని పరోక్ష కారకాలుగా ఉంటాయి. మరియు కొన్ని కోరి తెచ్చుకునేవిలా ఉంటాయి కూడా. ఉదాహరణకు రోడ్డు సైడ్ ఆహార పదార్ధాలకు అలవాటు పడ్డవారు అధిక స్థాయిలో ఫికల్(విసర్జనల సంబంధిత) బాక్టీరియాకు గురై, హెపటైటిస్ రోగాల బారిన పడడం జరుగుతుంటుంది.

3000 Year Old Natural Remedy That Can Treat Over 10 Diseases!

వాస్తవానికి, మనలో అనేకమంది కొన్నివ్యాధులకు తరచూ గురవడం వంటివి చూస్తుంటాము. క్రమంగా సాధారణ వైద్యపరీక్షలు తీసుకోవడం, చికిత్సలను అవలంభించడం, మెడికల్ ఇన్సూరెన్స్లను పూర్తి చేయడం వంటివి సాధారణమైన అంశాలుగా ఉంటాయి. చివరికి మధుమేహం గురించి అడిగితే, రెండు కేజీలు ఉంది అంటూ జోకులు వేసుకునే స్థాయిలోకి వెళ్ళిపోయాము అంటేనే అర్ధమైపోతుంది మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో.

ప్రాచీనకాలంలో వ్యాధుల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, ఆ వ్యాధులలో అనేకం, ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయి; ఒకప్పుడు జలుబు జ్వరం అంటే ఉలిక్కిపడే జనాలు, నేడు వాటిని అత్యంత సాధారణమైన విషయాలుగా భావిస్తున్నారు. దీనికి కారణం, మందుల సంఖ్య పెరిగే కొలదీ, రోగాల సంఖ్య కూడా పెరుగుతూ పోవడమే.

3000 Year Old Natural Remedy That Can Treat Over 10 Diseases!

ఉదాహరణకు, తీవ్ర శీతల వాతావరణ పరిస్థితుల కారణంగా, న్యుమోనియా వ్యాధికి గురై అనేకమంది ప్రాణాలను కోల్పోయేవారు. కానీ ఇప్పుడు అంతకన్నా తీవ్రమైన రోగాలు ఉనికిలో ఉన్నాయి.

అయినప్పటికీ, ఒత్తిడి, వంధ్యత్వం, నిరాశ, వాయుసంబంధిత అంటురోగాల వంటి ఆధునిక వ్యాధులు ప్రాచీనకాలంలో అత్యంత తగ్గుస్థాయిలో ఉండేవి. ఇక్కడ, కోరింత దగ్గు చికిత్స కోసం ప్రాచీనకాలం నుండి వాడుకలో ఉన్న సహజసిద్దమైన పదార్ధాల గురించిన వివరాలను పొందుపరచడం జరిగింది.

ప్రజల జీవనశైలిలో తీవ్రమైన మార్పుల కారణంగా, ఈ రోజుల్లో కొన్ని వ్యాధులు అత్యంత సాధారణమైనవిగా ఉంటున్నాయి.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, పని ఒత్తిడి, ఆందోళనలు , భావోద్వేగ సమస్యలు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కాలుష్యం, వ్యాయామానికి సమయం కేటాయించకపోవటం మొదలైన కారణాల వలన ప్రజలలో వ్యాధులు తీవ్రంగా వ్యాప్తిచెందుతున్నాయి.

పురాతన కాలంలో, ఆధునిక ఔషధాలు అందుబాటులోకి రాకముందే, సహజసిద్దమైన నివారణా చిట్కాలు, అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగించబడ్డాయి.

3000 Year Old Natural Remedy That Can Treat Over 10 Diseases!

అవి సురక్షితమైనవిగానూ మరియు సమర్థవంతమైనవిగానూ ఉండేవి. ఎందుకంటే అవి కేవలం సహజసిద్దంగా లభిస్తూ, ఎటువంటి రసాయనాలు కలపనివి కాబట్టి.

కోరింతదగ్గు వ్యాధికి సంబంధించి, 3000 సంవత్సరాల నుండి పాటిస్తున్న ఈ చికిత్సా విధానాన్ని పరిశీలించండి.

కావలసిన పదార్ధాలు :

ఎండబెట్టిన ఆలివ్ ఆకులు

రెండు గ్లాసుల నీళ్ళు

వివిధ రకాల వ్యాధుల చికిత్సకు ఈ గృహ చిట్కా, అత్యుత్తమంగా పని చేస్తుందని రుజువైంది కూడా, మరియు దీని ప్రయోజనాలను ఇటీవలే, శాస్త్రవేత్తలు తిరిగి కనుగొన్నారు.

3000 Year Old Natural Remedy That Can Treat Over 10 Diseases!

ఆలివ్ ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు :

మనకు ఇక్కడ తులసి చెట్టు ఆకులు ఉన్నట్లుగా, ప్రాచీన గ్రీకు మరియు ఇతర పశ్చిమ పురాణాలలో ఆలివ్ ఆకులను పవిత్రమైనవిగా భావిస్తారు.

ఎందుకంటే, ఆలివ్ ఆకులలో, ఎన్నో వ్యాధులను తగ్గించగల మరియు చికిత్స చేయగల పలు ఔషధ లక్షణాలు ఉన్నాయి కాబట్టి.

ఆలివ్ ఆకులు సాధారణంగా సేంద్రీయ(ఆర్గానిక్) దుకాణాలలో లభిస్తాయి. లేదా ఎక్కడైనా ఆలివ్ చెట్టు కనిపిస్తే, దాని నుండి తీసుకోవచ్చు. మనదేశంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ వంటి కొన్ని ప్రాంతాలలోనే ఇతర ప్రాంతాలకన్నా ఎక్కువగా ఈ ఆలివ్ చెట్లు కనిపిస్తూ ఉంటాయి.

ఆలివ్ ఆకులు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మరియు కొన్ని సూక్ష్మ ఎంజైములను కలిగి ఉంటాయి, ఇవి సూక్ష్మజీవులతో పోరాడే లక్షణాలను కూడుకుని ఉంటాయి.

ఆలివ్ ఆకులలో ఉన్న అనామ్లజనకాలు తక్కువ జీవక్రియల సమస్యలను, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వేగవంతమైన కణాల వృద్ధాప్యం, మొదలైన సమస్యల చికిత్సలలో విరివిగా ఉపయోగించబడుతుంది.

ఆలివ్ ఆకుల యొక్క యాంటీ మైక్రోబయల్ లక్షణాలు, యాంటీ వైరల్, వైరల్ ఫ్లూ, గొంతు ఇన్ఫెక్షన్లు, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, మూత్రనాళాల సంక్రమణ వ్యాధులు, క్షయ, హెర్పెస్ మరియు మరికొన్ని వైరస్, బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల కారణంగా సంభవించే వ్యాధులకు చికిత్సగా పనిచేస్తాయి.


ఆలివ్ ఆకులు, సంక్రమణ మరియు వాపును ప్రభావవంతంగా తగ్గించగలిగే శక్తిని కలిగి ఉన్న కారణాన, పైన పేర్కొన్న వ్యాధులకు సహజసిద్దంగానే చికిత్సను చేయగలవు.

ఏదేమైనా, లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్న ఎడల, ఈ సహజ చికిత్సా విధానాలతో పాటు, వైద్యుని పర్యవేక్షణ కూడా అవసరమని గుర్తుంచుకోండి.


తయారీ పద్ధతి :

నీటిలో ఎండబెట్టిన ఆలివ్ ఆకుల సూచించిన మొత్తాన్ని 15 నిమిషాలపాటు నానబెట్టండి.

తర్వాత ఆకులను తొలగించి, నీటిని వేడి చేయండి. అల్పాహారం తర్వాత, ఒక కప్పు ఆలివ్ ఆకుల నీటిని ప్రతిరోజూ తీసుకోండి. అవసరమని భావిస్తే, ఈ ఆలివ్ ఆకుల నీటిలో తేనెను జోడించుకోవచ్చు.

English summary

3000 Year Old Natural Remedy That Can Treat Over 10 Diseases!

As humans, we are no strangers to diseases. Right from a very young age, all of us realise that we cannot escape diseases, no matter what! Every human would be affected by at least a few minor diseases, if not major ones, in their lifetime. In fact, diseases are so common that most of us would be prepared for them, so we go ahead and get regular medical check-ups and get medical insurances done!
Desktop Bottom Promotion